“వ. సకల జన్మంబులందును ధర్మార్థాచారణ కారణంబయిన మానుష జన్మంబు దుర్లభంభు - అదియ శతవర్ష పరిమితంబైన జీవితకాలంబున నియతంబై యుండు. అందు సగమంధకార బంధురంబయి రాత్రిరూపమున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబై చను. చిక్కిన పంచాశద్వత్సరంబులందును బాల కైశోర కౌమారాది వయో విశేషంబుల వింశతి హాయనంబులు గడుచు. కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబులచేత బట్టువడి దురవగాహంబులయిన కామ క్రోధ లోభ మదమత్సరంబులను పాశంబులం గట్టువడి, విడివడ సమర్థుండుగాక - - - సంసారంబు నిర్జించు నుపాయంబు గానక - - గృహస్థుండు స్వయంకృత కర్మ బద్ధుండై - - విరక్తి మార్గంబు తెలియనేరక - - - అంధకారమునం బ్రవేశించుం గావున గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవత ధర్మంబులనుష్టింప వలయు - - - వృధా ప్రయాసంబున నాయుర్వ్యయంబు సేయం జనదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 6 - 213)
“va. sakala janmaṃbulaṃdunu dharmārthācāraṇa kāraṇaṃbayina mānuṣa janmaṃbu durlabhaṃbhu - adiya śatavarṣa parimitaṃbaina jīvitakālaṃbuna niyataṃbai yuṃḍu. aṃdu sagamaṃdhakāra baṃdhuraṃbayi rātrirūpamuna nidrādi vyavahāraṃbula nirarthakaṃbai canu. cikkina paṃcāśadvatsaraṃbulaṃdunu bāla kaiśōra kaumārādi vayō viśēṣaṃbula viṃśati hāyanaṃbulu gaḍucu. kaḍama muppadi yabdaṃbulu niṃdriyaṃbulacēta baṭṭuvaḍi duravagāhaṃbulayina kāma krōdha lōbha madamatsaraṃbulanu pāśaṃbulaṃ gaṭṭuvaḍi, viḍivaḍa samarthuṃḍugāka - - - saṃsāraṃbu nirjiṃcu nupāyaṃbu gānaka - - gṛhasthuṃḍu svayaṃkṛta karma baddhuṃḍai - - virakti mārgaṃbu teliyanēraka - - - aṃdhakāramunaṃ bravēśiṃcuṃ gāvuna gaumāra samayaṃbuna manīṣā gariṣṭhuṃḍai parama bhāgavata dharmaṃbulanuṣṭiṃpa valayu - - - vṛdhā prayāsaṃbuna nāyurvyayaṃbu sēyaṃ janadu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 6 - 213)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.