← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞాన ప్రసాదం jñāna prasādaṃ

Original — తెలుగు
  1. “జ్ఞాయతే అర్థో అనేనేతి మ్యత్పత్యా బుద్ధి రుచ్యతే, ధ్యాయమానో జ్ఞానప్రసాదం లభతే. జ్ఞాన ప్రసాదేన ఆత్మానం పశ్యతీతి క్రమో ద్రష్టవ్యం”

(శ్రీ ఆనందగిరి)

(కోరిన అర్థము దీనివలన తెలియబడుచున్నది గనుక ఇది జ్ఞానము - బుద్ధి - ధ్యానము చేయుచూనుండుటవలన జ్ఞానప్రసాదము లభించును - జ్ఞానప్రసాదము లభించిన ఆత్మసాక్షాత్కారము కలుగును).

  1. జ్ఞాన ప్రసరణ హేతుః పరమాత్మా జ్ఞానశబ్దే నోచ్యతే - పరమాత్మ ప్రసాదం“. (శ్రీరంగ రామానుజః)

(జ్ఞానమును ప్రసరింపచేయుటకు కారణము పరమాత్మ. అందుచేత పరమాత్మప్రసాదము; పరమాత్మానుగ్రహము).

  1. “ఆత్మావబోధన సమర్థమపి స్వభావేన సర్వ ప్రాణినాం జ్ఞానం బాహ్య విషయరాగాది దోషకలుషితం అప్రసన్నం అశుద్ధం సన్నావబోధయతి నిత్యం సన్నహితమపి ఆత్మ తత్వం మలాసనధమివాదిర్శం విలు లితమివ సలిలం తద్య దేంద్రియ విషయ సంసర్గ జనిత రాగాది మల కాలుష్యాపన యనా రాదర్శ సలిలాభివత్ ప్రసాదితం స్వచ్చం శాంతం అవతిష్టతే, తదా జ్ఞానస్య ప్రసాదస్యాత్” (శ్రీశంకరః)

(ఆత్మను గుఱించి తెలుసుకొనుటకు సమస్త ప్రాణులు జ్ఞానము శక్తి కలిగినవై యున్నప్పటికీ బాహ్య విషయములైన రాగాది దోషములతో కలుషితమై ఆత్మను తెలుసుకొనుటలేదు - ధూళిచే కప్పబడిన అద్దమువలె, నాచుచే కప్పబడిన నీరు వలె ఆత్మతత్వము నిత్యము దగ్గరగనే ఉండినదైనను ఇంద్రియములకు విషయముల యడల కలుగు సంసర్గము వలన కనబడకయుండి, అద్దముమీద ధూళి తీసివేసిన అద్దము నిర్మలముగా కనబడినట్లు, నీటిపైనున్న నాచును తీసివేసిన నీరు స్వచ్చముగా కనబడినట్లు, ఆత్మతత్వము స్వచ్ఛముగా ప్రసాదించును - కనుపించును).

Transliteration
  1. “jñāyatē arthō anēnēti myatpatyā buddhi rucyatē, dhyāyamānō jñānaprasādaṃ labhatē. jñāna prasādēna ātmānaṃ paśyatīti kramō draṣṭavyaṃ”

(śrī ānaṃdagiri)

(kōrina arthamu dīnivalana teliyabaḍucunnadi ganuka idi jñānamu - buddhi - dhyānamu cēyucūnuṃḍuṭavalana jñānaprasādamu labhiṃcunu - jñānaprasādamu labhiṃcina ātmasākṣātkāramu kalugunu).

  1. jñāna prasaraṇa hētuḥ paramātmā jñānaśabdē nōcyatē - paramātma prasādaṃ”. (śrīraṃga rāmānujaḥ)

(jñānamunu prasariṃpacēyuṭaku kāraṇamu paramātma. aṃducēta paramātmaprasādamu; paramātmānugrahamu).

  1. “ātmāvabōdhana samarthamapi svabhāvēna sarva prāṇināṃ jñānaṃ bāhya viṣayarāgādi dōṣakaluṣitaṃ aprasannaṃ aśuddhaṃ sannāvabōdhayati nityaṃ sannahitamapi ātma tatvaṃ malāsanadhamivādirśaṃ vilu litamiva salilaṃ tadya dēṃdriya viṣaya saṃsarga janita rāgādi mala kāluṣyāpana yanā rādarśa salilābhivat prasāditaṃ svaccaṃ śāṃtaṃ avatiṣṭatē, tadā jñānasya prasādasyāt” (śrīśaṃkaraḥ)

(ātmanu guṟiṃci telusukonuṭaku samasta prāṇulu jñānamu śakti kaliginavai yunnappaṭikī bāhya viṣayamulaina rāgādi dōṣamulatō kaluṣitamai ātmanu telusukonuṭalēdu - dhūḷicē kappabaḍina addamuvale, nācucē kappabaḍina nīru vale ātmatatvamu nityamu daggaraganē uṃḍinadainanu iṃdriyamulaku viṣayamula yaḍala kalugu saṃsargamu valana kanabaḍakayuṃḍi, addamumīda dhūḷi tīsivēsina addamu nirmalamugā kanabaḍinaṭlu, nīṭipainunna nācunu tīsivēsina nīru svaccamugā kanabaḍinaṭlu, ātmatatvamu svacchamugā prasādiṃcunu - kanupiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.