← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞాన ప్రతిబంధకారణము jñāna pratibaṃdhakāraṇamu

Original — తెలుగు
  1. అవిద్యా దీని.

(అవిద్య మొదలగునవి బేహ్మజ్ఞానము కలుగకుండుటకు కారణములు).

  1. విషయాసక్తిః, బుద్ధిమాంద్యం, భేదవాది ద్వైతశాస్త్ర వచన విశ్వాశస్య ఇత్యాది.

(విషయముల యడల ఆసక్తి కలిగియుండుట, మందబుద్ధి కలిగియుండుట, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, భగవంతుడు వేరు, ప్రపంచకము వేరు, భగవంతుడు కాక ఇంకొక వస్తువు కలదు, అను వాదించి ద్వైతశాస్త్రములందు నమ్మకము కలిగియుండుట - మొదలగునవి బ్రహ్మజ్ఞానము కలుగుటకు ప్రతిబంధకములు).

  1. (1). బుద్ధిమాంద్య విశిష్ట విషయాసక్తి, కుతర్క విపర్యయ దురాగ్రహాఖ్యః వర్తమాన ప్రతిబంధాః.

(2). పుత్ర విత్త దారాదీష్ట వస్తునాశనంతరమపి తత్స్మరణాత్మకః భూత ప్రతిబంధకః

(3). బ్రహ్మలోకాది లోకానతర భోగేచ్ఛా, అధవా భావిజన్మ హేతు భూత ప్రారబ్దకర్మ శేషః ఆగామీ

ప్రతిబంధకః

((1). బుద్ధిమాంద్యమువలన విషయాసక్తి కలిగియుండుట, కుతర్కము, దురాగ్రహము, అనునవి వర్తమాన ప్రతిబంధకములు

(2). పుత్రులు, ధనము, భార్య మొదలగు ఇష్టవస్తువులు నశించిన తర్వాత కూడా వాటిని గుఱించి జ్ఞాపకము తెచ్చుకొని యాలోచించుట అనునది భూత ప్రతిబంధకము - (గతించిన కాలముగుఱించి వగచుట).

(3). చతుర్ముఖబ్రహ్మలోకము (కార్యబ్రహ్మ) మొదలగు ఇతర లోకములందు భోగముల ననుభవించవలెననుకొనుట, లేక రాబోవు జన్మలందు అనుభవించవలసిన ఇప్పటి కర్మ శేష ఫలము గుఱించి ఆలోచించుట ఆగామి ప్రతిబంధకము - అని ప్రతిబంధకములు మూడు విధములు).

Transliteration
  1. avidyā dīni.

(avidya modalagunavi bēhmajñānamu kalugakuṃḍuṭaku kāraṇamulu).

  1. viṣayāsaktiḥ, buddhimāṃdyaṃ, bhēdavādi dvaitaśāstra vacana viśvāśasya ityādi.

(viṣayamula yaḍala āsakti kaligiyuṃḍuṭa, maṃdabuddhi kaligiyuṃḍuṭa, paramātma vēru, jīvātma vēru, bhagavaṃtuḍu vēru, prapaṃcakamu vēru, bhagavaṃtuḍu kāka iṃkoka vastuvu kaladu, anu vādiṃci dvaitaśāstramulaṃdu nammakamu kaligiyuṃḍuṭa - modalagunavi brahmajñānamu kaluguṭaku pratibaṃdhakamulu).

  1. (1). buddhimāṃdya viśiṣṭa viṣayāsakti, kutarka viparyaya durāgrahākhyaḥ vartamāna pratibaṃdhāḥ.

(2). putra vitta dārādīṣṭa vastunāśanaṃtaramapi tatsmaraṇātmakaḥ bhūta pratibaṃdhakaḥ

(3). brahmalōkādi lōkānatara bhōgēcchā, adhavā bhāvijanma hētu bhūta prārabdakarma śēṣaḥ āgāmī

pratibaṃdhakaḥ

((1). buddhimāṃdyamuvalana viṣayāsakti kaligiyuṃḍuṭa, kutarkamu, durāgrahamu, anunavi vartamāna pratibaṃdhakamulu

(2). putrulu, dhanamu, bhārya modalagu iṣṭavastuvulu naśiṃcina tarvāta kūḍā vāṭini guṟiṃci jñāpakamu teccukoni yālōciṃcuṭa anunadi bhūta pratibaṃdhakamu - (gatiṃcina kālamuguṟiṃci vagacuṭa).

(3). caturmukhabrahmalōkamu (kāryabrahma) modalagu itara lōkamulaṃdu bhōgamula nanubhaviṃcavalenanukonuṭa, lēka rābōvu janmalaṃdu anubhaviṃcavalasina ippaṭi karma śēṣa phalamu guṟiṃci ālōciṃcuṭa āgāmi pratibaṃdhakamu - ani pratibaṃdhakamulu mūḍu vidhamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.