జ్ఞానముయొక్క పరాకాష్ట, పర్యవసానము -
“లోకే (అ)స్మిన్ ద్వివిధానిష్ఠా పురాప్రోక్తా మయా నఘ |
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినః |“. (శ్రీమద్భగవద్గీత - 3 - 3)
“చిత్త శుద్ధిభ్యాం జనే (అ)స్మిన్నధికారిణి |
ద్వివిధా ద్విప్రాకారైవ |
పూర్వాధ్యాయే స్ఫుటం మయా |
జ్ఞాన కర్మ పరత్వాఖ్యా నిష్ఠోక్తా తేహి తైషిణా |
సమ్యక్తత్వమతిః సంఖ్యాతాం సంప్రాప్తవతాం సతాం |
బ్రహ్మచర్యాశ్రమా దేవ వేదాంత శ్రవణాదిభిః |
జ్ఞానభూమే ప్రవిష్ఠానాం సాంఖ్యానాం శుద్ధ చేతసాం |
యుజ్యుతే బ్రహ్మణానేన జ్ఞానం తద్యోగ ఈరితః |
జ్ఞానయోగేన తేనైవ నిష్ఠా తేషా ముదాహృతా ||“. (గీతాభావప్రకాశము - 3 - 28, 29, 34 to 36)
(చిత్తశుద్ధి గలవారు, చిత్తశుద్ధిలేనివారు అని అధికారులు రెండు విధములు - చిత్తశుద్ధిగలవారికి జ్ఞానయోగము - జ్ఞాననిష్ఠ - అనిన్నీ, చిత్తశుద్ధిలేనివారికి కర్మయోగము - కర్మనిష్ఠ - అనిన్నీ రెండు విధములుగా నిష్ఠ చెప్పబడినది).
వశీకృత్య శబ్దాదీన్ విషయాన్ సుఖార్ధాన్ త్యక్త్వా, వివిక్త దేశే సేవ శీలః) అత్యశనా నశనరహితః, ధ్యానాభిముఖీకృత కాయవాం జ్ఞ్మనో వృత్తి నియమః, ధ్యానయోగపరః, నిత్యం వైరాగ్యం (దృష్టా దృషేషు విషయేషు వైతృష్ణ్యం) సమ్యక్ ఉపాశ్రితః, అహంకారం, కామరాగ సం యుక్తం బలం (వాసనాబలం), దర్పం, క్రోధం, పరిగ్రహం, పరిత్యజ్య, నిర్గత మమభావః, శాంతః (ఉపరతః) (ఆత్మాను భవైక సుఖః)
ఏవం భూతః ధ్యానయోగం కుర్వన్ స్థితః జ్ఞాన నిష్ఠాపరః , ఏతత్ప్రకారం జ్ఞాననిష్ఠాప్రాప్తి ప్రకారం“.
(మాయలేని నిష్కల్మషమైన బుద్ధితో కార్యకారణ సంఘాతమైన ఆత్మను (మనస్సును) తనవశములో నుంచుకొని, సుఖమును కలుగచేయు శబ్దము మొదలగు విషయములను విడిచి, నిర్మానుష్యమైన ప్రదేశములో నుండుటకు అలవాటుపడి, అత్యాహారముగాని, అతిస్వల్పాహారముగాని తినకయుండి,ధ్యానముచేయుటకు సిద్ధముగానుండునట్లు శరీరము, వాక్కును, మనస్సును త్రిప్పుకొని ధ్యానయోగపరుడై, కనబడునవి, కనబడనవి యైన విషయముల యడల తృష్ణలేకయుండి (విరాగము కలిగి) అహంకారమును కామరాగములతో కూడిన వాసనా బలమును , దర్పమును, క్రోధమును, పరిగ్రహమును వదలివేసి, మమకారము లేనివాడై, శాంతుడై ఆత్మానుభవమను ఒకేదానియందు సుఖమును పొందుచున్నవాడై యుండుట - ఈ ప్రకారము ధ్యానయోగమందుండుట జ్ఞాన నిష్ఠ).
jñānamuyokka parākāṣṭa, paryavasānamu -
“lōkē (a)smin dvividhāniṣṭhā purāprōktā mayā nagha |
jñāna yōgēna sāṃkhyānāṃ karmayōgēna yōginaḥ |“. (śrīmadbhagavadgīta - 3 - 3)
“citta śuddhibhyāṃ janē (a)sminnadhikāriṇi |
dvividhā dviprākāraiva |
pūrvādhyāyē sphuṭaṃ mayā |
jñāna karma paratvākhyā niṣṭhōktā tēhi taiṣiṇā |
samyaktatvamatiḥ saṃkhyātāṃ saṃprāptavatāṃ satāṃ |
brahmacaryāśramā dēva vēdāṃta śravaṇādibhiḥ |
jñānabhūmē praviṣṭhānāṃ sāṃkhyānāṃ śuddha cētasāṃ |
yujyutē brahmaṇānēna jñānaṃ tadyōga īritaḥ |
jñānayōgēna tēnaiva niṣṭhā tēṣā mudāhṛtā ||“. (gītābhāvaprakāśamu - 3 - 28, 29, 34 to 36)
(cittaśuddhi galavāru, cittaśuddhilēnivāru ani adhikārulu reṃḍu vidhamulu - cittaśuddhigalavāriki jñānayōgamu - jñānaniṣṭha - aninnī, cittaśuddhilēnivāriki karmayōgamu - karmaniṣṭha - aninnī reṃḍu vidhamulugā niṣṭha ceppabaḍinadi).
vaśīkṛtya śabdādīn viṣayān sukhārdhān tyaktvā, vivikta dēśē sēva śīlaḥ) atyaśanā naśanarahitaḥ, dhyānābhimukhīkṛta kāyavāṃ jñmanō vṛtti niyamaḥ, dhyānayōgaparaḥ, nityaṃ vairāgyaṃ (dṛṣṭā dṛṣēṣu viṣayēṣu vaitṛṣṇyaṃ) samyak upāśritaḥ, ahaṃkāraṃ, kāmarāga saṃ yuktaṃ balaṃ (vāsanābalaṃ), darpaṃ, krōdhaṃ, parigrahaṃ, parityajya, nirgata mamabhāvaḥ, śāṃtaḥ (uparataḥ) (ātmānu bhavaika sukhaḥ)
ēvaṃ bhūtaḥ dhyānayōgaṃ kurvan sthitaḥ jñāna niṣṭhāparaḥ , ētatprakāraṃ jñānaniṣṭhāprāpti prakāraṃ”.
(māyalēni niṣkalmaṣamaina buddhitō kāryakāraṇa saṃghātamaina ātmanu (manassunu) tanavaśamulō nuṃcukoni, sukhamunu kalugacēyu śabdamu modalagu viṣayamulanu viḍici, nirmānuṣyamaina pradēśamulō nuṃḍuṭaku alavāṭupaḍi, atyāhāramugāni, atisvalpāhāramugāni tinakayuṃḍi,dhyānamucēyuṭaku siddhamugānuṃḍunaṭlu śarīramu, vākkunu, manassunu trippukoni dhyānayōgaparuḍai, kanabaḍunavi, kanabaḍanavi yaina viṣayamula yaḍala tṛṣṇalēkayuṃḍi (virāgamu kaligi) ahaṃkāramunu kāmarāgamulatō kūḍina vāsanā balamunu , darpamunu, krōdhamunu, parigrahamunu vadalivēsi, mamakāramu lēnivāḍai, śāṃtuḍai ātmānubhavamanu okēdāniyaṃdu sukhamunu poṃducunnavāḍai yuṃḍuṭa - ī prakāramu dhyānayōgamaṃduṃḍuṭa jñāna niṣṭha).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.