(బృహదారణ్యకోపనిషత్ - 2 - 4 - 4)
ఇతి దర్శన నునూద్య తత్సాధనత్వేన ” శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసి తవ్యః“ఇతి శ్రవణ మనన నిధిధ్యాసనానాం విధానాత్ కర్మణాంచ తత్వజ్ఞానే వినియోగః”.
(ఆత్మజ్ఞాన సాధనము యోగము - శ్రవణ, మనన, నిధిధ్యాసనములు కూడ జ్ఞాన సాధనములు - మైత్రేయీ బ్రాహ్మణమందు (బృహదారణ్యకోపనిషత్తునందు ఈ ప్రకారము చెప్పబడినది) (బృహదారణ్యకోపనిషత్తులో) - : “ఆత్మ సాక్షాత్కారము పొందవలసినది” అని చెప్పి దానికి సాధనముగా - “ఆత్మ శ్రోత వ్యము - ఆత్మగుఱించి వినతగినది - (శ్రవణము), మననము చేయవలసినది, ధ్యానము చేయవలసినది (నిధుధ్యాసనము)” అని చెప్పబడినది. అందుచేత శ్రవణము, మననము, నిధిధ్యాసనము జ్ఞానమునకు - బ్రహ్మను సాక్షాత్కరించుకొనుటకు - సాధనములు. కర్మలు ఈ తత్వజ్ఞానమును పొందుటకు వినియోగ పడును).
(శ్వేతాశ్వతరోపనిషత్ - 1 - 3)
(బ్రహ్మ సాక్షాత్కారము పొందుటలో నిధి ధ్యాసనము సాక్షాత్కారణము. అత్యంత గూఢముగానుండి సాధారణముగా కనబడని ఆత్మ శక్తిని ధ్యానయోగులు - నిధిధ్యాసనము చేయువారు - చూచెదరు).
(నిధిధ్యాసనమునకు కారణము మననము. మనోదారుఢ్యము లేనివానికి ధ్యానముచేయు విషయమందునిధిధ్యాసనము కుదరదు - మననమునకు శ్రవణము కారణము. శ్రవణము చేసిన విషయము యుక్తమా అయుక్తమా అనునది శ్రవణము లేనిదీ మననము కుదరదు - ఈ కారణమువల్ల ఈ మూడును - శ్రవణ, మనన, నిధిధ్యాసనములు - జ్ఞానము కలుగుటకు కారణములు - అని ఆచార్య వాచస్పతి మతము).
(bṛhadāraṇyakōpaniṣat - 2 - 4 - 4)
iti darśana nunūdya tatsādhanatvēna ” śrōtavyō, maṃtavyō, nidhidhyāsi tavyaḥ”iti śravaṇa manana nidhidhyāsanānāṃ vidhānāt karmaṇāṃca tatvajñānē viniyōgaḥ”.
(ātmajñāna sādhanamu yōgamu - śravaṇa, manana, nidhidhyāsanamulu kūḍa jñāna sādhanamulu - maitrēyī brāhmaṇamaṃdu (bṛhadāraṇyakōpaniṣattunaṃdu ī prakāramu ceppabaḍinadi) (bṛhadāraṇyakōpaniṣattulō) - : “ātma sākṣātkāramu poṃdavalasinadi” ani ceppi dāniki sādhanamugā - “ātma śrōta vyamu - ātmaguṟiṃci vinataginadi - (śravaṇamu), mananamu cēyavalasinadi, dhyānamu cēyavalasinadi (nidhudhyāsanamu)” ani ceppabaḍinadi. aṃducēta śravaṇamu, mananamu, nidhidhyāsanamu jñānamunaku - brahmanu sākṣātkariṃcukonuṭaku - sādhanamulu. karmalu ī tatvajñānamunu poṃduṭaku viniyōga paḍunu).
(śvētāśvatarōpaniṣat - 1 - 3)
(brahma sākṣātkāramu poṃduṭalō nidhi dhyāsanamu sākṣātkāraṇamu. atyaṃta gūḍhamugānuṃḍi sādhāraṇamugā kanabaḍani ātma śaktini dhyānayōgulu - nidhidhyāsanamu cēyuvāru - cūcedaru).
(nidhidhyāsanamunaku kāraṇamu mananamu. manōdāruḍhyamu lēnivāniki dhyānamucēyu viṣayamaṃdunidhidhyāsanamu kudaradu - mananamunaku śravaṇamu kāraṇamu. śravaṇamu cēsina viṣayamu yuktamā ayuktamā anunadi śravaṇamu lēnidī mananamu kudaradu - ī kāraṇamuvalla ī mūḍunu - śravaṇa, manana, nidhidhyāsanamulu - jñānamu kaluguṭaku kāraṇamulu - ani ācārya vācaspati matamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.