జ్ఞానము గలవాడు ; వేదాంతి , ఉపనిషత్తులలోని పరమార్థము నెఱింగినవాడు).
“విష్ణోః తత్వవిత్” (శ్రీశంకరః)
(శ్రీమహా విష్ణువు యొక్క తత్వమును తెలిసినవాడు).
తీర్ణమాయో యథా వ్యాస సనకాది రుదార ధీః |
యోవా కేవల నిష్కామో యథా (అ)క్ర్రూరో యుధిష్టరః ||“. (గీతాభావప్రకాశము - 4 - 104, 105)
(జ్ఞాని యగువాడు విష్ణుతత్వమును - భగవత్తత్వమును - తెలిసినవాడు - సనకసందనులు మొదలగువారివలె, వ్యాసుని వలె - మాయను తరించినవాడు. అక్రూరుడు, యుధిష్టరుడు వలె కేవలముఏ విధమైన కోరికలు లేనివాడు).
ప్రారబ్దాంతం సం చరన్ యత్ర కుత్ర జ్ఞానీ లోకే తాజతే నిర్మలాత్మా ||“.
(ప్రపంచమునకు సంబంధించినదేదియు లేని స్చరూపముగల ఆత్మను తెలుసుకొని, తాని ఆత్మారాముడని, చిదాత్మయని తెలుసుకొని ప్రారబ్దకర్మ ఫలము పూర్తియగువరకు - ఫలమునిచ్చుటకు ప్రారంభించిన కర్మ ఫలమును అనుభవించుట పూర్తియగు వరకు - ఎక్కడో ఒక చోట నిర్మలుడై - నిర్మలమైన మనస్సు గలవాడై - సంచరించువాడు జ్ఞాని).
న సు వృత్తం, న దుర్వృత్తం, వేదకశ్చిత్స బ్రాహ్మణః |
గూఢ ధర్మాశ్రితో విద్వానజ్ఞాత చరితం చరేత్ |
అంధవజ్జడవచ్చాపి మూకవచ్చ మహీం చరేత్ ||“. ఇతి శ్రుతేః.
(ప్రపంచకములో బ్రతికియున్నాడని కాని, లేడనికాని, విద్యావంతుడనికాని, కాడనికాని, మంచివాడనికాని, చెడ్డవాడనికాని ఎవ్వని జనులు ఎఱుంగరో వాడే బ్రహ్మ జ్ఞాని - తను జ్ఞానియని ఇతరులకు తెలియచేయుటయందు ఆసక్తి లేనివాడు. జ్ఞాని యగువాడు తనకు గల జ్ఞానమును పైకి కనపరచకుండ అజ్ఞాతవాసముచేయువానివలె నుండును - తన గుఱించి ఎవరికి తెలియకుండునట్లు సంచరించవలెను. గుడ్డివాడువలె, మూగవానివలె సంచరించవలయును).
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ |
తేషాం జ్ఞానీ నిత్య యుక్తః ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియోహి జ్ఞానినో (అ)త్యర్థ మహంసచ యమత్రియః |
ఉదారాసర్వ ఏ వైతే జ్ఞానీత్వా త్మైవ మేమతం |
ఆస్తితః సహి యుక్తాత్మా మామేవా నుత్తమాం గతిం |
బహూ నాం జన్మ నామం తే జ్ఞాన వాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి సమహాత్మా సు దుర్లభః“||. (శ్రీమద్భగవద్గీత - 7 - 16 to 19)
(పుణ్యాత్ములైనవారు నాలుగు విధములవారు నన్ను - భగవంతుని - భజింతురు. ఆర్తుడు - (ఆపదలోనున్నవాడు) (గజేంద్రుడు వంటివాడు), జిజ్ఞాసువు (ఆత్మతత్వజ్ఞానమును తెలుసుకొనవలెనను కోరిక గలవాడు), (ఉద్భవుడు , జనకుడు మొదలగువారు), అర్థార్థి భోగములననుభవించవలెనను లేక ఏదైన కోరిక గలవాడు (విభీషణుడు, సుగ్రీవుడు ధ్రువుడు మొదలగువారు), జ్ఞాని (మాయను తరించి భగవత్తత్వమును పూర్తిగా గ్రహించినవాడు (వ్యాసుడు, సనకసనందనాదులు), (కేవలము ఏ కోరికలు లేనివారు).. ఈ నలుగురిలోను ఏ కోరికయు లేనివాడగుటచేత, భగవంతునియందు హెచ్చుగా భక్తి కలిగియుండుటచేతను జ్ఞానియనువాడు ఉత్కృష్టుడు - భగవత్తత్త్వమును (స్వస్వరూపమును) యధార్థముగా తెలుసుకొని ఎల్లపుడు భగవంతునియందే మనస్సు గలిగి, భగవంతునే ధ్యానించువాడు అగుటచేత జ్ఞాని ఉత్తముడు. ఈ నలుగురు ఉదారులేగాని జ్ఞాని సాక్షాత్తు భగవంతుడే - “బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మ జ్ఞానము గలవాడు బ్రహ్మమే యగును). వాసుదేవుడే అంతయు అనుజ్ఞానము గలవాడు - జ్ఞాని ఎన్నో జన్మల తర్వాత భగవంతును పొందును -
(పదములకు, వాక్యములకు ప్రమాణము తెలిసినవాడు - వ్యాకరణము, మీమాంసన్యాయము మొదలగు శాస్త్రములను తెలిసినవాడు).
నది యొనర్తులితరులైనవార
లతడు సత్య మిట్టిదనినేని లోకంబు
దత్ప్రవర్తనమున దగిలియుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - 113)
(జ్ఞానియగువాడు ఏది చేసిన అదియే మంచిదని ఇతరులు అతనిని అనుకరింతురు).
న తేనై వైకతాం యాతి సంసారే జ్ఞానహం స్తథా ||“.
(పాలనుండి తీసిన వెన్న మరలపాలలో వేసిన దానితో ఏకము కాదు - అట్లే జ్ఞానియైనవాడు సంసారమునుండి విడిపోయినవాడు మరల సంసారములో కలియడు).
jñānamu galavāḍu ; vēdāṃti , upaniṣattulalōni paramārthamu neṟiṃginavāḍu).
“viṣṇōḥ tatvavit” (śrīśaṃkaraḥ)
(śrīmahā viṣṇuvu yokka tatvamunu telisinavāḍu).
tīrṇamāyō yathā vyāsa sanakādi rudāra dhīḥ |
yōvā kēvala niṣkāmō yathā (a)krrūrō yudhiṣṭaraḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 104, 105)
(jñāni yaguvāḍu viṣṇutatvamunu - bhagavattatvamunu - telisinavāḍu - sanakasaṃdanulu modalaguvārivale, vyāsuni vale - māyanu tariṃcinavāḍu. akrūruḍu, yudhiṣṭaruḍu vale kēvalamuē vidhamaina kōrikalu lēnivāḍu).
prārabdāṃtaṃ saṃ caran yatra kutra jñānī lōkē tājatē nirmalātmā ||“.
(prapaṃcamunaku saṃbaṃdhiṃcinadēdiyu lēni scarūpamugala ātmanu telusukoni, tāni ātmārāmuḍani, cidātmayani telusukoni prārabdakarma phalamu pūrtiyaguvaraku - phalamuniccuṭaku prāraṃbhiṃcina karma phalamunu anubhaviṃcuṭa pūrtiyagu varaku - ekkaḍō oka cōṭa nirmaluḍai - nirmalamaina manassu galavāḍai - saṃcariṃcuvāḍu jñāni).
na su vṛttaṃ, na durvṛttaṃ, vēdakaścitsa brāhmaṇaḥ |
gūḍha dharmāśritō vidvānajñāta caritaṃ carēt |
aṃdhavajjaḍavaccāpi mūkavacca mahīṃ carēt ||“. iti śrutēḥ.
(prapaṃcakamulō bratikiyunnāḍani kāni, lēḍanikāni, vidyāvaṃtuḍanikāni, kāḍanikāni, maṃcivāḍanikāni, ceḍḍavāḍanikāni evvani janulu eṟuṃgarō vāḍē brahma jñāni - tanu jñāniyani itarulaku teliyacēyuṭayaṃdu āsakti lēnivāḍu. jñāni yaguvāḍu tanaku gala jñānamunu paiki kanaparacakuṃḍa ajñātavāsamucēyuvānivale nuṃḍunu - tana guṟiṃci evariki teliyakuṃḍunaṭlu saṃcariṃcavalenu. guḍḍivāḍuvale, mūgavānivale saṃcariṃcavalayunu).
ārtō jijñāsurarthārthī jñānīca bharatarṣabha |
tēṣāṃ jñānī nitya yuktaḥ ēkabhaktirviśiṣyatē |
priyōhi jñāninō (a)tyartha mahaṃsaca yamatriyaḥ |
udārāsarva ē vaitē jñānītvā tmaiva mēmataṃ |
āstitaḥ sahi yuktātmā māmēvā nuttamāṃ gatiṃ |
bahū nāṃ janma nāmaṃ tē jñāna vānmāṃ prapadyatē |
vāsudēvaḥ sarvamiti samahātmā su durlabhaḥ”||. (śrīmadbhagavadgīta - 7 - 16 to 19)
(puṇyātmulainavāru nālugu vidhamulavāru nannu - bhagavaṃtuni - bhajiṃturu. ārtuḍu - (āpadalōnunnavāḍu) (gajēṃdruḍu vaṃṭivāḍu), jijñāsuvu (ātmatatvajñānamunu telusukonavalenanu kōrika galavāḍu), (udbhavuḍu , janakuḍu modalaguvāru), arthārthi bhōgamulananubhaviṃcavalenanu lēka ēdaina kōrika galavāḍu (vibhīṣaṇuḍu, sugrīvuḍu dhruvuḍu modalaguvāru), jñāni (māyanu tariṃci bhagavattatvamunu pūrtigā grahiṃcinavāḍu (vyāsuḍu, sanakasanaṃdanādulu), (kēvalamu ē kōrikalu lēnivāru).. ī nalugurilōnu ē kōrikayu lēnivāḍaguṭacēta, bhagavaṃtuniyaṃdu heccugā bhakti kaligiyuṃḍuṭacētanu jñāniyanuvāḍu utkṛṣṭuḍu - bhagavattattvamunu (svasvarūpamunu) yadhārthamugā telusukoni ellapuḍu bhagavaṃtuniyaṃdē manassu galigi, bhagavaṃtunē dhyāniṃcuvāḍu aguṭacēta jñāni uttamuḍu. ī naluguru udārulēgāni jñāni sākṣāttu bhagavaṃtuḍē - “brahma vid brahmaiva bhavati” (brahma jñānamu galavāḍu brahmamē yagunu). vāsudēvuḍē aṃtayu anujñānamu galavāḍu - jñāni ennō janmala tarvāta bhagavaṃtunu poṃdunu -
(padamulaku, vākyamulaku pramāṇamu telisinavāḍu - vyākaraṇamu, mīmāṃsanyāyamu modalagu śāstramulanu telisinavāḍu).
nadi yonartulitarulainavāra
lataḍu satya miṭṭidaninēni lōkaṃbu
datpravartanamuna dagiliyuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - 113)
(jñāniyaguvāḍu ēdi cēsina adiyē maṃcidani itarulu atanini anukariṃturu).
na tēnai vaikatāṃ yāti saṃsārē jñānahaṃ stathā ||“.
(pālanuṃḍi tīsina venna maralapālalō vēsina dānitō ēkamu kādu - aṭlē jñāniyainavāḍu saṃsāramunuṃḍi viḍipōyinavāḍu marala saṃsāramulō kaliyaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.