జ్ఞాతవ్యం (తెలుసుకో తగినది).
జ్ఞానైకాకారం ఇతి జ్ఞేయం. (జ్ఞానమే ఆకారముగా గల చిద్రూపము - చిద్రూపుడైన పరబ్రహ్మ).
ప్రాప్యం యత్ప్రత్యగాత్మస్వరూపం.
(పొంద తగినది, పరమ పదము - మోక్షస్థానమైన పరబ్రహ్మ - ప్రత్యగాత్మ స్వరూపము).
(పరబ్రహ్మ యొక్క స్వస్వరూపమే - యథార్థతత్వమే - తెలియ తగినది - పరబ్రహ్మమే పరమ పురుషార్థమైన మోక్షస్థానమగుటచేత, పరబ్రహ్మ తప్ప ఇతరము పరమ పురుషార్థము లేదు కనుక - ఇట్లు తెలియతగిన వస్తువు సన్మాత్రము - శాశ్వతముగా నుండునది కనుక అదియే తెలియ తగినది).
(మోక్షము కోరువారి చేత వేదములో చెప్పబడిన మార్గముననుసరించి ఆత్మ తత్వము అవశ్యము (తప్పక) తెలుసుకోతగినది - తెలుసుకోతగిన విషయము).
(ఈ ప్రపంచమంతకును సృష్టి స్థితిలయములు చేయువాడు అగుటచేత నారాయణుడు - పరబ్రహ్మ - తెలియ తగినవాడు). (చూడుము - ‘నారాయణుడు’). సమస్త జీవులకు (నారములకు) పుట్టుకస్థానము అగుటవల్లను, వాటిలోనే తాను నివసించి యుండుటచేతను, వాటికి లయస్థానముతానే అగుటచేతను శ్రీమన్నారాయణుడు తెలుసుకొన తగినవాడు).
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే |
సర్వతః పాణిపాదం తత్సర్వతో(అ)క్షి శిరోముఖం |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి |
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం|
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ|
బహిరంత శ్చ భూతానాం మచరం చరమేవచ |
సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ |
అవిభక్తం చ భూతేషు విభక్తమివచ |
జ్యోతిషా మపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్ఠితం ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 12 to 17)
(తెలియ తగిన వస్తువుగుఱించి చెప్పచున్నాను - దీనినితెలుసుకొనిన మృత్యువులేని స్థితిని మోక్షమును - పొందెదవు. అది ఆది - జన్మ - లేనిది, పరబ్రహ్మము. అది సత్ అనిగాని, అసత్ (సత్ కానిది) అని గాని చెప్పుటకు వీలులేనిది. అది అంతట కాళ్ళు చేతులు, కండ్లు శిరములు, ముఖములు, చెవులు కలది. అన్ని రూపములు దానివే అయినందున వాటి అవయవములన్నియు దానివే. అన్నింటిలోనూ తా నుండి వాటిచే వాటి వాటి వృత్తులను చేయించునది. లోకమంతటిలోను - లోకములో నున్న వస్తువులన్నింటిలోను - ఆవరించియున్నది - వ్యాపించియున్నది. ఇంద్రియముములున్నట్లు కనబడును కాని యే ఇంద్రియములేనిది. అన్నింటిలోనున్నను దేనిని అంటనిది, అన్నింటిని భరించునది, త్రిగుణములు లేనిది - సత్వరజస్తమోగుణములకు అతీతమైనది, త్రిగుణములవలన కలుగు ప్రభావము లేనిది; సమస్త భూతములలోను, లోపల. పైన, అంతటను నిండియుండునది; అచరము, చరము (కదులునది, కదలనిది) తానే అయినది, (తానున్న ఉపాధిని బట్టి కదలుట కదలకుండుట కలుగును), మిక్కిలి సూక్ష్మమైనదగుటచేత దాని విషయము తెలియబడనిది,దానిని తెలియనివారికి - అజ్ఞానులకు, భగవద్భక్తులు కానివారికి - ఎక్కడో దూరముగానున్నట్లుండునది.దానిని తెలిసినవారికి - బ్రహ్మజ్ఞానులకు, భక్తులకు - ఎక్కడపడితే అక్కడ ఉండునట్లు కనబడునది (ప్రహ్లాదునకు వలె) కనుక అట్టివారికి దగ్గరగానుండునది; స్వస్వరూపములో - యధార్థరూపములో -విభక్తముగాక ఒకటే అయి యుండునది; ప్రపంచములోనున్న వస్తువులన్నింటిలోను ఉండుటవలన విభక్తమైనట్లు - వేరు వేరుగానున్నట్లు - అనిపించునది; భూతములను భరించునది, అన్నింటినీ పుట్టించునది (అనగా, సృష్టి స్థితిలయములు చేయునది; ప్రకాశించు వస్తువులన్నింటికీ తన ప్రకాశమును - తేజస్సును - ఇచ్చి వాటిని ప్రకాశింపచేయునది - “తత్తేజో విద్ధి మామకం”, ప్రళయకాలమందు ప్రకాశించువస్తువులన్నియు నశించిపోగా, ప్రపంచమంతటను గాఢాంధకారమావరించి యుండగా దానికావల ప్రకాశించునది –
క. “లోకంబులు, లోకేశులు
లోకస్థులు తెగినతుదిన లోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతివెలుగు నతని నే సేవింతున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - - గజేంద్రమోక్షము - 8 - 3 - 75)
ఇదియే జ్ఞానము, జ్ఞేయము - తెలుసుకొనతగినది; జ్ఞానముద్వారా పొందతగినది. సమస్త ప్రాణముల హృదయములోను నివసించి యుండినది. ఇప్పటి పరబ్రహ్మ. ఇదియే తెలియతగినది. సమస్తమైన విషయముల గుఱించి అయిన జ్ఞానమిదియే – అజ్ఞానము వలన తెలియతగిన దిదియే. (the highest knowledge is knowledge of God).
“భూత భౌతిక విషయంబులు జ్ఞేయంబులనంబడు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)
“త్వమక్షరం పరమం వేది తవ్యం” (శ్రీమద్భగవద్గీత - 11 - 17)
jñātavyaṃ (telusukō taginadi).
jñānaikākāraṃ iti jñēyaṃ. (jñānamē ākāramugā gala cidrūpamu - cidrūpuḍaina parabrahma).
prāpyaṃ yatpratyagātmasvarūpaṃ.
(poṃda taginadi, parama padamu - mōkṣasthānamaina parabrahma - pratyagātma svarūpamu).
(parabrahma yokka svasvarūpamē - yathārthatatvamē - teliya taginadi - parabrahmamē parama puruṣārthamaina mōkṣasthānamaguṭacēta, parabrahma tappa itaramu parama puruṣārthamu lēdu kanuka - iṭlu teliyatagina vastuvu sanmātramu - śāśvatamugā nuṃḍunadi kanuka adiyē teliya taginadi).
(mōkṣamu kōruvāri cēta vēdamulō ceppabaḍina mārgamunanusariṃci ātma tatvamu avaśyamu (tappaka) telusukōtaginadi - telusukōtagina viṣayamu).
(ī prapaṃcamaṃtakunu sṛṣṭi sthitilayamulu cēyuvāḍu aguṭacēta nārāyaṇuḍu - parabrahma - teliya taginavāḍu). (cūḍumu - ‘nārāyaṇuḍu’). samasta jīvulaku (nāramulaku) puṭṭukasthānamu aguṭavallanu, vāṭilōnē tānu nivasiṃci yuṃḍuṭacētanu, vāṭiki layasthānamutānē aguṭacētanu śrīmannārāyaṇuḍu telusukona taginavāḍu).
anādimatparaṃ brahma na sattannā saducyatē |
sarvataḥ pāṇipādaṃ tatsarvatō(a)kṣi śirōmukhaṃ |
sarvataḥ śrutimallōkē sarvamāvṛtya tiṣṭhati |
sarvēṃdriya guṇābhāsaṃ sarvēṃdriya vivarjitaṃ|
asaktaṃ sarvabhṛccaiva nirguṇaṃ guṇabhōktṛca|
bahiraṃta śca bhūtānāṃ macaraṃ caramēvaca |
sūkṣmatvātta davijñēyaṃ dūrasthaṃ cāṃtikē ca tat |
avibhaktaṃ ca bhūtēṣu vibhaktamivaca |
jyōtiṣā mapi tajjyōtistamasaḥ paramucyatē |
jñānaṃ jñēyaṃ jñānagamyaṃ hṛdi sarvasya dhiṣṭhitaṃ ||“. (śrīmadbhagavadgīta - 13 - 12 to 17)
(teliya tagina vastuvuguṟiṃci ceppacunnānu - dīninitelusukonina mṛtyuvulēni sthitini mōkṣamunu - poṃdedavu. adi ādi - janma - lēnidi, parabrahmamu. adi sat anigāni, asat (sat kānidi) ani gāni ceppuṭaku vīlulēnidi. adi aṃtaṭa kāḷḷu cētulu, kaṃḍlu śiramulu, mukhamulu, cevulu kaladi. anni rūpamulu dānivē ayinaṃduna vāṭi avayavamulanniyu dānivē. anniṃṭilōnū tā nuṃḍi vāṭicē vāṭi vāṭi vṛttulanu cēyiṃcunadi. lōkamaṃtaṭilōnu - lōkamulō nunna vastuvulanniṃṭilōnu - āvariṃciyunnadi - vyāpiṃciyunnadi. iṃdriyamumulunnaṭlu kanabaḍunu kāni yē iṃdriyamulēnidi. anniṃṭilōnunnanu dēnini aṃṭanidi, anniṃṭini bhariṃcunadi, triguṇamulu lēnidi - satvarajastamōguṇamulaku atītamainadi, triguṇamulavalana kalugu prabhāvamu lēnidi; samasta bhūtamulalōnu, lōpala. paina, aṃtaṭanu niṃḍiyuṃḍunadi; acaramu, caramu (kadulunadi, kadalanidi) tānē ayinadi, (tānunna upādhini baṭṭi kadaluṭa kadalakuṃḍuṭa kalugunu), mikkili sūkṣmamainadaguṭacēta dāni viṣayamu teliyabaḍanidi,dānini teliyanivāriki - ajñānulaku, bhagavadbhaktulu kānivāriki - ekkaḍō dūramugānunnaṭluṃḍunadi.dānini telisinavāriki - brahmajñānulaku, bhaktulaku - ekkaḍapaḍitē akkaḍa uṃḍunaṭlu kanabaḍunadi (prahlādunaku vale) kanuka aṭṭivāriki daggaragānuṃḍunadi; svasvarūpamulō - yadhārtharūpamulō -vibhaktamugāka okaṭē ayi yuṃḍunadi; prapaṃcamulōnunna vastuvulanniṃṭilōnu uṃḍuṭavalana vibhaktamainaṭlu - vēru vērugānunnaṭlu - anipiṃcunadi; bhūtamulanu bhariṃcunadi, anniṃṭinī puṭṭiṃcunadi (anagā, sṛṣṭi sthitilayamulu cēyunadi; prakāśiṃcu vastuvulanniṃṭikī tana prakāśamunu - tējassunu - icci vāṭini prakāśiṃpacēyunadi - “tattējō viddhi māmakaṃ”, praḷayakālamaṃdu prakāśiṃcuvastuvulanniyu naśiṃcipōgā, prapaṃcamaṃtaṭanu gāḍhāṃdhakāramāvariṃci yuṃḍagā dānikāvala prakāśiṃcunadi –
ka. “lōkaṃbulu, lōkēśulu
lōkasthulu teginatudina lōkaṃbagu peṃ
jīkaṭi kavvala nevvaṃ
ḍēkākṛtivelugu natani nē sēviṃtun”. (śrīmadāṃdhramahābhāgavatamu - - gajēṃdramōkṣamu - 8 - 3 - 75)
idiyē jñānamu, jñēyamu - telusukonataginadi; jñānamudvārā poṃdataginadi. samasta prāṇamula hṛdayamulōnu nivasiṃci yuṃḍinadi. ippaṭi parabrahma. idiyē teliyataginadi. samastamaina viṣayamula guṟiṃci ayina jñānamidiyē – ajñānamu valana teliyatagina didiyē. (the highest knowledge is knowledge of God).
“bhūta bhautika viṣayaṃbulu jñēyaṃbulanaṃbaḍu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
“tvamakṣaraṃ paramaṃ vēdi tavyaṃ” (śrīmadbhagavadgīta - 11 - 17)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.