← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జ్యోతిః jyōtiḥ

Original — తెలుగు
  1. స్వయమేవద్యో తత్, స్వతః ఏవ ద్యోతతే ఇతి జ్యోతిః - “నారాయణః పరం జ్యోతిః” ఇతి మంత్ర వర్ణాత్.

(తనంతట తానే ప్రకాశించువాడు, వెలుగువాడు - నారాయణుడు తనంతట తానే ప్రకాశించువాడు, ప్రకాశించుటకు ఇతరవస్తువు అపేక్ష లేనివాడు అని మంత్రము పరమాత్మను (నారాయణుని) వర్ణించుచున్నది.. (నారాయణోపనిషత్)

  1. తేజః, తేజో రూపం; పరం బ్రహ్మ.

(తేజస్సు; తేజస్సే రూపముగా గలది ; పరబ్రహ్మ - “పరం జ్యోతి రుప సంపద్య” ఇతి శ్రుతిః).

  1. జ్యోతిశ్శబ్దో భాస్వ స్వరూపస్య వాచకః, స్వయం ప్రకాశః.

(జ్యోతి అనుమాట ప్రకాశించు స్వరూపమును తెలియ చేయునది - అందుచేత స్వయముగా ప్రకాశించునది అని అర్థము).

  1. యద్యత్ కస్య చిదవభాసకం తత్త జ్జ్యోతి శ్శబ్దేన అభిధీయ తే తథా సతి న్రహ్మణో పి చైతన్య రూపస్య సమస్త జగదవభాస హేతుత్వాత్ ఉపపన్నో జ్యోతిశ్శబ్దః.

(ఏది ప్రకాశించునో, దేనినైనా ప్రకాశింపచేయునో అది జ్యోతిస్సు అని చెపపబడుచున్నది. సమస్తమైన జగత్తును ప్రకాశింపచేయునది కనుక చైతన్య రూపుడైన పరబ్రహ్మ జ్యోతి అని చెప్పబడుచున్నాడు).

  1. సర్వ ప్రకాశక దీప్తిమంతం. (అన్నింటినీ ప్రకాశింప చేయు కాంతి గలది).

  2. అర్కాది తేజః, దీపాదిత్యా దీనాం అపి ఆత్మ ప్రభారూపం జ్ఞానం ఏవ ప్రకాశకం.

(సూర్యుడు మొదలగు వాటి తేజస్సు దీపములకు - (ప్రకాశించువాటికి) -, సూర్యుడు - (నక్షత్రములు) - మొదలగు వాటికి కూడా తనకాంతిచే వెలిగింపచేయునది (జ్ఞానము కలిగింప చేయుటే ప్రకాశింప చేయుట.

  1. తేజస్వీ (తేజస్సు కలవాడు).

  2. ప్రకాశరూపం, పరిశుద్ధః ; విజ్ఞాన ప్రకాశః -

(ప్రకాశించుటే రూపమైనది; పరిశుద్ధమైనది, విజ్ఞానమును ప్రకాశింప చేయునది).

  1. సూర్యుడు, వెలుగు, నక్షత్రము, అగ్ని, చైతన్యము.

  2. “తమేవ భాంతమను భాతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి”. (కఠోపనిషత్)

(ఆ ప్రకాశించునది అయిన బ్రహ్మము ననుసరించి - దాని తేజస్సు వాటిలో నుండుటవలననే - సర్వమును ప్రకాశించుచున్నది. తేజోవంతమగుచున్నది, చైతన్యవంతమగుచున్నది. ఆ తేజస్సు వలననే - ఆ తేజస్సు కలిగియుండుటవలననే - ఈ ప్రకాశరూపములైన సూర్యుడు, నక్షత్రములు మొదలగునవి ప్రకాశించుచున్నవి).

  1. “జ్యోతిషామపి తజ్యోతిః, తచ్ఛుభ్రం జ్యోతిషాం జ్యోతిః”. (ముండకోపనిషత్)

సూర్యాది ప్రకాశకత్వాత్.

(జ్యోతిస్వరూపములైన వాటిలోనున్న తేజస్సు పరబ్రహ్మయే. ఆ జ్యోతిస్వ్రూపములైనవాటికి జ్యోతిస్సును, కాంతిని, ఇచ్చువాడు) - ” జ్యోతిషాం రవి రం శుమాన్” (శ్రీమద్భగవద్గీత - 10 - 21)

(ప్రకాశించు రూపముగల వాటిలో కాంతి కిరణములు గల రవి - సూర్యుడు - నేనే (భగవంతుడే).

” హిరణ్మయే పరే కోశేవిరజం బ్రహ్మ నిష్కలం |

తచ్ఛుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్యదాత్మ విదోవిదుః” (ముండకోపనిషత్).

“మ. అనఘా ! విశ్వము నెల్ల దీప్తముగ జేయన్ సమర్థుండనే

ఇన చంద్రానల తారక గ్రహ గణంబేరీతి నారీతి నె

వ్వని దీప్తిం బ్రతి దీప్తమయ్యె భువన వింతంబు దద్దీప్తిచే

నను దీప్తంబగు నట్టి యీశ్వరునకే నశ్రాంతమున్ మ్రొక్కెదన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -2 -5 -82)

అగ్న్యా దీనా మపి జ్యోతిష్ట్వం అంతర్గత బ్రహ్మాత్మ చైతన్య జ్యోతిర్నిమిత్తం - పరంజ్యోతిః.

  1. “క. లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం

జీకటికవ్వల నెవ్వం

డేకాకృతి వెలుగు నతనునే సేవింతున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 75)

(ప్రాకృత ప్రళయములో సమస్త జీవులు, లోకములు నశించిపోగా - అనగా , వాటి వాటి కారణవస్తువులలో లీనము కాగా వాటితో పాటు సమస్త జ్యోతి స్వరూపములు అయిన సూర్యుడు మొదలగునవికూడా నామ రూపములు లేకుండునట్లు పరబ్రహ్మలో లీనమైనపుడు ఏకాకియై - ఒక్కడే అయి - వెలుగుచుండు శ్రీమహావిష్ణువునకు నమస్కారము).

  1. “నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరాః” (మంత్రపుష్పము)
Transliteration
  1. svayamēvadyō tat, svataḥ ēva dyōtatē iti jyōtiḥ - “nārāyaṇaḥ paraṃ jyōtiḥ” iti maṃtra varṇāt.

(tanaṃtaṭa tānē prakāśiṃcuvāḍu, veluguvāḍu - nārāyaṇuḍu tanaṃtaṭa tānē prakāśiṃcuvāḍu, prakāśiṃcuṭaku itaravastuvu apēkṣa lēnivāḍu ani maṃtramu paramātmanu (nārāyaṇuni) varṇiṃcucunnadi.. (nārāyaṇōpaniṣat)

  1. tējaḥ, tējō rūpaṃ; paraṃ brahma.

(tējassu; tējassē rūpamugā galadi ; parabrahma - “paraṃ jyōti rupa saṃpadya” iti śrutiḥ).

  1. jyōtiśśabdō bhāsva svarūpasya vācakaḥ, svayaṃ prakāśaḥ.

(jyōti anumāṭa prakāśiṃcu svarūpamunu teliya cēyunadi - aṃducēta svayamugā prakāśiṃcunadi ani arthamu).

  1. yadyat kasya cidavabhāsakaṃ tatta jjyōti śśabdēna abhidhīya tē tathā sati nrahmaṇō pi caitanya rūpasya samasta jagadavabhāsa hētutvāt upapannō jyōtiśśabdaḥ.

(ēdi prakāśiṃcunō, dēninainā prakāśiṃpacēyunō adi jyōtissu ani cepapabaḍucunnadi. samastamaina jagattunu prakāśiṃpacēyunadi kanuka caitanya rūpuḍaina parabrahma jyōti ani ceppabaḍucunnāḍu).

  1. sarva prakāśaka dīptimaṃtaṃ. (anniṃṭinī prakāśiṃpa cēyu kāṃti galadi).

  2. arkādi tējaḥ, dīpādityā dīnāṃ api ātma prabhārūpaṃ jñānaṃ ēva prakāśakaṃ.

(sūryuḍu modalagu vāṭi tējassu dīpamulaku - (prakāśiṃcuvāṭiki) -, sūryuḍu - (nakṣatramulu) - modalagu vāṭiki kūḍā tanakāṃticē veligiṃpacēyunadi (jñānamu kaligiṃpa cēyuṭē prakāśiṃpa cēyuṭa.

  1. tējasvī (tējassu kalavāḍu).

  2. prakāśarūpaṃ, pariśuddhaḥ ; vijñāna prakāśaḥ -

(prakāśiṃcuṭē rūpamainadi; pariśuddhamainadi, vijñānamunu prakāśiṃpa cēyunadi).

  1. sūryuḍu, velugu, nakṣatramu, agni, caitanyamu.

  2. “tamēva bhāṃtamanu bhāti sarvaṃ, tasya bhāsā sarvamidaṃ vibhāti”. (kaṭhōpaniṣat)

(ā prakāśiṃcunadi ayina brahmamu nanusariṃci - dāni tējassu vāṭilō nuṃḍuṭavalananē - sarvamunu prakāśiṃcucunnadi. tējōvaṃtamagucunnadi, caitanyavaṃtamagucunnadi. ā tējassu valananē - ā tējassu kaligiyuṃḍuṭavalananē - ī prakāśarūpamulaina sūryuḍu, nakṣatramulu modalagunavi prakāśiṃcucunnavi).

  1. “jyōtiṣāmapi tajyōtiḥ, tacchubhraṃ jyōtiṣāṃ jyōtiḥ”. (muṃḍakōpaniṣat)

sūryādi prakāśakatvāt.

(jyōtisvarūpamulaina vāṭilōnunna tējassu parabrahmayē. ā jyōtisvrūpamulainavāṭiki jyōtissunu, kāṃtini, iccuvāḍu) - ” jyōtiṣāṃ ravi raṃ śumān” (śrīmadbhagavadgīta - 10 - 21)

(prakāśiṃcu rūpamugala vāṭilō kāṃti kiraṇamulu gala ravi - sūryuḍu - nēnē (bhagavaṃtuḍē).

” hiraṇmayē parē kōśēvirajaṃ brahma niṣkalaṃ |

tacchubhraṃ jyōtiṣāṃ jyōtiḥ tadyadātma vidōviduḥ” (muṃḍakōpaniṣat).

“ma. anaghā ! viśvamu nella dīptamuga jēyan samarthuṃḍanē

ina caṃdrānala tāraka graha gaṇaṃbērīti nārīti ne

vvani dīptiṃ brati dīptamayye bhuvana viṃtaṃbu daddīpticē

nanu dīptaṃbagu naṭṭi yīśvarunakē naśrāṃtamun mrokkedan”. (śrīmadāṃdhramahābhāgavatamu -2 -5 -82)

agnyā dīnā mapi jyōtiṣṭvaṃ aṃtargata brahmātma caitanya jyōtirnimittaṃ - paraṃjyōtiḥ.

  1. “ka. lōkaṃbulu lōkēśulu

lōkasthulu tegina tudi nalōkaṃbagu peṃ

jīkaṭikavvala nevvaṃ

ḍēkākṛti velugu natanunē sēviṃtun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 75)

(prākṛta praḷayamulō samasta jīvulu, lōkamulu naśiṃcipōgā - anagā , vāṭi vāṭi kāraṇavastuvulalō līnamu kāgā vāṭitō pāṭu samasta jyōti svarūpamulu ayina sūryuḍu modalagunavikūḍā nāma rūpamulu lēkuṃḍunaṭlu parabrahmalō līnamainapuḍu ēkākiyai - okkaḍē ayi - velugucuṃḍu śrīmahāviṣṇuvunaku namaskāramu).

  1. “nārāyaṇaparō jyōtirātmā nārāyaṇaḥ parāḥ” (maṃtrapuṣpamu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.