(కేవలుడు అనగా ప్రకృతితో కలియని స్థితిలో ఉన్న భగవంతుడు - (చూడుము - ‘కేవలః’) - అతని భావము - కైవల్యము - అప్పటి అతని స్థితి, మోక్షము, ముక్తి, వైరాగ్యము).
(కేవల ఆత్మయొక్క భావము కైవల్యము - దేనితోను కలిసి యుండని ఆత్మయున్న స్థితి, స్వస్వభావము, దేహము లేకపోవుట.” బ్రహ్మజ్ఞానమువలన పొందబడిన కేవలత్వమువలన సర్వవిధములైన బంధములనుండి ముక్తుడగును“).
(\కేవలుడు అనగా సత్వరజస్తమోగుణములు లేని పరబ్రహ్మ, అతని భావము, తత్వము, సస్వభావము).
(ఒక్కడుగానే అన్నింటిలోను ఉండినప్పటికి, ఉన్నట్లు పైకి తెలియ బడకుండా నుండుట).
(చిత్తము ఆత్మతో సమానముగా నిర్మలత్వము కలిగియుండు స్థితి - శుద్ధ సత్వస్థితి).
(మోక్షరూపమైన ఆత్మ, ముక్తిరూపమైన పరమాత్మ - పరమాత్మయే మోక్షము, మోక్షమే పరమాత్మ, వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు).
అపవర్గము - భగవంతునితో ఐక్యమగుట.
“సాలోక్యమపి సారూప్యసార్ష్యం సాయుజ్యమేవచ |
కైవల్యం చేతితాం విద్ధిముక్తిం, రాఘవ, పంచధా ||“.
(సాలోక్యమని, సారూప్యమని, సార్ష్యమని, సాయుజ్యమని, కైవల్యమని ముక్తి అయిదు విధములు).
కైవల్యం లభతే మర్త్యః, కింతు జ్ఞానేన కేవలం ||“. (పద్మ పురాణము)
(కర్మలననుష్టించుటవలనగాని, తపస్సుచేతగాని, దానము చేతగాని మానవుడు కైవల్యమును పొందలేడు, కేవలము జ్ఞానముచేతనే పొందగలడు).
క్రోశము కైవల్య లక్ష్మికుల గృహమని యాక్రోశించు శ్రుతులు - - ||“. (శ్రీనాధుడు - కాశీఖండము)
గావించి భయంబుదక్కి, ఖట్వాంగ ధరి
త్రీవిభుడు సూరగొనియెను
గైవల్యము దొల్లి రెండు గడియలలోనన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 11)
సృష్టిలో ఉన్న ప్రతివస్తువులోనూ భగవంతుడు ప్రవేశించి, అందులో పూర్తిగా వ్యాపించియున్నాడు - (చూడుము - ‘విష్ణు’) - ప్రతివస్తువులోను కలిసియున్నాడు, ఆ వస్తువునుంచి వేరుగా లేడు. సృష్టికి పూర్వము, ఏ వస్తువు పుట్టకముందు, ఏ వస్తువులోను భగవంతుడు ప్రవేశింపకముందు భగవంతుడు ఒక్కడే - ఒకే తత్వముగా ఉండెడివాడు. ‘చిత్ ఘనం’ గా ఆ భగవంతుడొకడే ఉండెను - ఆ స్థితిలో ఉండు భగవంతుడు ‘కేవలుడు’. కేవలుని భావము కైవల్యము; అనగా కేవలుడుగా నుండు స్థితి, ఆత్మ మాత్రముగానుండు స్థితి. జీవుడు భగవంతుని అంశయే - ఆత్మ తత్వమే. అట్టి జీవుడు కైవల్యమును పొందుట అనగా (మోక్షమును పొందుట అనగా) జీవుడు తనను ఆవరించుకొని దేహ రూపముగా మారిన ప్రకృతిని - దాని వికారములను - విడిపించుకొని, వదలగొట్టుకొని, ఏ విధమైన ఉపాధి లేక తన నిజస్వరూపమైన పరమాత్మ తత్వముతో సమానమైన తత్వమై ఆ తత్వములో కలిసి దానిలో లీనమైపోవుట.
“మ. - - - కృష్ణ కథా సుథారసము సంప్రీతాత్ములై భక్తి గ్రో
లిన పుణ్యాత్ములు గాంతురిందు సుఖ ముల్ నిర్థూత సర్వాఘలై
యనయంబందుది గాంతురచ్యుతపదంబైనట్టి కైవల్యమున్||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.-1337)
(kēvaluḍu anagā prakṛtitō kaliyani sthitilō unna bhagavaṃtuḍu - (cūḍumu - ‘kēvalaḥ’) - atani bhāvamu - kaivalyamu - appaṭi atani sthiti, mōkṣamu, mukti, vairāgyamu).
(kēvala ātmayokka bhāvamu kaivalyamu - dēnitōnu kalisi yuṃḍani ātmayunna sthiti, svasvabhāvamu, dēhamu lēkapōvuṭa.” brahmajñānamuvalana poṃdabaḍina kēvalatvamuvalana sarvavidhamulaina baṃdhamulanuṃḍi muktuḍagunu”).
(\kēvaluḍu anagā satvarajastamōguṇamulu lēni parabrahma, atani bhāvamu, tatvamu, sasvabhāvamu).
(okkaḍugānē anniṃṭilōnu uṃḍinappaṭiki, unnaṭlu paiki teliya baḍakuṃḍā nuṃḍuṭa).
(cittamu ātmatō samānamugā nirmalatvamu kaligiyuṃḍu sthiti - śuddha satvasthiti).
(mōkṣarūpamaina ātma, muktirūpamaina paramātma - paramātmayē mōkṣamu, mōkṣamē paramātma, vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu).
apavargamu - bhagavaṃtunitō aikyamaguṭa.
“sālōkyamapi sārūpyasārṣyaṃ sāyujyamēvaca |
kaivalyaṃ cētitāṃ viddhimuktiṃ, rāghava, paṃcadhā ||“.
(sālōkyamani, sārūpyamani, sārṣyamani, sāyujyamani, kaivalyamani mukti ayidu vidhamulu).
kaivalyaṃ labhatē martyaḥ, kiṃtu jñānēna kēvalaṃ ||“. (padma purāṇamu)
(karmalananuṣṭiṃcuṭavalanagāni, tapassucētagāni, dānamu cētagāni mānavuḍu kaivalyamunu poṃdalēḍu, kēvalamu jñānamucētanē poṃdagalaḍu).
krōśamu kaivalya lakṣmikula gṛhamani yākrōśiṃcu śrutulu - - ||“. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)
gāviṃci bhayaṃbudakki, khaṭvāṃga dhari
trīvibhuḍu sūragoniyenu
gaivalyamu dolli reṃḍu gaḍiyalalōnan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 11)
sṛṣṭilō unna prativastuvulōnū bhagavaṃtuḍu pravēśiṃci, aṃdulō pūrtigā vyāpiṃciyunnāḍu - (cūḍumu - ‘viṣṇu’) - prativastuvulōnu kalisiyunnāḍu, ā vastuvunuṃci vērugā lēḍu. sṛṣṭiki pūrvamu, ē vastuvu puṭṭakamuṃdu, ē vastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃpakamuṃdu bhagavaṃtuḍu okkaḍē - okē tatvamugā uṃḍeḍivāḍu. ‘cit ghanaṃ’ gā ā bhagavaṃtuḍokaḍē uṃḍenu - ā sthitilō uṃḍu bhagavaṃtuḍu ‘kēvaluḍu’. kēvaluni bhāvamu kaivalyamu; anagā kēvaluḍugā nuṃḍu sthiti, ātma mātramugānuṃḍu sthiti. jīvuḍu bhagavaṃtuni aṃśayē - ātma tatvamē. aṭṭi jīvuḍu kaivalyamunu poṃduṭa anagā (mōkṣamunu poṃduṭa anagā) jīvuḍu tananu āvariṃcukoni dēha rūpamugā mārina prakṛtini - dāni vikāramulanu - viḍipiṃcukoni, vadalagoṭṭukoni, ē vidhamaina upādhi lēka tana nijasvarūpamaina paramātma tatvamutō samānamaina tatvamai ā tatvamulō kalisi dānilō līnamaipōvuṭa.
“ma. - - - kṛṣṇa kathā suthārasamu saṃprītātmulai bhakti grō
lina puṇyātmulu gāṃturiṃdu sukha mul nirthūta sarvāghalai
yanayaṃbaṃdudi gāṃturacyutapadaṃbainaṭṭi kaivalyamun||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.-1337)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.