(భగవత్ జ్ఞానమువలననే - ఆత్మ తత్వజ్ఞానమువలననే కైవల్యము - మోక్షము).
(బంగారముతో చేసిన ఆభరణము కంఠమునందున్నను, ఆ విషయము మఱచి ఆ ఆభరణము పోయినదని వెతుకువానికి, దగ్గరనున్నవాడు -” ఆ భరణము పోలేదు, కంఠమునందేయున్నది” అని చెప్పగా, ‘నిజముగా పోలేదు, ఉన్నది’ అని తెలుసుకొనును - అట్లే భగవత్తత్వము గుఱించి జ్ఞానములేని వానికి గురువుగాని, శాస్త్రముగాని ఆ జ్ఞానమును భోధించుటచేత తనలోనేయున్న ఆత్మ తెలియనగును - అందుచేత బ్రహ్మ జ్ఞానమువలననే కైవల్యము పొందనగును అని చెప్పబడినది. బ్రహ్మజ్ఞానము కలుగుట చేత అంతా పరబ్రహ్మమే, బ్రహ్మకు తనకు భేదములేదు అని తెలియుటచేత బ్రహ్మతో సమానుడై సారూప్య ముక్తి అను కైవల్యమును పొందును).
(బ్రహ్మ జ్ఞానము కలవాడు పరమపదమును, ముక్తిని, కైవల్యమును పొందును). “తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః” - సూరిజనులు, బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మ అయిన ఆ విష్ణుని యొక్క పరమపదమగు వైకుంఠమును - ముక్తిస్థానమును - ఎల్లపుడు చూచుచున్నారు. వారు కుశాగ్రబుద్ధి, సూక్ష్మదృష్టి కలవారగుటచేత వారిసూక్ష్మదృష్టికి, జ్ఞాననేత్రమునకు ఎల్లపుడు భగవంతుని పరమ పదము, వైకుంఠలోకము కనబడుచునే యుండును. వైకుంఠమే వైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము).
(అవిద్య మొదలగు క్లేశములు కర్మకి, దానివలన కలుగు ఫలమునకు మూలము - మూలకారణము. ఆ మూలకారణము బ్రహ్మజ్ఞానము అను అగ్నివలన దగ్ధమైపోవును - కర్మ సమూలముగ - దాని కారణ ముతో సహా నాశనమైపోయినపుడు సంసారమెక్కడిది - ఎట్లు కలుగును ? కలుగదు. అందుచేత దేహి చనిపోయినతర్వాత కైవల్యమును పొందును, అందుచేత బ్రహ్మజ్ఞానముచేతనే కైవల్యము ప్రాప్తించును).
“ఈశానః సర్వ విద్యానాం, ఈశ్వరః సర్వబ్ భూతానాం - -”ఇత్యాది శ్రుతిభ్యః శివాదేవ ప్రాప్నోతీతి“.
(బ్రహ్మ జ్ఞానమువలననే కైవల్యము లభించును అను మొదలగు వాక్యముల ప్రమాణమువలన జ్ఞానము వలననే మోక్షము కలుగును - ఆ జ్ఞానమెట్టిది యనగా సమస్త విద్యలకు ఈశ్వరుడు, సమస్తభూతము లకు ఈశ్వరుడు అను మొదలగు శ్రుతి వాక్యములవలన శివుని వలననే కలుగును - “జ్ఞానమిచ్ఛేత్ మహేశ్వరాత్”
(మహేశ్వరునివలననే బ్రహ్మజ్ఞానము పొందనగును - జ్ఞానము కొరకు మహేశ్వరుని ఉపాసించవలెను - “విద్యాకామునకు ఉమావల్లభుండును భజనీయులగుదురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 3 - 38)
(బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాతనే ముక్తిని పొందును - ముక్తిని పొందుటకు మరియొకమార్గము కన బడదు - కర్మ చేయుటచే చిత్తశుద్ధి కలుగును - చిత్తశుద్ధి కలిగిన బ్రహ్మజ్ఞానము కలుగును. బ్రహ్మజ్ఞాన ము కలిగిన ముక్తి కలుగును - అందుచేత కర్మ జ్ఞానమునకు సాధనము, జ్ఞానము ముక్తికి సాధనము - “య ఏవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంధా అయనాయ విద్యతే” - (మంత్రపుష్పములో చెప్పిన ప్రకారము పరబ్రహ్మగుఱించి జ్ఞానముగలవాడు ముక్తిని పొందును - ముక్తిని పొందుటకు మరియొక మార్గము తెలియబడలేదు - లేదు).
(అనాదిగా కలుగుచున్న జన్మలలో చేసిన కర్మ ప్రవాహరూపమైన అజ్ఞానము బంధమునకు కారణము - ఈ బంధము విడిపోయి ముక్తిని - కైవల్యమును - పొందుటకు జ్ఞానమే సాధనము - ఉపాసనయే సాధనము).
(నూట యెనిమిది ఉపనిషత్తులను విధి ప్రకారము అధ్యయనము చేసి, శ్రవణము మననము, నిధిథ్యాసము - వీటిని ఎల్లపుడూ చేయుచు, ప్రారబ్ధకర్మ క్షీణించుటవలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను మూడిం టిని లేకుండచేసుకొని, కుండలో కనబడు ఆకాశము కుండపోయినతోడనే మహాకాశములో కలిసినట్లు పరిపూర్ణత్వమును పొందును - విదేహముక్తియే కైవల్యముక్తి, దేహమును మరల పొందకపోవుటే. అందు చేత అందరికీ జ్ఞానమార్గముద్వారానే కైవల్యముక్తి ప్రాప్తించునని చెప్పబడినది. అంతియేకాని కర్మయోగ మువలన, సాంఖ్యయోగమువలన, ఉపాసనాయోగమువలన (భక్తియోగమువలన) ప్రాప్తించదు).
దురాచార రతో వాపి మన్నామ భజనాత్ కపే |
సాలోక్య ముక్తి మాప్నోతి నతు లోకాంతరాదికం |
కాశ్యాంతు బ్రహ్మనాళేస్మిన్ మృతౌ మత్తార మాఘ్నయాత్ |
పునరా వృత్తి రహితాం ముక్తిం ప్రాప్నోతి మానవః |
యత్ర కుత్రాపివా కాశ్యాం మరణే స మహేశ్వరః |
జంతోర్దక్షిణ కర్ణేతు మత్తారాం సముపాదిశేత్ |
నిర్థూతాశేష పాపౌఘ మత్సారూప్యం భజత్యయం |
సైవసాలోక్య సారూప్య సామీప్యా ముక్తి రిష్యతే |
గురూపదిష్ట మార్గేణ ధ్యాయన్ మద్రూపమవ్యయం |
మత్సాయుజ్యం ద్విజస్సమ్యక్ భవేత్ భ్రమర కీటవత్ |
సైవసాయుజ్య ముక్తిస్స్యాత్ బ్రహ్మానందకరీశివా |
చతుర్విధాచయా ముక్తిర్మ దుపాసనయా భవేత్ |
ఇయం కైవల్య ముక్తిస్తు - - - ||“. (ముక్తికోపనిషత్)
(దురాచారమందు రతి - ఆసక్తి - గలవాడైనప్పటికీ నా నామ భజన చేసినయెడల సాలోక్యముక్తిని పొందును - ఇతర లోకములకు వెళ్ళడు - ఈ కాశీ పట్టణములో చనిపోయినవాడు నా తారకమంత్రోపదేశ మును పొందును, పునర్జన్మ లేని మిక్తిని పొందును. కాశీలో ఎక్కడ చనిపోయినను సరే వాని చెవిలో మహేశ్వరుడు నా తారకనామమును (తారక మంత్రమును) ఉపదేశించును, దానివలన అన్నిపాపములను నశింపచేసుకొని, నా సారూప్యముక్తిని పొందును - అదియే సాలోక్యముక్తి, సారూప్యముక్తియని చెప్ప బడును. సదాచారుడై ఇతర విషయమందు మనస్సులేక నామీదనే తన ధ్యానముంచినవాడు నా సామీప్య ముక్తిని పొందును. అదియే సాలోక్యముక్తి - అదియే సారూప్యముక్తి, అదియే సామీప్యముక్తియని చెప్పబడు చున్నది. గురువు ఉపదేశించిన ప్రకారము అవ్యయయుడైన నా రూపమును ధ్యానించుచు (భ్రమరము కీటకమైనట్లు) నా సాయుజ్యమును పొందును - అదియే సాయుజ్య ముక్తి, బ్రహ్మానందమును కలుగచేయునది. నా ఉపాసనవలన పైన చెప్పిన నాలుగు విధముల ముక్తి కలుగును - ఇదియే కైవల్య ముక్తి).
(సర్వ కర్మ సన్యాసము - విహితకర్మ, నిత్యకర్మ చేయకుండుట - చేసి బ్రహ్మజ్ఞానమందు నిష్టకలిగి యుండుటవలననే మాత్రము కైవల్యము ప్రాప్తించదు అని కొందరి అభిప్రాయము. అగ్నిహోత్రము మొదలగు శ్రౌత, స్మార్త కర్మలను చేయుచు, (వేదములోను పురాణములలోను మొదలగు శాస్త్రములలోను చెప్ప బడిన కర్మలను చేయుచు) బ్రహ్మ జ్ణానము సంపాదించుటవలన కైవల్యము ప్రాప్తించును అని సమస్త శాస్త్ర ములలోను నిశ్చయించబడిన అభిప్రాయము).
శోధక వాక్యాన్యపి సవిశేషయేవ బ్రహ్మ ప్రతిపాదయంతి ఇత్యుక్తం” (శ్రీమాన్ రామానుజః - శ్రీభాష్యే)
(బ్రహ్మజ్ఞానము వలననే కైవల్యము కలుగును అని చెప్పుటవలన నిర్విశేష నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానము వలననే అవిద్యా నివృత్తియగును అని శ్రుతులు చెప్పుచున్నవనుట అసత్యము. ఎందుచేతననగా దీనికి విరోధమైన శ్రుతి వాక్యములు కూడా కలవు. “ఆదిత్యవర్ణము కలిగి తమస్సునకు పరుడైనటువంటి పరమపురుషుని తెలిసినవాడు అమృతుడగును - చావు లేని స్థితిని పొందును - కైవల్యము పొందును. ఇట్టి స్థితిని పొందుటకు మఱియొకమార్గములేదు -” అను మొదలగు శ్రుతి వాక్యములవలన సవిశేష బ్రహ్మజ్ఞానము వలననే మోక్షము కలుగును).
(ప్రకృతి గుణములైన సత్వరజస్తమోగుణములకు అతీతుడైనవాడు కైవల్యమును పొందును).
“స్వప్న మనోరధేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్ప నాశంబగుటంజేసి వాని గుదియంబట్టి నిరంతర హరిధ్యానపరుండైనవానికి కైవల్యంబు సులభంబుగ కరతలామలకంబై యుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 43)
“క. కోరినవారలకెల్లను
జేరువ కైవల్య పదము శ్రీవరుని మదిం
గోరనివారలకెల్లను
దూరము మోక్షప్రాప్తి యెన్ని త్రోవలనైనన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - 159)
(చూడుము - ‘మోక్షము’, ‘ముక్తి’).
(bhagavat jñānamuvalananē - ātma tatvajñānamuvalananē kaivalyamu - mōkṣamu).
(baṃgāramutō cēsina ābharaṇamu kaṃṭhamunaṃdunnanu, ā viṣayamu maṟaci ā ābharaṇamu pōyinadani vetukuvāniki, daggaranunnavāḍu -” ā bharaṇamu pōlēdu, kaṃṭhamunaṃdēyunnadi” ani ceppagā, ‘nijamugā pōlēdu, unnadi’ ani telusukonunu - aṭlē bhagavattatvamu guṟiṃci jñānamulēni vāniki guruvugāni, śāstramugāni ā jñānamunu bhōdhiṃcuṭacēta tanalōnēyunna ātma teliyanagunu - aṃducēta brahma jñānamuvalananē kaivalyamu poṃdanagunu ani ceppabaḍinadi. brahmajñānamu kaluguṭa cēta aṃtā parabrahmamē, brahmaku tanaku bhēdamulēdu ani teliyuṭacēta brahmatō samānuḍai sārūpya mukti anu kaivalyamunu poṃdunu).
(brahma jñānamu kalavāḍu paramapadamunu, muktini, kaivalyamunu poṃdunu). “tadviṣṇō paramaṃ padaṃ sadā paśyaṃti sūrayaḥ” - sūrijanulu, brahmajñānulu parabrahma ayina ā viṣṇuni yokka paramapadamagu vaikuṃṭhamunu - muktisthānamunu - ellapuḍu cūcucunnāru. vāru kuśāgrabuddhi, sūkṣmadṛṣṭi kalavāraguṭacēta vārisūkṣmadṛṣṭiki, jñānanētramunaku ellapuḍu bhagavaṃtuni parama padamu, vaikuṃṭhalōkamu kanabaḍucunē yuṃḍunu. vaikuṃṭhamē vaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu).
(avidya modalagu klēśamulu karmaki, dānivalana kalugu phalamunaku mūlamu - mūlakāraṇamu. ā mūlakāraṇamu brahmajñānamu anu agnivalana dagdhamaipōvunu - karma samūlamuga - dāni kāraṇa mutō sahā nāśanamaipōyinapuḍu saṃsāramekkaḍidi - eṭlu kalugunu ? kalugadu. aṃducēta dēhi canipōyinatarvāta kaivalyamunu poṃdunu, aṃducēta brahmajñānamucētanē kaivalyamu prāptiṃcunu).
“īśānaḥ sarva vidyānāṃ, īśvaraḥ sarvab bhūtānāṃ - -”ityādi śrutibhyaḥ śivādēva prāpnōtīti”.
(brahma jñānamuvalananē kaivalyamu labhiṃcunu anu modalagu vākyamula pramāṇamuvalana jñānamu valananē mōkṣamu kalugunu - ā jñānameṭṭidi yanagā samasta vidyalaku īśvaruḍu, samastabhūtamu laku īśvaruḍu anu modalagu śruti vākyamulavalana śivuni valananē kalugunu - “jñānamicchēt mahēśvarāt”
(mahēśvarunivalananē brahmajñānamu poṃdanagunu - jñānamu koraku mahēśvaruni upāsiṃcavalenu - “vidyākāmunaku umāvallabhuṃḍunu bhajanīyulaguduru” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 3 - 38)
(brahmajñānamu kaligina tarvātanē muktini poṃdunu - muktini poṃduṭaku mariyokamārgamu kana baḍadu - karma cēyuṭacē cittaśuddhi kalugunu - cittaśuddhi kaligina brahmajñānamu kalugunu. brahmajñāna mu kaligina mukti kalugunu - aṃducēta karma jñānamunaku sādhanamu, jñānamu muktiki sādhanamu - “ya ēvaṃ vidvān amṛta iha bhavati nānyaḥ paṃdhā ayanāya vidyatē” - (maṃtrapuṣpamulō ceppina prakāramu parabrahmaguṟiṃci jñānamugalavāḍu muktini poṃdunu - muktini poṃduṭaku mariyoka mārgamu teliyabaḍalēdu - lēdu).
(anādigā kalugucunna janmalalō cēsina karma pravāharūpamaina ajñānamu baṃdhamunaku kāraṇamu - ī baṃdhamu viḍipōyi muktini - kaivalyamunu - poṃduṭaku jñānamē sādhanamu - upāsanayē sādhanamu).
(nūṭa yenimidi upaniṣattulanu vidhi prakāramu adhyayanamu cēsi, śravaṇamu mananamu, nidhithyāsamu - vīṭini ellapuḍū cēyucu, prārabdhakarma kṣīṇiṃcuṭavalana sthūla, sūkṣma, kāraṇa śarīramulanu mūḍiṃ ṭini lēkuṃḍacēsukoni, kuṃḍalō kanabaḍu ākāśamu kuṃḍapōyinatōḍanē mahākāśamulō kalisinaṭlu paripūrṇatvamunu poṃdunu - vidēhamuktiyē kaivalyamukti, dēhamunu marala poṃdakapōvuṭē. aṃdu cēta aṃdarikī jñānamārgamudvārānē kaivalyamukti prāptiṃcunani ceppabaḍinadi. aṃtiyēkāni karmayōga muvalana, sāṃkhyayōgamuvalana, upāsanāyōgamuvalana (bhaktiyōgamuvalana) prāptiṃcadu).
durācāra ratō vāpi mannāma bhajanāt kapē |
sālōkya mukti māpnōti natu lōkāṃtarādikaṃ |
kāśyāṃtu brahmanāḷēsmin mṛtau mattāra māghnayāt |
punarā vṛtti rahitāṃ muktiṃ prāpnōti mānavaḥ |
yatra kutrāpivā kāśyāṃ maraṇē sa mahēśvaraḥ |
jaṃtōrdakṣiṇa karṇētu mattārāṃ samupādiśēt |
nirthūtāśēṣa pāpaugha matsārūpyaṃ bhajatyayaṃ |
saivasālōkya sārūpya sāmīpyā mukti riṣyatē |
gurūpadiṣṭa mārgēṇa dhyāyan madrūpamavyayaṃ |
matsāyujyaṃ dvijassamyak bhavēt bhramara kīṭavat |
saivasāyujya muktissyāt brahmānaṃdakarīśivā |
caturvidhācayā muktirma dupāsanayā bhavēt |
iyaṃ kaivalya muktistu - - - ||“. (muktikōpaniṣat)
(durācāramaṃdu rati - āsakti - galavāḍainappaṭikī nā nāma bhajana cēsinayeḍala sālōkyamuktini poṃdunu - itara lōkamulaku veḷḷaḍu - ī kāśī paṭṭaṇamulō canipōyinavāḍu nā tārakamaṃtrōpadēśa munu poṃdunu, punarjanma lēni miktini poṃdunu. kāśīlō ekkaḍa canipōyinanu sarē vāni cevilō mahēśvaruḍu nā tārakanāmamunu (tāraka maṃtramunu) upadēśiṃcunu, dānivalana annipāpamulanu naśiṃpacēsukoni, nā sārūpyamuktini poṃdunu - adiyē sālōkyamukti, sārūpyamuktiyani ceppa baḍunu. sadācāruḍai itara viṣayamaṃdu manassulēka nāmīdanē tana dhyānamuṃcinavāḍu nā sāmīpya muktini poṃdunu. adiyē sālōkyamukti - adiyē sārūpyamukti, adiyē sāmīpyamuktiyani ceppabaḍu cunnadi. guruvu upadēśiṃcina prakāramu avyayayuḍaina nā rūpamunu dhyāniṃcucu (bhramaramu kīṭakamainaṭlu) nā sāyujyamunu poṃdunu - adiyē sāyujya mukti, brahmānaṃdamunu kalugacēyunadi. nā upāsanavalana paina ceppina nālugu vidhamula mukti kalugunu - idiyē kaivalya mukti).
(sarva karma sanyāsamu - vihitakarma, nityakarma cēyakuṃḍuṭa - cēsi brahmajñānamaṃdu niṣṭakaligi yuṃḍuṭavalananē mātramu kaivalyamu prāptiṃcadu ani koṃdari abhiprāyamu. agnihōtramu modalagu śrauta, smārta karmalanu cēyucu, (vēdamulōnu purāṇamulalōnu modalagu śāstramulalōnu ceppa baḍina karmalanu cēyucu) brahma jṇānamu saṃpādiṃcuṭavalana kaivalyamu prāptiṃcunu ani samasta śāstra mulalōnu niścayiṃcabaḍina abhiprāyamu).
śōdhaka vākyānyapi saviśēṣayēva brahma pratipādayaṃti ityuktaṃ” (śrīmān rāmānujaḥ - śrībhāṣyē)
(brahmajñānamu valananē kaivalyamu kalugunu ani ceppuṭavalana nirviśēṣa nirguṇa parabrahma jñānamu valananē avidyā nivṛttiyagunu ani śrutulu ceppucunnavanuṭa asatyamu. eṃducētananagā dīniki virōdhamaina śruti vākyamulu kūḍā kalavu. “ādityavarṇamu kaligi tamassunaku paruḍainaṭuvaṃṭi paramapuruṣuni telisinavāḍu amṛtuḍagunu - cāvu lēni sthitini poṃdunu - kaivalyamu poṃdunu. iṭṭi sthitini poṃduṭaku maṟiyokamārgamulēdu -” anu modalagu śruti vākyamulavalana saviśēṣa brahmajñānamu valananē mōkṣamu kalugunu).
(prakṛti guṇamulaina satvarajastamōguṇamulaku atītuḍainavāḍu kaivalyamunu poṃdunu).
“svapna manōradhēcchādyavasthalayaṃdu sarvasaṃkalpa nāśaṃbaguṭaṃjēsi vāni gudiyaṃbaṭṭi niraṃtara haridhyānaparuṃḍainavāniki kaivalyaṃbu sulabhaṃbuga karatalāmalakaṃbai yuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 43)
“ka. kōrinavāralakellanu
jēruva kaivalya padamu śrīvaruni madiṃ
gōranivāralakellanu
dūramu mōkṣaprāpti yenni trōvalanainan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - 159)
(cūḍumu - ‘mōkṣamu’, ‘mukti’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.