← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాకుత్సః kākutsaḥ

Original — తెలుగు
  1. “కకుది వృషాంశే తిష్టతీవ కకుత్స్థ ఇతి ప్రసిద్ధః. కశ్చివ్రాజా అభూత్. కకుస్థస్యా పత్యం పుమాన్ కాకుత్సః. కకుస్థాత్ ఆరభ్య ఉత్తరకోసలేంద్రాః రాజానో దిలీపాదయః కాకుత్ స్థః ఇతి సం జ్ఞాందధతి. పురాకిల పురంజయోనామ రాజా సాక్షాత్ భగవతః విష్ణోరంశావతారః కశ్చి దైక్ష్వాకో రాజా దేవైః సహసమయ బంధేన దేవాసుర యుద్ధే మహాక్ష రూపధారిణో మహేంద్రస్య కకుదుస్థిత్వా బినా కిలీలయా వృషపర్వనామానం దైత్యమారభ్య నిఖిలం అసురకులం నిహాత్య కకుత్ స్థ సం జ్ఞాం అలభ్యత”.

(వృషభముయొక్క మూపురము మీద కూర్చుని యుండుటచేత కకుత్ స్థుడు అని ప్రసిద్ధిగాంచిన రాజుయొక్కకుమారుడు కాకుత్ స్థుడు - ఈ కకుత్ స్థుడు అను రాజు మొదలుకొని దిలీపుడు మొదలగువారు ఉత్తర కోసములను దేశమును పాలించు రాజులందరు కాకుత్స్థులని పేరు పొందిరి. పూర్వము పురంజనుండనురాజు సాక్షాత్తు విష్ణునియొక్క అంశావతారము. ఇక్ష్వాకువంశమునకు చెందిన ఒకరాజు దేవాసుర యుద్ధములో దేవతులకు సహాయము చేయుటకు ఋషభరూపమును దాల్చిన ఇంద్రుని మూపురముపైన ఎక్కి శివునివలె వృషపర్వుడను రాక్షసునితోసహా సమస్త రాక్షసకులమును చంపెను. మూపుమీద కూర్చుని యుద్ధము చేసినందున అతను కకుత్స్థుడని పేరు పొందెను - అతని వంశములోని వాడు అగుతచేత శ్రీరామచంద్రుడు కాకుత్స్థుడు). ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతము - (స్కం - 8 - ) లో చెప్పబడినది).

  1. “లజ్జమానస్తదా శక్రః వ్రేరితో హరిణా భృశం |

బభూవ వృషభస్తుర్ణం రుద్రస్యేవాపరో మహాన్ |

తమా రు రోహరాజసౌ సంగ్రామ గమనాయ వై |

స్థితః కకుది యేనాస్య కకుత్ స్థః తేన చాభవత్ ||“. (దేవీ భాగవతం)

(విష్ణువుచేత ప్రేరింపబడినవాడై ఇంద్రుడు వృషభరూపము దాల్చగా శివునివలె ప్రకాశించు ఆ రాజు ఆ వృషభముయొక్క మూపురమునెక్కి యుద్ధమునకు వెళ్ళెను. అట్లు చేయుటచేత ఆ రాజు కకుత్ స్థుడు అను పేరు పొందెను. అతని వంశమువారు కాకుత్స్థులు - ఆ వంశమువాడే శ్రీరామచంద్రుడు - అందుచేత శ్రీరామచంద్రుడు కాకుత్స్థుడు).

Transliteration
  1. “kakudi vṛṣāṃśē tiṣṭatīva kakutstha iti prasiddhaḥ. kaścivrājā abhūt. kakusthasyā patyaṃ pumān kākutsaḥ. kakusthāt ārabhya uttarakōsalēṃdrāḥ rājānō dilīpādayaḥ kākut sthaḥ iti saṃ jñāṃdadhati. purākila puraṃjayōnāma rājā sākṣāt bhagavataḥ viṣṇōraṃśāvatāraḥ kaści daikṣvākō rājā dēvaiḥ sahasamaya baṃdhēna dēvāsura yuddhē mahākṣa rūpadhāriṇō mahēṃdrasya kakudusthitvā binā kilīlayā vṛṣaparvanāmānaṃ daityamārabhya nikhilaṃ asurakulaṃ nihātya kakut stha saṃ jñāṃ alabhyata”.

(vṛṣabhamuyokka mūpuramu mīda kūrcuni yuṃḍuṭacēta kakut sthuḍu ani prasiddhigāṃcina rājuyokkakumāruḍu kākut sthuḍu - ī kakut sthuḍu anu rāju modalukoni dilīpuḍu modalaguvāru uttara kōsamulanu dēśamunu pāliṃcu rājulaṃdaru kākutsthulani pēru poṃdiri. pūrvamu puraṃjanuṃḍanurāju sākṣāttu viṣṇuniyokka aṃśāvatāramu. ikṣvākuvaṃśamunaku ceṃdina okarāju dēvāsura yuddhamulō dēvatulaku sahāyamu cēyuṭaku ṛṣabharūpamunu dālcina iṃdruni mūpuramupaina ekki śivunivale vṛṣaparvuḍanu rākṣasunitōsahā samasta rākṣasakulamunu caṃpenu. mūpumīda kūrcuni yuddhamu cēsinaṃduna atanu kakutsthuḍani pēru poṃdenu - atani vaṃśamulōni vāḍu agutacēta śrīrāmacaṃdruḍu kākutsthuḍu). ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamu - (skaṃ - 8 - ) lō ceppabaḍinadi).

  1. “lajjamānastadā śakraḥ vrēritō hariṇā bhṛśaṃ |

babhūva vṛṣabhasturṇaṃ rudrasyēvāparō mahān |

tamā ru rōharājasau saṃgrāma gamanāya vai |

sthitaḥ kakudi yēnāsya kakut sthaḥ tēna cābhavat ||“. (dēvī bhāgavataṃ)

(viṣṇuvucēta prēriṃpabaḍinavāḍai iṃdruḍu vṛṣabharūpamu dālcagā śivunivale prakāśiṃcu ā rāju ā vṛṣabhamuyokka mūpuramunekki yuddhamunaku veḷḷenu. aṭlu cēyuṭacēta ā rāju kakut sthuḍu anu pēru poṃdenu. atani vaṃśamuvāru kākutsthulu - ā vaṃśamuvāḍē śrīrāmacaṃdruḍu - aṃducēta śrīrāmacaṃdruḍu kākutsthuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.