← Back to క · Booklets 11–20 (digitized file 2)

కల kala

Original — తెలుగు
  1. “కలాస్యాన్ ములకే వృద్ధౌ శిల్పా దావంస మాత్రకే | షోదశాంసేపి చంద్రస్య కలనా కాలయోః కలా” - ఇతి విశ్వః.

(కలయనగా శిల్పము మొదలగు కళలు, అంశమాత్రము, (భాగము), చంద్రుని 16 కళలలో ఒకటి; కాలమానము తెలియచేయునది అని విశ్వకోశము చెప్పుచున్నది).

  1. “కళాతు షోదశో భాగః” ఇత్యమరః -

(కళయనగా 16 వ భాగము - చంద్రుని 16 కళలో ఒకటి అని అమరకోశము).

  1. అంశ; భాగము.

  2. కాలమానములో ముప్పది కాష్టలకాలము -

  3. శ్రుతిప్రసిద్ధ సకల విద్యా స్వరూపాః

(శ్రుతిలో చెప్పబడిన చతుష్షష్టికలలు - 64 విద్యలు).

  1. చిదంశ రూపాః ; అంశరూపాః.

(భగవంతుని అంశ, కళ).

  1. ప్రశ్నోపనిషత్పరి పరితాః ప్రాణాది పంచదశ సంఖ్యాకాః.

(ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన ప్రాణము మొదలగు పదిహేను కళలు).

  1. బ్రహ్మరుద్రాది మూర్తులు - పరమాత్మ కళలు - పరమాత్మ అంశలో పుట్టినవారు - సృష్టిలోని మూర్తులన్నియు భగవంతుని కళలే - విభూతులే.

“క. ఏనును, మీరును గాలము

మానవ తిర్య గ్లతాద్రుమస్వేదజము లీ

మానుగ నెవ్వని కళలము

వానికి మ్రొక్కెదము గాక వగవగ నేలా” (పోతన తెలుగు భాగవతము - 8 - 150)

“మ. ఉర్వీశులున్, నరులున్ బ్రాహ్మణ సంయ మీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్ -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 27)

  1. ఇతిహాసా గమ ప్రభృ తీశ్చ తుష్టష్టి కలః -

(ఇతిహాసములు, ఆగమములు మొదలగువాటిలో చెప్పబడిన 64 కళలు).

  1. వేదాంగాని, ఉపవేదా దయః - సర్వేశాబ్దాత్మకౌః.

(వేదాంగములు, ఉపవేదములు మొదలగునవి వేదములో చెప్పబడినవి).

  1. చతుష్షష్టి కళాః (64 కళలు - వేరే చూడుము).

  2. చంద్రుని 66 కళలు -

ఆప్యమండలః చంద్రః, తేజోమండలః ఆదిత్యః. తయోరేక నక్షత్రావస్థానే చంద్రో న దృశ్యతే చక్షుషాం ఆదిత్య మండలేన సమదేశస్థితేన వ్యవధానాత్, సా అమావాస్యా. అధ షష్టి ఘటికాభిః అహోరాత్రైః. అతః ప్రతిపదమారభ్య విషమస్థితస్య ఆదిత్య మండలస్య పంచదశో భాగః ఆప్యమందలే ప్రతిబింబితో దృశ్యతే. సాకళా ఇత్యుచ్యతే. ఏవం పంచదసే అహ్ని త్రయోదశభిః నక్షత్రైః అంతరమితి. రాశి చక్రస్య సప్త వింశతి నక్షత్రాత్మకస్య మధ్యే సం ముఖౌ చంద్రాదిత్యౌ యదా తిషటతః తదా సంపూర్ణ ప్రతిబింబం భూచ్ఛాయా లాంభియం దృశ్యతే. సా పూర్ణిమా తస్యాం పౌర్ణమాస్యాం సంపూర్ణ ప్రతిబింబేన షోడశ కళః చంద్రః ఇత్యుపచర్యతే. తతః పునః ప్రతిపదమారభ్య మండల యోర్విషయ భావాత్ కళాహ్రసః, తత్ర యథా కాళానామేవ ఉత్పత్యా దయః స అప్యమందలస్య తత్ఝా ఆత్మనః అపి.”

(చంద్రుడు ఆస్యమండలము, సూర్యుడు తేజోమండలము. సూర్యచంద్రులిద్దరు ఒకే నక్షత్రములోనున్నపుడు కంటికి చంద్రుడు కనబడడు - సూర్యమండలముతో సమాన స్థలమందుండుటవలన. అప్పుడు అమావాస్య. చంద్రుడు తర్వాత షష్టి ఘడియలకు ఇంకొక నక్షత్రము దగ్గరకు వెళ్ళును - సూర్యుడు పదమూడు రోజులకు (రాత్రి పగళ్ళు) నక్షత్రమును మారును. అందుచేత పాడ్యమినాడు సూర్యుని పదిహేనవభాగము చంద్రమండలమందు ప్రతిబింబితమగును - అదియే కల. (సూర్యకాంతి చంద్రునిమీద పడినది కల). ఇందుచేత 15 రోజులకు 13 నక్షత్రములు జరుగును. 27 నక్షత్రములుగల రాశి చక్రములో సూర్య చంద్రులు ముఖా ముఖిగా - ఎదురెదురుగా - ఉండునపుడు చంద్రుని పూర్ణ బింబము కనబడును. అప్పుడు అది పున్నమి యని చెప్పబడును - ఆ పున్నమియందు చందృడు 16 కళలతో పూర్ణుడుగా కనబడును - తర్వాత పాడ్యమి మొదలు సర్వ చంద్ర మండలముల తేడా ననుసరించి కళలు తగ్గుతూ వచ్చును - అందుచేత కళలలో హెచ్చు తగ్గులు ఉన్నవి కాని చంద్రమండలమునకు లేనట్లు ఆత్మకు కూడా హెచ్చు తగ్గులు లేవు).

  1. మానవ శరీరములో ఏడు కళలు ఉన్నవి : -

“ఆద్యామాంసధరాప్రోక్తా, ద్వితీయా రక్తధారిణీ |

మేధోధరా తృతీయా తు చతుర్థ శ్లేష్మ ధారిణీ |

పంచమీచమలం దత్తే, షష్టీ పిత్త ధరామతా |

రేతోధరా సప్తమీ స్యాత్ ఇతి సప్త కలాస్మృతాః ||“.

(మాంసమును ధరించునది, రక్తమును ధరించునది, మేధస్సును ధరించునది, శ్లేష్మమును ధరించునది, మలమును ధరించునది - ఈ ఏడు శరీరమునకు సంబంధించినకళలు).

  1. రేతస్సు.

  2. “అతి సూక్ష్మములగు ప్రాణవాయువులయొక్కయు, మనస్సు యొక్కయు నగ్రమున నుండు బుద్ధియే బందువు. స్దానియందు ప్రతిఫలించుచున్న పరమాత్మ ప్రతిబింబమే కల” -

  3. “ప్రభుభిః పూజ్యతే విప్ర కలైవ న కులీనతా |

కలావాన్ మాన్యతే మూర్ధ్న నత్సు దేవేషు శంభునా ||“. (భోజరాజ చరిత్ర)

(ప్రభువులు కలావంతులనే - విద్యావంతులనే - పూజింతురు, కులమును బట్టి పూజింపరు. ఎందరో దేవతులున్నను చంద్రుడు కళావంతుడు కనుకనే శివుడు తన తలమీద అలంకారముగా పెట్టుకున్నాడు).

Transliteration
  1. “kalāsyān mulakē vṛddhau śilpā dāvaṃsa mātrakē | ṣōdaśāṃsēpi caṃdrasya kalanā kālayōḥ kalā” - iti viśvaḥ.

(kalayanagā śilpamu modalagu kaḷalu, aṃśamātramu, (bhāgamu), caṃdruni 16 kaḷalalō okaṭi; kālamānamu teliyacēyunadi ani viśvakōśamu ceppucunnadi).

  1. “kaḷātu ṣōdaśō bhāgaḥ” ityamaraḥ -

(kaḷayanagā 16 va bhāgamu - caṃdruni 16 kaḷalō okaṭi ani amarakōśamu).

  1. aṃśa; bhāgamu.

  2. kālamānamulō muppadi kāṣṭalakālamu -

  3. śrutiprasiddha sakala vidyā svarūpāḥ

(śrutilō ceppabaḍina catuṣṣaṣṭikalalu - 64 vidyalu).

  1. cidaṃśa rūpāḥ ; aṃśarūpāḥ.

(bhagavaṃtuni aṃśa, kaḷa).

  1. praśnōpaniṣatpari paritāḥ prāṇādi paṃcadaśa saṃkhyākāḥ.

(praśnōpaniṣattulō ceppabaḍina prāṇamu modalagu padihēnu kaḷalu).

  1. brahmarudrādi mūrtulu - paramātma kaḷalu - paramātma aṃśalō puṭṭinavāru - sṛṣṭilōni mūrtulanniyu bhagavaṃtuni kaḷalē - vibhūtulē.

“ka. ēnunu, mīrunu gālamu

mānava tirya glatādrumasvēdajamu lī

mānuga nevvani kaḷalamu

vāniki mrokkedamu gāka vagavaga nēlā” (pōtana telugu bhāgavatamu - 8 - 150)

“ma. urvīśulun, narulun brāhmaṇa saṃya mīṃdrulu maharṣul viṣṇunaṃśāṃśajul -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 27)

  1. itihāsā gama prabhṛ tīśca tuṣṭaṣṭi kalaḥ -

(itihāsamulu, āgamamulu modalaguvāṭilō ceppabaḍina 64 kaḷalu).

  1. vēdāṃgāni, upavēdā dayaḥ - sarvēśābdātmakauḥ.

(vēdāṃgamulu, upavēdamulu modalagunavi vēdamulō ceppabaḍinavi).

  1. catuṣṣaṣṭi kaḷāḥ (64 kaḷalu - vērē cūḍumu).

  2. caṃdruni 66 kaḷalu -

āpyamaṃḍalaḥ caṃdraḥ, tējōmaṃḍalaḥ ādityaḥ. tayōrēka nakṣatrāvasthānē caṃdrō na dṛśyatē cakṣuṣāṃ āditya maṃḍalēna samadēśasthitēna vyavadhānāt, sā amāvāsyā. adha ṣaṣṭi ghaṭikābhiḥ ahōrātraiḥ. ataḥ pratipadamārabhya viṣamasthitasya āditya maṃḍalasya paṃcadaśō bhāgaḥ āpyamaṃdalē pratibiṃbitō dṛśyatē. sākaḷā ityucyatē. ēvaṃ paṃcadasē ahni trayōdaśabhiḥ nakṣatraiḥ aṃtaramiti. rāśi cakrasya sapta viṃśati nakṣatrātmakasya madhyē saṃ mukhau caṃdrādityau yadā tiṣaṭataḥ tadā saṃpūrṇa pratibiṃbaṃ bhūcchāyā lāṃbhiyaṃ dṛśyatē. sā pūrṇimā tasyāṃ paurṇamāsyāṃ saṃpūrṇa pratibiṃbēna ṣōḍaśa kaḷaḥ caṃdraḥ ityupacaryatē. tataḥ punaḥ pratipadamārabhya maṃḍala yōrviṣaya bhāvāt kaḷāhrasaḥ, tatra yathā kāḷānāmēva utpatyā dayaḥ sa apyamaṃdalasya tatjhā ātmanaḥ api.”

(caṃdruḍu āsyamaṃḍalamu, sūryuḍu tējōmaṃḍalamu. sūryacaṃdruliddaru okē nakṣatramulōnunnapuḍu kaṃṭiki caṃdruḍu kanabaḍaḍu - sūryamaṃḍalamutō samāna sthalamaṃduṃḍuṭavalana. appuḍu amāvāsya. caṃdruḍu tarvāta ṣaṣṭi ghaḍiyalaku iṃkoka nakṣatramu daggaraku veḷḷunu - sūryuḍu padamūḍu rōjulaku (rātri pagaḷḷu) nakṣatramunu mārunu. aṃducēta pāḍyamināḍu sūryuni padihēnavabhāgamu caṃdramaṃḍalamaṃdu pratibiṃbitamagunu - adiyē kala. (sūryakāṃti caṃdrunimīda paḍinadi kala). iṃducēta 15 rōjulaku 13 nakṣatramulu jarugunu. 27 nakṣatramulugala rāśi cakramulō sūrya caṃdrulu mukhā mukhigā - eduredurugā - uṃḍunapuḍu caṃdruni pūrṇa biṃbamu kanabaḍunu. appuḍu adi punnami yani ceppabaḍunu - ā punnamiyaṃdu caṃdṛḍu 16 kaḷalatō pūrṇuḍugā kanabaḍunu - tarvāta pāḍyami modalu sarva caṃdra maṃḍalamula tēḍā nanusariṃci kaḷalu taggutū vaccunu - aṃducēta kaḷalalō heccu taggulu unnavi kāni caṃdramaṃḍalamunaku lēnaṭlu ātmaku kūḍā heccu taggulu lēvu).

  1. mānava śarīramulō ēḍu kaḷalu unnavi : -

“ādyāmāṃsadharāprōktā, dvitīyā raktadhāriṇī |

mēdhōdharā tṛtīyā tu caturtha ślēṣma dhāriṇī |

paṃcamīcamalaṃ dattē, ṣaṣṭī pitta dharāmatā |

rētōdharā saptamī syāt iti sapta kalāsmṛtāḥ ||“.

(māṃsamunu dhariṃcunadi, raktamunu dhariṃcunadi, mēdhassunu dhariṃcunadi, ślēṣmamunu dhariṃcunadi, malamunu dhariṃcunadi - ī ēḍu śarīramunaku saṃbaṃdhiṃcinakaḷalu).

  1. rētassu.

  2. “ati sūkṣmamulagu prāṇavāyuvulayokkayu, manassu yokkayu nagramuna nuṃḍu buddhiyē baṃduvu. sdāniyaṃdu pratiphaliṃcucunna paramātma pratibiṃbamē kala” -

  3. “prabhubhiḥ pūjyatē vipra kalaiva na kulīnatā |

kalāvān mānyatē mūrdhna natsu dēvēṣu śaṃbhunā ||“. (bhōjarāja caritra)

(prabhuvulu kalāvaṃtulanē - vidyāvaṃtulanē - pūjiṃturu, kulamunu baṭṭi pūjiṃparu. eṃdarō dēvatulunnanu caṃdruḍu kaḷāvaṃtuḍu kanukanē śivuḍu tana talamīda alaṃkāramugā peṭṭukunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.