చక్రమువలె మొదలు కొస లేక (cycle) అనంతముగా తిరుగు కాలము.
“భవదీయ మాయా వినిర్మితంబును, కాలాత్మక భూరి వేగ సమా యుక్తంబును నక్షరంబును నైన బ్రహ్మంబునందు భ్రమణశీలంబును (తిరుగు స్వభావము కలదియు), అధిమాస సమేత త్రయోదస మాసారంబును (ఈ తిరుగుట బ్రహ్మరూపమైన ఇరుసునందు), (పదమూడు మాసములనెడి అరలు (గదులు లేక అంచులు గలదియు), ఋతుషట్క సమాకలిత నేమియు (ఆరు ఋతువులచే గూడిన నేమి), అంచు (పట్టా) కలదియు, జతుర్మాస్య త్రయ విరాజితనాభియు (చక్రముయొక్క కుంచము - దాని నుండి ఊసలు అన్ని ప్రక్కలకు చక్రము అంచువరకు వెళ్ళి దానిని కలియునదియు), నపరిమిత క్షణ లవాది పరికల్పిత పత్ర శోభితంబును, కాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల జీవ నికరాయుర్గ్రసన తత్పరంబగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 21 - 752)
“సంవత్సరాత్మకం చక్రం - అధికమాసేన సః త్రయ దశమాసాః అరాః, త్రిశతం షష్టి అహోరాత్రాణి సర్వాణి, షడృతవో నేమ యో; అనంతాః క్షణ లవాదయః ఛదాః పత్రాణి పత్రాకారాః ధారా, త్రీణి చతుర్మాస్యాని నాభయో రంధ్రాణి, కరాళ స్రోతః తీవ్ర వేగం యస్య సం తీతి - ఏ తైర్విశేషణైరేవ సంవత్సరాత్మకం చక్రం ఉక్తం ఇతి ద్రష్టవ్యం”.
(సంవత్సరమను రూపముగల చక్రము - చక్రమువలె తిరుగునది. ఈ చక్రమునకు అరలు, అంచులు, మాసములు (అధికమాసముతో కలిసి పదమూడు), 360 అహోరాత్రములు, అంచు ఆరు ఋతువులు, పత్రములు (లెక్కలేనన్ని క్షణములు, లవములు మొదలగునవి కాలమానము లోనివి). కుంచము మూడు చతుర్మాసములు, గొప్ప వేగముతో, ఆగని వేగముతో ప్రవాహమువలె జరుగుచుండు కాలాత్మకమైన చక్రము - చక్రమువలె మొదలు కొస లేక అనంతముగా జరుగుచుండు కాలము).
cakramuvale modalu kosa lēka (cycle) anaṃtamugā tirugu kālamu.
“bhavadīya māyā vinirmitaṃbunu, kālātmaka bhūri vēga samā yuktaṃbunu nakṣaraṃbunu naina brahmaṃbunaṃdu bhramaṇaśīlaṃbunu (tirugu svabhāvamu kaladiyu), adhimāsa samēta trayōdasa māsāraṃbunu (ī tiruguṭa brahmarūpamaina irusunaṃdu), (padamūḍu māsamulaneḍi aralu (gadulu lēka aṃculu galadiyu), ṛtuṣaṭka samākalita nēmiyu (āru ṛtuvulacē gūḍina nēmi), aṃcu (paṭṭā) kaladiyu, jaturmāsya traya virājitanābhiyu (cakramuyokka kuṃcamu - dāni nuṃḍi ūsalu anni prakkalaku cakramu aṃcuvaraku veḷḷi dānini kaliyunadiyu), naparimita kṣaṇa lavādi parikalpita patra śōbhitaṃbunu, kālātmaka bhūrivēga samāyuktaṃbunu naina kālacakraṃbu sakala jīva nikarāyurgrasana tatparaṃbagu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 21 - 752)
“saṃvatsarātmakaṃ cakraṃ - adhikamāsēna saḥ traya daśamāsāḥ arāḥ, triśataṃ ṣaṣṭi ahōrātrāṇi sarvāṇi, ṣaḍṛtavō nēma yō; anaṃtāḥ kṣaṇa lavādayaḥ chadāḥ patrāṇi patrākārāḥ dhārā, trīṇi caturmāsyāni nābhayō raṃdhrāṇi, karāḷa srōtaḥ tīvra vēgaṃ yasya saṃ tīti - ē tairviśēṣaṇairēva saṃvatsarātmakaṃ cakraṃ uktaṃ iti draṣṭavyaṃ”.
(saṃvatsaramanu rūpamugala cakramu - cakramuvale tirugunadi. ī cakramunaku aralu, aṃculu, māsamulu (adhikamāsamutō kalisi padamūḍu), 360 ahōrātramulu, aṃcu āru ṛtuvulu, patramulu (lekkalēnanni kṣaṇamulu, lavamulu modalagunavi kālamānamu lōnivi). kuṃcamu mūḍu caturmāsamulu, goppa vēgamutō, āgani vēgamutō pravāhamuvale jarugucuṃḍu kālātmakamaina cakramu - cakramuvale modalu kosa lēka anaṃtamugā jarugucuṃḍu kālamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.