← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాలః kālaḥ

Original — తెలుగు
  1. విశ్వం కలయతీతి కాలః, సర్వం కలయతీతి కాలః -

(ప్రపంచమును, ప్రపంచములోని అన్నింటిని క్షోభింపచేయునది కాలము. ప్రపంచములోని అన్నివస్తువు లలోను తాపము - వేడిమి - కలుగుచుండుటచేత వాటిలో మార్పు కలుగుచుండును - ఈ మార్పును కలుగచేయుటయే క్షోభింపచేయుట. (Heat converted into Energy). దీని వలననే సృష్టి జరుగు చున్నది - ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు కలుగుచున్నది. దీనికి కారణము కాలరూపములో నున్న భగవంతుడు).

  1. కలయతి క్షోభయతి సర్వ కార్యాణి ఇతి కాలసంజ్ఞా ప్రక్తిః -

(సమస్త కార్య వస్తువులలోను క్షోభము కలుగచేసి వాటిలోనుండి మరియొక వస్తువును ఉద్భవింప చేయునది - కాలమమను పేరనున్న ప్రకృతి).

  1. స్వాతి రిక్తం కలయతి స్వాత్మ సాత్కరోతీతి కాలః -

(తనకన్న వేరైన దానిని తన స్వాధీనములోనికి తీసుకొనునది).

  1. కలయతి, గణయతీతి కాలః -

(లెక్క పెట్టునది, గణనము చేయునది. ప్రతి వస్తువును దాని నిర్ణీతకాలములో దాని కారణవస్తువు నుండి ఉద్భవింపచేసి నశింపచేయునది).

  1. క్షోభకః, సర్వోత్పత్తి నిమిత్తం గుణ క్షోభకః.

(ప్రతి వస్తువులోను క్షోభము - సంక్షోభము కలుగచేయునది సృష్టిలోని సమస్త వస్తువులు పుట్టుటకు ప్రకృతి గుణములను వలయు రీతిని క్షోభింపచేయునది).

  1. ప్రకృతి - మహత్తత్వాది క్షోభకం -

(ప్రకృతి, మహత్తత్వం మొదలగువాటిని క్షోభింపచేయునది - క్షోభింప చేయుటద్వారా వాటినుండి కార్య వస్తువులను పుట్టింప చేయునది).

  1. సర్వభూతానాం విపరిణామ హేతుః -

(సమస్త భూతములు క్షణక్షణము పరిణామము - మార్పు - చెందుచూ ఉండు - ఒక చిన్న బాలుడు పెద్ద మనిషిగా మారును - ఒక చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారును - ఇట్టి మార్పు కాలము జరిగిన కొలది కలుగును - “ఇట్లు దినదిన ప్రవర్థమానయై”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - - స్కం - 10 - రుక్మిణీ కల్యాణము)

  1. నిఖిల కార్యవర్గ పరిణామ సంపాదకః - (సమస్త కార్య వస్తువులను మార్పు చెందునట్లు చేయునది).

  2. సర్వాధారః కాలః సర్వ కార్య నిమిత్త కారణం -

(అన్నింటికి ఆధారభూతమైనది కాలము - కార్యములన్నింటికి నిమిత్త కారణం).

  1. “కాల వేగంబున సర్వ ప్రపంచంబునగు, నవస్థాంతరంబులు గలుగుచుండు. పరమేశ్వరమూర్తియైన కాలంబున, నభంబునం బగలు తారకలుగానరాని చందంబున బడక కల్పావస్థలు చరించు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)

  2. గుణప్రేరకః

(త్రిగుణములను ప్రేరేపించునది - సత్వరజస్తమో గుణములు కాలము గడచినకొలది వాటి పనులను నిర్వర్తించును. వాటిలోనుండి తర్వాత వచ్చు తత్వములను పుట్టించుచుండును).

  1. పురుషస్య ఈశ్వరస్య ప్రభావం విక్రిమం కాలం ఆహుః.

(భగవంతునియొక్క ప్రభావము, విక్రమము, శక్తియే కాలమని చెప్పుదురు).

  1. పరమ పురుషస్య సర్గ సమ్హారాదిషు జగన్నియమన సామర్థ్యం కాలః, నతు తత్వాంతర మిత్యర్థః -

(సృష్టి స్థితిలయములు చేయుటలో భగవంతుడు నియమించు సామర్థ్యమే, శక్తియే కాలము - భగవంతుని లోనుండి ఉద్భవించిన తత్వములలో నొకటికాదు).

  1. క్రియా శక్త్యుపహితః పరమేశ్వరః

(త్రిశక్తులలో నొకటి అయిన క్రియా శక్తితో కూడియున్న పరమేశ్వరుడు).

  1. సంహార దశాయాం నామరూప విభాగా నర్హ నిరతిశయ సూక్ష్మావస్థామాపన్న యోః ప్రకృతి పురు షయోః పరమాత్మాత్మకయోః తస్మిన్నేవ లీనయోః, పునః సృష్టి దశాయాం జగదాకారేణ పరిణామ రూపో యో వ్యాపారః తద్దేతు భూతః సకాలః స భగవదాత్మకః -

(జగత్తుయొక్క సంహార దశయందు నామరూపములులేక అత్యంత సూక్ష్మరూపముగానున్న ప్రకృతి పురుషులు దానిలో లీనమై యుండి, తిరిగి సృష్టి జరుగు సమయమందు జగద్రూపముగా పరిణమించుట యను వ్యాపారము ఏది కలదో అదియే కాలము, భగవదాత్మకము).

  1. “కాలంబను పంచ వింశతి తత్వంబు చెప్పెద. కొందఱు పురుష శబ్ద వాచ్యుండైన ఈశ్వరుని పౌరుషంబు గాలశబ్దంబున చెప్పంబడునందురు - - - ప్రకృతిగుణ సామ్యంబునం జేసి వర్తించి నిర్విశే షుండగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నంబగు నదియ కాలంబని చెప్పంబడు - అదియు జీవరాశ్యంతర్గతంబగుటం జేసి పురుషుండనియు, వాని బహిర్భాగ వ్యాప్తిం జేసి కాలంబనియు జెప్పంబడు. ఆత్మ మాయం జేసి తత్వాంతర్గతుండైన జీవునివలన క్షభితంబయి జగత్కారణంబగు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 888)

  2. “కాల శబ్దో జగద్బంధన భేదన జ్ఞానాది సర్వ భగవద్ధర్మ వాచీ” -

(జగత్తును బంధించుట, భేధించుట తెలుసుకొనుట మొదలగు భగవంతునియొక్క ధర్మమే - పనియే, గుణమే - కాలము).

  1. “కాలో నామ భగవల్లీలా ప్రకృతిః శక్తిః”.

(కాలమనగా భగవంతుని లీల యగు ప్రకృతి, లేక భగవంతుని శక్తి).

  1. “అమ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకంబగు నాదిపురుష రూపంబగు. అందు గాలస్వభావంబులను శక్తులుదయించె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 -

  2. పంచ వింశతి తత్వము - (భగన్వంతుని చైతన్య శక్తి రూపమే అయిన జీవుడు).

  3. “దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును, గర్మక్షోభకంబైన కాలంబును, గాల స్వపరి ణామ హేతువైన స్వభావంబును, భోక్తమైన జీవుండును వాసుదేవుండుకా నెఱుంగుము. వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 84)

  4. “అహమేవా క్షయః కాలో” (శ్రీమద్భగవద్గీత - 10 - 33)

(నాశము లేని కాలము నేనే) ;

“కాలోస్మి లోకక్షయ కృత్ -” (శ్రీమద్భవద్గీత - 11 - 32)

(లోకమును క్షీణించి నశింపచేయుకాలము నేనే).

  1. కాల శరీరకః కాలస్వరూపః -

(కాలము శరీరముగా గలవాడు - కాలమే తన రూపమైనవాడు - కాలము అనగా భగవంతుడే).

  1. శ్రీ హరేః సుదర్శనాఖ్యం చక్రం, తద్రూపో యః కాలః దేహభాజాం నరాణాం భయముత్పాదయన్ తేషా మాయుః పరిక్షిణోతి, సకాలః.

(శ్రీ మహ విష్ణువుయొక్క సుదర్శనమను పేరుగల చక్రము. దేహధారులగు నరులకు భయమును కలుగచేసి వారి ఆయువును క్షీణింప చేయునది).

  1. సంహారకత్వాత్ కాలః ; మృత్యుః ; అత్తా -

(సంహరించునది కనుక కాలము, మృత్యువు - తినునది - “అత్తా చరాచర గ్రహణాత్” చరాచరము లను గ్రసియించునది - తినునది - చూడుము - ఆత్మ).

  1. “కాలచక్ర ప్రవర్తకత్వంబు వలన గాలుండవయ్యును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ - భా.
  2. “ప్రకృతిరేవ అవస్థా విశేషః.

(ప్రకృతికి భగవంతుని చైతన్య శక్తి కలుగుటవలన కలుగు మార్పులలో ఒకానొక అవస్థ).

  1. సృష్ట్యాదికారణం.

(సృష్టికి మొదటి కారణము - సృష్టి ప్రారంభమగుటకు, తరువాత ఒక తత్వములోనుండి ఇంకొక తత్వము, ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుటకు కారణమైనది - వస్తువులన్నియు కొంతకాలము గడిచిననే ఒక దానిలో ఒకటి పుట్టి, పెరిగి. నశించుచున్నవి. అందుచేత వాటి అన్నింటికి కారణము కాలము).

  1. రామే ప్రవ్రజనం, బలేర్నియమను, పాలడోః సుతానాం వనం | వృష్ణీనాం నిధనం నలస్య నృపతే రాజ్యాత్ పరి భ్రంశనం | కారాగార నిషేవణం చ మరణం సంచింత్య లంకేశ్వరే | సర్వః కాలవశేన నశ్యతి నరః కోవా పరిత్రాయతే ||“. (భోజరాజ చరిత్ర)

(శ్రీరామును అరణ్యవాసము, బలిచక్రవర్తి యంతటివాడు లొంగిపోవుట, పాండవుల వనవాసము, యాదవులు నాశనమొందుట, నలమహారాజు రాజ్యము కోలుపోవుట, రావణ సంహారము, - వీటిని బట్టి ఆలోచించగా అందరూ కాలమునకు వశులై - వారి కాలము రాగానే - నశించెదరు - ఆ కాలమునుండి రక్షించువాడెవడూ లేడు).

  1. “క. కాలము వచ్చిన శబరుని

కోలను ధర గూలె ఖగము ఘోషముతోడన్

కాలము డాసిన నేలం

గూలకపోవశమె యెట్టి గుణవంతులకున్|“. (శ్రీ మదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 66)

  1. పరిపాక సమయం.

(సమస్త కారణ వస్తువులలోను జరుగుచున్న సంక్షోభము పక్వమునకు వచ్చి వాటిలోనుండి కార్య వస్తువులను ఉద్భవింప చేయు సమయము).

  1. “కాలః స్వభావో నియతిర్య దృచ్ఛాభూతాని యోనిః పురుషః ఇతి చింత్యం”

(కాలమనగా స్వభావము, కర్మఫలము, భూతములకు కారణము, పురుషుడు అని తెలుసుకొనవలెను).

  1. “దుఃఖే కాలః సుదీర్ఘోహి సుఖే లఘుతరః సదా |

రాత్రిర్వాదశ వర్షాణి హరిశ్చంద్రస్య బోధితా ||” (యోగవాశిష్టము - 80 - 43)

(దుఃఖము కలిగినప్పుడు ఎంత తక్కువ కాలమైనను చాలా కాలమనిపించును - సుఖము కలిగి నపుడు ఎంత దీర్ఘకాలమైనను క్షణముగ గడిచిపోవును - చక్రవర్తి అయిన హరిశ్చంద్రునకు కష్ట కాలమపుడు ఒక రాత్రికాలము పన్నెండు సంవత్సరములవలె గడిచెను).

  1. “కళా ముహూర్తాదిమయః కాలః.

(కలలు, ముహూర్తములు మొదలగు విభాగములు గలది కాలము) - (చూడుము - కాలమానము).

  1. “కాలం కాలాగ్ని రుద్రం - - - రామచంద్రం భజాహం” (శ్రీరామకర్ణామృతం - 1 - 22)
Transliteration
  1. viśvaṃ kalayatīti kālaḥ, sarvaṃ kalayatīti kālaḥ -

(prapaṃcamunu, prapaṃcamulōni anniṃṭini kṣōbhiṃpacēyunadi kālamu. prapaṃcamulōni annivastuvu lalōnu tāpamu - vēḍimi - kalugucuṃḍuṭacēta vāṭilō mārpu kalugucuṃḍunu - ī mārpunu kalugacēyuṭayē kṣōbhiṃpacēyuṭa. (Heat converted into Energy). dīni valananē sṛṣṭi jarugu cunnadi - oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu kalugucunnadi. dīniki kāraṇamu kālarūpamulō nunna bhagavaṃtuḍu).

  1. kalayati kṣōbhayati sarva kāryāṇi iti kālasaṃjñā praktiḥ -

(samasta kārya vastuvulalōnu kṣōbhamu kalugacēsi vāṭilōnuṃḍi mariyoka vastuvunu udbhaviṃpa cēyunadi - kālamamanu pēranunna prakṛti).

  1. svāti riktaṃ kalayati svātma sātkarōtīti kālaḥ -

(tanakanna vēraina dānini tana svādhīnamulōniki tīsukonunadi).

  1. kalayati, gaṇayatīti kālaḥ -

(lekka peṭṭunadi, gaṇanamu cēyunadi. prati vastuvunu dāni nirṇītakālamulō dāni kāraṇavastuvu nuṃḍi udbhaviṃpacēsi naśiṃpacēyunadi).

  1. kṣōbhakaḥ, sarvōtpatti nimittaṃ guṇa kṣōbhakaḥ.

(prati vastuvulōnu kṣōbhamu - saṃkṣōbhamu kalugacēyunadi sṛṣṭilōni samasta vastuvulu puṭṭuṭaku prakṛti guṇamulanu valayu rītini kṣōbhiṃpacēyunadi).

  1. prakṛti - mahattatvādi kṣōbhakaṃ -

(prakṛti, mahattatvaṃ modalaguvāṭini kṣōbhiṃpacēyunadi - kṣōbhiṃpa cēyuṭadvārā vāṭinuṃḍi kārya vastuvulanu puṭṭiṃpa cēyunadi).

  1. sarvabhūtānāṃ vipariṇāma hētuḥ -

(samasta bhūtamulu kṣaṇakṣaṇamu pariṇāmamu - mārpu - ceṃducū uṃḍu - oka cinna bāluḍu pedda maniṣigā mārunu - oka cinna mokka pedda ceṭṭugā mārunu - iṭṭi mārpu kālamu jarigina koladi kalugunu - “iṭlu dinadina pravarthamānayai”

(śrīmadāṃdhramahābhāgavatamu - - skaṃ - 10 - rukmiṇī kalyāṇamu)

  1. nikhila kāryavarga pariṇāma saṃpādakaḥ - (samasta kārya vastuvulanu mārpu ceṃdunaṭlu cēyunadi).

  2. sarvādhāraḥ kālaḥ sarva kārya nimitta kāraṇaṃ -

(anniṃṭiki ādhārabhūtamainadi kālamu - kāryamulanniṃṭiki nimitta kāraṇaṃ).

  1. “kāla vēgaṃbuna sarva prapaṃcaṃbunagu, navasthāṃtaraṃbulu galugucuṃḍu. paramēśvaramūrtiyaina kālaṃbuna, nabhaṃbunaṃ bagalu tārakalugānarāni caṃdaṃbuna baḍaka kalpāvasthalu cariṃcu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)

  2. guṇaprērakaḥ

(triguṇamulanu prērēpiṃcunadi - satvarajastamō guṇamulu kālamu gaḍacinakoladi vāṭi panulanu nirvartiṃcunu. vāṭilōnuṃḍi tarvāta vaccu tatvamulanu puṭṭiṃcucuṃḍunu).

  1. puruṣasya īśvarasya prabhāvaṃ vikrimaṃ kālaṃ āhuḥ.

(bhagavaṃtuniyokka prabhāvamu, vikramamu, śaktiyē kālamani ceppuduru).

  1. parama puruṣasya sarga samhārādiṣu jaganniyamana sāmarthyaṃ kālaḥ, natu tatvāṃtara mityarthaḥ -

(sṛṣṭi sthitilayamulu cēyuṭalō bhagavaṃtuḍu niyamiṃcu sāmarthyamē, śaktiyē kālamu - bhagavaṃtuni lōnuṃḍi udbhaviṃcina tatvamulalō nokaṭikādu).

  1. kriyā śaktyupahitaḥ paramēśvaraḥ

(triśaktulalō nokaṭi ayina kriyā śaktitō kūḍiyunna paramēśvaruḍu).

  1. saṃhāra daśāyāṃ nāmarūpa vibhāgā narha niratiśaya sūkṣmāvasthāmāpanna yōḥ prakṛti puru ṣayōḥ paramātmātmakayōḥ tasminnēva līnayōḥ, punaḥ sṛṣṭi daśāyāṃ jagadākārēṇa pariṇāma rūpō yō vyāpāraḥ taddētu bhūtaḥ sakālaḥ sa bhagavadātmakaḥ -

(jagattuyokka saṃhāra daśayaṃdu nāmarūpamululēka atyaṃta sūkṣmarūpamugānunna prakṛti puruṣulu dānilō līnamai yuṃḍi, tirigi sṛṣṭi jarugu samayamaṃdu jagadrūpamugā pariṇamiṃcuṭa yanu vyāpāramu ēdi kaladō adiyē kālamu, bhagavadātmakamu).

  1. “kālaṃbanu paṃca viṃśati tatvaṃbu ceppeda. koṃdaṟu puruṣa śabda vācyuṃḍaina īśvaruni pauruṣaṃbu gālaśabdaṃbuna ceppaṃbaḍunaṃduru - - - prakṛtiguṇa sāmyaṃbunaṃ jēsi vartiṃci nirviśē ṣuṃḍagu bhagavaṃtuni cēṣṭā viśēṣaṃbu dēnivalana nutpannaṃbagu nadiya kālaṃbani ceppaṃbaḍu - adiyu jīvarāśyaṃtargataṃbaguṭaṃ jēsi puruṣuṃḍaniyu, vāni bahirbhāga vyāptiṃ jēsi kālaṃbaniyu jeppaṃbaḍu. ātma māyaṃ jēsi tatvāṃtargatuṃḍaina jīvunivalana kṣabhitaṃbayi jagatkāraṇaṃbagu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 888)

  2. “kāla śabdō jagadbaṃdhana bhēdana jñānādi sarva bhagavaddharma vācī” -

(jagattunu baṃdhiṃcuṭa, bhēdhiṃcuṭa telusukonuṭa modalagu bhagavaṃtuniyokka dharmamē - paniyē, guṇamē - kālamu).

  1. “kālō nāma bhagavallīlā prakṛtiḥ śaktiḥ”.

(kālamanagā bhagavaṃtuni līla yagu prakṛti, lēka bhagavaṃtuni śakti).

  1. “ammahanīya tējōnidhi modali yavatāraṃbu sahasra śīrṣādi yuktaṃbayi prakṛti pravartakaṃbagu nādipuruṣa rūpaṃbagu. aṃdu gālasvabhāvaṃbulanu śaktuludayiṃce” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 -

  2. paṃca viṃśati tatvamu - (bhaganvaṃtuni caitanya śakti rūpamē ayina jīvuḍu).

  3. “dēhaṃbunaku dravyaṃbulaina mahābhūtaṃbulunu, garmakṣōbhakaṃbaina kālaṃbunu, gāla svapari ṇāma hētuvaina svabhāvaṃbunu, bhōktamaina jīvuṃḍunu vāsudēvuṃḍukā neṟuṃgumu. vāsudēva vyatiriktaṃbu lēdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 84)

  4. “ahamēvā kṣayaḥ kālō” (śrīmadbhagavadgīta - 10 - 33)

(nāśamu lēni kālamu nēnē) ;

“kālōsmi lōkakṣaya kṛt -” (śrīmadbhavadgīta - 11 - 32)

(lōkamunu kṣīṇiṃci naśiṃpacēyukālamu nēnē).

  1. kāla śarīrakaḥ kālasvarūpaḥ -

(kālamu śarīramugā galavāḍu - kālamē tana rūpamainavāḍu - kālamu anagā bhagavaṃtuḍē).

  1. śrī harēḥ sudarśanākhyaṃ cakraṃ, tadrūpō yaḥ kālaḥ dēhabhājāṃ narāṇāṃ bhayamutpādayan tēṣā māyuḥ parikṣiṇōti, sakālaḥ.

(śrī maha viṣṇuvuyokka sudarśanamanu pērugala cakramu. dēhadhārulagu narulaku bhayamunu kalugacēsi vāri āyuvunu kṣīṇiṃpa cēyunadi).

  1. saṃhārakatvāt kālaḥ ; mṛtyuḥ ; attā -

(saṃhariṃcunadi kanuka kālamu, mṛtyuvu - tinunadi - “attā carācara grahaṇāt” carācaramu lanu grasiyiṃcunadi - tinunadi - cūḍumu - ātma).

  1. “kālacakra pravartakatvaṃbu valana gāluṃḍavayyunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū - bhā.
  2. “prakṛtirēva avasthā viśēṣaḥ.

(prakṛtiki bhagavaṃtuni caitanya śakti kaluguṭavalana kalugu mārpulalō okānoka avastha).

  1. sṛṣṭyādikāraṇaṃ.

(sṛṣṭiki modaṭi kāraṇamu - sṛṣṭi prāraṃbhamaguṭaku, taruvāta oka tatvamulōnuṃḍi iṃkoka tatvamu, oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭaku kāraṇamainadi - vastuvulanniyu koṃtakālamu gaḍicinanē oka dānilō okaṭi puṭṭi, perigi. naśiṃcucunnavi. aṃducēta vāṭi anniṃṭiki kāraṇamu kālamu).

  1. rāmē pravrajanaṃ, balērniyamanu, pālaḍōḥ sutānāṃ vanaṃ | vṛṣṇīnāṃ nidhanaṃ nalasya nṛpatē rājyāt pari bhraṃśanaṃ | kārāgāra niṣēvaṇaṃ ca maraṇaṃ saṃciṃtya laṃkēśvarē | sarvaḥ kālavaśēna naśyati naraḥ kōvā paritrāyatē ||“. (bhōjarāja caritra)

(śrīrāmunu araṇyavāsamu, balicakravarti yaṃtaṭivāḍu loṃgipōvuṭa, pāṃḍavula vanavāsamu, yādavulu nāśanamoṃduṭa, nalamahārāju rājyamu kōlupōvuṭa, rāvaṇa saṃhāramu, - vīṭini baṭṭi ālōciṃcagā aṃdarū kālamunaku vaśulai - vāri kālamu rāgānē - naśiṃcedaru - ā kālamunuṃḍi rakṣiṃcuvāḍevaḍū lēḍu).

  1. “ka. kālamu vaccina śabaruni

kōlanu dhara gūle khagamu ghōṣamutōḍan

kālamu ḍāsina nēlaṃ

gūlakapōvaśame yeṭṭi guṇavaṃtulakun|“. (śrī madāṃdhramahābhāgavatamu - 7 - 2 - 66)

  1. paripāka samayaṃ.

(samasta kāraṇa vastuvulalōnu jarugucunna saṃkṣōbhamu pakvamunaku vacci vāṭilōnuṃḍi kārya vastuvulanu udbhaviṃpa cēyu samayamu).

  1. “kālaḥ svabhāvō niyatirya dṛcchābhūtāni yōniḥ puruṣaḥ iti ciṃtyaṃ”

(kālamanagā svabhāvamu, karmaphalamu, bhūtamulaku kāraṇamu, puruṣuḍu ani telusukonavalenu).

  1. “duḥkhē kālaḥ sudīrghōhi sukhē laghutaraḥ sadā |

rātrirvādaśa varṣāṇi hariścaṃdrasya bōdhitā ||” (yōgavāśiṣṭamu - 80 - 43)

(duḥkhamu kaliginappuḍu eṃta takkuva kālamainanu cālā kālamanipiṃcunu - sukhamu kaligi napuḍu eṃta dīrghakālamainanu kṣaṇamuga gaḍicipōvunu - cakravarti ayina hariścaṃdrunaku kaṣṭa kālamapuḍu oka rātrikālamu panneṃḍu saṃvatsaramulavale gaḍicenu).

  1. “kaḷā muhūrtādimayaḥ kālaḥ.

(kalalu, muhūrtamulu modalagu vibhāgamulu galadi kālamu) - (cūḍumu - kālamānamu).

  1. “kālaṃ kālāgni rudraṃ - - - rāmacaṃdraṃ bhajāhaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 22)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.