“యధాన దీనాం బహ హోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నర లోకపాలా విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి ||
యధా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధి వేగాః |
తధైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధి వేగాః ||” (శ్రీమద్భగవద్గీత - 11 - 28, 29)
“బహుమార్గ ప్రవృత్తానాం నదీనాం బహవోప్యపాం వేగ వంతః |
ప్రవాహావై సముద్రాభిముఖా యథా |
సముద్రం ప్రవిశం త్యేవం నృణాం వీరా మహత్తరాః |
భీష్మ ద్రోణాదయ సర్వే తవ వక్త్రాణి సర్వతః |
ప్రవిశంతి జ్వలంత్యేతే మహాకాలేన యోజితాః ||
యథా పతంగా ఉద్భూత వేగాస్తే బుద్ధి పూర్వకం |
విశం త్యగ్నిం జ్వలంతం చ స్వనాశాయ త ధైవతే |
దుర్యోధనాదయ స్సర్వే వేగవంతో ముఖాని తే |
మరణాయ విశంతీమే బుద్ధి పూర్వం ప్రవాహతః ||“. (గీతాభావప్రకాశము - 11 - 97 to 100)
(అనేక మార్గములుగా ప్రవహించుచున్న నదులన్నియు ప్రవాహ వేగముతో సముద్రమును కలియుచున్నవి. ఉన్నవి ఉన్నట్టుగా ఒక చోటనే ఉండక పల్లముగా నున్న భూభాగమునకు నదులు ప్రవహించును. భూమిలోని అన్ని భాగములకన్న సముద్రమట్ట మగుటచేత అక్కడికే నీరు అంతయు ప్రవహించి చేరును. దీనికి కారణము భూమిలో మధ్యమముననున్న ఆకర్షణశక్తి - (నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగును). ఆ ప్రకారముగానే ఈ యుద్ధముచేయుచున్న వీరులందరు భగవంతుని నోటిలో గ్రసించ బడుచున్నారు. భగవంతుడు వారిని వారి కాలము - జీవిత కాలము - పూర్తియగుటచేత - తనలోనికి ఆకర్షించుచున్నాడు. (భగవంతుడు ‘సంకర్షణుడు’ = సమ్యక్ కర్షతి ఆకర్షతి ఇతి సం రక్షణః. బాగుగా ఆకర్షించువాడు, ఆకర్షించు శక్తి గలవాడు - ఆ శక్తియే కాలరూపము -). కాలరూపుడైన భగవంతుడు వారి వారి కాలము అయిపోయిన తోడనే వారినిసంహరించును. దీనికి కాలమే కారణము - కాలము గడిచిన కొలది జీవులు పరిణామము చెంది లయమును పొందెదరు. కాలమును ఎదిరించి నిగ్రహింపగలశక్తి ఎవరికినీ లేదు - ఆ కాలము వచ్చిన ఆ బుద్ధి పుట్టి ఆ కర్మ చేసి ఆ ఫలము నను భవించెదరు. అడ్డులేని ఈ కాలముయొక్క శక్తియే కాలవేగము - ఆ పని చేయుటకు ప్రేరేపించునది. ఆ ప్రకారముగానే శలభములు మండుచున్న అగ్నినిచూచి దానిచేత ఆకర్షింపబడి అందులో పడి చనిపోవుచున్నవి. వాటికి ఆ కాలమునకు ఆ బుద్ధి పుట్టి (బుద్ధిః కర్మానుసారిణి) ఆ పని చేసి
మరణించుచున్నవి. ప్రతిఘటము చేయుటకు వలను పడని కాలగతియే కాలవేగము).
“yadhāna dīnāṃ baha hōṃbuvēgāḥ samudramēvābhimukhā dravaṃti |
tathā tavāmī nara lōkapālā viśaṃti vaktrāṇyabhi vijvalaṃti ||
yadhā pradīptaṃ jvalanaṃ pataṃgāḥ viśaṃti nāśāya samṛddhi vēgāḥ |
tadhaiva nāśāya viśaṃti lōkāḥ tavāpi vaktrāṇi samṛddhi vēgāḥ ||” (śrīmadbhagavadgīta - 11 - 28, 29)
“bahumārga pravṛttānāṃ nadīnāṃ bahavōpyapāṃ vēga vaṃtaḥ |
pravāhāvai samudrābhimukhā yathā |
samudraṃ praviśaṃ tyēvaṃ nṛṇāṃ vīrā mahattarāḥ |
bhīṣma drōṇādaya sarvē tava vaktrāṇi sarvataḥ |
praviśaṃti jvalaṃtyētē mahākālēna yōjitāḥ ||
yathā pataṃgā udbhūta vēgāstē buddhi pūrvakaṃ |
viśaṃ tyagniṃ jvalaṃtaṃ ca svanāśāya ta dhaivatē |
duryōdhanādaya ssarvē vēgavaṃtō mukhāni tē |
maraṇāya viśaṃtīmē buddhi pūrvaṃ pravāhataḥ ||“. (gītābhāvaprakāśamu - 11 - 97 to 100)
(anēka mārgamulugā pravahiṃcucunna nadulanniyu pravāha vēgamutō samudramunu kaliyucunnavi. unnavi unnaṭṭugā oka cōṭanē uṃḍaka pallamugā nunna bhūbhāgamunaku nadulu pravahiṃcunu. bhūmilōni anni bhāgamulakanna samudramaṭṭa maguṭacēta akkaḍikē nīru aṃtayu pravahiṃci cērunu. dīniki kāraṇamu bhūmilō madhyamamunanunna ākarṣaṇaśakti - (nīru pallamerugu, nijamu dēvuḍerugunu). ā prakāramugānē ī yuddhamucēyucunna vīrulaṃdaru bhagavaṃtuni nōṭilō grasiṃca baḍucunnāru. bhagavaṃtuḍu vārini vāri kālamu - jīvita kālamu - pūrtiyaguṭacēta - tanalōniki ākarṣiṃcucunnāḍu. (bhagavaṃtuḍu ‘saṃkarṣaṇuḍu’ = samyak karṣati ākarṣati iti saṃ rakṣaṇaḥ. bāgugā ākarṣiṃcuvāḍu, ākarṣiṃcu śakti galavāḍu - ā śaktiyē kālarūpamu -). kālarūpuḍaina bhagavaṃtuḍu vāri vāri kālamu ayipōyina tōḍanē vārinisaṃhariṃcunu. dīniki kālamē kāraṇamu - kālamu gaḍicina koladi jīvulu pariṇāmamu ceṃdi layamunu poṃdedaru. kālamunu ediriṃci nigrahiṃpagalaśakti evarikinī lēdu - ā kālamu vaccina ā buddhi puṭṭi ā karma cēsi ā phalamu nanu bhaviṃcedaru. aḍḍulēni ī kālamuyokka śaktiyē kālavēgamu - ā pani cēyuṭaku prērēpiṃcunadi. ā prakāramugānē śalabhamulu maṃḍucunna agninicūci dānicēta ākarṣiṃpabaḍi aṃdulō paḍi canipōvucunnavi. vāṭiki ā kālamunaku ā buddhi puṭṭi (buddhiḥ karmānusāriṇi) ā pani cēsi
maraṇiṃcucunnavi. pratighaṭamu cēyuṭaku valanu paḍani kālagatiyē kālavēgamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.