కలిపురుషుడు వేడుకొనగా అతనికి పైన చెప్పీన స్థలముల నుండుటకు పరీక్షిత్తు అనుజ్ఞ యిచ్చెను - ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగ చెప్పబడినది : -
“నీవు పాపబంధుండవు - - రాజదేహంబునందు వర్తించుచు నిన్ను నసత్య లోభ చౌర్య దైర్జన్య దురాచార మాయా కలహ కపట కలుషా లక్ష్యాది ధర్మేతర సమూహంబు లాశ్రయించు - - - ప్రాణివధ, స్త్రీ, ద్యూత పానంబులనియెడు నాలుగు స్థానంబులిచ్చి, మఱియు నడిగిన సువర్ణమూలంబగు నసత్య మద, కామహింసా వైరంబులనియెడి పంచప్రదేశంబుల నొసంగి యితరస్థలంబుల స్పృశియింపకుండ నియమించె”.
(1 - 17 – 399)
(పైన చెప్పిన దోషగుణములున్న చోట కలి దాని ప్రభావము కనపరచును - ఈ దోషములు లేనివారిని కలికాలమియొక్క ప్రభావము ఏమియు చేయలేదు).
kalipuruṣuḍu vēḍukonagā ataniki paina ceppīna sthalamula nuṃḍuṭaku parīkṣittu anujña yiccenu - ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamuga ceppabaḍinadi : -
“nīvu pāpabaṃdhuṃḍavu - - rājadēhaṃbunaṃdu vartiṃcucu ninnu nasatya lōbha caurya dairjanya durācāra māyā kalaha kapaṭa kaluṣā lakṣyādi dharmētara samūhaṃbu lāśrayiṃcu - - - prāṇivadha, strī, dyūta pānaṃbulaniyeḍu nālugu sthānaṃbulicci, maṟiyu naḍigina suvarṇamūlaṃbagu nasatya mada, kāmahiṃsā vairaṃbulaniyeḍi paṃcapradēśaṃbula nosaṃgi yitarasthalaṃbula spṛśiyiṃpakuṃḍa niyamiṃce”.
(1 - 17 – 399)
(paina ceppina dōṣaguṇamulunna cōṭa kali dāni prabhāvamu kanaparacunu - ī dōṣamulu lēnivārini kalikālamiyokka prabhāvamu ēmiyu cēyalēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.