← Back to క · Booklets 11–20 (digitized file 2)

కల్ప తరువు kalpa taruvu

Original — తెలుగు
  1. కల్పితం నత కల్పితం భక్తాకాంక్షితం తరతి దదాతి ఇతి కల్ప తరుః - సురపాదపః -

(భక్తుల కోరికల నిచ్చునది - దేవ వృక్షము).

“పంచైతే దేవ తరవో మందారః పారిజాతకః |

సంతానః కల్ప వృక్షశ్చ పుంసినా హరి చందనం ||’.

(మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము - ఈ అయిదు దేవలోకములోని వృక్షములు).

  1. కల్పాః ఇతి ద్రుమాః కల్పద్రుమాః ఇతి విగ్రహః -

(కోరినవి కల్పించు చెట్లు కనుక కల్పద్రుమములు అని చెప్పబడినవి).

  1. “బ్రహ్మ మృతానంద ఫల ప్రదాయినం |

వేదాంత సుజ్ఞాన సుగంధ పుష్పితం |

సీతా శుభాంగాంచిత బాహు శాఖినం |

శ్రీరామకల్ప ద్రుమ మాశ్రయామః ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 5)

(అమృతముతో సమానమైన బ్రహ్మానందమను ఫలమునిచ్చునదియు, వేదాంతజ్ఞానము - బ్రహ్మజ్ఞానము - అను మంచి సువాసనగల పుష్పము గలదియు, సీతాదేవియొక్క శుభప్రదమైన శరీరభాగములైన బాహువులు అను శాఖలు - కొమ్మలు - గల శ్రీరాముడను కల్పవృక్షమును - నా కోరికలు నెరవేర్చుటకు - ఆశ్రయించుచున్నాను).

Transliteration
  1. kalpitaṃ nata kalpitaṃ bhaktākāṃkṣitaṃ tarati dadāti iti kalpa taruḥ - surapādapaḥ -

(bhaktula kōrikala niccunadi - dēva vṛkṣamu).

“paṃcaitē dēva taravō maṃdāraḥ pārijātakaḥ |

saṃtānaḥ kalpa vṛkṣaśca puṃsinā hari caṃdanaṃ ||’.

(maṃdāramu, pārijātamu, saṃtānamu, kalpavṛkṣamu, haricaṃdanamu - ī ayidu dēvalōkamulōni vṛkṣamulu).

  1. kalpāḥ iti drumāḥ kalpadrumāḥ iti vigrahaḥ -

(kōrinavi kalpiṃcu ceṭlu kanuka kalpadrumamulu ani ceppabaḍinavi).

  1. “brahma mṛtānaṃda phala pradāyinaṃ |

vēdāṃta sujñāna sugaṃdha puṣpitaṃ |

sītā śubhāṃgāṃcita bāhu śākhinaṃ |

śrīrāmakalpa druma māśrayāmaḥ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 5)

(amṛtamutō samānamaina brahmānaṃdamanu phalamuniccunadiyu, vēdāṃtajñānamu - brahmajñānamu - anu maṃci suvāsanagala puṣpamu galadiyu, sītādēviyokka śubhapradamaina śarīrabhāgamulaina bāhuvulu anu śākhalu - kommalu - gala śrīrāmuḍanu kalpavṛkṣamunu - nā kōrikalu neravērcuṭaku - āśrayiṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.