కోరబడుచున్నవి కామములు. అన్నము, పానము మొదలగునవి - కామ్యంతే అఖిలష్యంతే ఇతి కామః - కామినీ సంభోగాది విషయాః (అభిలషించు వస్తువులు - స్త్రీ సంభోగము మొదలగునవి).
ఈప్సితాః, ఇచ్వ్హాబేధాః; మనోరధః - (ఇష్టమైనవి - కోరబడునవి, మనసులోని కోరిక).
విషయాభిలాషః దృష్టా దృష్ట విషయాః - (విషయములందలి కోరిక, దృష్ట, అదృష్ట విషయములు).
శబ్దా దయః. విష్యాః; ద్రవ్యాణి; గృహక్షేత్ర పుత్రాదయః.
(శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము - ద్రవ్యములు - గృహము, భూమి, పుత్రులు మొదలగునవి).
(ఇది నాకు కావలెను, ఇది నాకు కావలెను - అను కోరికయే కామము).
(తనకు దగ్గరగాలేని విషయములందు - అందుబాటులో లేని విషయముల యడల కోరిక).
అప్రాప్త వస్తువును పొందుటకై కలుగు ఇచ్ఛా కామము.
స్వాజ్ఞ దశాయాం స్వాతి రేకేణ విషయజాతం కామ్యంతే ఇతి కామాః.
(తన నిజస్వరూపమును - అన్నీ తానే అని – తెలియనంత కాలము తనను తప్పించి ఇతరమైన విషయములను కోరబడుచున్నవి కామములు).
(కండ్లు మొదలగు అవయవములు మనసుతోసహా వాటి వాటికి అనుకూలమైన విషయములందు ప్రవర్తించుట కామము).
(ఇంద్రియములకు గోచరమైన ఇష్టవస్తువునందు, వినవలెననికాని, స్మరించవలెననికాని ఉన్నవస్తువులందు అనుభవించవలెనని కలుగు తృష్ణయే కామము).
ధర్మా ధర్మ ప్రవృత్తి హేతూం. (పుణ్య పాప కర్మలయందు ప్రవృత్తికి కారణమైనది కామము).
ఇచ్ఛాయాః కాష్టా ప్రాప్త దశా. (కోరికయొక్క పరాకాష్ట దశయే కామము).
కామో నామ సంగస్య విపాకదశా - “సంగాత్ సం జాయతే కామః” - పురుషో యాం దశాం ఆపన్నో విషయా సు భుక్త్వా స్థాతుం న శక్నోతి స కామః.
(విషయములతోడి సంగము పరిపక్వమునొందిన దశకామము - ‘విషయములతో సంగము కలుగుటవలననే కామము కలుగును’. ఈ దశలో ఉన్న పురుషుడు విషయభోగములననుభవించినవాడు వాటిని వదలి యుండలేడు - అదియే కామము).
(ఇది నాకు కావలెను అనుట సంకల్పము - అట్టి సంకల్పము వలన కలుగునది కామము).
(పురుషుడు విషయముల గుఱించి ఆలోచించుటవలన వాటితో సంగము కలుగును, అట్లు కలిగిన సంగమువలన వాటి యందు కామము కలుగును).
(ఈ పురుషుడు - జీవుడు - కామమయుడు. ఇతడెట్టి కామము గలవాడో అట్టి పని చేయును).
(ప్రాప్తముగాని విషయమునందు కోరిక తీరుటకు అవకాశము లేకపోయినను అది పొందవలెనని యున్నది అను వాంఛ కామము).
(తనకు అనుకూలములైనటువంటిన్నీ, సుఖమునకు కారనమైనటువంటిన్నీ - సుఖమును కలుగుచేయునవియు - కనబడుచున్నవాటియందు, మనసులో తలచుకొనుచున్నవాటియందు పదే పదే ఆలోచించుట అభ్యాసముగా చేసుకొనుటవలన వాటియందు అభిలాష కామము).
ధర్మార్థకామమోక్షములు అను చతుర్విధ పురుషార్థములలోను మూడవది - “తృతీయ పురుషార్థః”.
“ధర్మ కామో(అ)థకామశ్చ మోక్షకామస్తధైవచ |
స్త్రీ పుంసయోస్తు సం యోగోయః కామస్సతం సంస్కృతః ||“.
(ధర్మము గుఱించి కామము, అర్థముగుఱించికామము, మోక్షముగుఱించి కామము, స్త్రీకి పురుషునియడల, పురుషునికి స్త్రీ యడల కలుగు కామము - ఇవన్నియు కామమ).
జ్ఞాన రత్నాపహరేణ తస్మాత్ జాగ్రత, జాగ్రత ||“..
(జ్ఞానమను రత్నమును దొంగలించునవికనుక కామము, క్రోధము, లోభము అను మూడున్నూ దేహములోనుండు దొంగలు).
ధర్మా ధర్మేచ తన్మూలౌ దేహానర్థా శ్రయస్తతః ||“.
(పాపములకు కారణము అవిద్య. క్షామముననుసరించి పుణ్యపాపకర్మలు - ఈ ప్రవృత్తులే - కర్మలే జన్మము మొదలగు అనర్థములకు కారణము).
(కామము ప్రారబ్దకర్మవలన కలుగును, ఎందుచేతననగా - “సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞాన దానపి” - (జ్ఞాని అయినను తన ప్రకృతిని (స్వభావమును) అనుసరించియే ప్రవర్తించును).
(కామము ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించి యుండును).
హవిషా కృష్ణ వర్త్మేవ భూయ యేవా భి వర్థతే ||“. (మనుః)
(కామ్య వస్తువుల ననుభవించుటచేత కామము శాంతి పొందదు. హోమద్రవ్యము వేసినకొలది అగ్ని ప్రజ్వలించుచునే యుండును కాని శాంతిని పొందదు).
(అగ్ని ప్రకాశించునదైనను దాని వలననే కలిగిన బూడిద కప్పబడినదై ఇతరులకు కానరాకున్నదో, ఆ ప్రకారముగానే అద్దము ధూళిచే కప్పబడినదై ప్రతిబింబమును కనపర్చలేదు - ఆ ప్రకారముగానే కామముచేత కప్పబడిన (ఆవరించబడిన) అంతఃకరణము పరమాత్మను దర్శింపచేయునదైనను కామముచే ఆవృతమైనదై పరమాత్మను దర్శింప చేయనేరదు. మావిచే కప్పబడిన గర్భము కనబడకుండనుండునట్లు జీవుడు కామముచే ఆవరించబడినవాడై శాస్త్రముద్వారా జ్ఞానము సంపాదించినవాడైనను కామము చేత – అజ్ఞానము చేత కప్పబడినవాడై పరమాత్మను అపరోక్షముగా చూడలేడు - జ్ఞాని అయినను అతని జ్ఞానము ఈ ప్రకారముగా కామముచేత కప్పబడియుండును).
“కామంబు భక్తియోగంబున కంతరాయంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - - )
కామాః స్పర్సజాః సంకల్ప జాః చ ఇతి ద్వివిధాః కామాః - స్పర్సజాః శీతోష్ణాదయః ; సంకల్ప జాః పుత్రక్షేత్రా దయః తత్ర సంకల్ప ప్రభవాః స్వరూపే ణైవ త్యక్తుం శక్యాః.
(కామములు రెండువిధములు - స్పర్శవలన కలిగినవి, సంకల్పమున కలిగినవి. శీతోష్ణములు మొదలగునవి స్పర్సవలన కలిగినవి; సంతానము, ఇళ్ళు, భూములు మొదలగునవి సంకల్పమువలన కలిగినవి, సంకల్పమువలన కలిగిన కామములు వదలుకొనుటకు వీలగునవి - శక్యమైనవి).
kōrabaḍucunnavi kāmamulu. annamu, pānamu modalagunavi - kāmyaṃtē akhilaṣyaṃtē iti kāmaḥ - kāminī saṃbhōgādi viṣayāḥ (abhilaṣiṃcu vastuvulu - strī saṃbhōgamu modalagunavi).
īpsitāḥ, icvhābēdhāḥ; manōradhaḥ - (iṣṭamainavi - kōrabaḍunavi, manasulōni kōrika).
viṣayābhilāṣaḥ dṛṣṭā dṛṣṭa viṣayāḥ - (viṣayamulaṃdali kōrika, dṛṣṭa, adṛṣṭa viṣayamulu).
śabdā dayaḥ. viṣyāḥ; dravyāṇi; gṛhakṣētra putrādayaḥ.
(śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu - dravyamulu - gṛhamu, bhūmi, putrulu modalagunavi).
(idi nāku kāvalenu, idi nāku kāvalenu - anu kōrikayē kāmamu).
(tanaku daggaragālēni viṣayamulaṃdu - aṃdubāṭulō lēni viṣayamula yaḍala kōrika).
aprāpta vastuvunu poṃduṭakai kalugu icchā kāmamu.
svājña daśāyāṃ svāti rēkēṇa viṣayajātaṃ kāmyaṃtē iti kāmāḥ.
(tana nijasvarūpamunu - annī tānē ani – teliyanaṃta kālamu tananu tappiṃci itaramaina viṣayamulanu kōrabaḍucunnavi kāmamulu).
(kaṃḍlu modalagu avayavamulu manasutōsahā vāṭi vāṭiki anukūlamaina viṣayamulaṃdu pravartiṃcuṭa kāmamu).
(iṃdriyamulaku gōcaramaina iṣṭavastuvunaṃdu, vinavalenanikāni, smariṃcavalenanikāni unnavastuvulaṃdu anubhaviṃcavalenani kalugu tṛṣṇayē kāmamu).
dharmā dharma pravṛtti hētūṃ. (puṇya pāpa karmalayaṃdu pravṛttiki kāraṇamainadi kāmamu).
icchāyāḥ kāṣṭā prāpta daśā. (kōrikayokka parākāṣṭa daśayē kāmamu).
kāmō nāma saṃgasya vipākadaśā - “saṃgāt saṃ jāyatē kāmaḥ” - puruṣō yāṃ daśāṃ āpannō viṣayā su bhuktvā sthātuṃ na śaknōti sa kāmaḥ.
(viṣayamulatōḍi saṃgamu paripakvamunoṃdina daśakāmamu - ‘viṣayamulatō saṃgamu kaluguṭavalananē kāmamu kalugunu’. ī daśalō unna puruṣuḍu viṣayabhōgamulananubhaviṃcinavāḍu vāṭini vadali yuṃḍalēḍu - adiyē kāmamu).
(idi nāku kāvalenu anuṭa saṃkalpamu - aṭṭi saṃkalpamu valana kalugunadi kāmamu).
(puruṣuḍu viṣayamula guṟiṃci ālōciṃcuṭavalana vāṭitō saṃgamu kalugunu, aṭlu kaligina saṃgamuvalana vāṭi yaṃdu kāmamu kalugunu).
(ī puruṣuḍu - jīvuḍu - kāmamayuḍu. itaḍeṭṭi kāmamu galavāḍō aṭṭi pani cēyunu).
(prāptamugāni viṣayamunaṃdu kōrika tīruṭaku avakāśamu lēkapōyinanu adi poṃdavalenani yunnadi anu vāṃcha kāmamu).
(tanaku anukūlamulainaṭuvaṃṭinnī, sukhamunaku kāranamainaṭuvaṃṭinnī - sukhamunu kalugucēyunaviyu - kanabaḍucunnavāṭiyaṃdu, manasulō talacukonucunnavāṭiyaṃdu padē padē ālōciṃcuṭa abhyāsamugā cēsukonuṭavalana vāṭiyaṃdu abhilāṣa kāmamu).
dharmārthakāmamōkṣamulu anu caturvidha puruṣārthamulalōnu mūḍavadi - “tṛtīya puruṣārthaḥ”.
“dharma kāmō(a)thakāmaśca mōkṣakāmastadhaivaca |
strī puṃsayōstu saṃ yōgōyaḥ kāmassataṃ saṃskṛtaḥ ||“.
(dharmamu guṟiṃci kāmamu, arthamuguṟiṃcikāmamu, mōkṣamuguṟiṃci kāmamu, strīki puruṣuniyaḍala, puruṣuniki strī yaḍala kalugu kāmamu - ivanniyu kāmama).
jñāna ratnāpaharēṇa tasmāt jāgrata, jāgrata ||“..
(jñānamanu ratnamunu doṃgaliṃcunavikanuka kāmamu, krōdhamu, lōbhamu anu mūḍunnū dēhamulōnuṃḍu doṃgalu).
dharmā dharmēca tanmūlau dēhānarthā śrayastataḥ ||“.
(pāpamulaku kāraṇamu avidya. kṣāmamunanusariṃci puṇyapāpakarmalu - ī pravṛttulē - karmalē janmamu modalagu anarthamulaku kāraṇamu).
(kāmamu prārabdakarmavalana kalugunu, eṃducētananagā - “sadṛśaṃ cēṣṭatē svasyāḥ prakṛtēḥ jñāna dānapi” - (jñāni ayinanu tana prakṛtini (svabhāvamunu) anusariṃciyē pravartiṃcunu).
(kāmamu iṃdriyamulanu, manassunu, buddhini āśrayiṃci yuṃḍunu).
haviṣā kṛṣṇa vartmēva bhūya yēvā bhi varthatē ||“. (manuḥ)
(kāmya vastuvula nanubhaviṃcuṭacēta kāmamu śāṃti poṃdadu. hōmadravyamu vēsinakoladi agni prajvaliṃcucunē yuṃḍunu kāni śāṃtini poṃdadu).
(agni prakāśiṃcunadainanu dāni valananē kaligina būḍida kappabaḍinadai itarulaku kānarākunnadō, ā prakāramugānē addamu dhūḷicē kappabaḍinadai pratibiṃbamunu kanaparcalēdu - ā prakāramugānē kāmamucēta kappabaḍina (āvariṃcabaḍina) aṃtaḥkaraṇamu paramātmanu darśiṃpacēyunadainanu kāmamucē āvṛtamainadai paramātmanu darśiṃpa cēyanēradu. māvicē kappabaḍina garbhamu kanabaḍakuṃḍanuṃḍunaṭlu jīvuḍu kāmamucē āvariṃcabaḍinavāḍai śāstramudvārā jñānamu saṃpādiṃcinavāḍainanu kāmamu cēta – ajñānamu cēta kappabaḍinavāḍai paramātmanu aparōkṣamugā cūḍalēḍu - jñāni ayinanu atani jñānamu ī prakāramugā kāmamucēta kappabaḍiyuṃḍunu).
“kāmaṃbu bhaktiyōgaṃbuna kaṃtarāyaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - - )
kāmāḥ sparsajāḥ saṃkalpa jāḥ ca iti dvividhāḥ kāmāḥ - sparsajāḥ śītōṣṇādayaḥ ; saṃkalpa jāḥ putrakṣētrā dayaḥ tatra saṃkalpa prabhavāḥ svarūpē ṇaiva tyaktuṃ śakyāḥ.
(kāmamulu reṃḍuvidhamulu - sparśavalana kaliginavi, saṃkalpamuna kaliginavi. śītōṣṇamulu modalagunavi sparsavalana kaliginavi; saṃtānamu, iḷḷu, bhūmulu modalagunavi saṃkalpamuvalana kaliginavi, saṃkalpamuvalana kaligina kāmamulu vadalukonuṭaku vīlagunavi - śakyamainavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.