కంఠమున ఉన్న ఆభరణము కంఠమందే ఉండగా అది పోయినదని విచారించినవానిని చూచి ఆ ఆభరణము కంఠమునందే ఉండుట చూచి ఆ సంగతి అతనికి చెప్పగా అతని అజ్ఞానము తొలగిపోయి తన ఆభరణమును చూచి సంతోషించును - అట్లే ఆత్మ తన స్వస్వరూపమే అయినను జీవుడు దానిని మఱచియుండగా బ్రహ్మ జ్ఞానోపదేశమువల్ల తన స్వస్వరూపమును తెలుసుకొనును -,“అహం బ్రహ్మస్మి” అను మహావాక్యముయొక్క అర్థమును గ్రహించును - దీనినే కంఠచామీకరన్యాయమని యందురు.
kaṃṭhamuna unna ābharaṇamu kaṃṭhamaṃdē uṃḍagā adi pōyinadani vicāriṃcinavānini cūci ā ābharaṇamu kaṃṭhamunaṃdē uṃḍuṭa cūci ā saṃgati ataniki ceppagā atani ajñānamu tolagipōyi tana ābharaṇamunu cūci saṃtōṣiṃcunu - aṭlē ātma tana svasvarūpamē ayinanu jīvuḍu dānini maṟaciyuṃḍagā brahma jñānōpadēśamuvalla tana svasvarūpamunu telusukonunu -,“ahaṃ brahmasmi” anu mahāvākyamuyokka arthamunu grahiṃcunu - dīninē kaṃṭhacāmīkaranyāyamani yaṃduru.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.