← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామ్య కర్మ kāmya karma

Original — తెలుగు
  1. ఫలార్థం విహితం కర్మకామ్యం, - యథా వృష్టికామేన క్రియమాణ కార్యాది యోగః, స్వర్గాద్యర్థినా క్రియమాణాగ్నిహోత్ర జ్యోతిష్టొ మాదికం చ కామ్యం కర్మ.

(ఫలము కొఱకు విహితమైన కర్మ కామ్యకర్మ. వర్షమును కోరువాడు చేయు యాగము, - లేక స్వర్గము మొదలగువాటిని గుఱించి చేయు అగ్నిహోత్రము, జ్యోతిష్టోమము మొదలగునవి కామ్యకర్మలు) –

“జ్యోతిష్టోమేన స్వర్గకామో య జేత”

(స్వర్గమును కోరువాడు జ్యోతిష్టోమమును చేయవలయును - అని శ్రుతిచెప్పుచున్నది. శ్రుతిలో నిర్థిష్టమైన ఫలమును కోరి చేయబడునది కనుక ఈ కర్మ కామ్య కర్మ).

  1. ఆశ్రమత్రయ విహితాని యజ్ఞాదీని యుద్ధా దీనిచ కర్మాణి కామ్యాన్యేవ, ఫలశ్రవణాత్ సర్వే ఏతే పుణ్య లోకాః భవంతి.

(బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థాశ్రమములలో నుండగా విధిగా చేయవలసినవైన యజ్ఞము మొదలగునవి, యుద్ధము మొదలగునవి. వీటివలన ఫలము కలుగునని చెప్పబడియుండుటవలన ఇవి కామ్య కర్మలు).

Transliteration
  1. phalārthaṃ vihitaṃ karmakāmyaṃ, - yathā vṛṣṭikāmēna kriyamāṇa kāryādi yōgaḥ, svargādyarthinā kriyamāṇāgnihōtra jyōtiṣṭo mādikaṃ ca kāmyaṃ karma.

(phalamu koṟaku vihitamaina karma kāmyakarma. varṣamunu kōruvāḍu cēyu yāgamu, - lēka svargamu modalaguvāṭini guṟiṃci cēyu agnihōtramu, jyōtiṣṭōmamu modalagunavi kāmyakarmalu) –

“jyōtiṣṭōmēna svargakāmō ya jēta”

(svargamunu kōruvāḍu jyōtiṣṭōmamunu cēyavalayunu - ani śruticeppucunnadi. śrutilō nirthiṣṭamaina phalamunu kōri cēyabaḍunadi kanuka ī karma kāmya karma).

  1. āśramatraya vihitāni yajñādīni yuddhā dīnica karmāṇi kāmyānyēva, phalaśravaṇāt sarvē ētē puṇya lōkāḥ bhavaṃti.

(brahmacarya, gṛhasta, vānaprasthāśramamulalō nuṃḍagā vidhigā cēyavalasinavaina yajñamu modalagunavi, yuddhamu modalagunavi. vīṭivalana phalamu kalugunani ceppabaḍiyuṃḍuṭavalana ivi kāmya karmalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.