← Back to క · Booklets 11–20 (digitized file 2)

కారణశరీరము kāraṇaśarīramu

Original — తెలుగు
  1. “స్వరూపాజ్ఞానం ఆనందమయకోశః, తత్ కారణ శరీరం”. (పైంగలోపనిషత్).

(స్వరూపాజ్ఞానము - తను ఎవరో ఎరుగకుండ ఆనందము ననుభవించునదియగు అవిద్య - ఆనంద మయకోశము - అదియేకారణశరీరము).

  1. అజ్ఞానమేవ కారణశరీరం ఇత్యుచ్యతే. స్థూల సూక్ష్మ శరీరయోః కారణత్వాత్ అజ్ఞానం కారణ శరీరం ఇత్యుచ్యతే. తత్వజ్ఞాన దాహ్యత్వాత్ కారణ దేహః ఇతిచ ఉచ్యతే అజ్ఞానమేవ.

(అజ్ఞానమే కారణశరీరమని చెప్పబడుచున్నది - స్థూల శరీరమునకు, సూక్ష్మశరీరమునకు కారణ మగుటవలన అజ్ఞానము కారణశరీరమని చెప్పబడుచున్నది. తత్వజ్ఞానముచే దహింపబడునదికనుక అజ్ఞానమే కారణదేహమని చెప్పబడుచున్నది - ‘దహ్యతే ఇతి దేహం’ (దహింపబడునదికనుక దేహము).

(సమష్టి అజ్ఞానము ఈశ్వరునకు కారణశరీరము, వ్యష్టి అజ్ఞానము జీవునకు కారణశరీరము. శుద్ద సత్వగుణ సహితమైన మాయ ఈశ్వరునకు కారణశరీరము. మలిన సత్వగుణసహితా విద్యాన్శము జీవునకు కారణశరీరము

  1. “అన్నమయకోశమైన స్థూలశరీరమునున్నూ, అందుకు లోనైన ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మనెడి కోశ త్రయాత్మకమైన లింగశరీరమున్నూ, అందుకు లోనైన ఆనందమ యాత్మకమైన, తమో రూపమైన కారణశరీరము -” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  2. “వటబీజం వటశ్చైవ” అనెడి న్యాయం చేతను బీజంలో వృక్షం అణిగియున్నట్లు దేహద్వయానకు లయస్థానమై తమోరూపమై అవ్యక్తమై యుండినదేహము కారణశరీరము. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)

  3. అజ్ఞానరూపమగు శరీరము స్థూలసూక్ష్మ దేహములకు లోపలనుండి మరియొక దేహమునిచ్చుటకు కారణమగు దేహము.

  4. జీవులు వారి వారి నామరూపములు లేక వాసనలతో నుండు స్థితి.

  5. వాసనలు.

Transliteration
  1. “svarūpājñānaṃ ānaṃdamayakōśaḥ, tat kāraṇa śarīraṃ”. (paiṃgalōpaniṣat).

(svarūpājñānamu - tanu evarō erugakuṃḍa ānaṃdamu nanubhaviṃcunadiyagu avidya - ānaṃda mayakōśamu - adiyēkāraṇaśarīramu).

  1. ajñānamēva kāraṇaśarīraṃ ityucyatē. sthūla sūkṣma śarīrayōḥ kāraṇatvāt ajñānaṃ kāraṇa śarīraṃ ityucyatē. tatvajñāna dāhyatvāt kāraṇa dēhaḥ itica ucyatē ajñānamēva.

(ajñānamē kāraṇaśarīramani ceppabaḍucunnadi - sthūla śarīramunaku, sūkṣmaśarīramunaku kāraṇa maguṭavalana ajñānamu kāraṇaśarīramani ceppabaḍucunnadi. tatvajñānamucē dahiṃpabaḍunadikanuka ajñānamē kāraṇadēhamani ceppabaḍucunnadi - ‘dahyatē iti dēhaṃ’ (dahiṃpabaḍunadikanuka dēhamu).

(samaṣṭi ajñānamu īśvarunaku kāraṇaśarīramu, vyaṣṭi ajñānamu jīvunaku kāraṇaśarīramu. śudda satvaguṇa sahitamaina māya īśvarunaku kāraṇaśarīramu. malina satvaguṇasahitā vidyānśamu jīvunaku kāraṇaśarīramu

  1. “annamayakōśamaina sthūlaśarīramununnū, aṃduku lōnaina prāṇamaya manōmaya vijñānamaya maneḍi kōśa trayātmakamaina liṃgaśarīramunnū, aṃduku lōnaina ānaṃdama yātmakamaina, tamō rūpamaina kāraṇaśarīramu -” (brahmavidyāsudhārṇavamu - 6)

  2. “vaṭabījaṃ vaṭaścaiva” aneḍi nyāyaṃ cētanu bījaṃlō vṛkṣaṃ aṇigiyunnaṭlu dēhadvayānaku layasthānamai tamōrūpamai avyaktamai yuṃḍinadēhamu kāraṇaśarīramu. (brahmavidyāsudhārṇavamu - 2)

  3. ajñānarūpamagu śarīramu sthūlasūkṣma dēhamulaku lōpalanuṃḍi mariyoka dēhamuniccuṭaku kāraṇamagu dēhamu.

  4. jīvulu vāri vāri nāmarūpamulu lēka vāsanalatō nuṃḍu sthiti.

  5. vāsanalu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.