← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మ సన్యాసము karma sanyāsamu

Original — తెలుగు
  1. “కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః |

సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 2)

(కామ్య కర్మలను విడుచుట కర్మసన్యాసము అని కవులు చెప్పుదురు. కాని, సకల కర్మలఫలమును విడిచిపెట్టుట కర్మ సన్యాసము అని విచక్షుణులైనవారు చెప్పుదురు).

  1. “మయి సర్వేశ్వరే సర్వాం తరాత్మ భూతే అధ్యాత్మ చేతసా సర్వ కర్మాణి సన్యస్య మచ్ఛరీర తయా మత్ప్రవర్త్యాత్మ స్వరూపాను సంధానేన సర్వాణి కర్మాణి మయైవ క్రియమానాణి ఇతి మయి పరమపురుషే సన్యస్య తానిచ కేవలం మదారాధనాని ఇతి కృత్వా తత్ఫలే నిరాశీ భూత్వా. తతః ఏవ తత్ర కర్మణి మమతా రహితఃభూత్వా విగతసంతాపః భవ”.

(ఆధ్యాత్మ చేతః, ఆత్మనియచ్ఛేతః, తదధ్యాత్మచేతః, వివేక బుద్ధ్యా అహం కర్తా ఈశ్వరాయ భృత్యవత్కరోమి ఇత్యనయా బుద్ధ్యా; పరమ పురుషే సన్యస్య భ్రాత్యా జీవే అధ్యారోపితాని సర్వాణి కర్మాణి, భగవాన్ ఏవ సర్వాణి కర్మాణి కరోతీతి సర్వాణి కర్మాణి మయి సన్యస్య ఇతి).

(పిండితార్థః - స్వకీయేన ఆత్మనా కర్త్రా స్వకీయైశ్చ ఉపకరణైః స్వారాధనైక ప్రయోజనాయ పరమ పురుషః సర్వశేషీ; సర్వేశ్వరః స్వయమేవ స్వకీయ కర్మాణి కారయతి” ఇతి.

(సర్వేశ్వరుడు, అన్నింటిలోను అంతరాత్మగానున్నవాడు అయిన భగవంతునియందు వివేకబుద్ధితో - అన్ని కర్మలను విడిచిపెట్టి - అనగా, ఈ కర్మలను భగవంతుని కొఱకు సేవకునివలె నేను చేయుచున్నాను - భ్రాంతిచేత జీవుడే అన్ని కర్మలు చేయుచున్నాడు అని జీవునియందు ఆరోపించబడినవనిన్నీ, భగవంతుడే అన్ని కర్మలు చేయుచున్నాడనిన్నీ - అన్ని కర్మలు భగవంతునియందే విడిచిపెట్టి (సన్యసించి), ఆ కర్మలను కేవలము భగవంతుని ఆరాధించుట కొఱకే అనుకొని, వాటిఫలమందు ఆశలేక చేయుచూ, ఇట్లు చేయుటవలన సంతాపము లేక ఉండుటయే కర్మ సన్యాసము. దీని సారాంశమేమనగా - తనయొక్క అంశ అయిన కర్తచేత, తన ఉపకరణములచే, తనయొక్క ఆరాధన్యను ప్రయోజనము కొఱకే, పరమ పురుషుడు అయిన భగవంతుడు తనయొక్క పనులను చేయుచున్నాడు).

  1. “కర్మణాం పరిత్యాగః. (శ్రీశంకరః)

(కర్మసన్యాసమనగా కర్మలను చేయకుండుట - ఏ కర్మను చేయక ఎవడును ఉండలేడు - అందుచేత కర్మసన్యాసము అనగా – చూడుము - 1, 2).

  1. “బ్రహ్మ చర్యం సమాప్య, గృహీభూత్వా, వానప్రస్థాశ్రమేత్య వైరాగ్యాభావే (అ)పి ఆశ్రమక్రమాను సారేణ య స్సన్యసతి సకర్మ సన్యాసీ”.

(ముందు బ్రహ్మచర్యాశ్రమము నవలంభించి, తర్వాత గృహస్థాశ్రమమును స్వీకరించి అన్నింటియందు అనురాగమును వదలుకొని - విరాగియై - ఈ ప్రకారముగా ఆశ్రమములకు సంబంధించి కర్మలు క్రమముగా చేసి, తర్వాత సన్యసించవలెను - అట్లు సన్యసించినవాడు కర్మసన్యాసి) హఠాత్తుగా కర్మసన్యాసము చేయకూడదు).

Transliteration
  1. “kāmyānāṃ karmaṇāṃ nyāsaṃ sanyāsaṃ kavayō viduḥ |

sarvakarmaphalatyāgaṃ prāhustyāgaṃ vicakṣaṇāḥ ||“. (śrīmadbhagavadgīta - 18 - 2)

(kāmya karmalanu viḍucuṭa karmasanyāsamu ani kavulu ceppuduru. kāni, sakala karmalaphalamunu viḍicipeṭṭuṭa karma sanyāsamu ani vicakṣuṇulainavāru ceppuduru).

  1. “mayi sarvēśvarē sarvāṃ tarātma bhūtē adhyātma cētasā sarva karmāṇi sanyasya maccharīra tayā matpravartyātma svarūpānu saṃdhānēna sarvāṇi karmāṇi mayaiva kriyamānāṇi iti mayi paramapuruṣē sanyasya tānica kēvalaṃ madārādhanāni iti kṛtvā tatphalē nirāśī bhūtvā. tataḥ ēva tatra karmaṇi mamatā rahitaḥbhūtvā vigatasaṃtāpaḥ bhava”.

(ādhyātma cētaḥ, ātmaniyacchētaḥ, tadadhyātmacētaḥ, vivēka buddhyā ahaṃ kartā īśvarāya bhṛtyavatkarōmi ityanayā buddhyā; parama puruṣē sanyasya bhrātyā jīvē adhyārōpitāni sarvāṇi karmāṇi, bhagavān ēva sarvāṇi karmāṇi karōtīti sarvāṇi karmāṇi mayi sanyasya iti).

(piṃḍitārthaḥ - svakīyēna ātmanā kartrā svakīyaiśca upakaraṇaiḥ svārādhanaika prayōjanāya parama puruṣaḥ sarvaśēṣī; sarvēśvaraḥ svayamēva svakīya karmāṇi kārayati” iti.

(sarvēśvaruḍu, anniṃṭilōnu aṃtarātmagānunnavāḍu ayina bhagavaṃtuniyaṃdu vivēkabuddhitō - anni karmalanu viḍicipeṭṭi - anagā, ī karmalanu bhagavaṃtuni koṟaku sēvakunivale nēnu cēyucunnānu - bhrāṃticēta jīvuḍē anni karmalu cēyucunnāḍu ani jīvuniyaṃdu ārōpiṃcabaḍinavaninnī, bhagavaṃtuḍē anni karmalu cēyucunnāḍaninnī - anni karmalu bhagavaṃtuniyaṃdē viḍicipeṭṭi (sanyasiṃci), ā karmalanu kēvalamu bhagavaṃtuni ārādhiṃcuṭa koṟakē anukoni, vāṭiphalamaṃdu āśalēka cēyucū, iṭlu cēyuṭavalana saṃtāpamu lēka uṃḍuṭayē karma sanyāsamu. dīni sārāṃśamēmanagā - tanayokka aṃśa ayina kartacēta, tana upakaraṇamulacē, tanayokka ārādhanyanu prayōjanamu koṟakē, parama puruṣuḍu ayina bhagavaṃtuḍu tanayokka panulanu cēyucunnāḍu).

  1. “karmaṇāṃ parityāgaḥ. (śrīśaṃkaraḥ)

(karmasanyāsamanagā karmalanu cēyakuṃḍuṭa - ē karmanu cēyaka evaḍunu uṃḍalēḍu - aṃducēta karmasanyāsamu anagā – cūḍumu - 1, 2).

  1. “brahma caryaṃ samāpya, gṛhībhūtvā, vānaprasthāśramētya vairāgyābhāvē (a)pi āśramakramānu sārēṇa ya ssanyasati sakarma sanyāsī”.

(muṃdu brahmacaryāśramamu navalaṃbhiṃci, tarvāta gṛhasthāśramamunu svīkariṃci anniṃṭiyaṃdu anurāgamunu vadalukoni - virāgiyai - ī prakāramugā āśramamulaku saṃbaṃdhiṃci karmalu kramamugā cēsi, tarvāta sanyasiṃcavalenu - aṭlu sanyasiṃcinavāḍu karmasanyāsi) haṭhāttugā karmasanyāsamu cēyakūḍadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.