← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మ karma

Original — తెలుగు
    1. కర్మ అనుమాట ‘కృ, కర్’ అను ధాతువునుండి కలిగినది. దీని అర్థము - పని, పనిచేయుట, చేయుట.

    2. క్రియతే ఇతి కర్మ, వ్యాపారమాత్రం. (చేయబడునది కర్మ; - వ్యాపారము; ఇంద్రియవ్యాపారము).

    3. వాగాదికం, (వాక్కు మొదలగునవి; అనగా మాటలాడుట, చూచుట; వినుట; నడచుట, తినుట, ఆలోచించుట మొదలగునవి ఇంద్రియములు చేయుపనులు - వ్యాపారము).

    4. మనోవాక్కాయైః యద్యత్ క్రియతే తత్సర్వం కర్మ –

(మనస్సుచేతను, వాక్కు చేతను, శరీరము చేతను, ఏది చేసినను అది అంతయు కర్మయే - అనగా, మనసులో ఆలోచించుట, నోటితో మాటలాడుట - శరీరముతో, శరీరావయవములతో ఏమి చేసినను అదంతయు కర్మయే).

  1. దేహేద్రియాది వ్యాపారః.

(దేహము, దాని ఇంద్రియములు మొదలగువాటి వ్యాపారములు - అవి చేయు పనులు).

  1. స్నాన, సంధ్యావందన, ఔపాసన, యజ్ఞాదిక్రియాః; అగ్నిహోత్రాది కర్మాణి -

(స్నానము, సంధ్యావందనము, ఔపాసన, యజ్ఞము మొదలగునవి).

  1. గర్భాదానము మొదలగు షోడశకర్మలు.

  2. పుణ్యా పుణ్యాత్మకం, పుణ్యపాపరూపం.

(చేసిన పని మంచిదైనను, చెడ్డదైనను - పుణ్యకర్మ అయినను పాపకర్మ అయినను).

  1. ఈప్సితతమం కర్తుః క్రియయా వ్యాప్యమానం. (కర్తయొక్క గాఢమైన కోరిక క్రియగా పరిణమించుట).

  2. జన్మ నిమిత్తం; జన్మ హేతుః -

(పుట్టుటకు కారణమైనది - చేసిన ప్రతికర్మకు ఫలముండును. ఆ ఫలముననుభవించుటకు స్థూల శరీరము కావలెను, జన్మించవలెను - అందుచేత కర్మ జన్మకు కారణము).

  1. “క్రియమాణేంద్రి యైః కర్మాణి అహం కరోమి ఇత్యధ్యాత్మనిష్టతయా కృతం కర్మైవ కర్మ” (నిరాలంబోపనిషత్)

(కర్మలు చేయునవి ఇంద్రియములు. వాటితో నేను కర్మ చేయుచున్నాను. అవి వాటి పనులు చేయుచున్నవి అని అధ్యాత్మనిష్టతో చేయుపనియ కర్మ).

  1. “సర్వేశ్వర పరితోషికంబేది యదీయ కర్మంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 2 - )

  2. “కర్మ ఈశ్వరస్య సృష్ట్యర్థం, తచ్చాపి ఇచ్ఛాద్య ముచ్యతే” (గీతాకల్పే)

(భగవంతుడు చేయు సృష్టికి పనికివచ్చునదే, ఉపకరించునదే - కర్మ - ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, ఆ శక్తులే స్పందనము, స్పందనమే కర్మ).

  1. “జగచ్చక్రి ప్రవృత్తి హేరుః కర్మ”.

(చక్రమువలె తిరుగుచుండు జగత్తునకు కారనమైనది కర్మ. జననమరణములు మరల మరల కలుగుటకు కారణమైనది).

  1. “కర్మ బ్రహ్మోద్భవం విద్ది” ఇతి ప్రకృతి పరిణామరూప శరీరోద్భవం కర్మ ఇత్యుక్తం భవతి.

(కర్మలు వేదలో చెప్పబడినవి. అవి చేయుటవలననే జగత్తు నడుచుచున్నవి. అందుచేత ప్రకృతియొక్క పరిణామమే అయిన శరీరమును కలిగించునది - శరీరమునకు కారణమైనది కర్మ).

  1. “స్వభావ సిద్ధ రాగద్వేషాదివశాత్ అనుష్టీయమానాస్తు చేష్టా, రూపాః, క్రియాః నకర్మాణి ఇత్యుచ్యంతే, ప్రవృత్తి నివృత్త్యర్థం వేదోక్తాః ఏవ క్రియాః కర్మాణి ఇత్యుచ్యంతే, నతు ఉదాసీన క్రియాః సర్వా అపి” (విచారసాగరము)

(స్వభావసిద్ధమైన రాగద్వేషాదులమూలముగా చేయబడుచున్న చేష్టారూపమైన క్రియలు కర్మలు అని చెప్పబడవు. ప్రవృత్తి నివృత్తిల నిమిత్తము వేదములో ఏ క్రియలు చెప్పబడినవో అవియే కర్మలు అని చెప్పబడుచున్నవి. ఉదాసీన క్రియలు ఏవియు కర్మలు అని చెప్పబడవు).

  1. “వేదోక్తమేవ కర్మ పరమేశ్వర ప్రీత్యర్థం నిష్కామసయా క్రియమాణం చిత్త శుద్ధి ద్వరా పరాత్మని పరానురక్తరూప పరభక్త్యుత్పాదన ద్వారా జ్ఞాన ప్రాప్తయే భవతీతి తారకమేవ తత్కర్మ ఇత్యర్థః”.

(పరమేశ్వరుని కటాక్షమును పొందే నిమిత్తము వేదములో చెప్పబడినప్రకారము కోరికలేక చేయబడినకర్మ చిత్త శుద్ధి ద్వారా పరమాత్మయందు గొప్ప అనురాగరూపమైన పరభక్తిని పుట్టించుటద్వారా జ్ఞానప్రాప్తికికారణమగును. అందుచేత అటువంటి కర్మ తారకము - అనగా, జననమరణములు ప్రవాహరూపముగా వచ్చు సంసారమను ఒక మహాసముద్రమును దాటింప చేయునది - తిరిగి జన్మ కలుగకుండ చేయునది - అట్టి కర్మయే కర్మ).

  1. “భూత భవోద్భవ కరో విసర్గః కర్మ సంజ్ఞితః”. (శ్రీమద్భగవద్గీత - 8 - 3)

(భూతముల భవము (పుట్టుక), ఉద్భవము (వృద్ధి) య జ్ఞ యాగాదులవలన కలుగును. అందుచేత శాస్త్రములో చెప్పిన యజ్ఞయాగాది కర్మలే కర్మయని చెప్పబడును - దేవతులనుద్దేశించు చేయునవి కనుక కర్మలు).

  1. కర్మ రెండు విధములు: -

    1. విహితకర్మ, నిషిద్ధకర్మ. విహితకర్మ అనగా శాస్త్రములో చేయవలసినదని చెప్పబడినకర్మ. నిషిద్ధమనగా శాస్త్రములో చేయకూడదని నిషేధించబడిన కర్మ. పురుషుని ప్రవృత్తి నిమిత్తము వేదము బోధించునది విహితకర్మ, నివృత్తి నిమిత్తము బోధించునది నిషిద్ధకర్మ.

    2. ఇష్టములు పూర్తములు. ఇష్టకర్మలనగా: -

శ్లో|| ’అగ్నిహోత్రం తపస్సత్యం వేదానాం చాను పాలనం |

ఆతిద్యం వైశ్య దేవంచ ఇష్టమిత్యభిధీయతే ||.

(అగ్నిహోత్రము, తపస్సు, సత్యము, వేదాధ్యయనము, అతిధిపూజ, వైశ్వదేవము - ఇవి ఇష్ట కర్మలు) - పూర్తములనగా: -

“వాపీ కూప తటాకాది దేతాయ తనాని చ |

అన్న ప్రదానమారామః పూర్త మిత్యభిధీయతే ||“.

(బావులు, చెరువులు మొదలగు వాటిని త్రవించుట దేవాలయములు కట్టించుట, అన్నదానము, వనములు వేయుట).

  1. కామ్యకర్మలు, నిష్కామకర్మలు. (కోరికతో చేయుకర్మలు, కోరిక లేక చేయుకర్మలు).

  2. ద్వివిధం హి కర్మ - శుద్ధ మశుద్ధం, శుభమశుభం చ తత్రవేదోక్తం కర్మ శుభం తారకం, వేదానుక్తంతు కర్మ అశుభం, నరకాదిప్రదం. వేదస్య సర్వమూల ప్రకృతి ప్రణీతత్వేన తస్మిన్ భ్రాంతి వాక్య త్వా భావాత్ ఇతరేషాం శాస్త్రాణాం తు అసర్వజ్ఞా జ్ఞాన విశిష్ట కర్తృ ప్రణీతత్వేన తేషాం భ్రాంతవాక్యత్వాత్ ఇతి భావః ఫలరహితా, సంకల్పరహితా దేవ ప్రీత్యర్థం సేవాకర్మ నిర్మూలనం యావత్కర్మా భావః, తద్రూపా తస్య కర్త్రీ చిత్తశుద్ధిదాయినీ త్యర్థః నిష్కామనయా క్రియామాణం చిత్తశుద్ధి ద్వారా పరాత్మని పరానురక్తి రూప పరభక్త్యుత్పాదన ద్వారా జ్ఞానప్రాప్తయే భవతీతి తారకమేవ తత్కర్మ ఇత్యర్థః.

(కర్మ రెండువిధములు: - శుద్ధము, అశుద్ధము, శుభము, అశుభము అని. అందులో వేదమందు చెప్పబడినకర్మ శుభము, తారకమున్నూ (తరింప చేయునది).. వేదములో చెప్పబడనికర్మ అశుభమున్నూ, నరక ము మొదలగువాటిని కలుగచేయునదిన్నీ. వేదము మూల ప్రకృతి ప్రణీతమగుటవల్లను, అందులో భ్రాంతి వాక్యములు, సందేహాస్పదమైనవాక్కులు లేకపోవుటచేతను, ఇతరశాస్త్రములు సర్వజ్ఞులు కానివారు అజ్ఞానులు అయినవారిచే చెప్పబడియుండుటచేతను వాటిలో భ్రాంతి వాక్కు ఉండుటచేతను ఈ ప్రకారము చెప్పబడినది.

  1. కర్మ లౌకికమని, వైదికమని రెండు విధములు: - జీవించియుండుటకు కారణమైన కర్మలు లౌకికము, వైదిక కర్మ శ్రౌతమని, (శ్రుతులకు సంబంధించినవి)., స్మార్తమని (స్మృతులలో చెప్పబడినవి) రెండువిధములు. నిత్యనైమిత్తిక కర్మలు స్మార్త కర్మలు.
  1. కర్మ మూడు విధములు -

    1. మనో వాక్కాయములచేత చేయబడినది - మనసులో ఆలోచించునది, నోటితో మాటలాడునది, శరీరముతో - శరీరావయవములతో చేయునది అని కర్మ మూడు విధములు.

    2. సంచితము, ఆగామీ, ప్రారబ్దము అని మూడు విధములు - “ఆగమ్యాది భేదేన కర్మాణి త్రివిధాని - వర్తమాన దేహానుష్టిత శుభా శుభాత్మకం కర్మ ఆగామీ త్యుచ్యతే. కేవల శాస్త్ర జన్య జ్ఞానేన తత్ స్థూలాంశనివృత్యా తత్రా శ్లేషోజాయతే తద్యదా పుష్కరపలాశౌ ఆపో న శ్లిష్యంతే ఏవ మేవం విధ పాపకర్మ నశ్లిష్యతే.” ఇతి శ్రుతేః - అనంతకోటి జన్మో పాదాన భూతం సంచితం కర్మ. తద్విజ్ఞానేన ఆగామి సంచితార్థా శోవినశ్యతి. స్థూలదేహారంభకత్వేన యావద్దేహ భావి ప్రారబ్దకర్మతత్ జ్ఞాన విజ్ఞానాభ్యాం న నశ్యతి. తస్య ప్రవృత్త ఫలత్వే నానుభవ నాశ్యత్వాత్. యది సమ్యక్ జ్ఞానం జాయతే తదా ఆగమ్యాది కర్మత్రయ స్థూలాదిభాగత్రయం ఖీయతే. తత్వజ్ఞానం చేత్ తదర్ధ మాత్రాంశోపి నిశ్శేషం క్షీయతే. ఇత్థంవ్యవిద్ధ హృదయ గ్రంధి. సంసయ జాలస్య అస్య తత్వజ్ఞానినః ఆగామి సంచితారబ్ద కర్మాణ్యపి నిశ్శేషం క్షీయంతే“.

(ఆగామి, సంచితము, ప్రారబ్దము అని కర్మ మూడు విధములు. ఇప్పుడున్న దేహముతో చేసిన శుభాశుభకర్మ - పాపకర్మ, పుణ్యకర్మ - ఆగామి - - - అనంతకోటి జన్మలలో ఉపాదానమైన కర్మ - అనంతకోటి జన్మలకు కారణమైన కర్మ సంచితము - ఫలము కూడబెట్టుకున్నది. జ్ఞానము వలన ఆగామి కర్మ, సంచితకర్మ నశించును. ఇప్పటి స్థూలదేహము కల్పించి ఫలము ననుభవింపచేయుటకు ప్రారంభించినకర్మ జ్ఞాన విజ్ఞానములవలన నశింపదు. అది ఫలమినిచ్చుటకు ఆరంభించినది కనుక నశింపదు. సమ్యక్ జ్ఞానం కలిగినపుడు ఆగామి, సంచితము, ప్రారబ్దము అను మూడు విధముల కర్మయొక్క స్థూలభాగము నశించును. తత్వజ్ఞానము కలిగినయడల మిగిలినదికూడ పూర్తిగా నశించును - ఈ ప్రకారము హృదయగ్రంధిలో సంశయములుగల తత్వజ్ఞానియొక్క ఆగామి సంచితారబ్దకర్మలు నిశ్శేషముగా క్షీణించి పోవును).

  1. సాత్వికకర్మ, రాజసకర్మ, తామసకర్మ అని మూడు విధములు. (చూడుము - శ్రీమద్భగవద్గీత - 18 - 23 to 25)

(వీటిని వేరు వేరుగా చూడుము).

  1. “కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః |

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 17)

“కర్మా కర్మ వికర్మ మర్మ సుధియా బోద్ధవ్యమేవాదితః |

కర్మస్యా ద్విధి పూర్వకంతు మనసా సర్వేంద్రియవ్యాపృతిః |

తద్ద్వేధాస ఫలం ఫలేన రహితం త్వాద్యం వికర్మస్మృతం |

బందాదన్యద కర్మ శుద్ధి కరణాన్నైష్కర్మ్యతా మాగతం ||“.

(కర్మ, అకర్మ, వికర్మల మర్మము - అంతరార్థము - బుద్ధిమంతులు ముందుగానే తెలుసుకోవలెను - కర్మ అనగా శాస్త్రములో చెప్పిన ప్రకారము మనసార సర్వేంద్రియములచేత చేయుపని, వాటి వ్యాపారము. అది రెండువిధములు, ఫలముతో కూడియున్నవి, ఫలము లేనివి, అందులో మొదటిది బంధము కలిగించునదగుటచేత వికర్మ అని చెప్పబడుచున్నది. రెండవది అకర్మ - శుద్ధి చేయునదగుటవలన నైష్కర్మ్యము -).

  1. కర్మలు నాలుగు విధములు: -

    1. పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యము పాపము కలిసిన కర్మలు, పుణ్యము పాపము లేనికర్మలు.
  2. కర్మలు అయిదు విధములు: -

“ఉత్షేపణం తతో అవక్షేపణం; ఆకుంచినం తథా |

ప్రసారణంచ గమనం కర్మాణ్యేతాని పంచ చ ||“. (బాషా పరిచ్ఛేదము)

  1. కర్మలు చేయవలయునని శాస్త్రములు చెప్పుచున్నవి - ఎందుచేతననగా: -

    1. పుట్టిన ప్రతిజీవి, యావజ్జీవము, ప్రతిక్షణము ఏదో ఒక కర్మ చేయుచునే యుండును.

“నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ |

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 5)

“యతః కశ్చిదపి ప్రాణీ క్షణం వాపి కదాచన |

తిష్టతీహ వినాకర్మ వాతః శుద్ధిమృతే(అ)క్రియః |

యతో అశుద్ధమనాః సర్వో రజస్సత్వతమో గుణైః |

స్వభావప్రభ వైర్వాపి రాగద్వేషాది భిర్గుణైః |

అస్వతంత్రో అఖిలం కర్మ వైదికం లౌకికం బలాత్ |

కార్యతే (అ)తో వినా శుద్ధిం న సన్యాసోపి సంభవేత్ ||“. (గీతాభావప్రకాశము - 3 - 52 to 54)

(ఏ ప్రాణి అయినను ఎప్పుడును క్షణమైనను ఏ కర్మయును చేయక ఉండడు. చిత్తశుద్ధిలేనివాడు అక్రియుడు కానేరడు. అందుచేత చిత్తశుద్ధిలేనివారందరు రజస్సత్వతమోగుణములను మూడింటిచేతను స్వభావము వలన కలిగిన రాగద్వేషములు మొదలగు గుణములచేతను బద్ధుడై స్వతంత్రముగా పని చేయుటకు శక్తిలేనివాడై సమస్తమైన వైదికకర్మలు, లౌకిక కర్మలను చేయును. మనుజుడు చేయుకర్మ పుణ్యమైనదని, పాపమైనదనిగాని తెలిసినప్పటికీ, అవి చేయుట ఇష్టము లేనప్పటికీ ఆ పని చేయును. అందుచేత స్వతంత్రుడుకాడు, తన స్వభావముచేతనే చేయును. తన స్వభావము సత్వరజస్తమోగుణముల కలియకను బట్టి కలుగును. అది పూర్వజన్మలలో తాను చేసిన కర్మములబట్టి వాటియొక్క ఫలములను అనుభవించుటకు అవకాశము కలుగచేయురీతిగా నుండును - “ఒక్క నరుండు నొకక్షణంబును గర్మంబు సేయకుండువాడు. పూర్వ సంస్కారంబులంగల గుణంబులచేత బురుషుండవశుండు గావున బలిమి గర్మంబు సేయింపబడుచుండు” – (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - )

  1. “నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయోహ్య కర్మణః |

శరీరయాత్రాపి చ తే స ప్రసిద్ధ్యేదకర్మణః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 9)

(కర్మ చేయకయుండుటకంటె కర్మ చేయుటయే మేలు. అందుచేత శాస్త్రములో చేయవలసినదని చెప్పబడిన కర్మ - శ్రౌతకర్మ - లౌకిక కర్మ - నిత్యము చేయవలయును - స్వధర్మమును చేయకుండుటచేత శరీరయాత్ర సిద్ధింపదు - జీవితము గడుచుట కష్టము).

  1. “తస్మాన్ముముక్షి భిర్కార్యమాత్మా జ్ఞానాభిలాషిభిః |

నిత్యం నైమిత్తికం కర్మ సదైవాత్మ శుద్ధయే ||“. (నైష్కర్మ్యసిద్ధి - 150)

(ఆత్మజ్ఞానము నభిలషించువారు ఆత్మశుద్ధి కొరకు, చిత్తశుద్ధికొరకు ఎల్లపుడూ నిత్య నైమిత్తిక కర్మలు చేయవలయును -) (చిత్తశుద్ధిద్వారా బ్రహ్మజ్ఞానము, తద్ద్వారా ముక్తి కలుగును).

  1. “ధీ శుద్ధి హేతుకం కర్మ న త్యాజ్యం” (గీతాభావప్రకాశము - 5 - 65)

(చిత్త శుద్ధికికారణమైన కర్మను - చిత్తశుద్ధిని కలిగించుకర్మను మానరాదు).

  1. “జ్యోతిష్టోమేవ స్వర్గకామో యజేత”

(స్వర్గమునుకోరువాడు జ్యోతిష్టోమమను యజ్ఞమును చేయవలయును).

  1. “క్రియలుమాన దగదు గృహ గతునికి”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 463)

(గృహస్థాశ్రములో నున్నవాడు కర్మలు చేయవలెను).

  1. “కుర్వన్నే దేహ కర్మాణి జి జీవిషేచ్ఛతం సమాః” (ఈశావాశ్యోపనిషత్)

(ఈ లోకములో పురుషుడు తాను కర్మలు చేయుచునే నూరు సంవత్సరములు జీవించియుండును).

  1. “అకుర్వన్ విహితం కర్మ నిందితం చ సమాచరన్ |

ప్రసజ్జం శ్చేంద్రియార్థేషు నరః పతనమృచ్ఛతి”

ఇతి మనుః.

(శాస్త్రములో ఈ పనులు చేయవలెను అని విధించబడిన కర్మలు చేయక, నిందిత కర్మలను చేయుటవలనను, ఇంద్రియార్థములైన విషయములను అనుభవించుటయందు మునిగియుండువాడు పతితుడగును, భ్రష్టుడగును).

  1. “యావజ్జీవ మగ్నిహోత్రం జుహోతి”.

(జీవించియున్నంతకాలము అగ్నిహోత్రిక్రియ చేయవలసినదే).

  1. “కర్మణైవ హి సంసిద్ధిమాస్థితాః జనకాదయః” - (శ్రీమద్భగవద్ఘీత - 3 - 20)

(రాజ ఋషి అయిన జనకమహారాజు మొదలగువారు కర్మలు చేసి సిద్ధిని పొందిరి).

  1. “సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః”. (శ్రీమద్భగవద్గీత - 3 - 10)

(యజ్ఞము చేయుటవలా అపూర్వను శక్తి కలిగి మేఘములుగా మారి వర్షించును. వర్షమువలన సస్యములు పండును - అందుచేత యజ్ఞకర్మ చేయించవలసినదే).

  1. కర్మచేసిన అది బంధము కలుగచేయును - అనగా, దాని ఫలముననుభవింపచేయును - (Every action has a reaction). అందుచేత కర్మ చేయకూడదని శాస్త్రములు చెప్పుచున్నవి -

    1. “కర్మణా బద్ధ్యతే జంతుః విద్యయా (అ) మృతమశ్నుతే తస్మాత్ కర్మ నకుర్వంతి యతయః పారదర్శనః ||”.

(జీవులు కర్మలు చేసినయడల అవి వారిని బంధించును. ఆ కర్మల ఫలమనుభవించుటకు మరల మరల జన్మించెదరు, సంసారములో పడుదురు. ఈ కారణమువలన బ్రహ్మజ్ఞానము కలిగినయడల మోక్షమునొందుదురు. ఈ కారణమువలన తత్త్వము తెలిసిన యతులు కర్మలు చేయరు).

  1. “కర్మంబులు గోరక చేయవలయును, కోరి చేసిన దుఃఖంబులు ప్రాప్తించు” (శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 7 - 7 - 241)

  2. “శరీరంబు గర్మమూలంబగుటవలన గర్మంబులు సేయ జనదు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 -1 -

  3. “కర్మంబులు బంధకంబులునుంగాని సౌఖ్యదాయకంబులై పాపనివృత్తి చేయనోపవు.”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 181)

  1. క. “కర్మమున బుట్టు జంతువు

కర్మమున వృద్ధిబొందు కర్మమున జెడున్

కర్మమె జనులకు దేవత

కర్మమె సుఖదుఃఖములకు కారణమనఘా ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. - భా. - 886)

  1. కర్మలు సాధారణముగా బంధము కలుగచేయునవి అయినను కొన్ని విధములైన కర్మలు బంధించవు - అవి ఏవి అనగా : -

    1. “యోగస్థః కురుకర్మాణి సంగంత్యక్త్వా ధనంజయ” (శ్రీమద్భగవద్గీత - 2 - 48)

“యోగస్థః సన్ ఫలే కామం కర్తృత్వాభిమతిం తథా |

త్యక్త్వా త్వం కురుకర్మాణి కృష్ణార్పణధియా సదా ||“. (గీతాభావప్రకాశం - 2 - 504 - 506)

(కర్మఫలమాసించక, తనే కర్మ చేయుచున్నాను అను అభిమానము వదలి భగవదర్పణ చేయుచు కర్మలు చేయవలెను).

    1. కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్యా మనీషిణః |

జన్మ బంధ వినుర్ముక్తాః పదం గచ్చం త్యనా మయం ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 51)

(చేసిన కర్మలకు ఫలము సిద్ధించునా లేదా అను ఆలోచన, ఫలము సిద్ధించినను సిద్ధించకపోయినను ఒకేవిధముగాయుండుట అను యోగము నవలంబించి కర్మలు చేసిన జన్మ బంధము వదలిపోయి - తిరిగి జన్మించనక్కర్లేక - అనామయమైన పదమును బుద్ధిమంతులు - జ్ఞానులు యోగులు పొందుదురు).

  1. “త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |

కర్మణ్యభి ప్రవృత్తో పి నైవకించిత్కరోతి సః |

నిరాశీర్యత చిత్తత్మా త్యక్త సర్వ పరిగ్రహః |

శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషం ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 20, 21)

(కర్మ ఫలమందాశలేక ఎల్లపుడు తృప్తుడైయుండి దేనిని ఆశ్రయించనివాడై ఏ కర్మలు చేసినను చేయనట్లే యగును. దేనియందైనను ఏ విధమైన ఆశలేనివాడు, ఎల్లపుడు తృప్తుడై యుండువాడు. దేనిని ఆశ్రయించనివాడు - ఇట్టివాడు ఏ కర్మలు చేసినను చేయనట్లే యగును. మనసును తనస్వాధీనములో నుంచుకొనినవాడు, దేనిని పరిగ్రహింపనివాడు, శరీరమును నిలబెట్టుకొనుటకు ఏ విధమైన కర్మలు చేసినను ఆ కర్మలవలన దోషమును పొందడు - ఆ కర్మలు అతనిని బంధించవు).

    1. “కర్మంబులు సంసారహేతుకంబులయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ము జెఱిపి కొననోపియుండు

(శ్రీమదాంధ్రమహాభాగవతము -1 – 5 – 73)

  1. “కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా త్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యత్సకలం పరస్మైనారాయణా యేతి సమర్పయామి ||“.

(శరీరముచేతగాని, వాక్కుచేతగాని, మనస్సుచేతగాని, ఇంద్రియములచేతగాని, బుద్ధిచేతగాని, స్వభావము చేతగాని యేకర్మ చేసినను అదంతయు శ్రీమన్నారాయుణుని కొఱకే సమర్పించుచున్నాను). “ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు తాపత్రయంబు మాన్ప నౌషధంబగు”.

  1. “యః అతత్వవిత్ ప్రవృత్తశ్చ కర్మయోగే కర్మ బ్రహ్మణి ఈశ్వరే, ఆధాయ నిక్షిప్య తదర్థం కర్మ కరోమి”

ఇతి భృత్య ఇవస్వామ్యర్థం సర్వాణి కర్మాణి మోక్షే అపి ఫలే సంగత్యక్త్వా కరోతి సః పాపేన న లిప్యతే – యధా పద్మపత్రం ఇవ అంభసా ఉదకేన కేవలం సత్వశుద్ధి మాత్రం ఏవ ఫలం తస్య తత్కర్మణః |” (శ్రీశంకరః)

(ఆత్మ తత్వము తెలియనివాడు కర్మయోగమందు ప్రవృత్తుడైనవాడు తాను చేయుకర్మ పరమాత్మయందు సమర్పించి, యజమానికొఱకు కర్మచేయు సేవకునివలె భగవంతునికొఱకు నేనీకర్మ చేయుచున్నాను అను అభిప్రాయముతో సమస్తమైన కర్మలను, వాటి ఫలమందాసక్తి లేక, మోక్షఫలమందైనను ఆసక్తిలేక చేయునో, అట్టి వానికి పాపము అంటదు, ఆ కర్మఫలము అంటదు - తామరాకు నీటిపైనున్నను దానికి నీరు అంటనట్లే -అట్టివానికి ఆ కర్మఫలము సత్వశుద్ధికొఱకే యగును).

  1. “యథై ధాంసి సమిద్ధో అగ్నిర్భస్మసాత్కురుతే (అ)ర్జున |

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మ సాత్కురుతే తథా“. (శ్రీమద్భగవద్గీత - 4 - 37)

“యథా ఏథాంసి కాష్టాని సమిద్ధః అగ్నిః - దీపతాగ్నిః భస్మీభావం కరోతి, తథా జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మ సాత్ కురుతే - నిర్బీజం కరో తీత్యర్థః - నహి సాక్షాదేవ జ్ఞానాగ్నిః కర్మాణి ఇంధనవత్ భస్మీకర్తుం శక్నోతి. తస్మాత్ సమ్యక్ దర్శనం సర్వ కర్మణాం నిర్బీజత్వే కారణం ఇత్యభిప్రాయః, సామర్థ్యాత్ యేన కర్మణా శరీరం ఆరబ్దం తత్ ప్రవృత్త ఫలత్వాత్ ఉపభోగేనైవ క్షీయతే -”తస్య తాన దేవ చిరం యావన్న విమోక్ష్యే అధ్య సం త్స్యే” ఇతి శ్రుతేః - అతోయాని అప్రవృత్త ఫలాని జ్ఞానోత్పత్తేః ప్రాక్ కృతాని జ్ఞానసహభావని వా అతీతానేక జన్మ కృతానిచ | త్యాన్యేవ సర్వాణి భస్మ సాత్కురుతే ||“. (శ్రీశంకరః)

(దీప్తిమంతమైన అగ్ని - మండుతూ ఉన్న అగ్ని కట్టెలను ఏ విధముగా భస్మము చేయునో ఆప్రకారముగానే జ్ఞానమనే అగ్ని -, బ్రహ్మజ్ఞానమనే అగ్ని - సమస్తమైన కర్మలను భస్మము చేయును - ఆ కర్మలకు సంబంధించిన బీజమైనను మిగలకుండునట్లు చేయును - ఇట్లు చెప్పుటచేత కట్టెలను అగ్ని కాల్చివేసి బూడిదగా చేసినట్లు జ్ఞానాగ్ని నిజముగ అన్ని కర్మలను బూడిదగ చేయలేదు. ఏ కర్మ కారణముగా ప్రస్తుత శరీరము ప్రారంభింపబడినదో (ప్రారబ్ద కర్మ) ఆ కర్మ దాని కర్మనిచ్చుటకు ప్రారంభించినది కనుక ఆ కర్మఫలము అనుభవించుటచేతనే తీరును - క్షీణించును - అందుచేత ఏ కర్మలు ఫలమునిచ్చుటకు ప్రారంభించలేదో అనేక జన్మలలో చేసిన అటువంటి కర్మలు, బ్రహ్మజ్ఞానము కలుగకముందు చేసినవి - ఇవియే బ్రహ్మజ్ఞానమువలన నశించును. ప్రారబ్దకర్మలు అనుభవమువలననే క్షీణించి నశించును).

Transliteration
    1. karma anumāṭa ‘kṛ, kar’ anu dhātuvunuṃḍi kaliginadi. dīni arthamu - pani, panicēyuṭa, cēyuṭa.

    2. kriyatē iti karma, vyāpāramātraṃ. (cēyabaḍunadi karma; - vyāpāramu; iṃdriyavyāpāramu).

    3. vāgādikaṃ, (vākku modalagunavi; anagā māṭalāḍuṭa, cūcuṭa; vinuṭa; naḍacuṭa, tinuṭa, ālōciṃcuṭa modalagunavi iṃdriyamulu cēyupanulu - vyāpāramu).

    4. manōvākkāyaiḥ yadyat kriyatē tatsarvaṃ karma –

(manassucētanu, vākku cētanu, śarīramu cētanu, ēdi cēsinanu adi aṃtayu karmayē - anagā, manasulō ālōciṃcuṭa, nōṭitō māṭalāḍuṭa - śarīramutō, śarīrāvayavamulatō ēmi cēsinanu adaṃtayu karmayē).

  1. dēhēdriyādi vyāpāraḥ.

(dēhamu, dāni iṃdriyamulu modalaguvāṭi vyāpāramulu - avi cēyu panulu).

  1. snāna, saṃdhyāvaṃdana, aupāsana, yajñādikriyāḥ; agnihōtrādi karmāṇi -

(snānamu, saṃdhyāvaṃdanamu, aupāsana, yajñamu modalagunavi).

  1. garbhādānamu modalagu ṣōḍaśakarmalu.

  2. puṇyā puṇyātmakaṃ, puṇyapāparūpaṃ.

(cēsina pani maṃcidainanu, ceḍḍadainanu - puṇyakarma ayinanu pāpakarma ayinanu).

  1. īpsitatamaṃ kartuḥ kriyayā vyāpyamānaṃ. (kartayokka gāḍhamaina kōrika kriyagā pariṇamiṃcuṭa).

  2. janma nimittaṃ; janma hētuḥ -

(puṭṭuṭaku kāraṇamainadi - cēsina pratikarmaku phalamuṃḍunu. ā phalamunanubhaviṃcuṭaku sthūla śarīramu kāvalenu, janmiṃcavalenu - aṃducēta karma janmaku kāraṇamu).

  1. “kriyamāṇēṃdri yaiḥ karmāṇi ahaṃ karōmi ityadhyātmaniṣṭatayā kṛtaṃ karmaiva karma” (nirālaṃbōpaniṣat)

(karmalu cēyunavi iṃdriyamulu. vāṭitō nēnu karma cēyucunnānu. avi vāṭi panulu cēyucunnavi ani adhyātmaniṣṭatō cēyupaniya karma).

  1. “sarvēśvara paritōṣikaṃbēdi yadīya karmaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 2 - )

  2. “karma īśvarasya sṛṣṭyarthaṃ, taccāpi icchādya mucyatē” (gītākalpē)

(bhagavaṃtuḍu cēyu sṛṣṭiki panikivaccunadē, upakariṃcunadē - karma - icchā, jñāna, kriyāśaktulu, ā śaktulē spaṃdanamu, spaṃdanamē karma).

  1. “jagaccakri pravṛtti hēruḥ karma”.

(cakramuvale tirugucuṃḍu jagattunaku kāranamainadi karma. jananamaraṇamulu marala marala kaluguṭaku kāraṇamainadi).

  1. “karma brahmōdbhavaṃ viddi” iti prakṛti pariṇāmarūpa śarīrōdbhavaṃ karma ityuktaṃ bhavati.

(karmalu vēdalō ceppabaḍinavi. avi cēyuṭavalananē jagattu naḍucucunnavi. aṃducēta prakṛtiyokka pariṇāmamē ayina śarīramunu kaligiṃcunadi - śarīramunaku kāraṇamainadi karma).

  1. “svabhāva siddha rāgadvēṣādivaśāt anuṣṭīyamānāstu cēṣṭā, rūpāḥ, kriyāḥ nakarmāṇi ityucyaṃtē, pravṛtti nivṛttyarthaṃ vēdōktāḥ ēva kriyāḥ karmāṇi ityucyaṃtē, natu udāsīna kriyāḥ sarvā api” (vicārasāgaramu)

(svabhāvasiddhamaina rāgadvēṣādulamūlamugā cēyabaḍucunna cēṣṭārūpamaina kriyalu karmalu ani ceppabaḍavu. pravṛtti nivṛttila nimittamu vēdamulō ē kriyalu ceppabaḍinavō aviyē karmalu ani ceppabaḍucunnavi. udāsīna kriyalu ēviyu karmalu ani ceppabaḍavu).

  1. “vēdōktamēva karma paramēśvara prītyarthaṃ niṣkāmasayā kriyamāṇaṃ citta śuddhi dvarā parātmani parānuraktarūpa parabhaktyutpādana dvārā jñāna prāptayē bhavatīti tārakamēva tatkarma ityarthaḥ”.

(paramēśvaruni kaṭākṣamunu poṃdē nimittamu vēdamulō ceppabaḍinaprakāramu kōrikalēka cēyabaḍinakarma citta śuddhi dvārā paramātmayaṃdu goppa anurāgarūpamaina parabhaktini puṭṭiṃcuṭadvārā jñānaprāptikikāraṇamagunu. aṃducēta aṭuvaṃṭi karma tārakamu - anagā, jananamaraṇamulu pravāharūpamugā vaccu saṃsāramanu oka mahāsamudramunu dāṭiṃpa cēyunadi - tirigi janma kalugakuṃḍa cēyunadi - aṭṭi karmayē karma).

  1. “bhūta bhavōdbhava karō visargaḥ karma saṃjñitaḥ”. (śrīmadbhagavadgīta - 8 - 3)

(bhūtamula bhavamu (puṭṭuka), udbhavamu (vṛddhi) ya jña yāgādulavalana kalugunu. aṃducēta śāstramulō ceppina yajñayāgādi karmalē karmayani ceppabaḍunu - dēvatulanuddēśiṃcu cēyunavi kanuka karmalu).

  1. karma reṃḍu vidhamulu: -

    1. vihitakarma, niṣiddhakarma. vihitakarma anagā śāstramulō cēyavalasinadani ceppabaḍinakarma. niṣiddhamanagā śāstramulō cēyakūḍadani niṣēdhiṃcabaḍina karma. puruṣuni pravṛtti nimittamu vēdamu bōdhiṃcunadi vihitakarma, nivṛtti nimittamu bōdhiṃcunadi niṣiddhakarma.

    2. iṣṭamulu pūrtamulu. iṣṭakarmalanagā: -

ślō|| ’agnihōtraṃ tapassatyaṃ vēdānāṃ cānu pālanaṃ |

ātidyaṃ vaiśya dēvaṃca iṣṭamityabhidhīyatē ||.

(agnihōtramu, tapassu, satyamu, vēdādhyayanamu, atidhipūja, vaiśvadēvamu - ivi iṣṭa karmalu) - pūrtamulanagā: -

“vāpī kūpa taṭākādi dētāya tanāni ca |

anna pradānamārāmaḥ pūrta mityabhidhīyatē ||“.

(bāvulu, ceruvulu modalagu vāṭini traviṃcuṭa dēvālayamulu kaṭṭiṃcuṭa, annadānamu, vanamulu vēyuṭa).

  1. kāmyakarmalu, niṣkāmakarmalu. (kōrikatō cēyukarmalu, kōrika lēka cēyukarmalu).

  2. dvividhaṃ hi karma - śuddha maśuddhaṃ, śubhamaśubhaṃ ca tatravēdōktaṃ karma śubhaṃ tārakaṃ, vēdānuktaṃtu karma aśubhaṃ, narakādipradaṃ. vēdasya sarvamūla prakṛti praṇītatvēna tasmin bhrāṃti vākya tvā bhāvāt itarēṣāṃ śāstrāṇāṃ tu asarvajñā jñāna viśiṣṭa kartṛ praṇītatvēna tēṣāṃ bhrāṃtavākyatvāt iti bhāvaḥ phalarahitā, saṃkalparahitā dēva prītyarthaṃ sēvākarma nirmūlanaṃ yāvatkarmā bhāvaḥ, tadrūpā tasya kartrī cittaśuddhidāyinī tyarthaḥ niṣkāmanayā kriyāmāṇaṃ cittaśuddhi dvārā parātmani parānurakti rūpa parabhaktyutpādana dvārā jñānaprāptayē bhavatīti tārakamēva tatkarma ityarthaḥ.

(karma reṃḍuvidhamulu: - śuddhamu, aśuddhamu, śubhamu, aśubhamu ani. aṃdulō vēdamaṃdu ceppabaḍinakarma śubhamu, tārakamunnū (tariṃpa cēyunadi).. vēdamulō ceppabaḍanikarma aśubhamunnū, naraka mu modalaguvāṭini kalugacēyunadinnī. vēdamu mūla prakṛti praṇītamaguṭavallanu, aṃdulō bhrāṃti vākyamulu, saṃdēhāspadamainavākkulu lēkapōvuṭacētanu, itaraśāstramulu sarvajñulu kānivāru ajñānulu ayinavāricē ceppabaḍiyuṃḍuṭacētanu vāṭilō bhrāṃti vākku uṃḍuṭacētanu ī prakāramu ceppabaḍinadi.

  1. karma laukikamani, vaidikamani reṃḍu vidhamulu: - jīviṃciyuṃḍuṭaku kāraṇamaina karmalu laukikamu, vaidika karma śrautamani, (śrutulaku saṃbaṃdhiṃcinavi)., smārtamani (smṛtulalō ceppabaḍinavi) reṃḍuvidhamulu. nityanaimittika karmalu smārta karmalu.
  1. karma mūḍu vidhamulu -

    1. manō vākkāyamulacēta cēyabaḍinadi - manasulō ālōciṃcunadi, nōṭitō māṭalāḍunadi, śarīramutō - śarīrāvayavamulatō cēyunadi ani karma mūḍu vidhamulu.

    2. saṃcitamu, āgāmī, prārabdamu ani mūḍu vidhamulu - “āgamyādi bhēdēna karmāṇi trividhāni - vartamāna dēhānuṣṭita śubhā śubhātmakaṃ karma āgāmī tyucyatē. kēvala śāstra janya jñānēna tat sthūlāṃśanivṛtyā tatrā ślēṣōjāyatē tadyadā puṣkarapalāśau āpō na śliṣyaṃtē ēva mēvaṃ vidha pāpakarma naśliṣyatē.” iti śrutēḥ - anaṃtakōṭi janmō pādāna bhūtaṃ saṃcitaṃ karma. tadvijñānēna āgāmi saṃcitārthā śōvinaśyati. sthūladēhāraṃbhakatvēna yāvaddēha bhāvi prārabdakarmatat jñāna vijñānābhyāṃ na naśyati. tasya pravṛtta phalatvē nānubhava nāśyatvāt. yadi samyak jñānaṃ jāyatē tadā āgamyādi karmatraya sthūlādibhāgatrayaṃ khīyatē. tatvajñānaṃ cēt tadardha mātrāṃśōpi niśśēṣaṃ kṣīyatē. itthaṃvyaviddha hṛdaya graṃdhi. saṃsaya jālasya asya tatvajñāninaḥ āgāmi saṃcitārabda karmāṇyapi niśśēṣaṃ kṣīyaṃtē”.

(āgāmi, saṃcitamu, prārabdamu ani karma mūḍu vidhamulu. ippuḍunna dēhamutō cēsina śubhāśubhakarma - pāpakarma, puṇyakarma - āgāmi - - - anaṃtakōṭi janmalalō upādānamaina karma - anaṃtakōṭi janmalaku kāraṇamaina karma saṃcitamu - phalamu kūḍabeṭṭukunnadi. jñānamu valana āgāmi karma, saṃcitakarma naśiṃcunu. ippaṭi sthūladēhamu kalpiṃci phalamu nanubhaviṃpacēyuṭaku prāraṃbhiṃcinakarma jñāna vijñānamulavalana naśiṃpadu. adi phalaminiccuṭaku āraṃbhiṃcinadi kanuka naśiṃpadu. samyak jñānaṃ kaliginapuḍu āgāmi, saṃcitamu, prārabdamu anu mūḍu vidhamula karmayokka sthūlabhāgamu naśiṃcunu. tatvajñānamu kaliginayaḍala migilinadikūḍa pūrtigā naśiṃcunu - ī prakāramu hṛdayagraṃdhilō saṃśayamulugala tatvajñāniyokka āgāmi saṃcitārabdakarmalu niśśēṣamugā kṣīṇiṃci pōvunu).

  1. sātvikakarma, rājasakarma, tāmasakarma ani mūḍu vidhamulu. (cūḍumu - śrīmadbhagavadgīta - 18 - 23 to 25)

(vīṭini vēru vērugā cūḍumu).

  1. “karmaṇōhyapi bōddhavyaṃ, bōddhavyaṃ ca vikarmaṇaḥ |

akarmaṇaśca bōddhavyaṃ gahanā karmaṇō gatiḥ ||” (śrīmadbhagavadgīta - 4 - 17)

“karmā karma vikarma marma sudhiyā bōddhavyamēvāditaḥ |

karmasyā dvidhi pūrvakaṃtu manasā sarvēṃdriyavyāpṛtiḥ |

taddvēdhāsa phalaṃ phalēna rahitaṃ tvādyaṃ vikarmasmṛtaṃ |

baṃdādanyada karma śuddhi karaṇānnaiṣkarmyatā māgataṃ ||“.

(karma, akarma, vikarmala marmamu - aṃtarārthamu - buddhimaṃtulu muṃdugānē telusukōvalenu - karma anagā śāstramulō ceppina prakāramu manasāra sarvēṃdriyamulacēta cēyupani, vāṭi vyāpāramu. adi reṃḍuvidhamulu, phalamutō kūḍiyunnavi, phalamu lēnivi, aṃdulō modaṭidi baṃdhamu kaligiṃcunadaguṭacēta vikarma ani ceppabaḍucunnadi. reṃḍavadi akarma - śuddhi cēyunadaguṭavalana naiṣkarmyamu -).

  1. karmalu nālugu vidhamulu: -

    1. puṇyakarmalu, pāpakarmalu, puṇyamu pāpamu kalisina karmalu, puṇyamu pāpamu lēnikarmalu.
  2. karmalu ayidu vidhamulu: -

“utṣēpaṇaṃ tatō avakṣēpaṇaṃ; ākuṃcinaṃ tathā |

prasāraṇaṃca gamanaṃ karmāṇyētāni paṃca ca ||“. (bāṣā paricchēdamu)

  1. karmalu cēyavalayunani śāstramulu ceppucunnavi - eṃducētananagā: -

    1. puṭṭina pratijīvi, yāvajjīvamu, pratikṣaṇamu ēdō oka karma cēyucunē yuṃḍunu.

“nahi kaścit kṣaṇamapi jātu tiṣṭatya karmakṛt |

kāryatē hyavaśaḥ karma sarvaḥ prakṛtijairguṇaiḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 5)

“yataḥ kaścidapi prāṇī kṣaṇaṃ vāpi kadācana |

tiṣṭatīha vinākarma vātaḥ śuddhimṛtē(a)kriyaḥ |

yatō aśuddhamanāḥ sarvō rajassatvatamō guṇaiḥ |

svabhāvaprabha vairvāpi rāgadvēṣādi bhirguṇaiḥ |

asvataṃtrō akhilaṃ karma vaidikaṃ laukikaṃ balāt |

kāryatē (a)tō vinā śuddhiṃ na sanyāsōpi saṃbhavēt ||“. (gītābhāvaprakāśamu - 3 - 52 to 54)

(ē prāṇi ayinanu eppuḍunu kṣaṇamainanu ē karmayunu cēyaka uṃḍaḍu. cittaśuddhilēnivāḍu akriyuḍu kānēraḍu. aṃducēta cittaśuddhilēnivāraṃdaru rajassatvatamōguṇamulanu mūḍiṃṭicētanu svabhāvamu valana kaligina rāgadvēṣamulu modalagu guṇamulacētanu baddhuḍai svataṃtramugā pani cēyuṭaku śaktilēnivāḍai samastamaina vaidikakarmalu, laukika karmalanu cēyunu. manujuḍu cēyukarma puṇyamainadani, pāpamainadanigāni telisinappaṭikī, avi cēyuṭa iṣṭamu lēnappaṭikī ā pani cēyunu. aṃducēta svataṃtruḍukāḍu, tana svabhāvamucētanē cēyunu. tana svabhāvamu satvarajastamōguṇamula kaliyakanu baṭṭi kalugunu. adi pūrvajanmalalō tānu cēsina karmamulabaṭṭi vāṭiyokka phalamulanu anubhaviṃcuṭaku avakāśamu kalugacēyurītigā nuṃḍunu - “okka naruṃḍu nokakṣaṇaṃbunu garmaṃbu sēyakuṃḍuvāḍu. pūrva saṃskāraṃbulaṃgala guṇaṃbulacēta buruṣuṃḍavaśuṃḍu gāvuna balimi garmaṃbu sēyiṃpabaḍucuṃḍu” – (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - )

  1. “niyataṃ kuru karma tvaṃ karma jyāyōhya karmaṇaḥ |

śarīrayātrāpi ca tē sa prasiddhyēdakarmaṇaḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 9)

(karma cēyakayuṃḍuṭakaṃṭe karma cēyuṭayē mēlu. aṃducēta śāstramulō cēyavalasinadani ceppabaḍina karma - śrautakarma - laukika karma - nityamu cēyavalayunu - svadharmamunu cēyakuṃḍuṭacēta śarīrayātra siddhiṃpadu - jīvitamu gaḍucuṭa kaṣṭamu).

  1. “tasmānmumukṣi bhirkāryamātmā jñānābhilāṣibhiḥ |

nityaṃ naimittikaṃ karma sadaivātma śuddhayē ||“. (naiṣkarmyasiddhi - 150)

(ātmajñānamu nabhilaṣiṃcuvāru ātmaśuddhi koraku, cittaśuddhikoraku ellapuḍū nitya naimittika karmalu cēyavalayunu -) (cittaśuddhidvārā brahmajñānamu, taddvārā mukti kalugunu).

  1. “dhī śuddhi hētukaṃ karma na tyājyaṃ” (gītābhāvaprakāśamu - 5 - 65)

(citta śuddhikikāraṇamaina karmanu - cittaśuddhini kaligiṃcukarmanu mānarādu).

  1. “jyōtiṣṭōmēva svargakāmō yajēta”

(svargamunukōruvāḍu jyōtiṣṭōmamanu yajñamunu cēyavalayunu).

  1. “kriyalumāna dagadu gṛha gatuniki”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 463)

(gṛhasthāśramulō nunnavāḍu karmalu cēyavalenu).

  1. “kurvannē dēha karmāṇi ji jīviṣēcchataṃ samāḥ” (īśāvāśyōpaniṣat)

(ī lōkamulō puruṣuḍu tānu karmalu cēyucunē nūru saṃvatsaramulu jīviṃciyuṃḍunu).

  1. “akurvan vihitaṃ karma niṃditaṃ ca samācaran |

prasajjaṃ ścēṃdriyārthēṣu naraḥ patanamṛcchati”

iti manuḥ.

(śāstramulō ī panulu cēyavalenu ani vidhiṃcabaḍina karmalu cēyaka, niṃdita karmalanu cēyuṭavalananu, iṃdriyārthamulaina viṣayamulanu anubhaviṃcuṭayaṃdu munigiyuṃḍuvāḍu patituḍagunu, bhraṣṭuḍagunu).

  1. “yāvajjīva magnihōtraṃ juhōti”.

(jīviṃciyunnaṃtakālamu agnihōtrikriya cēyavalasinadē).

  1. “karmaṇaiva hi saṃsiddhimāsthitāḥ janakādayaḥ” - (śrīmadbhagavadghīta - 3 - 20)

(rāja ṛṣi ayina janakamahārāju modalaguvāru karmalu cēsi siddhini poṃdiri).

  1. “saha yajñāḥ prajāḥ sṛṣṭvā purōvāca prajāpatiḥ”. (śrīmadbhagavadgīta - 3 - 10)

(yajñamu cēyuṭavalā apūrvanu śakti kaligi mēghamulugā māri varṣiṃcunu. varṣamuvalana sasyamulu paṃḍunu - aṃducēta yajñakarma cēyiṃcavalasinadē).

  1. karmacēsina adi baṃdhamu kalugacēyunu - anagā, dāni phalamunanubhaviṃpacēyunu - (Every action has a reaction). aṃducēta karma cēyakūḍadani śāstramulu ceppucunnavi -

    1. “karmaṇā baddhyatē jaṃtuḥ vidyayā (a) mṛtamaśnutē tasmāt karma nakurvaṃti yatayaḥ pāradarśanaḥ ||”.

(jīvulu karmalu cēsinayaḍala avi vārini baṃdhiṃcunu. ā karmala phalamanubhaviṃcuṭaku marala marala janmiṃcedaru, saṃsāramulō paḍuduru. ī kāraṇamuvalana brahmajñānamu kaliginayaḍala mōkṣamunoṃduduru. ī kāraṇamuvalana tattvamu telisina yatulu karmalu cēyaru).

  1. “karmaṃbulu gōraka cēyavalayunu, kōri cēsina duḥkhaṃbulu prāptiṃcu” (śrīmadāṃdhra,mahābhāgavatamu - 7 - 7 - 241)

  2. “śarīraṃbu garmamūlaṃbaguṭavalana garmaṃbulu sēya janadu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 -1 -

  3. “karmaṃbulu baṃdhakaṃbulunuṃgāni saukhyadāyakaṃbulai pāpanivṛtti cēyanōpavu.”

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 181)

  1. ka. “karmamuna buṭṭu jaṃtuvu

karmamuna vṛddhiboṃdu karmamuna jeḍun

karmame janulaku dēvata

karmame sukhaduḥkhamulaku kāraṇamanaghā ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. - bhā. - 886)

  1. karmalu sādhāraṇamugā baṃdhamu kalugacēyunavi ayinanu konni vidhamulaina karmalu baṃdhiṃcavu - avi ēvi anagā : -

    1. “yōgasthaḥ kurukarmāṇi saṃgaṃtyaktvā dhanaṃjaya” (śrīmadbhagavadgīta - 2 - 48)

“yōgasthaḥ san phalē kāmaṃ kartṛtvābhimatiṃ tathā |

tyaktvā tvaṃ kurukarmāṇi kṛṣṇārpaṇadhiyā sadā ||“. (gītābhāvaprakāśaṃ - 2 - 504 - 506)

(karmaphalamāsiṃcaka, tanē karma cēyucunnānu anu abhimānamu vadali bhagavadarpaṇa cēyucu karmalu cēyavalenu).

    1. karmajaṃ buddhi yuktāhi phalaṃ tyaktyā manīṣiṇaḥ |

janma baṃdha vinurmuktāḥ padaṃ gaccaṃ tyanā mayaṃ ||“. (śrīmadbhagavadgīta - 2 - 51)

(cēsina karmalaku phalamu siddhiṃcunā lēdā anu ālōcana, phalamu siddhiṃcinanu siddhiṃcakapōyinanu okēvidhamugāyuṃḍuṭa anu yōgamu navalaṃbiṃci karmalu cēsina janma baṃdhamu vadalipōyi - tirigi janmiṃcanakkarlēka - anāmayamaina padamunu buddhimaṃtulu - jñānulu yōgulu poṃduduru).

  1. “tyaktvā karma phalāsaṃgaṃ nityatṛptō nirāśrayaḥ |

karmaṇyabhi pravṛttō pi naivakiṃcitkarōti saḥ |

nirāśīryata cittatmā tyakta sarva parigrahaḥ |

śārīraṃ kēvalaṃ karma kurva nnāpnōti kilbiṣaṃ ||“. (śrīmadbhagavadgīta - 4 - 20, 21)

(karma phalamaṃdāśalēka ellapuḍu tṛptuḍaiyuṃḍi dēnini āśrayiṃcanivāḍai ē karmalu cēsinanu cēyanaṭlē yagunu. dēniyaṃdainanu ē vidhamaina āśalēnivāḍu, ellapuḍu tṛptuḍai yuṃḍuvāḍu. dēnini āśrayiṃcanivāḍu - iṭṭivāḍu ē karmalu cēsinanu cēyanaṭlē yagunu. manasunu tanasvādhīnamulō nuṃcukoninavāḍu, dēnini parigrahiṃpanivāḍu, śarīramunu nilabeṭṭukonuṭaku ē vidhamaina karmalu cēsinanu ā karmalavalana dōṣamunu poṃdaḍu - ā karmalu atanini baṃdhiṃcavu).

    1. “karmaṃbulu saṃsārahētukaṃbulayyu nīśvarārpitaṃbulai tāmu tammu jeṟipi konanōpiyuṃḍu

(śrīmadāṃdhramahābhāgavatamu -1 – 5 – 73)

  1. “kāyēna vācā manasēṃdriyairvā buddhyā tmanā vā prakṛtēḥ svabhāvāt |

karōmi yadyatsakalaṃ parasmainārāyaṇā yēti samarpayāmi ||“.

(śarīramucētagāni, vākkucētagāni, manassucētagāni, iṃdriyamulacētagāni, buddhicētagāni, svabhāvamu cētagāni yēkarma cēsinanu adaṃtayu śrīmannārāyuṇuni koṟakē samarpiṃcucunnānu). “īśvaruniyaṃdu samarpitaṃbaina karmaṃbu tāpatrayaṃbu mānpa nauṣadhaṃbagu”.

  1. “yaḥ atatvavit pravṛttaśca karmayōgē karma brahmaṇi īśvarē, ādhāya nikṣipya tadarthaṃ karma karōmi”

iti bhṛtya ivasvāmyarthaṃ sarvāṇi karmāṇi mōkṣē api phalē saṃgatyaktvā karōti saḥ pāpēna na lipyatē – yadhā padmapatraṃ iva aṃbhasā udakēna kēvalaṃ satvaśuddhi mātraṃ ēva phalaṃ tasya tatkarmaṇaḥ |” (śrīśaṃkaraḥ)

(ātma tatvamu teliyanivāḍu karmayōgamaṃdu pravṛttuḍainavāḍu tānu cēyukarma paramātmayaṃdu samarpiṃci, yajamānikoṟaku karmacēyu sēvakunivale bhagavaṃtunikoṟaku nēnīkarma cēyucunnānu anu abhiprāyamutō samastamaina karmalanu, vāṭi phalamaṃdāsakti lēka, mōkṣaphalamaṃdainanu āsaktilēka cēyunō, aṭṭi vāniki pāpamu aṃṭadu, ā karmaphalamu aṃṭadu - tāmarāku nīṭipainunnanu dāniki nīru aṃṭanaṭlē -aṭṭivāniki ā karmaphalamu satvaśuddhikoṟakē yagunu).

  1. “yathai dhāṃsi samiddhō agnirbhasmasātkurutē (a)rjuna |

jñānāgniḥ sarvakarmāṇi bhasma sātkurutē tathā”. (śrīmadbhagavadgīta - 4 - 37)

“yathā ēthāṃsi kāṣṭāni samiddhaḥ agniḥ - dīpatāgniḥ bhasmībhāvaṃ karōti, tathā jñānāgniḥ sarvakarmāṇi bhasma sāt kurutē - nirbījaṃ karō tītyarthaḥ - nahi sākṣādēva jñānāgniḥ karmāṇi iṃdhanavat bhasmīkartuṃ śaknōti. tasmāt samyak darśanaṃ sarva karmaṇāṃ nirbījatvē kāraṇaṃ ityabhiprāyaḥ, sāmarthyāt yēna karmaṇā śarīraṃ ārabdaṃ tat pravṛtta phalatvāt upabhōgēnaiva kṣīyatē -”tasya tāna dēva ciraṃ yāvanna vimōkṣyē adhya saṃ tsyē” iti śrutēḥ - atōyāni apravṛtta phalāni jñānōtpattēḥ prāk kṛtāni jñānasahabhāvani vā atītānēka janma kṛtānica | tyānyēva sarvāṇi bhasma sātkurutē ||“. (śrīśaṃkaraḥ)

(dīptimaṃtamaina agni - maṃḍutū unna agni kaṭṭelanu ē vidhamugā bhasmamu cēyunō āprakāramugānē jñānamanē agni -, brahmajñānamanē agni - samastamaina karmalanu bhasmamu cēyunu - ā karmalaku saṃbaṃdhiṃcina bījamainanu migalakuṃḍunaṭlu cēyunu - iṭlu ceppuṭacēta kaṭṭelanu agni kālcivēsi būḍidagā cēsinaṭlu jñānāgni nijamuga anni karmalanu būḍidaga cēyalēdu. ē karma kāraṇamugā prastuta śarīramu prāraṃbhiṃpabaḍinadō (prārabda karma) ā karma dāni karmaniccuṭaku prāraṃbhiṃcinadi kanuka ā karmaphalamu anubhaviṃcuṭacētanē tīrunu - kṣīṇiṃcunu - aṃducēta ē karmalu phalamuniccuṭaku prāraṃbhiṃcalēdō anēka janmalalō cēsina aṭuvaṃṭi karmalu, brahmajñānamu kalugakamuṃdu cēsinavi - iviyē brahmajñānamuvalana naśiṃcunu. prārabdakarmalu anubhavamuvalananē kṣīṇiṃci naśiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.