← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మబంధము karmabaṃdhamu

Original — తెలుగు
  1. కర్మైవ బంధనం, కర్మణావా బంధనం, సంసారబంధః ఇత్యర్థః - బంధకత్వం వాసనా ద్వారా బంధకం మోక్షస్య ప్రతిబంధకం.

(కర్మయే బంధనము, బంధించునది; లేక కర్మచేతనగు బంధనము, సంసారములో బంధించునది, వాసన ద్వారా బంధము కలిగుంచునది; మోక్షమునకు ప్రతిబంధకమైనది, అడ్డు తగులునది చేసిన కర్మఫలమును అనుభవించుటకు జన్మ పరంపరలు కలుగుచేయునది).

  1. “కర్మ ఏవ ధర్మా ధర్మాఖ్యః బంధః” (శ్రీశంకరః)

(ధర్మా ధర్మములు - పాపపుణ్యములు అను పేరుగల కర్మయే బంధము).

  1. కర్మ పుణ్యా పుణ్యాత్మకం కర్మ, నిబంధనం దేహ సంబంధకారణం.

(పాపపుణ్యరూపమైన కర్మ, దేహముతో సంబంధము కలుగుచేయుటకు కారణమైనది; చేసిన కర్మకు అనుగుణ్యమైన దేహమును కలుగ చేయునది, జన్మకు కారణమైనది).

  1. “కర్మణా బధ్యతే జంతుః”

(ప్రాణులు వారు చేసిన కర్మచేత బంధింపబడుచున్నారు. చేసిన కర్మ పుణ్యమైన శుభఫలము కలుగును, పాపము అయిన అశుభఫలము కలుగును. ఫలము ఎట్టిదైనను కర్మ చేసినవాడు అనిభవింపక తప్పదు - అనుభవించుటే బంధము).

  1. “యషాం సంసారిణాం అహం కర్తా” ఇత్యభిమానః కర్మసు, స్పృహా చ తత్ఫలేషు, తాన్ కర్మాణి లింపంతి. ఇతి యుక్తం, తేకర్మభిః బధ్యతే.

(చేయు కర్మలందు ‘నేను కర్తను’ అను అభిమానము ఎవరికి కలదో, ఆ కర్మలయొక్క ఫలమందు ఆశ ఎవరికి ఉండునో, ఆ కర్మలు బంధము కలిగించును).

  1. “క. కామక్రోధాదికముల్ |

భూమీశ్వర కర్మబంధములు; - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 1 - 6)

  1. “నహి కర్మాణి స్వయం బధ్నంతి, జడత్వాత్. అతః స్వయం ఆత్మాకర్మభిః వాసనాత్మకైః ఆత్మానం బధ్నాతి”. (అభినవ గుప్తాచార్య)

(కర్మలు జడములు. అందుచేత అవి స్వయముగా బంధించవు. ఆత్మయే కర్మవాసనలచేత తననే బంధించుకొనుచున్నాడు. కర్మవాసనలవలన తన స్వభావము కలిగినందున వాటికి అనుగుణ్యముగా కర్మలు చేసి వాటి ఫలము ననుభవించుచున్నాడు).

  1. “యజ్ఞార్థా త్కర్మణో(అ)న్యత్ర లోకోయం కర్మ బంధనం |

తదర్థంకర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర ||“.

“కర్మణా బధ్యతే జంతురితి స్మృత్యా ముముక్షుణా |

బంధకత్వాత్కధం కర్మ కర్తవ్య మితి చేచ్ఛృణు |

యజ్ఞో వైవిష్ణు అత్యుక్తస్త దారాధన హేతుకం |

యత్కర్మక్రియతే తస్మాత్ప్రవృత్తో (అ)న్యత్ర కర్మణి |

కర్మాధి కార్యయంలోకః కర్మణా బధ్యతే తదా |

నీశ్వరారాధనార్థేన బ ద్ధ్యతే (అ)తస్త దర్ధకం |

కర్మణ్యధి కృతః సంస్త్వం ఫలసంగ వివర్జితః |

సమ్యక్ శ్రద్ధాదినా కర్మ కౌంతేయ కురు శాస్త్రతః (గీతాభావప్రకాశము - 3 - 64 to 68)

(కర్మ చేయుట వలన జీవుడు బంధింపబడుచున్నాడు, దాని ఫలము అనుభవించుటకు జన్మముల నెత్తుచున్నాడు అని శ్రుతి చెప్పుచున్నది. ఇట్లైన మోక్షము కోరువాడు - జన్మ లేకుండుట కోరువాడు - కర్మ ఎట్లు చేయవలెననగా - యజ్ఞమనిన విష్ణువే అని శ్రుతులు చెప్పుచున్నవి. అట్టి విష్ణువును ఆరాధించుతకు చేయు కర్మ బంధించదు - మిగిలిన కర్మలు బంధించును. అందుచేత ఫలమును కోరక శాస్త్ర ప్రకారము శ్రద్ధతో భగవదర్పణ బుద్ధితో కర్మ చేయును).

  1. యోగసన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం |

ఆత్మవంతం న కర్మాణి బధ్నంతి ధనంజయ ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 41)

“సంత్వ బుద్ధి రూపేణ యోగేన పరమేశ్వరే |

సమర్పితాని కర్మాణి యేన తం శుద్ధ మానసం |

యద్వాత్యక్తానికర్మాణి యేన బ్రహ్మైక్య దర్శినా |

యోగ సన్యస్త కర్మత్వం కథం స్యాత్సం శయేసతి |

శ్రుణుత్వ మాత్మ బోధేనయేన ఛిన్నోస్తి సంశయః |

సర్వదా సావధానం తం క్రియామాణస్య నే కథా |

కర్మాణి న నిబధ్నంత్యనిష్టే ష్టాది కలే బరైః ||“. (గీతాభావప్రకాశము - 4 - 251 to 253)

(కర్మఫలమును పొందినను పొందకపోయినను ఒకే రీతి బుద్ధి కలిగియుండి పరిశుద్ధమైన మనసుతో ఆ కర్మను భగవంతునికి సమర్పణ చేసిన, పరబ్రహ్మ ఒకడే, అంతా పరబ్రహ్మమే అని బ్రహ్మజ్ఙ్నానము కలిగియుండుటచేత ఏ విధమైన సంశయములు లేనివాడై ఏ కర్మలు చేసినను ఆ కర్మలు సుఖదుఃఖములను కలుగచేయు శరీరములను కలుగ చేయవు. అవి అతనిని బంధించవు).

  1. యస్త్వ యుక్తోస్తి పూర్వస్మా త్విపరీతః ఫలేప్సుకః |

ప్రవృత్యా మే ఫలయేదా కరోమితి ఫలేప్సుకః |

దేహాభిమాన సామయేపి కృతం భగవదర్పణం |

కర్మ శ్రౌతం తథా స్మార్తం లౌకికం చ ముముక్షుభిః |

చిత్తశుద్ధ్యాప్త వైరాగ్య జ్ఞానద్వారా విమిక్తదం |

తదేవ కామకారేణ కృతం సత్ఫలకామిభిః |

దృఢబంధాయ మూఢానాం భవతీత్యాశయో హరేః ||’. (గీతాభావప్రకాశము - 5 - 91 to 95)

(యోగికానివాడు కర్మఫలమందు “నాకు దీని ఫలము కావలెన”ను కోరికతో కర్మచేయువాడు ఆ కర్మచే బంధింపబడును - సంసారములో పడి కష్టసుఖములననుభవించును - ఆ కర్మ - శ్రౌతకర్మగాని స్మార్తకర్మగాని - భగవంతునికి ముముక్షువైనవాడు అర్పించిన చిత్తశుద్ధిగలవాడై వైరాగ్యం పొంది దాని ద్వారాభగవత్ జ్ఞానము కలవాడై ముక్తిని పొందును - అదియే కోరికతో చేసినయడల మూఢులైనవారికి దృఢమైన బంధము కలుగచేయును).

  1. “యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం |

శుభా శుభఫలైరేవం మోక్ష్యపే కర్మ బంధనైః ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 27, 28)

(నీవు ఏమి చేసినను, ఏది తినినను, యేది హోమము చేయుచున్నావో, దేనిని దానము చేయుచున్నావో, యే తపస్సు చేయుచున్నావో, వాటి నన్నింటిని “కృష్ణార్పణం” అని నాకు అర్పించుము - ఈ ప్రకారము చేసినయడల పుణ్యపాప కర్మల ఫలమువలన నీకు విముక్తి కలుగును - ఆ కర్మలు నిన్ను బంధించవు).

  1. “యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |

సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబద్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 22)

(తాను కోరకయే, ప్రయత్నము చేయకయే, కలిగినదానితో సంతుష్టిని పొందినవాడున్నూ, శాస్త్రములో చెప్పిన ప్రకారము భిక్షచేయగా పొందినదానితో సంతుష్టి పొందిన వాడున్నూ, ఆకలి దప్పులు, శీతోష్ణములు, కష్టసుఖములు మొదలగు ద్వంద్వములవలన మనసులో బాధపడనివాడున్నూ, ఏ ప్రాణియందును శతృత్వములేక అన్నింటియందును సమబుద్ధి గలిగియున్నవాడున్నూ, దేనియందును మత్సరము లేని వాడున్నూ, శరీరము నిలుపుటకు గాని పోషించుటకు గాని కావలసిన వస్తువులు లభించినను లభించకపోయినను, వికారమును చెందకయుండువాడు తన అనుభవమును బట్టి ఏ కర్మను చేయనివాడే. అట్టివానిని యే కర్మయును బంధించదు).

  1. “సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం |

కల్పక్షయే; పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం |

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |

భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ |

న చ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |

ఉదాసీనవదాసీన మస్తకం తేషు కర్మసు ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 7, 8, 9)

(కల్పాంతమందు సమస్త భూతములు నా ప్రకృతిలో లీనమైపోవును.కల్ప ప్రారంభమున తిరిగి వాటిని నేను ప్రకృతినుండి వేరు చేసి పైకి చిమ్మివేయుదును - వాటిని సృష్టించినట్లు చేయుదును - ఈ ప్రకారముగా నేను ప్రకృతి నధిష్టించుయుండి, ప్రకృతి వశములోనుండుటవలన స్వతంత్రములేని ఈ భూతములన్నింటినీ మరల మరల సృజించుచుందును. అవి పుట్టినట్లు చేయుచుందును. ఇట్లు కల్పము, కల్పములోని సృష్టి, ప్రళయము, తిరిగి కల్పము, తిరిగి ప్రళయము పరంపరగా చేయుచుందును - కాని ఈ కర్మలందు నాకు ఆసక్తిలేదు, దానిఫలమందాసక్తి లేదు - నేను అధిష్టించియుడుటవలన నా శక్తిని వినియోగించుకొని ప్రకృతి ఈ పనులను చేయుచున్నది, నేను వాటితో సంబంధములేనట్లుగా నుందును. అందుచేత ఆ కర్మలు నన్ను అంటవు, అవి నన్ను బంధించవు.

“వ. జీవునకు నవిద్యామహిమం జేసి కర్మబంధనాదికంబు సంప్రాప్తంబగుంగాని, సర్వ భూతాంతర్యామి యైన ఈశ్వరునకు బ్రాప్తంబు గానేరదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 3 - 240)

Transliteration
  1. karmaiva baṃdhanaṃ, karmaṇāvā baṃdhanaṃ, saṃsārabaṃdhaḥ ityarthaḥ - baṃdhakatvaṃ vāsanā dvārā baṃdhakaṃ mōkṣasya pratibaṃdhakaṃ.

(karmayē baṃdhanamu, baṃdhiṃcunadi; lēka karmacētanagu baṃdhanamu, saṃsāramulō baṃdhiṃcunadi, vāsana dvārā baṃdhamu kaliguṃcunadi; mōkṣamunaku pratibaṃdhakamainadi, aḍḍu tagulunadi cēsina karmaphalamunu anubhaviṃcuṭaku janma paraṃparalu kalugucēyunadi).

  1. “karma ēva dharmā dharmākhyaḥ baṃdhaḥ” (śrīśaṃkaraḥ)

(dharmā dharmamulu - pāpapuṇyamulu anu pērugala karmayē baṃdhamu).

  1. karma puṇyā puṇyātmakaṃ karma, nibaṃdhanaṃ dēha saṃbaṃdhakāraṇaṃ.

(pāpapuṇyarūpamaina karma, dēhamutō saṃbaṃdhamu kalugucēyuṭaku kāraṇamainadi; cēsina karmaku anuguṇyamaina dēhamunu kaluga cēyunadi, janmaku kāraṇamainadi).

  1. “karmaṇā badhyatē jaṃtuḥ”

(prāṇulu vāru cēsina karmacēta baṃdhiṃpabaḍucunnāru. cēsina karma puṇyamaina śubhaphalamu kalugunu, pāpamu ayina aśubhaphalamu kalugunu. phalamu eṭṭidainanu karma cēsinavāḍu anibhaviṃpaka tappadu - anubhaviṃcuṭē baṃdhamu).

  1. “yaṣāṃ saṃsāriṇāṃ ahaṃ kartā” ityabhimānaḥ karmasu, spṛhā ca tatphalēṣu, tān karmāṇi liṃpaṃti. iti yuktaṃ, tēkarmabhiḥ badhyatē.

(cēyu karmalaṃdu ‘nēnu kartanu’ anu abhimānamu evariki kaladō, ā karmalayokka phalamaṃdu āśa evariki uṃḍunō, ā karmalu baṃdhamu kaligiṃcunu).

  1. “ka. kāmakrōdhādikamul |

bhūmīśvara karmabaṃdhamulu; - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 1 - 6)

  1. “nahi karmāṇi svayaṃ badhnaṃti, jaḍatvāt. ataḥ svayaṃ ātmākarmabhiḥ vāsanātmakaiḥ ātmānaṃ badhnāti”. (abhinava guptācārya)

(karmalu jaḍamulu. aṃducēta avi svayamugā baṃdhiṃcavu. ātmayē karmavāsanalacēta tananē baṃdhiṃcukonucunnāḍu. karmavāsanalavalana tana svabhāvamu kaliginaṃduna vāṭiki anuguṇyamugā karmalu cēsi vāṭi phalamu nanubhaviṃcucunnāḍu).

  1. “yajñārthā tkarmaṇō(a)nyatra lōkōyaṃ karma baṃdhanaṃ |

tadarthaṃkarma kauṃtēya mukta saṃgaḥ samācara ||“.

“karmaṇā badhyatē jaṃturiti smṛtyā mumukṣuṇā |

baṃdhakatvātkadhaṃ karma kartavya miti cēcchṛṇu |

yajñō vaiviṣṇu atyuktasta dārādhana hētukaṃ |

yatkarmakriyatē tasmātpravṛttō (a)nyatra karmaṇi |

karmādhi kāryayaṃlōkaḥ karmaṇā badhyatē tadā |

nīśvarārādhanārthēna ba ddhyatē (a)tasta dardhakaṃ |

karmaṇyadhi kṛtaḥ saṃstvaṃ phalasaṃga vivarjitaḥ |

samyak śraddhādinā karma kauṃtēya kuru śāstrataḥ (gītābhāvaprakāśamu - 3 - 64 to 68)

(karma cēyuṭa valana jīvuḍu baṃdhiṃpabaḍucunnāḍu, dāni phalamu anubhaviṃcuṭaku janmamula nettucunnāḍu ani śruti ceppucunnadi. iṭlaina mōkṣamu kōruvāḍu - janma lēkuṃḍuṭa kōruvāḍu - karma eṭlu cēyavalenanagā - yajñamanina viṣṇuvē ani śrutulu ceppucunnavi. aṭṭi viṣṇuvunu ārādhiṃcutaku cēyu karma baṃdhiṃcadu - migilina karmalu baṃdhiṃcunu. aṃducēta phalamunu kōraka śāstra prakāramu śraddhatō bhagavadarpaṇa buddhitō karma cēyunu).

  1. yōgasanyasta karmāṇaṃ jñāna saṃcinna saṃśayaṃ |

ātmavaṃtaṃ na karmāṇi badhnaṃti dhanaṃjaya ||” (śrīmadbhagavadgīta - 4 - 41)

“saṃtva buddhi rūpēṇa yōgēna paramēśvarē |

samarpitāni karmāṇi yēna taṃ śuddha mānasaṃ |

yadvātyaktānikarmāṇi yēna brahmaikya darśinā |

yōga sanyasta karmatvaṃ kathaṃ syātsaṃ śayēsati |

śruṇutva mātma bōdhēnayēna chinnōsti saṃśayaḥ |

sarvadā sāvadhānaṃ taṃ kriyāmāṇasya nē kathā |

karmāṇi na nibadhnaṃtyaniṣṭē ṣṭādi kalē baraiḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 251 to 253)

(karmaphalamunu poṃdinanu poṃdakapōyinanu okē rīti buddhi kaligiyuṃḍi pariśuddhamaina manasutō ā karmanu bhagavaṃtuniki samarpaṇa cēsina, parabrahma okaḍē, aṃtā parabrahmamē ani brahmajṅnānamu kaligiyuṃḍuṭacēta ē vidhamaina saṃśayamulu lēnivāḍai ē karmalu cēsinanu ā karmalu sukhaduḥkhamulanu kalugacēyu śarīramulanu kaluga cēyavu. avi atanini baṃdhiṃcavu).

  1. yastva yuktōsti pūrvasmā tviparītaḥ phalēpsukaḥ |

pravṛtyā mē phalayēdā karōmiti phalēpsukaḥ |

dēhābhimāna sāmayēpi kṛtaṃ bhagavadarpaṇaṃ |

karma śrautaṃ tathā smārtaṃ laukikaṃ ca mumukṣubhiḥ |

cittaśuddhyāpta vairāgya jñānadvārā vimiktadaṃ |

tadēva kāmakārēṇa kṛtaṃ satphalakāmibhiḥ |

dṛḍhabaṃdhāya mūḍhānāṃ bhavatītyāśayō harēḥ ||’. (gītābhāvaprakāśamu - 5 - 91 to 95)

(yōgikānivāḍu karmaphalamaṃdu “nāku dīni phalamu kāvalena”nu kōrikatō karmacēyuvāḍu ā karmacē baṃdhiṃpabaḍunu - saṃsāramulō paḍi kaṣṭasukhamulananubhaviṃcunu - ā karma - śrautakarmagāni smārtakarmagāni - bhagavaṃtuniki mumukṣuvainavāḍu arpiṃcina cittaśuddhigalavāḍai vairāgyaṃ poṃdi dāni dvārābhagavat jñānamu kalavāḍai muktini poṃdunu - adiyē kōrikatō cēsinayaḍala mūḍhulainavāriki dṛḍhamaina baṃdhamu kalugacēyunu).

  1. “yatkarōṣi yadaśnāsi yajjuhōṣi dadāsi yat |

yattapasyasi kauṃtēya tatkuruṣva madarpaṇaṃ |

śubhā śubhaphalairēvaṃ mōkṣyapē karma baṃdhanaiḥ ||“. (śrīmadbhagavadgīta - 9 - 27, 28)

(nīvu ēmi cēsinanu, ēdi tininanu, yēdi hōmamu cēyucunnāvō, dēnini dānamu cēyucunnāvō, yē tapassu cēyucunnāvō, vāṭi nanniṃṭini “kṛṣṇārpaṇaṃ” ani nāku arpiṃcumu - ī prakāramu cēsinayaḍala puṇyapāpa karmala phalamuvalana nīku vimukti kalugunu - ā karmalu ninnu baṃdhiṃcavu).

  1. “yadṛcchā lābha saṃtuṣṭō dvaṃdvātītō vimatsaraḥ |

samaḥ siddhāva siddhau ca kṛtvāpi na nibadyatē ||“. (śrīmadbhagavadgīta - 4 - 22)

(tānu kōrakayē, prayatnamu cēyakayē, kaliginadānitō saṃtuṣṭini poṃdinavāḍunnū, śāstramulō ceppina prakāramu bhikṣacēyagā poṃdinadānitō saṃtuṣṭi poṃdina vāḍunnū, ākali dappulu, śītōṣṇamulu, kaṣṭasukhamulu modalagu dvaṃdvamulavalana manasulō bādhapaḍanivāḍunnū, ē prāṇiyaṃdunu śatṛtvamulēka anniṃṭiyaṃdunu samabuddhi galigiyunnavāḍunnū, dēniyaṃdunu matsaramu lēni vāḍunnū, śarīramu nilupuṭaku gāni pōṣiṃcuṭaku gāni kāvalasina vastuvulu labhiṃcinanu labhiṃcakapōyinanu, vikāramunu ceṃdakayuṃḍuvāḍu tana anubhavamunu baṭṭi ē karmanu cēyanivāḍē. aṭṭivānini yē karmayunu baṃdhiṃcadu).

  1. “sarva bhūtāni kauṃtēya prakṛtiṃ yāṃti māmikāṃ |

kalpakṣayē; punastāni kalpādau visṛjāmyahaṃ |

prakṛtiṃ svāmavaṣṭabhya visṛjāmi punaḥ punaḥ |

bhūtagrāmamimaṃ kṛtsnamavaśaṃ prakṛtērvaśāt |

na ca māṃtāni karmāṇi nibadhnaṃti dhanaṃjaya |

udāsīnavadāsīna mastakaṃ tēṣu karmasu ||“. (śrīmadbhagavadgīta - 9 - 7, 8, 9)

(kalpāṃtamaṃdu samasta bhūtamulu nā prakṛtilō līnamaipōvunu.kalpa prāraṃbhamuna tirigi vāṭini nēnu prakṛtinuṃḍi vēru cēsi paiki cimmivēyudunu - vāṭini sṛṣṭiṃcinaṭlu cēyudunu - ī prakāramugā nēnu prakṛti nadhiṣṭiṃcuyuṃḍi, prakṛti vaśamulōnuṃḍuṭavalana svataṃtramulēni ī bhūtamulanniṃṭinī marala marala sṛjiṃcucuṃdunu. avi puṭṭinaṭlu cēyucuṃdunu. iṭlu kalpamu, kalpamulōni sṛṣṭi, praḷayamu, tirigi kalpamu, tirigi praḷayamu paraṃparagā cēyucuṃdunu - kāni ī karmalaṃdu nāku āsaktilēdu, dāniphalamaṃdāsakti lēdu - nēnu adhiṣṭiṃciyuḍuṭavalana nā śaktini viniyōgiṃcukoni prakṛti ī panulanu cēyucunnadi, nēnu vāṭitō saṃbaṃdhamulēnaṭlugā nuṃdunu. aṃducēta ā karmalu nannu aṃṭavu, avi nannu baṃdhiṃcavu.

“va. jīvunaku navidyāmahimaṃ jēsi karmabaṃdhanādikaṃbu saṃprāptaṃbaguṃgāni, sarva bhūtāṃtaryāmi yaina īśvarunaku brāptaṃbu gānēradu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 3 - 240)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.