(జగచ్చక్రము - జగత్తు చక్రమువలె ఏ రీతిగా నడుచుచున్నదనగా - తినిన అన్నము శుక్లశోణితములుగామారుటవలన జీవులకు శరీరము కలుగును. వర్షము పడుటవలన అన్నము కలుగును - (అన్నము అనగా తినదగిన సస్యము మొదలగునవి). అపూర్వము అను పేరుగల ధర్మము (natural law) ద్వార యజ్ఞమువలన సూర్యుడు కారణముగా వర్షము కలుగును - శ్రద్ధతో యధావిధిగా అగ్నిలో ఆహుతి చేయబడినది సూర్యుని పొందుచున్నది యని శ్రుతి చెప్పుచున్నది, అందుచేత సూర్యుని వలన వర్షము కలుగుచున్నది; వర్షమువలన అన్నము కలుగుచున్నది. అన్నము వలన ప్రజలు కలుగుచున్నారు - ‘అపూర్వము’ అని పైన చెప్పబడిన యజ్ఞము (కర్మ) సూక్ష్మధర్మము ననుసరించును - యజ్ఞమను ఈ కర్మ ఋత్విక్కు మొదలగువారు చేయుకర్మ, అనగా - అపూర్వము అను ధర్మము గల యజ్ఞమునకు శాస్త్రములో విధించిన కర్మ (విహితకర్మ) కారణము - దీనిని బట్టి యజ్ఞమను కర్మ ఫలము ఏ రీతిగా జీవులకు ఆహారరూపముగా పరిణమించునో తెలియుచున్నది. కాని దీనికికారణము భగవంతుని రూపమువలె అగోచరము - అయినను దాని పరిణామము కనబడుచున్నదికనుక నమ్మతగినదే - కనుక ఇట్టికర్మ చేయవలసినదే - అని వేదములో చెప్పబడినది).
(jagaccakramu - jagattu cakramuvale ē rītigā naḍucucunnadanagā - tinina annamu śuklaśōṇitamulugāmāruṭavalana jīvulaku śarīramu kalugunu. varṣamu paḍuṭavalana annamu kalugunu - (annamu anagā tinadagina sasyamu modalagunavi). apūrvamu anu pērugala dharmamu (natural law) dvāra yajñamuvalana sūryuḍu kāraṇamugā varṣamu kalugunu - śraddhatō yadhāvidhigā agnilō āhuti cēyabaḍinadi sūryuni poṃducunnadi yani śruti ceppucunnadi, aṃducēta sūryuni valana varṣamu kalugucunnadi; varṣamuvalana annamu kalugucunnadi. annamu valana prajalu kalugucunnāru - ‘apūrvamu’ ani paina ceppabaḍina yajñamu (karma) sūkṣmadharmamu nanusariṃcunu - yajñamanu ī karma ṛtvikku modalaguvāru cēyukarma, anagā - apūrvamu anu dharmamu gala yajñamunaku śāstramulō vidhiṃcina karma (vihitakarma) kāraṇamu - dīnini baṭṭi yajñamanu karma phalamu ē rītigā jīvulaku āhārarūpamugā pariṇamiṃcunō teliyucunnadi. kāni dīnikikāraṇamu bhagavaṃtuni rūpamuvale agōcaramu - ayinanu dāni pariṇāmamu kanabaḍucunnadikanuka nammataginadē - kanuka iṭṭikarma cēyavalasinadē - ani vēdamulō ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.