← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మచితము karmacitamu

Original — తెలుగు
  1. కర్మణా సంచితః, కృష్యాదినా చితః సంచితః.

(కర్మచేత సంపాదింపబడినవి - కర్మఫలరూపమైనవి, కర్మచేత సంపాదింపబడినవి).

  1. “తద్య దేహ కర్మ చితో లోకః క్షీయతే ఏవ మేవా ముత్ర పుణ్య చితోలోకః క్షీయతే” ఇతి శ్రుతేః.

(ఈ లోకములో కర్మవలన సంపాదించిన ఫలము అనుభవమువలన క్షీణించునట్లే పుణ్యకర్మవలన సంపాదింపబడిన పరలోక సుఖము కూడా క్షీణించును).

“త్రైవిద్యామాం సోమపాః పూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |

తే పుణ్యమాసాద్య సురేంద్ర లోకమశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ ||

తే తంభిక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ||“.

(జ్ఞానకాండ మినహా మిగిలిన వేదభాగము చదివినవారు అందులో చెప్పబడిన ప్రకారము యజ్ఞములు చేసి, సోమపానము చేసి స్వర్గమును పొందకోరెదరు. ఈ కర్మవలన సంపాదించిన పుణ్యమువలన వారు దేవేంద్రలోకము పొంది అక్కడ స్వర్గభోగములను అనుభవించెదరు. వారు చేసిన ఈ కర్మ యిట్టి అనుభవమువలన క్షీణించిపోగా, తరిగిపోయినపిదప మరల మనుష్యలోకములో జన్మించెదరు అని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. అందుచేత ఇటువంటి కర్మలవలన సంపాదించిన ఫలము అనుభవమువలన క్షీణించును).

Transliteration
  1. karmaṇā saṃcitaḥ, kṛṣyādinā citaḥ saṃcitaḥ.

(karmacēta saṃpādiṃpabaḍinavi - karmaphalarūpamainavi, karmacēta saṃpādiṃpabaḍinavi).

  1. “tadya dēha karma citō lōkaḥ kṣīyatē ēva mēvā mutra puṇya citōlōkaḥ kṣīyatē” iti śrutēḥ.

(ī lōkamulō karmavalana saṃpādiṃcina phalamu anubhavamuvalana kṣīṇiṃcunaṭlē puṇyakarmavalana saṃpādiṃpabaḍina paralōka sukhamu kūḍā kṣīṇiṃcunu).

“traividyāmāṃ sōmapāḥ pūta pāpāḥ yajñairiṣṭvā svargatiṃ prārthayaṃtē |

tē puṇyamāsādya surēṃdra lōkamaśnaṃti divyān divi dēva bhōgān ||

tē taṃbhiktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti ||“.

(jñānakāṃḍa minahā migilina vēdabhāgamu cadivinavāru aṃdulō ceppabaḍina prakāramu yajñamulu cēsi, sōmapānamu cēsi svargamunu poṃdakōredaru. ī karmavalana saṃpādiṃcina puṇyamuvalana vāru dēvēṃdralōkamu poṃdi akkaḍa svargabhōgamulanu anubhaviṃcedaru. vāru cēsina ī karma yiṭṭi anubhavamuvalana kṣīṇiṃcipōgā, tarigipōyinapidapa marala manuṣyalōkamulō janmiṃcedaru ani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. aṃducēta iṭuvaṃṭi karmalavalana saṃpādiṃcina phalamu anubhavamuvalana kṣīṇiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.