← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మగతి karmagati

Original — తెలుగు
  1. “కర్మణః యాధాత్మ్యం, కర్మతత్వం ఇత్యర్థః” (శ్రీశంకరః)

(కర్మయొక్క యధార్థము - కర్మతత్వము - అని అర్థము).

  1. “కర్మణస్తు త్రిథాప్రోక్తం గతిః తత్వ విదాం వరైః |

సంచితం వర్తమానంచ ప్రారబ్దమితి భేదతః |

అనేక జన్మ సంజాతం ప్రాక్తనం సంచితం స్మృతం |

సాత్వికం రాజసం కర్మ తామసం త్రివిధం పునః |

శుభం వాప్యశుభం భూప సంచితం బహు కాలికం |

అవశ్యమేవ భోక్తవ్యం సుకృతం ధుష్కృతం తథా |

జన్మ జన్మని జీవానాం అంచితానాంచ కర్మణాం |

నిశ్శేషస్తు క్షయోనా భూత్ కల్ప కోటి శతైరపి |

క్రియమాణంచ యత్కర్మ వర్తమానం తదుచ్యతే |

దేహం ప్రాప్య శుభవాపి హ్య శుభం వా సమాచరేత్ |

కర్మక్షయే జన్మ నాసః ప్రాణినాం నాత్ర సంశయః ||“.

(కర్మతత్వమును తెలిసిన విద్వాంసులు కర్మగతి మూడు విధములని చెప్పిరి : - సంచితము, వర్తమానము, ప్రారబ్దము. అనేక పూర్వ జన్మలలో చేసినది సంచితము - కూడబెట్టినది. కర్మ సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములు - శుభమైనను, అశుభమైనను, పుణ్యమైనను, పాపమైనను చాలాకాలమునుండి పెరిగియున్న సంచితకర్మ తప్పనిసరిగా అనుభవించవలసినదే. ప్రతి జన్మలోను సంపాదింపబడుచున్న ఈ సంచితకర్మ నూరు కోట్ల కల్పములు జరిగినప్పటికీ పూర్తిగా క్షీణించుటలేదు. ఇంకను ముందు జన్మకు కొంత మిగులుచునేయుండును. ఇప్పుడు ఈ జన్మలో చేయుచున్న కర్మ వర్తమాన కర్మ. జన్మ ఎత్తినవాడు శుభకర్మకాని, అశుభకర్మగాని చేయుచునే యుండును. కర్మ పూర్తిగా నశించిన జన్మ మఱియుండదు - కర్మశేషము ఉన్నంతవఱకు జన్మ ఎత్తవలసియుండును).

  1. గహనా కర్మణో గతిః -

(కర్మతత్వము చాలా గూఢమైనది. కర్మ ఎందుకు చేయుచున్నాము - చేసినఫలము అనుభవించవలసియున్నది. (Every action has a reaction) ఆ ఫలము ఎటువంటిది, ఎప్పుడు అనుభవించవలసివచ్చును - ఏ రీతిగా, ఎచ్చట ? - ఈ కర్మ చేయుటవలన ఈ ఫలము అనుభవించుచున్నాను అని నిర్ధారణగా రుజువుచేయగల తార్కాణములు స్పష్టముగా కనబడుటలేదు. కాని ఈ సృష్టిలో ఏ పని అయినను కారణములేనిదీ జరగదు - ఇది ప్రకృతియొక్క సృష్టిలో చిత్ర విచిత్రమైన పద్దతి - Natural Law. యజ్ఞము చేసినపుడు అగ్నిగుండములో ఆహుతి చేయబడినవి సూక్ష్మరూపములో ఆకాశమునకు పోయి అక్కడ సూక్ష్మరూపములోనున్న జలబిందువులను సూక్ష్మరూపములోనున్న వాయువుతో కలిసి (Hydrogen gas + Oxygen = Water) వర్షముగా మారునని మనశాస్త్రవేత్తలు చెప్పుచున్నారు. ఇది చాలా సూక్ష్మమైన పరిణామము - దీనినే మనవారు ‘అపూర్వము’ (కారణము కానరాని పరిణామము) అని చెప్పియున్నారు - అట్లేకర్మఫలమునకు కూడ అపూర్వ సిద్ధాంతమే వర్తించును - కర్మ ఎప్పుడు ఏ రీతిఫలము, ఎక్కడ ఇచ్చునో అను విషయము కూడ మనపూర్వులకు తెలిసిన విషయమే - బలరాముడు రుక్మిణీదేవితో ఇట్లనియె –

శా .”తోడం బుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె

గ్గాడం జూడకుమమ్మ; పూర్వభవకర్మాధీనమై ప్రాణులన్

కీడున్ మేలును జెందు; లేడొకడు సిక్షింపగ రక్షింప;

తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్యె నేడీయడన్“. (పోతన తెలుగు భాగవతము-10.1-1775)

(ఈ రోజున, ఇక్కడ, ఈ ప్రకారము కర్మఫలమనుభవించెను). దీని ప్రకారము పద్దతి ఎట్లో తెలియదుకనుక కర్మగతి ‘గహనా’ (గూఢము) అని చెప్పబడినది). (చూడుము –‘కర్మ చక్రము’).

Transliteration
  1. “karmaṇaḥ yādhātmyaṃ, karmatatvaṃ ityarthaḥ” (śrīśaṃkaraḥ)

(karmayokka yadhārthamu - karmatatvamu - ani arthamu).

  1. “karmaṇastu trithāprōktaṃ gatiḥ tatva vidāṃ varaiḥ |

saṃcitaṃ vartamānaṃca prārabdamiti bhēdataḥ |

anēka janma saṃjātaṃ prāktanaṃ saṃcitaṃ smṛtaṃ |

sātvikaṃ rājasaṃ karma tāmasaṃ trividhaṃ punaḥ |

śubhaṃ vāpyaśubhaṃ bhūpa saṃcitaṃ bahu kālikaṃ |

avaśyamēva bhōktavyaṃ sukṛtaṃ dhuṣkṛtaṃ tathā |

janma janmani jīvānāṃ aṃcitānāṃca karmaṇāṃ |

niśśēṣastu kṣayōnā bhūt kalpa kōṭi śatairapi |

kriyamāṇaṃca yatkarma vartamānaṃ taducyatē |

dēhaṃ prāpya śubhavāpi hya śubhaṃ vā samācarēt |

karmakṣayē janma nāsaḥ prāṇināṃ nātra saṃśayaḥ ||“.

(karmatatvamunu telisina vidvāṃsulu karmagati mūḍu vidhamulani ceppiri : - saṃcitamu, vartamānamu, prārabdamu. anēka pūrva janmalalō cēsinadi saṃcitamu - kūḍabeṭṭinadi. karma sātvikamu, rājasamu, tāmasamu ani mūḍu vidhamulu - śubhamainanu, aśubhamainanu, puṇyamainanu, pāpamainanu cālākālamunuṃḍi perigiyunna saṃcitakarma tappanisarigā anubhaviṃcavalasinadē. prati janmalōnu saṃpādiṃpabaḍucunna ī saṃcitakarma nūru kōṭla kalpamulu jariginappaṭikī pūrtigā kṣīṇiṃcuṭalēdu. iṃkanu muṃdu janmaku koṃta migulucunēyuṃḍunu. ippuḍu ī janmalō cēyucunna karma vartamāna karma. janma ettinavāḍu śubhakarmakāni, aśubhakarmagāni cēyucunē yuṃḍunu. karma pūrtigā naśiṃcina janma maṟiyuṃḍadu - karmaśēṣamu unnaṃtavaṟaku janma ettavalasiyuṃḍunu).

  1. gahanā karmaṇō gatiḥ -

(karmatatvamu cālā gūḍhamainadi. karma eṃduku cēyucunnāmu - cēsinaphalamu anubhaviṃcavalasiyunnadi. (Every action has a reaction) ā phalamu eṭuvaṃṭidi, eppuḍu anubhaviṃcavalasivaccunu - ē rītigā, eccaṭa ? - ī karma cēyuṭavalana ī phalamu anubhaviṃcucunnānu ani nirdhāraṇagā rujuvucēyagala tārkāṇamulu spaṣṭamugā kanabaḍuṭalēdu. kāni ī sṛṣṭilō ē pani ayinanu kāraṇamulēnidī jaragadu - idi prakṛtiyokka sṛṣṭilō citra vicitramaina paddati - Natural Law. yajñamu cēsinapuḍu agniguṃḍamulō āhuti cēyabaḍinavi sūkṣmarūpamulō ākāśamunaku pōyi akkaḍa sūkṣmarūpamulōnunna jalabiṃduvulanu sūkṣmarūpamulōnunna vāyuvutō kalisi (Hydrogen gas + Oxygen = Water) varṣamugā mārunani manaśāstravēttalu ceppucunnāru. idi cālā sūkṣmamaina pariṇāmamu - dīninē manavāru ‘apūrvamu’ (kāraṇamu kānarāni pariṇāmamu) ani ceppiyunnāru - aṭlēkarmaphalamunaku kūḍa apūrva siddhāṃtamē vartiṃcunu - karma eppuḍu ē rītiphalamu, ekkaḍa iccunō anu viṣayamu kūḍa manapūrvulaku telisina viṣayamē - balarāmuḍu rukmiṇīdēvitō iṭlaniye –

śā .”tōḍaṃ buṭṭinavāni bhaṃgamunakun duḥkhiṃci mā kṛṣṇu ne

ggāḍaṃ jūḍakumamma; pūrvabhavakarmādhīnamai prāṇulan

kīḍun mēlunu jeṃdu; lēḍokaḍu sikṣiṃpaga rakṣiṃpa;

tōḍaṃbuṭṭuvu karmaśēṣa paribhūtuṃḍayye nēḍīyaḍan”. (pōtana telugu bhāgavatamu-10.1-1775)

(ī rōjuna, ikkaḍa, ī prakāramu karmaphalamanubhaviṃcenu). dīni prakāramu paddati eṭlō teliyadukanuka karmagati ‘gahanā’ (gūḍhamu) ani ceppabaḍinadi). (cūḍumu –‘karma cakramu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.