(విహిత కర్మలకును నిషిద్ధకర్మలకును రాగద్వేషములు కారణములు - ఆ కర్మలయందు అనురాగము - ఆసక్తి - కలిగియుండుట, కొన్నింటియందు ఇష్టములేకుండుట).
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వ కర్మణాం |
’అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధం |
వివిథాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం’ ||
(అధిష్టానం శరీరం, కర్తా భోక్తా జీవాత్మ, కరణం శ్రోత్రాది, చేష్టా వాయ వీయాః ప్రాణాపానాద్యాః; పంచాత్మావాయుః, తద్వత్తివాచినా క్రియాః, దైవం పరమాత్మ, అంతర్యామి; అదృష్టం శాస్త్ర సిద్ధే విపరీతే ప్రతిషిద్ధేవాకర్మణి శరీరే, వాచికే మానసేచ పంచైతేహి తవః కారాణాః”
(కర్మలు శాస్త్రసిద్ధమైనవికాని, ప్రతిషేధించబడినవికాని - శారీరకములు, వాచికములు, మానసికములు అని మూడు విధములు. ఈ కర్మలు అన్నింటికీ కారణములు అయిదు - అధిష్టానము అనగా శరీరము; కర్త, భోక్త అయిన జీవుడు; కరణము అనగా ఇంద్రియములు - కర్మేంద్రియములు, మనస్సు, చేష్ట అనగా ప్రాణము, అపానము మొదలగు పంచప్రాణములు, వాటి వృత్తులు - పనులు. దైవము అనగా పరమాత్మ, సర్వాంతర్యామి, లేక అదృష్టము. ఈ అయిదు కర్మలకు కారణము).
(ఇంద్రియములు అని చెప్పినపుడు జ్ఞానేంద్రియములు అనిన్నీ, దైవము అను నప్పుడు ఇంద్రియముల అధిదేవతలు యని కూడ తెలియనగును - ఇట్లు కర్మకు కారణములు అయిదు ఉండగా అజ్ఞానముచేత నేనే కర్తను, కారణము ఈ కర్మలకు అని తలచువాడు దుష్టబుద్ధి కలవాడు. ఎవడు ఈ అయిదుకారణములను తెలుసుకొనునో వాడు ఈ లోకములను, లోకములలోని జీవులను చంపినప్పటికీ చంపనివాడే, ఆ కర్మఫలము వానినంటదు.
“ఉ. కర్మవశంబునన్ జగము గల్గును హెచ్చు నడంగు నన్నచో
గర్మము బుద్ధి జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా
కర్మమునందు గర్తయనగా విలసిల్లగజాలదీ జగ
త్కర్మక కార్యకారణము గావున నీశుడు, విష్ణుడారయన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 22 - 581)
(vihita karmalakunu niṣiddhakarmalakunu rāgadvēṣamulu kāraṇamulu - ā karmalayaṃdu anurāgamu - āsakti - kaligiyuṃḍuṭa, konniṃṭiyaṃdu iṣṭamulēkuṃḍuṭa).
sāṃkhyē kṛtāṃtē prōktāni siddhayē sarva karmaṇāṃ |
’adhiṣṭhānaṃ tathā kartā karaṇaṃ ca pṛthagvidhaṃ |
vivithāśca pṛthak cēṣṭā daivaṃ caivātra paṃcamaṃ’ ||
(adhiṣṭānaṃ śarīraṃ, kartā bhōktā jīvātma, karaṇaṃ śrōtrādi, cēṣṭā vāya vīyāḥ prāṇāpānādyāḥ; paṃcātmāvāyuḥ, tadvattivācinā kriyāḥ, daivaṃ paramātma, aṃtaryāmi; adṛṣṭaṃ śāstra siddhē viparītē pratiṣiddhēvākarmaṇi śarīrē, vācikē mānasēca paṃcaitēhi tavaḥ kārāṇāḥ”
(karmalu śāstrasiddhamainavikāni, pratiṣēdhiṃcabaḍinavikāni - śārīrakamulu, vācikamulu, mānasikamulu ani mūḍu vidhamulu. ī karmalu anniṃṭikī kāraṇamulu ayidu - adhiṣṭānamu anagā śarīramu; karta, bhōkta ayina jīvuḍu; karaṇamu anagā iṃdriyamulu - karmēṃdriyamulu, manassu, cēṣṭa anagā prāṇamu, apānamu modalagu paṃcaprāṇamulu, vāṭi vṛttulu - panulu. daivamu anagā paramātma, sarvāṃtaryāmi, lēka adṛṣṭamu. ī ayidu karmalaku kāraṇamu).
(iṃdriyamulu ani ceppinapuḍu jñānēṃdriyamulu aninnī, daivamu anu nappuḍu iṃdriyamula adhidēvatalu yani kūḍa teliyanagunu - iṭlu karmaku kāraṇamulu ayidu uṃḍagā ajñānamucēta nēnē kartanu, kāraṇamu ī karmalaku ani talacuvāḍu duṣṭabuddhi kalavāḍu. evaḍu ī ayidukāraṇamulanu telusukonunō vāḍu ī lōkamulanu, lōkamulalōni jīvulanu caṃpinappaṭikī caṃpanivāḍē, ā karmaphalamu vāninaṃṭadu.
“u. karmavaśaṃbunan jagamu galgunu heccu naḍaṃgu nannacō
garmamu buddhi jūḍa jaḍakāryamu; gāni prapaṃca kalpanā
karmamunaṃdu gartayanagā vilasillagajāladī jaga
tkarmaka kāryakāraṇamu gāvuna nīśuḍu, viṣṇuḍārayan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 22 - 581)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.