← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మక్షయము karmakṣayamu

Original — తెలుగు

“నను క్షీయంతౌ చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే” (ముండకోపనిషత్ - 3 - 8)

ఇత్యాది శ్రుత్యా,

“జ్ఞానాగ్నిః స్సర్వకర్మాణి భస్మ సాత్కురుతే తథా”. (శ్రీమద్భగవద్గీత - 4 - 37)

ఇత్యాదిస్మృత్యచ జ్ఞానస్య సకల కర్మ క్షయ హేతుత్వ నిశ్చయే సతి ప్రాబ్దకర్మా వస్థానమనుపపన్న మితి చేత్, న - తస్య తావదేవ చిరం యాపన్న విమోక్ష్యే (అ)ధ సంపత్స్యతే” (ఛాందోగ్యోపనిషత్ - 24 - 2)

ఇత్యాది శ్రుత్యా “నా భుక్తం క్షీయతే కర్మ” ఇత్యాది స్మృత్యా చోత్పాదిత జ్ఞాన వినాశిత్వా వగమాత్ ” (వేదాంత పరిభాష)

(భగవత్సాక్షాత్కారము కలుగగానే - భగవత్ జ్ఞానము కలుగగానే - కర్మలన్నియు నశించిపోవును అని శ్రుతివాక్యమున్నది. భగవత్ జ్ఞానము అను అగ్ని కర్మలను భస్మము చేయును అని స్మృతి వాక్యముకూడ కలదు. వీటిని బట్టి బ్రహ్మజ్ఞానము సకల కర్మల నాశమునకు హేతువు అగుచున్నది - సాధకమగుచున్నది కనుక ప్రారబ్ద కర్మ నశింపదు అను విషయమే లేదు అనుటకు వీలు లేదు. ఎందుచేత ననగా - అనుభవించనిది కర్మ నశింపదు అని శ్రుతి చెప్పుటవలన ఫలమునిచ్చుటకు ఆరంభించని కర్మలు సంచితము మొదలగునవియే బ్రహ్మజ్ఞానమువలన నశించును. ప్రారబ్దకర్మ అనుభవమువలననే నశించును).

(ధనస్సు కలవాడు తన ధనస్సులో బాణము సంధించి దానిని విడువనంతవరకు ఆ బాణము అతని వశములోనుండును. బాణమును వదలిన తర్వాత అది దాని గురినికాని ఇతర వస్తువునుకాని తాకక మానదు. దాని వేగమున్నంతవరకు అది వెళ్ళును. దాని వేగమును ఆ ధనుర్ధరుడు అప్పుడు ఆప లేడు. ఆ ప్రకారముగానే యే కర్మ అయినను ఫలమునిచ్చుటకు ప్రారంభించినయడల (ప్రారబ్ద కర్మ) అది దాని ఫలముననుభవింప చేయనిదే క్షీణించదు - దాని వేగము, శక్తి తగ్గదు. ఈ విషయము శ్రీమద్భగవద్గీతలో ఈ క్రింద విధముగా చెప్పబడినది : - “కర్మణ్యేవాధికారస్తే; మాఫలేషు కదాచన” - కర్మ చేయుటయందే నీకు అధికారము కలదు కాని దాని ఫలమందుకాదు). దాని ఫలమది యివ్వకుండ నుండునట్లు చేయుటకు నీకు అధికారము లేదు. (చూడుము - కర్మఫలము - 4).

Transliteration

“nanu kṣīyaṃtau cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē” (muṃḍakōpaniṣat - 3 - 8)

ityādi śrutyā,

“jñānāgniḥ ssarvakarmāṇi bhasma sātkurutē tathā”. (śrīmadbhagavadgīta - 4 - 37)

ityādismṛtyaca jñānasya sakala karma kṣaya hētutva niścayē sati prābdakarmā vasthānamanupapanna miti cēt, na - tasya tāvadēva ciraṃ yāpanna vimōkṣyē (a)dha saṃpatsyatē” (chāṃdōgyōpaniṣat - 24 - 2)

ityādi śrutyā “nā bhuktaṃ kṣīyatē karma” ityādi smṛtyā cōtpādita jñāna vināśitvā vagamāt ” (vēdāṃta paribhāṣa)

(bhagavatsākṣātkāramu kalugagānē - bhagavat jñānamu kalugagānē - karmalanniyu naśiṃcipōvunu ani śrutivākyamunnadi. bhagavat jñānamu anu agni karmalanu bhasmamu cēyunu ani smṛti vākyamukūḍa kaladu. vīṭini baṭṭi brahmajñānamu sakala karmala nāśamunaku hētuvu agucunnadi - sādhakamagucunnadi kanuka prārabda karma naśiṃpadu anu viṣayamē lēdu anuṭaku vīlu lēdu. eṃducēta nanagā - anubhaviṃcanidi karma naśiṃpadu ani śruti ceppuṭavalana phalamuniccuṭaku āraṃbhiṃcani karmalu saṃcitamu modalagunaviyē brahmajñānamuvalana naśiṃcunu. prārabdakarma anubhavamuvalananē naśiṃcunu).

(dhanassu kalavāḍu tana dhanassulō bāṇamu saṃdhiṃci dānini viḍuvanaṃtavaraku ā bāṇamu atani vaśamulōnuṃḍunu. bāṇamunu vadalina tarvāta adi dāni gurinikāni itara vastuvunukāni tākaka mānadu. dāni vēgamunnaṃtavaraku adi veḷḷunu. dāni vēgamunu ā dhanurdharuḍu appuḍu āpa lēḍu. ā prakāramugānē yē karma ayinanu phalamuniccuṭaku prāraṃbhiṃcinayaḍala (prārabda karma) adi dāni phalamunanubhaviṃpa cēyanidē kṣīṇiṃcadu - dāni vēgamu, śakti taggadu. ī viṣayamu śrīmadbhagavadgītalō ī kriṃda vidhamugā ceppabaḍinadi : - “karmaṇyēvādhikārastē; māphalēṣu kadācana” - karma cēyuṭayaṃdē nīku adhikāramu kaladu kāni dāni phalamaṃdukādu). dāni phalamadi yivvakuṃḍa nuṃḍunaṭlu cēyuṭaku nīku adhikāramu lēdu. (cūḍumu - karmaphalamu - 4).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.