← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మఫలము karmaphalamu

Original — తెలుగు
    1. కర్మణః ఫలం - (కర్మయొక్క ఫలము - చేసిన కర్మవలన కలుగు ఫలము).

    2. సుఖ దుఃఖ లక్షణం కర్మఫలం. (కర్మఫలమనగా కర్మలవలన కలుగు సుఖదుఃఖములు).

    3. “యాదృశం కురుతే కర్మ తా దృశం ఫలమామ్నయాత్|

అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ||“. (శ్రీదేవీభాగవతము)

(ఎటువంటి కర్మచేసిన అటువంటి ఫలమే పొందును - చేసిన కర్మకు తగిన ఫలమే లభించును. పుణ్యకర్మ చేసినను పాపకర్మ చేసిననను దాని ఫలము అనుభవింపవలసినదే).

  1. “కర్మణా మనసా వాచా పరపదాం కరోతి యః |

తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చా శుభం ||“. (విష్ణుపురాణే)

  1. “యత్కాలం హి యత్సుఖం దుఃఖం వాత్మనా భుజ్యతే |

తస్వైవలోకే ఫలత్వం ప్రసిద్ధం ||“.

(ఏ కాలమందు ఏ వేళలో, యే సమయమందు సుఖముకాని దుఃఖముకాని అనుభవించుచున్నాడో అదియే కర్మఫలమని లోకములో ప్రసిద్ధి).

  1. “ఫలస్వ రూపాలు ఏవి అంటే ఈశ్వరుని నిగ్రహానుగ్రహత్మకమైన సుర నర తిర్య గాద్యనేక సుఖ దుఃఖః | ఫలాత్మకమైన అనేక సృష్టి స్థితి లయ సంపత్తి ఫలమనుభవించుకొనును - - సకల జంతువులున్నూ కర్మఫలస్వరూపములు కాని వేరే జగత్తు అనేది లేదు”

(బ్రహ్మవిద్యా సుధార్ణవము - 4)

  1. “జగత్సంహార నరకపాతాది సర్వం కర్మాయత్తం, న భగవత్కృతం, న భగవత్కృతం”.

(జగత్సంహారము, నరకములు మొదలగునవన్నియు కర్మ వలన కలిగినవే. ప్రపంచములో పుట్టుట, పెరుగుట, నశించుట - వీటికి సంబంధించినవన్నియు జీవులు చేయు కర్మ ఫలితముగవే జరుగుచున్నవి. భగవంతుడు వేరు వేరుగా ఒక్కొక్కనికి స్వయముగా కలుగ చేయడు).

  1. “కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధిః కర్మానుసారిణి” (భర్తృహరి - నీతి శతకం)

(పురుషులకు వారు చేసిన కర్మలవలననే ఫలము కలుగును. కర్మను అనుసరించే వారి బుద్ధియుండును. పూర్వ జన్మలో చేసిన కర్మను బట్టియే - దాని ఫలముగా ఈ జన్మలో కర్మలు చేయుచుందురు).

  1. “నైవాకృతిః ఫలతి, నైవ కులం, నశీలం, విద్యాపినైవ, న చ యత్న కృతాపిసేవా |

భాగ్యాని పూర్వ తపసా ఖలు సంచితాని ఫలంతి పురుషస్య, యధైవ వృక్షాః ||“. (భర్తృహరి - నీతిశతకం)

(పురుషుని ఆకారముకాని - సౌందర్యముకాని, కులముకాని, గుణముకాని, అతను నేర్చిన విద్యకాని - పాండిత్యముకాని - ఎంతో ప్రయత్నముతో చేసిన సేవకాని ఫలమునిచ్చునవికావు. భోగభాగ్యములననుభవించుటకు ఇవియేవియు కారణములుకావు. క్రిందటి జన్మలలో చేసిన తపస్సు - లేక, సికృత కర్మలే ఇప్పటి భోగభాగ్యములను కలుగచేసినవి. ఆ కర్మఫలమే ఇప్పటి భోగభాగ్యములు. ఆ కర్మలు కాలము గతించినకొలది పరిపక్వమైనపుడు – ఫలము నిచ్చుటకు కాలము వచ్చునపుడు ఈ భోగభాగ్యములు కలుగును. చెట్లు వాటికి అనుగుణమైన కాలము వచ్చునంతవరకు వేచియుండి, ఆ కాలము వచ్చినపుడు పుష్పించి ఫలమునిచ్చునట్లే - మొక్క వేసిన వెంటనే ఫలమునీయదు, పెరిగి, పెద్దదయి పుష్పించి ఫలమునిచ్చును).

  1. “దేవ మనుష్య తిర్యగాదులకు వేరే వేరే సంచితాగామి కర్మలయందు మానుష శరీరమందలి కర్మఫలమే స్వర్గనరకమోక్షాలకు కారణమై యుండును”. (బ్రహ్మ విద్యా సుధార్ణవము -2)

  2. “యద్వ్యంగాః కుష్ఠి నశ్చాంథాః పంగవశ్చ దరిద్రినః |

పూర్వోపార్జిత పాపస్య ఫలమశ్నంతి దేహినః ||“. (భోజరాజ చరిత్ర)

(పూర్వ జన్మలలో చేసిన పాపకర్మల వలననే కొందఱు మనుష్యులు కుంటివారుగను, కొందఱు గ్రుడ్డివారుగను, కొందఱు కుష్టురోగులగను, కొందఱు అంగలోపముగలవారుగను, మరికొందఱు బీదవారుగను జీవించుచుందురు). .

  1. - - పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ |

గీడున్ మేలును జెందు; లేడొకడు శిక్షింప రక్షిమ - - - ||“. (పోతన తెలుగు భాగవతము – 10.1 - 1775)

  1. “పుణ్యో వైపుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన ఇత్యాది శాస్త్రేన సుఖ దుఃఖయో ధర్మా ధర్మహేతుకత్వం అవగతం”.

(పుణ్య కర్మ చేయుటవలన పుణ్యాత్ముడు, పాప కర్మ చేయుటవలన పాపాత్ముడుగా జన్మించును అని చెప్పబడియుండుటచేత మానవులకు కలుగు సుఖ దుఃఖములకు వారు చేసిన పుణ్యపాపములే కారణములు - పుణ్యము చేసిన పుణ్యఫలము, పాపము చేసిన పాపఫలము కలుగును).

  1. “సంపత్తిర్వా విపత్తిర్వా పూర్వజన్మ నికృత స్వకర్మాయత్తా, తదధీనా భవతి; తతః తయోః కర్తాపి స్వయమేవ భవతి. తస్మాత్ కర్మానురూపం ఫలం భవిష్యత్యేవ న కాతరతయా తన్నాశో భవిష్యతి”.

(సంపదగాని, ఆపదగాని పూర్వ జన్మలో చేసిన తన కర్మవలన కలిగినదే, అందుచేత ఆ కర్మకు ఆధీనమై యుండునదే, ఆ కర్మనుబట్టియే యుండును. అందుచేత ఆ సుఖ దుఃఖములకు కర్త తానే యగుచున్నాడు. చేసిన కర్మకు అనుగుణమైన ఫలమే కలుగుచున్నది. అది భయపడినందువలన పోవునదికాదు).

  1. వ. “వర్తమాన వసంతాది కాలంబు భూత భావి వసంతాది కాలయోగ్యంబైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబెట్లు సేయునట్లు భూత భావి జన్మంబులకు ధర్మా ధర్మంబులు నిదర్శనంబులు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - 88)

  1. కర్మ ఏ రూపముగ ఫలము నిచ్చును ?

    1. శ్లో.|| యాదృశం కురుతే కర్మ తా దృశం ఫలమామ్నయాత్ |.

(ఎటువంటి కర్మచేసిన అటువంటి ఫలమే అనుభవించును).

  1. “పుణ్యాద్దేవత్వ మాప్నోతి, పాపై స్థావరతామియాత్ |

సమాఖ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే నరః ||“.

(పుణ్యకర్మలవలన దేవతులై పుట్టుదురు, పాపకర్మలవలన స్థావరములై - చెట్లు మొదలగునవిగా - పుట్టుదురు - పుణ్య పాపకర్మల మిశ్రమమువలన మానవులై పుట్టుదురు).

  1. “యవాః ప్రకీర్ణాః న భవంతి శాలయః”.

(యవలు జల్లిన వరి పండదు. పూర్వ జన్మలో పాపకర్మ చేసినయడల ఈ జన్మలో పుణ్యఫలము లభించదు).

  1. “శుభేన కర్మణా యాతి స్వర్లోకాది కమేవ చ |

కరమాచా శుభేనైవ భ్రమంతి నరకేషు చ |

- - - రోగీ కుకర్మణా జీవశ్చ అరోగీ శుభ కర్మణా |

దీర్ఘ జీవీచ దీర్ఘాయుః సుఖీ చ కర్మణా |

అంధాదయ శ్చాంగ హీనాః కర్మణా కుత్సి తేనచ |

సుద్ధ్యాదికమ వాప్నోతి సర్వఓత్కృష్టేన కర్మణా ||’. (దేవీ భాగవతము -)

(పుణ్యకర్మచేత స్వర్గలోకము మొదలగునవి పొందును; అశుభకర్మచేత - పాపకర్మచేత - నరకమందు భ్రమించెదరు. చెడ్డకర్మలవలన రోగులుగను మంచికర్మవలన రోగము లేనివారుగను, మంచికర్మ వలన దీర్ఘాయువు కలవారుగను సుఖము గలవారుగను, కుత్సిత కర్మవలన - గ్రుడ్డివారుగను అంగహీనులుగను, వికలాంగులను పుట్టెదరు - అన్నిటికంటెను ఉత్కృష్టమైన కర్మవలన.

  1. “ఊర్థ్వం గచ్ఛంతి సత్వస్థాః అధోగచ్ఛంతి తామసాః |”.

(సత్వగుణముకలవారు పుణ్యకర్మలు చేయుటవలన స్వర్గము మొదలగు ఊర్థ్వ లోకములను పొందుదురు - తామసగునము గలవారు పాపకార్యములు చేసి అధోలోకములైన నరకాదులను పొందుదురు - హీనమైన జన్మలను పొందుదురు).

  1. “వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్టాః ప్రేత్య, లరమ ఫలమనుభూయ తతః శేషేణ విశిష్టదేశ, జాతి, కుల, ధర్మ ఆయుః శ్రుతవిత్త వృత్త సుఖమేధసో జన్మ ప్రతి పద్యంతే |”. (గౌతమబుద్ధ సూత్రములు)

(స్వకర్మనిష్టులు తమతమ వర్ణములకు, ఆశ్రమములకు సంబంధించిన ధర్మములను పాటించుటయందు నిష్టకలిగి యుండువారు చనిపోయి కర్మఫలముననుభవించి తిరిగి మిగిలిన కర్మవలన విశిష్టమైన దేశములో, జాతిలో కులములో ఆయుష్మంతులై, శ్రోతలై, సుఖవంతులై, మేథావంతులైన జన్మమెత్తుదురు).

  1. “స్నాన తపో యజ్ఞ, వసన, భూషణాన్న ప్రదానాది సుకర్మబులవలన స్వర్గాది పుణ్యలోక ప్రాప్తియు, బ్రహ్మ వాసనా, సుజన తిరస్కరణ, పరధన పరదారాద్యపహరణ, మృషావాది ప్రముఖ దుష్కర్మంబులవలన నిరయనివాసంబును సిద్ధించు. స్వర్గనరకాది సంబంధంబులు జీవులకు స్వకర్మ ఫలభోగైక విన్యాసంబులుగావున బునర్జన్మ కారణంబులై యుండు”

(కులశేఖరమహీపాలచరిత్ర - 2 - 122)

  1. “ప్రతిషిద్ధ లక్షణంబగున ధర్మంబాచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగానె యుండు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 30)

  2. “కర్మణా పితృలోక ప్రాప్తిః.” (నిత్యనైమిత్తిక కర్మలు చేయుటవలన పితృలోకమును పొందును).

  3. “ఈశ్వరో కాంశ్చి దత్యంత సుఖ భాజః కరోతి దేవాదీన్, కాంశ్చిదత్యంత దుఃఖభాజః కరోతి, పశ్వాదీన్ - కాంశ్చిన్మధ్యమ భోగ భాజో మనుష్యాదీ నిత్యేవం విషమా సృష్టిః - - - సృజ్యమాన ప్రాణి ధర్మాధర్మాపేక్షా విషయా సృష్టిరితి నాయ మీశ్వరస్యా పరాధః. ఈశ్వరస్తు వర్జన్యవ ద్రష్టవ్యః - యథాహి వర్జన్యో వ్రీహియవాది సృష్టౌ సాధారణం కారణం భవతి, వ్రీహియవాది వైషమ్యేతం తత్తద్బీజగతాన్యేవా సాధారణాని సామర్థ్యాని కారణాని భవంతి. ఏవమీశ్వరో దేవేవ మనుష్యాది సృష్టౌ సాధారణం కారనం భవతి, దేవమన్ష్యాది వైషమ్యేతు తత్తద్బీజగతా న్యేవా సాధరణాని కర్మాణి కారణాని భవంతి. ఏవమీశ్వరస్యాపేక్షత్వాన్న వైషమ్య నైర్ఘ్యణా ఖ్యాం దుష్యతి - - శ్రుతిః -”ఏష హ్యేవసాధుకర్మ కారయతి తం య మేణ్యో, లోకే బ్యః ఉన్ని నీషతే. ఏష ఏవా సాధు కర్మకారయంతి తం యమధోని నిషతే” ఇతి - స్మృతిః –

“యే యథా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహం”. (శ్రీమద్భగవద్గీత - 4 - 11)

“సదేవ సోమ్యేద మదగ్ర ఆసీదేకమేవా ద్వితీయమితి ప్రాక్సృష్టే రవి భాగావధారణాన్నస్తి కర్మ యదపేక్షయా విషమా సృష్టిస్యాత్, సృష్ట్యుత్తర కాలేహి శరీరది విభాగా ద్యపేక్షం కర్మ కర్మాపేక్షశ్చ శరీరాది విభాగ ఇతీతరేతరాశ్రయత్వం ప్రపజ్యేత - - - అనాది త్వాత్సంసారస్య భవేదేష యధ్యాది మానయం సంసారస్యాత్. అనాదౌతు సంసారే బీజాంకుర వద్దేతు హేతు మద్భావేన కర్మన సర్గ వైషమ్యస్య చ ప్రవృత్తి ర్నవిరుద్ధ్యతే కథం పునరేత దవగమ్యతే అనాది రేష సంసార ఇతి”.

(శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే - 2 - 1 - 34, 35)

(ఈశ్వరుడు కొందఱిని దేవతలు మొదలగు అత్యంత సుఖజీవులుగను, కొందఱినిపశువులు మొదలగువాటిని అత్యంత దుఃఖజీవులుగను, మఱికొందఱిని మనుష్యులవలె మధ్యమ జీవులుగను, అనగా, సుఖ దుఃఖములు రెంటిని అనుభవించువారివలె - వ్యత్యాసములతో సృష్టించుచున్నాడు. ఇది ఆయా జీవుల ధర్మా ధర్మములబట్టి - సుకృత దుష్కృత కర్మలబట్టి - చేయుచున్నాడే గాని ఈ విషమ సృష్టికి ఈశ్వరునివలన తప్పులేదు. ఈశ్వరుడు వర్షమేఘమువలెనే ప్రవర్తించును అని తెలుసుకొనవలెను - వ్రీహియవాదులు - ధాన్యములు - అన్ని రకములు పుట్టుటకు మేఘము (వర్షమేఘము) సాధారణకారణము - అన్నింటికీ ఒకే కారణముధాన్యములలోని తేడాకు ఆయా ధాన్యములయొక్క ఆయా బీజములలోని తేడావే అసాధారణ కారణము - భగవంతుడు అందఱికి ఒకేరీతిగానుండు సాధారన కారణము. అందుచేత ఈ సృష్టిలో కనబడుచున్న వైషమ్యమునకు ఈశ్వరుడు కారణముకాదు. దుఃఖ జీవులుగా సృష్టించుటలో ఈశ్వరుడు నిర్దాక్షిణ్యుడు అనుట తగదు.” ఎవరు పుణ్యకర్మ చేయుదురో వారిని భగవంతుడు ఈ లోకమునుండి పైలోకములకు తీసుకొనిపోవును - ఉత్తమలోకములను పొందించును. ఎవడు పాపకర్మ చేయునో వానిని భగవంతుడు అధోలోకములను పొందించును; లేక, ఎవడిని ఉత్తమలోకములను పొందింప తలచునో, అట్టివానిచేత భగవంతుడు పుణ్యకర్మలు చేయించును. శ్రీమద్భగవద్గీతలో ఈ విషయము ఈ క్రింద విధముగా చెప్పబడినది : - “ఎవడు నన్ను ఏ ప్రకారముగా భజించునో వానిని నేను ఆ ప్రకారముగానే అనుగ్రహించెదను” - ఈ భగవద్గీతా శ్లోకమునకు ఈ క్రిందవిధముగా వ్యాఖ్యానము చేయబడినది” –

“యే జ్ఞాన తపసా పూతాస్త్వద్భావం యాంతి తెజనాః |

నచేత రేచేతి వైషమ్యం ఫలదాతుస్త వేతి చేత్ |

శృణ్వర్తా విత్త కామాశ్చ జ్ఞాని నశ్చ ముముక్షపః |

సకామత్వేన నిష్కామతయా యే మాం యధ్గేశ్వరం |

సమస్త ఫలదాతారం భజంతే తాం స్త దైవచ |

తదభీష్ట ప్ర్దానేన త్వను గృహ్ణామ్యహం హరిః |

ఆర్తానార్తి వినాశేన విత్తదానేన చార్థినః |

జిజ్ఞాసూన్ జ్ఞానదానేమ్న, జ్ఞానినో మోక్షదానతః |

అనిగృహ్ణోమ్యహం స్వామీ నాన్య కామా యాన్య థా |

ఫలార్థిత్వే ముముక్షుత్వే హరిరేవ నృణాం గైః ||“. (గీతాభావప్రకాశము - 4 - 70 - 75)

(జ్ఞాన యజ్ఞమును చేసిన మహానుభావులే నన్ను పొందగలరు, ఇతరులు పొందలేరు - అట్లైనచో భగవంతునికి ప్రజల యడల వైషమ్యము కలిగియున్నట్లు స్ఫురించును ఇట్లుకాదు అని భగవంతుడు ఇట్లు చెప్పెను - సమస్తమునకు ఈశ్వరుడను, అన్ని విధములైన ఫలమును ఇచ్చువాడను అయిన నన్ను ఆర్తులుగాని, ధనముకోరువారుగాని, జ్ఞానులుకాని, మోక్షమును కోరువారుగాని, ఎవరు ఏ కోరికతో ఏ ఫలమునాశించి నన్ను భజించెదరో - ఉపాసన చేసెదరో - వారికి వారి వారి కోరికను నెఱవేర్చి అనుగ్రహించెదను - అది ఎట్లనగా - ఆర్తునకు వాని బాధను పోగొట్టెదను. ధనము కోరినవారికి ధనమునిచ్చెదను. జిజ్ఞాసువులకు బ్రహ్మజ్ఞానము నిచ్చెదను. జ్ఞానులకు మోక్షమునిచ్చెదను – ‘జ్ఞానముచేతనే కైవల్యము’ అని చెప్పబడినదికనుక. అంతేగాని ఒక కోరిక కోరి నన్ను భజించినావనికి ఇతరవిధముగా అనుగ్రహించను. కర్మ ఫలమును కోరుటకుగాని, మోక్షమును కోరుటకుగాని, మనుజులకు భగవంతుడే గతి, పొందతగినవాడు. ఇవ్వగల శక్తిమంతుడు).

(సృష్టికి ముందు ఆత్మ ఒకటే యుండెను - అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి కనుక అప్పటిలో కర్మయను నది యుండుటకు అవకాశము లేదు, దాని ఫలము కలుగుటకును అవకాశము లేదు. అప్పటిలో ఇప్పటివలె వేరు వేరు వస్తువులు లేవు. అందుచేత విషమసృష్టికి (సృష్టిలో ఒక వస్తువునకు ఇంకొక వస్తువునకు గల వ్యత్యాసమునకు) అవకాశము లేదు. సృష్టి అయిన తర్వాత శరీరములు కలుగుట, వాటివలన కలుగు కర్మలు, కర్మలు చేయుటవలన వాటి ఫలముననుభవించుటకై మరల శరీరమునెత్తుట, ఈ రీతిగా ఒకదాని తరువాత నొకటి, ఒకదానికార్యముగా నింకొకటి కలుగుటకు అవకాశము కలిగినది. ఇట్లు అయిన యడల మొదట లేనికారణమునకు తర్వాత ఫలమెట్లుకలుగును. దేనికైనను కారణముండవలెను - మొదటిలో కర్మఫలరూపమైన సంసారము లేనపుడు తరువాత సృష్టి ప్రకారములో ఎట్లు కలిగెను. అందుచేత సృష్టి - సంసారము - అనాది, మొదలు లేనిది, ప్రారంభములేనిది. అందుచేత కర్మ చేయుట, ఫలముననుభవించుటకు - జన్మమెత్తుట అను సంసారమునకు మొదలులేదు - ఇది ప్రవాహరూపముగా జరుగుచు వచ్చుచున్నదనే గ్రహించవలెను).

(భగవంతుడు అనాది, ఆది లేనివాడు, జన్మ లేనివాడు, మొదలు ఎప్పుడో ఏ రీతిగనో తెలియదు. భగవంతుడు వలెనే ప్రకృతి - సంసారము - అనాది, భగవంతుడు ఉన్నదగ్గరనుండి ఉన్నది. అందుచేత ఈ సంసారమునకు బీజాంకురన్యాయము, హేతువర్భావము, కారణము కలిగియుండుట, మొదలు పెట్టుట లేనిది).

  1. “నచోపచితానాం కర్మణా మియత్తా (అ) స్తిసంసారస్యానాది త్వాత్”

(సంసారమనగా పుట్టుట, చనిపోవుట, కర్మఫలమనుభచించుటకు మరల పుట్టుట, మరల చనిపోవుట. ఇది చక్రమురీతిగా ఈ ప్రకారముగా జరుగుచునే యుండును. ఇది ఎప్పుడు మొదలు పెట్టినదో తెలియదు. అందుచేత ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తితిమో, ఎన్ని, ఎన్ని కర్మలు చేసితిమో. ఎన్నికర్మల ఫలమనుభువించితిమో, ఇంకను ఎన్ని జన్మలు చేయుదమో ఆ కర్మఫలము లెన్ని అనుభవించవలసియున్నదో, ఇది ఎప్పటికి అంతమగునో తెలియదు. జన్మలు పెరుగుచునే యుండును, వాటితో కర్మలు పెరుగుచునే యుండును.జన్మలు ఇంతే అని కాని, వాటి ఫలము ఇంతే అనిగాని, దీనితో సరియనిగాని చెప్పుటకు వీలులేదు).

  1. “స పరమేశ్వరః సర్వాధ్యక్షః సృష్టి స్థితి సంహారాన్ విచిత్రాన్ విదధద్ధేశకాల విశేషాభి జ్ఞాత్వాత్ కర్మణా కర్మాను రూపం ఫలం సంపాదయతి ఇత్యుప పద్యతే. కర్మణస్తు అనుక్షణ వినాశినః కాలాంతర భావిఫలం భవతీత్యనుపపన్నం, అభావాద్వా బావానుత్పత్తేః. యత్కాలం హి యత్సుఖం దుఃఖం వాత్మనా భుజ్యతే తస్యైవ లోకే ఫలత్వం ప్రసిద్ధం”

(శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే)

(సర్వాధ్యక్షుడైన - అన్నింటిలోను అధివసించి అన్నింటిని చూచువాడైన - పరమేశ్వరుడు సృష్టి స్థితి సంహారములను విచిత్రములను చేయువాడగుటచేతను, దేశకాలవిశేషముల నెఱిగియుండువాడగుటచేతను కర్మచేత కర్మకు అనుగుణమైన ఫలము కలుగునట్లు చేయుచున్నాడు అనుటయే ఉపపన్నమగుచున్నది. కర్మ క్షణములో నశించునది, ఏ క్షణమున చేసినది ఆ క్షణముతో సరి. ఆందుచేత అట్టికర్మ ముందుకాలమందు ఫలమునీయ గలదు అనుట ఉపపన్నముకాదు. అభావమువలన భావము పుట్టుటలేదుకదా! ఎప్పుడు ఏ సుఖము కాని కష్టముకాని కలుగునో అదియే ఫలమని లోకములో ప్రసిద్ధి).

  1. “అచేతనస్య కర్మణః స్వతః ప్రవృత్య యోగాత్ సేవాది దృష్తాంతానుసారి శ్రుతేర్బలీయత్వాత్ సర్వ వేదాంతేషు ఈశ్వరస్య జగద్ధేతుత్వ శ్రుతేశ్చ ఈశ్వరాధిష్టి తాత్ కర్మణః జగదంతః పాతి ఫలసిద్ధి. రితి సముదా యార్థః”.

(అచేతనమైన కర్మ స్వతః ప్రవృత్తి లేకపోవుటచేతను (inert) ఉపనిషత్తులన్నింటిలోను పరమాత్మ జగత్తునకు కారణమని చేప్పబడుటచేతను, ఈశ్వరుడు కర్మను అధిష్టించియుండుటచేతను భగవంతుడే ఫలమునిచ్చును అనుట మొత్తముమీద అర్థమగుచున్నది).

“న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |

న కర్మఫలసం యోగం స్వభావస్తు ప్రవర్తతే ||“. (శ్రీమద్భగవ్ద్గీత - 5 - 14)

(పరమాత్మ లోకమున కర్తృత్వముగాని, కర్మలను గాని చేయడు, కర్మఫలమునుకూడ ఇవ్వడు - అంతయు స్వభావమువలననే కలుగుచున్నది. కాని అన్నింటిలోను తాను ఉండి వాటికి చైతన్య శక్తి ఇచ్చుచుండుటవలన అవి వాటి స్వభావమువలన ఆయా కర్మలను చేయుటకు వినియోగించుకొనుచున్నవి. ప్రతిభూతములోను తానుండుటచేత ఒకదాని చేత ఇంకొక దానికి కష్టసుఖములు కలిగించుచుండును. –

“క. భూతములచేత నెప్పుడు

భూతములకు జన్మమరణ పోషణములు ని

ర్ణీతములు చేయుచుండును

భూతమయుండీశ్వరుండు భూత శరణ్యా “. (పోతన తెలుగు భాగవతము - 1 - 378)

  1. “ఉ. కర్మవశంబునన్ జగము కల్గును హెచ్చునడంగునన్నచో

గర్మము బుద్ధిజూడజడకార్యముగాని ప్రపంచకల్పనా

కర్మమునందు గర్తయనగా విలసిల్లగజాల దీ జగ

త్కర్మక కార్య కారణముగావున నీశుడు విష్ణు డారయన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 22 - 581)

  1. కర్మఫలము అనుభవించి తీరవలసినదే - అనుభవముతోనే కర్మఫలము క్షీణించును -

    1. “అవశ్యమేవ భోక్తవ్యం కృతంకర్మ శుభాశుభం”. (శ్రీదేవీ భాగవతం)

(చేసిన కర్మ పుణ్యమైనదైనను, పాపకర్మ అయినను అనుభవించక తప్పదు).

  1. “నా భుక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతైరపి”. (దేవీ భాగవతము)

(కోట్ల కల్పములు గడచినను అనుభవించనిదే కర్మ క్షీణించదు).

  1. “చ. ధన పశు మిత్ర పుత్ర గృహకారణ భూతమైన యీ

తనువున నున్న జీవుడ పదంపడి యట్టి శరీరమెత్తి తా

ననుగతమైన కర్మఫలమందకపోవరాదు మింటబో

యిన భువి దూఱినన్ దిశలకేగిన నెచ్చటనైన డాగినన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 - 1008)

  1. సంచితకర్మ, ఆగామికర్మ కొన్ని పరిస్థితులలో నశించినను ప్రారబ్దకర్మ - ఫలమునిచ్చుటకు ప్రారంభించినకర్మ - ఫలమును పూర్తిగా అనుభవింపచేయక క్షీణించదు - “తద్విజ్ఞానేన ఆగామి సంచితార్దాశో వినశ్యతి. స్థూల దేహారంభ కత్వేన యావద్దేహ భావి ప్రారంభకర్మతత్ జ్ఞాన విజ్ఞానాభ్యాం న నశ్యతి. తస్య ప్రవృత్త ఫలత్వేన అనుభవ నాశ్యత్వాత్. యది సమ్యక్ జ్ఞానం జాయతే తదా ఆగామ్యాది కర్మత్రయ స్థూలాది భాగత్రయం క్షీయతే తత్వజ్ఞానం చేత్ తదర్థ మాత్రాంశో (అ) పి నిశ్శేషం క్షీయతే. ఇత్థం వ్యావిద్ధ హృదయగ్రంధి సంశయ జాలస్య అస్య తత్వ జ్ఞానినః ఆగామి సంచితా రబ్ద కర్మాణ్యపి నిశ్శేషం క్షీయంతే, అపహ్నవం యాంతి.”

(స్థూలదేహము మొదలైన తర్వాత దేహము నశించువరకు పాపఫలము నిచ్చుటకు ప్రారంభమైన కర్మ - ప్రారబ్ద కర్మ - జ్ఞానముచేత, విజ్ఞానముచేతగాని నశించదు - అది ఫలమునిచ్చుటకు అరంభించినది కనుక దాని ఫలము అనుభవింపచేయును - అది అనుభవమువలననే నశించును - సమ్యక్ జ్ఞానము కలుగగనే ఆగామి మొదలగు కర్మలు మూడు వంతులు క్షీణించును. తత్వజ్ఞానము కలిగినపిదప సగము భాగము నశించును. సంశయములు నివర్తించినతర్వాత తత్వజ్ఞానియొక్క ఆగామి, సంచిత, ప్రారబ్దకర్మలు నిశ్శేషముగా నశించును).

  1. కొన్ని కర్మలు ఫలమనుభవింపచేయకయే క్షీణించును -

    1. “ఇవ్విధంబున కర్మంబులు సంసారహేతుకంబులయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ముజఱిపి కొననోపియుండు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 73)

ఈశ్వరార్పణము ఎట్లు చేయవలెననగా : -

“కాయేనవాచా మనసేంద్రియై ర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ |

కరోమియద్యత్సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి ||“.

(శరీరముచేత గాని, వాక్కు చేతగాని, మనస్సుచేగాని, ఇంద్రియములచేతగాని, బుద్ధిచేతగాని, ప్రకృతి స్వభావముచేతగాని నేను ఏ పని చేసినను దానిని నారాయణునికొఱకు సమర్పించుచున్నాను).

  1. “బ్రహ్మణ్యా ధాయకర్మాణి సంగం త్యక్త్వాకరోతియః |

లిప్యతే న స పాపేన పద్మ పత్ర మివాం భసా ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 10)

యధా పద్మ పత్రం అంభసా సంస్పృష్ట మపి న లిప్యతే, తథా కర్మ కుర్వన్నపి బ్రహ్మణి - ఇంద్రియాణాం ప్రకృతిపరిణామ విశేషరూపత్వేన ఇంద్రియా కారేణ అవస్థితాయాం ప్రకృతౌ - కర్మ ఆధాయ ఫలసంగం త్యక్త్వా, నైవకించిత్కరోమితి యః కర్మాణి కరోతి సః ప్రకృతి సంస్పృష్టతయా వర్తమానోపి ప్రకృత్యాత్మాభిమాన రూపేణ బంధహేతునా పాపేన నలిప్యతే” (శ్రీరామానుజః)

(తామరాకు నీటిని అంటి యున్నప్పటికీ నీటి కల్మషము తామరాకునకు అంటనట్లు కర్మ చేయుచున్నప్పటికీ పరబ్రహ్మ నిమిత్తమే నేనీ కర్మ చేయుచున్నాను అని కర్మఫలమును విడిచిపెట్టి, నేను ఏ కర్మయును చేయలేదు, ప్రకృతిలోనే వర్తించుచున్నాను, అను కర్తృత్వాభిమానము వలన కలుగు దోషమును పొందడు - ఆ కర్మ అతనిని బంధించదు దాని ఫలమును అనుభవింపచేయదు).

“యః అతత్వవిత్ ప్రవృత్తశ్చ కర్మయోగే కర్మ బ్రహ్మణి ఈశ్వరే ఆధాయ నిక్షిప్య, ‘తదర్థం కర్మ కరోమి’ ఇతి భృత్య ఇవ స్వామ్యర్థం సర్వాణి కర్మాణి మోక్షే (అ) పి ఫలే సంగం త్యక్త్వా కరోతి, సః పాపేన న లిప్యతే - యథా పద్మ పత్రం ఇవ అంభసా ఉదకేన కేవలం సత్వశుద్ధి మాత్రం ఏవ ఫలం తస్య తత్కరణః” (శ్రీశంకరః)

(ఆత్మ తత్వము తెలియనివాడు కర్మయోగమందు ప్రవృత్తుడైనవాడు తాను చేయు కర్మ పరమాత్మయందు సమర్పించి, యజమాని కొఱకు కర్మ చేయు సేవకునివలె‘భగవంతుని కొఱకు నేనీ కర్మ చేయుచున్నాను’ అను అభిప్రాయముతో సమస్తమైన కర్మలను వాటి ఫలమందాసక్తి లేక - మోక్షఫలమందైనను ఆసక్తి లేక - చేయువానికి పాపము అంటదు - ఆ కర్మలయొక్క ఫలము అంటదు, తామరాకుకు నీటితో సంబంధముండునట్లే. అట్టివానికి ఆ కర్మయొక్క ఫలము సత్వశుద్ధి కొఱకు మాత్రమే యగును).

  1. “యధైధాంసి సమిద్ధో(అ)గ్నిః భస్మసాత్ కురుతే (అ)ర్జున |

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మ సాత్కురుతే తథా ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 37)

(బాగా మండుచున్న అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా కాల్చివేసి బూడిద చేయునో, ఆ ప్రకారముగానే ప్రారబ్ద కర్మలుతప్ప, మిగిలిన సమస్త కర్మలు - సంచితములు ఆగామిలు - అప్పటికి ఫలనిచ్చుటకు అవకాశములేక మిగిలియున్నవన్నియు, వాటికి కారణమైన అజ్ఞానము నశించినందున, జ్ఞానము - బ్రహ్మజ్ఞానమి కలిగినంతనే నశించును).

  1. “భిద్యతే హృదయగ్రంధిశ్చ ద్యంతే సర్వసంశయాః |

క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ||’.

(పరమాత్మను తెలుసుకొనినచో - భగవత్సాక్షాత్కారము కలిగినచో - హృదయగ్రంధి - ముడి - విడిపోవును, సంశయములన్నియు తీరిపోవును, కర్మలన్నియు నశించిపోవును).

  1. కర్మ ఫలము అనేక విధములుగా నున్నది : -

    1. “ద్వివిధానికర్మఫలాని - నియతాని అనియతాని తి చ ప్రబల శాపాది సంభవాని నియతాని, ఇతరాణి అనియతాని అనియతత్వం చ తేషాం దేశకాలాద్య పేక్షయా, నతు స్వరూపతః, యేన కర్మణాం నిష్ఫల ప్రసంగస్యాత్”.

(కర్మఫలములు రెండు విధములు - నియతములు, అనియతములు. ప్రబలమైన శాపము మొదలగువాటివలన కలుగునవి నియతములు. మిగిలినవి అనియతములు - అనియతములు వాటి దేశకాలములనుబట్టి అట్టివని చెప్పబడినవి, స్వభావముగా అనియతములుకావు) –

“క. ధరణీసుర శాపమునకు

హరిహరబ్రహ్మాదులైన నడ్డము గలరే

నరులనగ నెంతవారలు

గరమరుదుగ పూర్వజన్మ కర్మము దోపన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 25 - )

దూర్వాస మహర్షి శాపమువలన శ్రీమహావిష్ణువు మత్స్య, కూర్మ, వరాహాది అవతారములను - రూపములను ధరించవలసి వచ్చెను - కాని అవి ప్రపంచకల్యాణముకొఱకే ఫలించెను - ఇటివంటి కర్మఫలము నియతము - ఫలము ముందుగనే నియమించబడినది. అనియతములు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా వచ్చునో తెలియనివి. అయినను ఆ ఫలములు కలుగుట దేశము, కాలము, రీతి అతిసూక్ష్మమైన అపూర్వమను ధర్మము (natural law) ననుసరించియే యుండును –

“తోడంబుట్టినవాని భంగమునకుం దుఃఖించి మా కృష్ణు నె

గ్గాడం జూడకు మమ్మ; పూర్వభవ కర్మాధీనమై ప్రాణులున్ కీడున్ మేలును జెందు;

లేడొకడు సిక్షింపంగ, రక్షింప; నీ

తోడం బుట్టినవాడు కర్మశేష పరిభూతుండయ్యే నేడీయడన్“, (శ్రీమదాంధ్రమహాభారతము -)

(నేడు, ఈ యడన్ అనుటలో కాలము, దేశము చెప్పబడినది. చేయబడిన భంగము ఫలరీతిని చెప్పుచున్నది.)

(చూడుము – ‘కర్మ చక్రం’) (చూడుము - 5.5)

  1. ప్రతికర్మకు దృష్ట ఫలము, అదృష్టఫలము అని రెండు విధముల ఫలము లభించును - స్థూలముగ కనబడు ఫలము దృష్టఫలము, ప్రత్యక్షఫలము. కనులకు కనబడనిది అదృష్టఫలము. అన్నదానము దృష్టఫలము,ఒక జీవికి సంతోషపెట్టుట కనబడుఫలము. దాని వలన లభించు పుణ్యఫలము అదృష్టఫలము. జీవహింస దృష్టఫలము - ఒకజీవికి బాధ కలిగించుట కంటికి కనబడునది. దాని వలన కలుగు పాపఫలము అదృష్టఫలము. సుకృత దుష్కృత కర్మలవలన కలుగు లాభనష్టములు దృష్టఫలములు; వాటి వలన కలుగు పుణ్యపాపములు అదృష్టఫలములు.

  2. “అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధః కర్మణః ఫలం |

భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ ||“. (శ్రీమద్బ్గవద్గీత - 18 - 12)

“త్రివిధం కర్మణః ఫలం - అనిష్టం నరకతిర్యగాది లక్షణం; ఇష్టం దేవాది లక్షణం; మిశ్రం ఇష్టానిష్ట సంయుక్తం మనుష్యలక్షణం, త్రిప్రకారం కర్మణః ధర్మాధర్మ లక్షణస్యఫలం, బాహ్యానేక కారక వ్యాపార నిష్పన్నం సత్ అవిద్యాకృతం ఇంద్రజాలమాయోపమం మహా మోహకరం ప్రత్యగాత్మో పసర్పి ఇవ ఏవం చ లక్షణం ఫలం |”. (శ్రీశంకరః)

(కర్మఫలము మూడు విధములు : -

(1). అనిష్టము - నరకముననుభవించుట, జంతువులుగా పుట్టుట, మొదలగునవి

(2) ఇష్టఫలము - దేవతులుగా పుట్టుట మొదలగునవి

(3) మిశ్రమఫలము - ఇష్టానిష్టఫలములు కలిసినవి - మానవుడై పుట్టుట.

పైకి అనేకవిధములైన వ్యాపారములవలన కలుగుచున్నట్లు కనబడుచున్నను ఇంద్రజాలమువలె మాయచేత కలుగుచున్నవి, గొప్ప భ్రమ కలుగచేయునది, ఫలము ఏ ప్రకారముగా కలుగుచున్నదో దానిగతి తెలియబడకుండ జరుగునవి).

(ఈ మూడు విధములగు ఫలములు కర్మఫలమునాశించువారికే కలుగును, కర్మఫలమందాసక్తిలేనివారికి కలుగవు).

  1. “కర్మ కుర్వతః తేనకర్మణా ఉత్పత్తిః, ఆప్తిః వికారః, సంస్కారః, నాశశ్చ ఇతి పంచవిధం ఫలం జాయతే. ఉత్పత్తిః పదార్ధస్య ఉత్పత్తిః; ఆప్తిః పదార్థస్య ప్రాప్తిః వికారః పదార్థస్య పూర్వరూప పరిత్యాగేన రూపాంతర ప్రాప్తిః; సంస్కారః పదార్థగతమల నివృత్తి రూపః, పదార్థే గుణదానరూపశ్చ ఇతి ద్వివిధః; నాశః పదార్థ ద్వంసః ఇతి కర్మజన్య ఫలస్య పంచప్రకారాః భవంతి ||”

(కర్మచేయువానికి తాను చేసినకర్మవలన అయిదు విధముల ఫలము కలుగును : - ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము నాశము. ఉత్పత్తి అనగా ఒకటి పుట్టుట. ఆప్తి అనగా ప్రాప్యము - ప్రాప్తించుట, ఒకచోటునుండి మఱియొకచోటునకు పోవుట. వికారము అనగా ఒకపదార్థము మఱియొక పదార్థముగా మారుట - పాలు పెరుగుగా మారుట, పదార్థము దాని పూర్వరూపమును వదలి మఱియొకరూపముగా మారుట. సంస్కారమనగా పదార్థములోని మలము - దోషము - లేనట్లు చేయుట, పదార్ధముయెక్క గుణమును పైకి వచ్చునట్లు చేయుట అని రెండు విధములు - శుద్ధి చేయుట. నాశము అనగా పదార్థము యొక్క ధ్వంసము - ఈ అయిదువిధముల ఫలములు కర్మలవలన కలుగును) (చూడుము – 5.4.1).

  1. ఈ అయిదు విధముల కర్మవలన భగవంతుని పొందుట కుదరదు - ఉత్పత్తి - భగవంతుడు జననము లేనివాడు - ప్రాప్తి - ప్రాప్తికి, భగవంతుడు పొందుటకు వీలుకానివాడు - “అప్రాప్య మనసా సహ”

(మనసు చేతనైనను - చింతించుటకునైనను - వీలుకానివాడు). వికృతి - మార్పులు లేనివాడు - సంస్కారము - శుద్ధబుద్ధ స్వరూపము అగుటవలనను, “సర్వదైక రసః” (ఎల్లపుడు ఒకే రీతిగనుండువాడు) అని చెప్పబడుటచేతను సంస్కారము అవసరములేనివాడు - నాశము - భగవంతుడు అవినాశి, నాశము లేనివాడు - ఎల్లపుడు ఉండువాడు. అందుచేత ఈ అయిదు విధములగు కర్మఫలములు భగవత్ప్రాప్తిని -ముక్తిని - ఇచ్చునవికావు - “జ్ఞానే నైవతు కైవల్యం” - (జ్ఞానముచేతనే మోక్షము)

  1. కర్మఫలము రెండు విధములు : - ముఖ్యఫలము, అవాంతరఫలము. అరటిచెట్టు వేసిన దాని ముఖ్యఫలము అరటికాయలు, అరటిపళ్ళు, ఆకులు, పువ్వు అవాంతరఫలము. యోగాభ్యాసము చేయువానికి భగవత్సాక్షాత్కారము ముఖ్యఫలము - దానికి ముందుగా కలుగు ఇంద్రియ జయము మొదలగునవి అవాంతరఫలము.
  1. కొన్ని కర్మలు ఫలమునిచ్చుకాలము చెప్పబడీంది : -

    1. “న చిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం |

సవిషాణా మన్నానాం భుక్తానాం క్షణ వా చర ||“.

(పాపకర్మలఫలము వెంటనే అచిరకాలములోనే అనుభవించును. విషాన్నము తినిన ఫలము వెంటనే కనబడినట్లు).

  1. “త్రిభిర్వర్షై స్త్రి భిర్మాసై స్త్రిభిర్పక్షై స్త్రిభిర్దినైః |

అత్యుత్కటైః పాపపుణ్యై రిహైవ ఫలమామ్నతే ||“.

(మహా ఘోరమైన పాపకర్మలుగాని, గొప్ప పుణ్యకర్మలుగాని చేసిన మూడు సంవత్సరములలోగాని, మూడుమాసములలోగాని, మూడు పక్షములలోగాని, మూడుదినములలో గాని ఫలమును ఇక్కడే, ఈ లోకములోనే, ఈ జన్మలోనే అనిభవించును).

  1. ఒకడు చేసిన కర్మఫలమును ఇంకొకడు అనుభవించుట కూడ కలదు : - పుత్రుడు శ్రాద్ధము పెట్టిన తండ్రికి తృప్తి కలుగును. శిష్యుడు పాపము చేసిన గురువు వాని ఫలముననుభవించును. “రాజా రాష్ట్ర కృతం పాపం, రాజపాపం పురోహితః | భర్తా భార్య కృతం పాపం - - - ||”. రాజ్యములో ఎవడు పాపము చేసిన పాలించు రాజు పరిపాలన లేకుండుటవలన కలిగినది కనుక ఆ కర్మఫలము రాజు అనుభవించును. రాజునకు ధర్మపరిపాలానా విధము చెప్పి చేయించకపోవుటవలన రాజు పాపకర్మ ఫలము పురోహితునిది).
Transliteration
    1. karmaṇaḥ phalaṃ - (karmayokka phalamu - cēsina karmavalana kalugu phalamu).

    2. sukha duḥkha lakṣaṇaṃ karmaphalaṃ. (karmaphalamanagā karmalavalana kalugu sukhaduḥkhamulu).

    3. “yādṛśaṃ kurutē karma tā dṛśaṃ phalamāmnayāt|

avaśyamēva bhōktavyaṃ kṛtaṃ karma śubhāśubhaṃ ||“. (śrīdēvībhāgavatamu)

(eṭuvaṃṭi karmacēsina aṭuvaṃṭi phalamē poṃdunu - cēsina karmaku tagina phalamē labhiṃcunu. puṇyakarma cēsinanu pāpakarma cēsinananu dāni phalamu anubhaviṃpavalasinadē).

  1. “karmaṇā manasā vācā parapadāṃ karōti yaḥ |

tadbījaṃ janma phalati prabhūtaṃ tasya cā śubhaṃ ||“. (viṣṇupurāṇē)

  1. “yatkālaṃ hi yatsukhaṃ duḥkhaṃ vātmanā bhujyatē |

tasvaivalōkē phalatvaṃ prasiddhaṃ ||“.

(ē kālamaṃdu ē vēḷalō, yē samayamaṃdu sukhamukāni duḥkhamukāni anubhaviṃcucunnāḍō adiyē karmaphalamani lōkamulō prasiddhi).

  1. “phalasva rūpālu ēvi aṃṭē īśvaruni nigrahānugrahatmakamaina sura nara tirya gādyanēka sukha duḥkhaḥ | phalātmakamaina anēka sṛṣṭi sthiti laya saṃpatti phalamanubhaviṃcukonunu - - sakala jaṃtuvulunnū karmaphalasvarūpamulu kāni vērē jagattu anēdi lēdu”

(brahmavidyā sudhārṇavamu - 4)

  1. “jagatsaṃhāra narakapātādi sarvaṃ karmāyattaṃ, na bhagavatkṛtaṃ, na bhagavatkṛtaṃ”.

(jagatsaṃhāramu, narakamulu modalagunavanniyu karma valana kaliginavē. prapaṃcamulō puṭṭuṭa, peruguṭa, naśiṃcuṭa - vīṭiki saṃbaṃdhiṃcinavanniyu jīvulu cēyu karma phalitamugavē jarugucunnavi. bhagavaṃtuḍu vēru vērugā okkokkaniki svayamugā kaluga cēyaḍu).

  1. “karmāyattaṃ phalaṃ puṃsāṃ buddhiḥ karmānusāriṇi” (bhartṛhari - nīti śatakaṃ)

(puruṣulaku vāru cēsina karmalavalananē phalamu kalugunu. karmanu anusariṃcē vāri buddhiyuṃḍunu. pūrva janmalō cēsina karmanu baṭṭiyē - dāni phalamugā ī janmalō karmalu cēyucuṃduru).

  1. “naivākṛtiḥ phalati, naiva kulaṃ, naśīlaṃ, vidyāpinaiva, na ca yatna kṛtāpisēvā |

bhāgyāni pūrva tapasā khalu saṃcitāni phalaṃti puruṣasya, yadhaiva vṛkṣāḥ ||“. (bhartṛhari - nītiśatakaṃ)

(puruṣuni ākāramukāni - sauṃdaryamukāni, kulamukāni, guṇamukāni, atanu nērcina vidyakāni - pāṃḍityamukāni - eṃtō prayatnamutō cēsina sēvakāni phalamuniccunavikāvu. bhōgabhāgyamulananubhaviṃcuṭaku iviyēviyu kāraṇamulukāvu. kriṃdaṭi janmalalō cēsina tapassu - lēka, sikṛta karmalē ippaṭi bhōgabhāgyamulanu kalugacēsinavi. ā karmaphalamē ippaṭi bhōgabhāgyamulu. ā karmalu kālamu gatiṃcinakoladi paripakvamainapuḍu – phalamu niccuṭaku kālamu vaccunapuḍu ī bhōgabhāgyamulu kalugunu. ceṭlu vāṭiki anuguṇamaina kālamu vaccunaṃtavaraku vēciyuṃḍi, ā kālamu vaccinapuḍu puṣpiṃci phalamuniccunaṭlē - mokka vēsina veṃṭanē phalamunīyadu, perigi, peddadayi puṣpiṃci phalamuniccunu).

  1. “dēva manuṣya tiryagādulaku vērē vērē saṃcitāgāmi karmalayaṃdu mānuṣa śarīramaṃdali karmaphalamē svarganarakamōkṣālaku kāraṇamai yuṃḍunu”. (brahma vidyā sudhārṇavamu -2)

  2. “yadvyaṃgāḥ kuṣṭhi naścāṃthāḥ paṃgavaśca daridrinaḥ |

pūrvōpārjita pāpasya phalamaśnaṃti dēhinaḥ ||“. (bhōjarāja caritra)

(pūrva janmalalō cēsina pāpakarmala valananē koṃdaṟu manuṣyulu kuṃṭivāruganu, koṃdaṟu gruḍḍivāruganu, koṃdaṟu kuṣṭurōgulaganu, koṃdaṟu aṃgalōpamugalavāruganu, marikoṃdaṟu bīdavāruganu jīviṃcucuṃduru). .

  1. - - pūrvabhava karmādhīnamai prāṇulan |

gīḍun mēlunu jeṃdu; lēḍokaḍu śikṣiṃpa rakṣima - - - ||“. (pōtana telugu bhāgavatamu – 10.1 - 1775)

  1. “puṇyō vaipuṇyēna karmaṇā bhavati, pāpaḥ pāpēna ityādi śāstrēna sukha duḥkhayō dharmā dharmahētukatvaṃ avagataṃ”.

(puṇya karma cēyuṭavalana puṇyātmuḍu, pāpa karma cēyuṭavalana pāpātmuḍugā janmiṃcunu ani ceppabaḍiyuṃḍuṭacēta mānavulaku kalugu sukha duḥkhamulaku vāru cēsina puṇyapāpamulē kāraṇamulu - puṇyamu cēsina puṇyaphalamu, pāpamu cēsina pāpaphalamu kalugunu).

  1. “saṃpattirvā vipattirvā pūrvajanma nikṛta svakarmāyattā, tadadhīnā bhavati; tataḥ tayōḥ kartāpi svayamēva bhavati. tasmāt karmānurūpaṃ phalaṃ bhaviṣyatyēva na kātaratayā tannāśō bhaviṣyati”.

(saṃpadagāni, āpadagāni pūrva janmalō cēsina tana karmavalana kaliginadē, aṃducēta ā karmaku ādhīnamai yuṃḍunadē, ā karmanubaṭṭiyē yuṃḍunu. aṃducēta ā sukha duḥkhamulaku karta tānē yagucunnāḍu. cēsina karmaku anuguṇamaina phalamē kalugucunnadi. adi bhayapaḍinaṃduvalana pōvunadikādu).

  1. va. “vartamāna vasaṃtādi kālaṃbu bhūta bhāvi vasaṃtādi kālayōgyaṃbaina puṣpa phalādulu tatkāla jñāpakaṃbeṭlu sēyunaṭlu bhūta bhāvi janmaṃbulaku dharmā dharmaṃbulu nidarśanaṃbulu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - 88)

  1. karma ē rūpamuga phalamu niccunu ?

    1. ślō.|| yādṛśaṃ kurutē karma tā dṛśaṃ phalamāmnayāt |.

(eṭuvaṃṭi karmacēsina aṭuvaṃṭi phalamē anubhaviṃcunu).

  1. “puṇyāddēvatva māpnōti, pāpai sthāvaratāmiyāt |

samākhyāṃ puṇyapāpābhyāṃ mānuṣyaṃ labhatē naraḥ ||“.

(puṇyakarmalavalana dēvatulai puṭṭuduru, pāpakarmalavalana sthāvaramulai - ceṭlu modalagunavigā - puṭṭuduru - puṇya pāpakarmala miśramamuvalana mānavulai puṭṭuduru).

  1. “yavāḥ prakīrṇāḥ na bhavaṃti śālayaḥ”.

(yavalu jallina vari paṃḍadu. pūrva janmalō pāpakarma cēsinayaḍala ī janmalō puṇyaphalamu labhiṃcadu).

  1. “śubhēna karmaṇā yāti svarlōkādi kamēva ca |

karamācā śubhēnaiva bhramaṃti narakēṣu ca |

- - - rōgī kukarmaṇā jīvaśca arōgī śubha karmaṇā |

dīrgha jīvīca dīrghāyuḥ sukhī ca karmaṇā |

aṃdhādaya ścāṃga hīnāḥ karmaṇā kutsi tēnaca |

suddhyādikama vāpnōti sarvaōtkṛṣṭēna karmaṇā ||’. (dēvī bhāgavatamu -)

(puṇyakarmacēta svargalōkamu modalagunavi poṃdunu; aśubhakarmacēta - pāpakarmacēta - narakamaṃdu bhramiṃcedaru. ceḍḍakarmalavalana rōguluganu maṃcikarmavalana rōgamu lēnivāruganu, maṃcikarma valana dīrghāyuvu kalavāruganu sukhamu galavāruganu, kutsita karmavalana - gruḍḍivāruganu aṃgahīnuluganu, vikalāṃgulanu puṭṭedaru - anniṭikaṃṭenu utkṛṣṭamaina karmavalana.

  1. “ūrthvaṃ gacchaṃti satvasthāḥ adhōgacchaṃti tāmasāḥ |”.

(satvaguṇamukalavāru puṇyakarmalu cēyuṭavalana svargamu modalagu ūrthva lōkamulanu poṃduduru - tāmasagunamu galavāru pāpakāryamulu cēsi adhōlōkamulaina narakādulanu poṃduduru - hīnamaina janmalanu poṃduduru).

  1. “varṇāśramāśca svakarma niṣṭāḥ prētya, larama phalamanubhūya tataḥ śēṣēṇa viśiṣṭadēśa, jāti, kula, dharma āyuḥ śrutavitta vṛtta sukhamēdhasō janma prati padyaṃtē |”. (gautamabuddha sūtramulu)

(svakarmaniṣṭulu tamatama varṇamulaku, āśramamulaku saṃbaṃdhiṃcina dharmamulanu pāṭiṃcuṭayaṃdu niṣṭakaligi yuṃḍuvāru canipōyi karmaphalamunanubhaviṃci tirigi migilina karmavalana viśiṣṭamaina dēśamulō, jātilō kulamulō āyuṣmaṃtulai, śrōtalai, sukhavaṃtulai, mēthāvaṃtulaina janmamettuduru).

  1. “snāna tapō yajña, vasana, bhūṣaṇānna pradānādi sukarmabulavalana svargādi puṇyalōka prāptiyu, brahma vāsanā, sujana tiraskaraṇa, paradhana paradārādyapaharaṇa, mṛṣāvādi pramukha duṣkarmaṃbulavalana nirayanivāsaṃbunu siddhiṃcu. svarganarakādi saṃbaṃdhaṃbulu jīvulaku svakarma phalabhōgaika vinyāsaṃbulugāvuna bunarjanma kāraṇaṃbulai yuṃḍu”

(kulaśēkharamahīpālacaritra - 2 - 122)

  1. “pratiṣiddha lakṣaṇaṃbaguna dharmaṃbācariṃcu naruni śraddha viparītaṃbugāne yuṃḍu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 30)

  2. “karmaṇā pitṛlōka prāptiḥ.” (nityanaimittika karmalu cēyuṭavalana pitṛlōkamunu poṃdunu).

  3. “īśvarō kāṃści datyaṃta sukha bhājaḥ karōti dēvādīn, kāṃścidatyaṃta duḥkhabhājaḥ karōti, paśvādīn - kāṃścinmadhyama bhōga bhājō manuṣyādī nityēvaṃ viṣamā sṛṣṭiḥ - - - sṛjyamāna prāṇi dharmādharmāpēkṣā viṣayā sṛṣṭiriti nāya mīśvarasyā parādhaḥ. īśvarastu varjanyava draṣṭavyaḥ - yathāhi varjanyō vrīhiyavādi sṛṣṭau sādhāraṇaṃ kāraṇaṃ bhavati, vrīhiyavādi vaiṣamyētaṃ tattadbījagatānyēvā sādhāraṇāni sāmarthyāni kāraṇāni bhavaṃti. ēvamīśvarō dēvēva manuṣyādi sṛṣṭau sādhāraṇaṃ kāranaṃ bhavati, dēvamanṣyādi vaiṣamyētu tattadbījagatā nyēvā sādharaṇāni karmāṇi kāraṇāni bhavaṃti. ēvamīśvarasyāpēkṣatvānna vaiṣamya nairghyaṇā khyāṃ duṣyati - - śrutiḥ -”ēṣa hyēvasādhukarma kārayati taṃ ya mēṇyō, lōkē byaḥ unni nīṣatē. ēṣa ēvā sādhu karmakārayaṃti taṃ yamadhōni niṣatē” iti - smṛtiḥ –

“yē yathā māṃ prapadyaṃtē tāṃ stadhaiva bhajāmyahaṃ”. (śrīmadbhagavadgīta - 4 - 11)

“sadēva sōmyēda madagra āsīdēkamēvā dvitīyamiti prāksṛṣṭē ravi bhāgāvadhāraṇānnasti karma yadapēkṣayā viṣamā sṛṣṭisyāt, sṛṣṭyuttara kālēhi śarīradi vibhāgā dyapēkṣaṃ karma karmāpēkṣaśca śarīrādi vibhāga itītarētarāśrayatvaṃ prapajyēta - - - anādi tvātsaṃsārasya bhavēdēṣa yadhyādi mānayaṃ saṃsārasyāt. anādautu saṃsārē bījāṃkura vaddētu hētu madbhāvēna karmana sarga vaiṣamyasya ca pravṛtti rnaviruddhyatē kathaṃ punarēta davagamyatē anādi rēṣa saṃsāra iti”.

(śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē - 2 - 1 - 34, 35)

(īśvaruḍu koṃdaṟini dēvatalu modalagu atyaṃta sukhajīvuluganu, koṃdaṟinipaśuvulu modalaguvāṭini atyaṃta duḥkhajīvuluganu, maṟikoṃdaṟini manuṣyulavale madhyama jīvuluganu, anagā, sukha duḥkhamulu reṃṭini anubhaviṃcuvārivale - vyatyāsamulatō sṛṣṭiṃcucunnāḍu. idi āyā jīvula dharmā dharmamulabaṭṭi - sukṛta duṣkṛta karmalabaṭṭi - cēyucunnāḍē gāni ī viṣama sṛṣṭiki īśvarunivalana tappulēdu. īśvaruḍu varṣamēghamuvalenē pravartiṃcunu ani telusukonavalenu - vrīhiyavādulu - dhānyamulu - anni rakamulu puṭṭuṭaku mēghamu (varṣamēghamu) sādhāraṇakāraṇamu - anniṃṭikī okē kāraṇamudhānyamulalōni tēḍāku āyā dhānyamulayokka āyā bījamulalōni tēḍāvē asādhāraṇa kāraṇamu - bhagavaṃtuḍu aṃdaṟiki okērītigānuṃḍu sādhārana kāraṇamu. aṃducēta ī sṛṣṭilō kanabaḍucunna vaiṣamyamunaku īśvaruḍu kāraṇamukādu. duḥkha jīvulugā sṛṣṭiṃcuṭalō īśvaruḍu nirdākṣiṇyuḍu anuṭa tagadu.” evaru puṇyakarma cēyudurō vārini bhagavaṃtuḍu ī lōkamunuṃḍi pailōkamulaku tīsukonipōvunu - uttamalōkamulanu poṃdiṃcunu. evaḍu pāpakarma cēyunō vānini bhagavaṃtuḍu adhōlōkamulanu poṃdiṃcunu; lēka, evaḍini uttamalōkamulanu poṃdiṃpa talacunō, aṭṭivānicēta bhagavaṃtuḍu puṇyakarmalu cēyiṃcunu. śrīmadbhagavadgītalō ī viṣayamu ī kriṃda vidhamugā ceppabaḍinadi : - “evaḍu nannu ē prakāramugā bhajiṃcunō vānini nēnu ā prakāramugānē anugrahiṃcedanu” - ī bhagavadgītā ślōkamunaku ī kriṃdavidhamugā vyākhyānamu cēyabaḍinadi” –

“yē jñāna tapasā pūtāstvadbhāvaṃ yāṃti tejanāḥ |

nacēta rēcēti vaiṣamyaṃ phaladātusta vēti cēt |

śṛṇvartā vitta kāmāśca jñāni naśca mumukṣapaḥ |

sakāmatvēna niṣkāmatayā yē māṃ yadhgēśvaraṃ |

samasta phaladātāraṃ bhajaṃtē tāṃ sta daivaca |

tadabhīṣṭa prdānēna tvanu gṛhṇāmyahaṃ hariḥ |

ārtānārti vināśēna vittadānēna cārthinaḥ |

jijñāsūn jñānadānēmna, jñāninō mōkṣadānataḥ |

anigṛhṇōmyahaṃ svāmī nānya kāmā yānya thā |

phalārthitvē mumukṣutvē harirēva nṛṇāṃ gaiḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 70 - 75)

(jñāna yajñamunu cēsina mahānubhāvulē nannu poṃdagalaru, itarulu poṃdalēru - aṭlainacō bhagavaṃtuniki prajala yaḍala vaiṣamyamu kaligiyunnaṭlu sphuriṃcunu iṭlukādu ani bhagavaṃtuḍu iṭlu ceppenu - samastamunaku īśvaruḍanu, anni vidhamulaina phalamunu iccuvāḍanu ayina nannu ārtulugāni, dhanamukōruvārugāni, jñānulukāni, mōkṣamunu kōruvārugāni, evaru ē kōrikatō ē phalamunāśiṃci nannu bhajiṃcedarō - upāsana cēsedarō - vāriki vāri vāri kōrikanu neṟavērci anugrahiṃcedanu - adi eṭlanagā - ārtunaku vāni bādhanu pōgoṭṭedanu. dhanamu kōrinavāriki dhanamuniccedanu. jijñāsuvulaku brahmajñānamu niccedanu. jñānulaku mōkṣamuniccedanu – ‘jñānamucētanē kaivalyamu’ ani ceppabaḍinadikanuka. aṃtēgāni oka kōrika kōri nannu bhajiṃcināvaniki itaravidhamugā anugrahiṃcanu. karma phalamunu kōruṭakugāni, mōkṣamunu kōruṭakugāni, manujulaku bhagavaṃtuḍē gati, poṃdataginavāḍu. ivvagala śaktimaṃtuḍu).

(sṛṣṭiki muṃdu ātma okaṭē yuṃḍenu - ani upaniṣattulu ceppucunnavi kanuka appaṭilō karmayanu nadi yuṃḍuṭaku avakāśamu lēdu, dāni phalamu kaluguṭakunu avakāśamu lēdu. appaṭilō ippaṭivale vēru vēru vastuvulu lēvu. aṃducēta viṣamasṛṣṭiki (sṛṣṭilō oka vastuvunaku iṃkoka vastuvunaku gala vyatyāsamunaku) avakāśamu lēdu. sṛṣṭi ayina tarvāta śarīramulu kaluguṭa, vāṭivalana kalugu karmalu, karmalu cēyuṭavalana vāṭi phalamunanubhaviṃcuṭakai marala śarīramunettuṭa, ī rītigā okadāni taruvāta nokaṭi, okadānikāryamugā niṃkokaṭi kaluguṭaku avakāśamu kaliginadi. iṭlu ayina yaḍala modaṭa lēnikāraṇamunaku tarvāta phalameṭlukalugunu. dēnikainanu kāraṇamuṃḍavalenu - modaṭilō karmaphalarūpamaina saṃsāramu lēnapuḍu taruvāta sṛṣṭi prakāramulō eṭlu kaligenu. aṃducēta sṛṣṭi - saṃsāramu - anādi, modalu lēnidi, prāraṃbhamulēnidi. aṃducēta karma cēyuṭa, phalamunanubhaviṃcuṭaku - janmamettuṭa anu saṃsāramunaku modalulēdu - idi pravāharūpamugā jarugucu vaccucunnadanē grahiṃcavalenu).

(bhagavaṃtuḍu anādi, ādi lēnivāḍu, janma lēnivāḍu, modalu eppuḍō ē rītiganō teliyadu. bhagavaṃtuḍu valenē prakṛti - saṃsāramu - anādi, bhagavaṃtuḍu unnadaggaranuṃḍi unnadi. aṃducēta ī saṃsāramunaku bījāṃkuranyāyamu, hētuvarbhāvamu, kāraṇamu kaligiyuṃḍuṭa, modalu peṭṭuṭa lēnidi).

  1. “nacōpacitānāṃ karmaṇā miyattā (a) stisaṃsārasyānādi tvāt”

(saṃsāramanagā puṭṭuṭa, canipōvuṭa, karmaphalamanubhaciṃcuṭaku marala puṭṭuṭa, marala canipōvuṭa. idi cakramurītigā ī prakāramugā jarugucunē yuṃḍunu. idi eppuḍu modalu peṭṭinadō teliyadu. aṃducēta ippaṭiki enni janmalu ettitimō, enni, enni karmalu cēsitimō. ennikarmala phalamanubhuviṃcitimō, iṃkanu enni janmalu cēyudamō ā karmaphalamu lenni anubhaviṃcavalasiyunnadō, idi eppaṭiki aṃtamagunō teliyadu. janmalu perugucunē yuṃḍunu, vāṭitō karmalu perugucunē yuṃḍunu.janmalu iṃtē ani kāni, vāṭi phalamu iṃtē anigāni, dīnitō sariyanigāni ceppuṭaku vīlulēdu).

  1. “sa paramēśvaraḥ sarvādhyakṣaḥ sṛṣṭi sthiti saṃhārān vicitrān vidadhaddhēśakāla viśēṣābhi jñātvāt karmaṇā karmānu rūpaṃ phalaṃ saṃpādayati ityupa padyatē. karmaṇastu anukṣaṇa vināśinaḥ kālāṃtara bhāviphalaṃ bhavatītyanupapannaṃ, abhāvādvā bāvānutpattēḥ. yatkālaṃ hi yatsukhaṃ duḥkhaṃ vātmanā bhujyatē tasyaiva lōkē phalatvaṃ prasiddhaṃ”

(śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē)

(sarvādhyakṣuḍaina - anniṃṭilōnu adhivasiṃci anniṃṭini cūcuvāḍaina - paramēśvaruḍu sṛṣṭi sthiti saṃhāramulanu vicitramulanu cēyuvāḍaguṭacētanu, dēśakālaviśēṣamula neṟigiyuṃḍuvāḍaguṭacētanu karmacēta karmaku anuguṇamaina phalamu kalugunaṭlu cēyucunnāḍu anuṭayē upapannamagucunnadi. karma kṣaṇamulō naśiṃcunadi, ē kṣaṇamuna cēsinadi ā kṣaṇamutō sari. āṃducēta aṭṭikarma muṃdukālamaṃdu phalamunīya galadu anuṭa upapannamukādu. abhāvamuvalana bhāvamu puṭṭuṭalēdukadā! eppuḍu ē sukhamu kāni kaṣṭamukāni kalugunō adiyē phalamani lōkamulō prasiddhi).

  1. “acētanasya karmaṇaḥ svataḥ pravṛtya yōgāt sēvādi dṛṣtāṃtānusāri śrutērbalīyatvāt sarva vēdāṃtēṣu īśvarasya jagaddhētutva śrutēśca īśvarādhiṣṭi tāt karmaṇaḥ jagadaṃtaḥ pāti phalasiddhi. riti samudā yārthaḥ”.

(acētanamaina karma svataḥ pravṛtti lēkapōvuṭacētanu (inert) upaniṣattulanniṃṭilōnu paramātma jagattunaku kāraṇamani cēppabaḍuṭacētanu, īśvaruḍu karmanu adhiṣṭiṃciyuṃḍuṭacētanu bhagavaṃtuḍē phalamuniccunu anuṭa mottamumīda arthamagucunnadi).

“na kartṛtvaṃ na karmāṇi lōkasya sṛjati prabhuḥ |

na karmaphalasaṃ yōgaṃ svabhāvastu pravartatē ||“. (śrīmadbhagavdgīta - 5 - 14)

(paramātma lōkamuna kartṛtvamugāni, karmalanu gāni cēyaḍu, karmaphalamunukūḍa ivvaḍu - aṃtayu svabhāvamuvalananē kalugucunnadi. kāni anniṃṭilōnu tānu uṃḍi vāṭiki caitanya śakti iccucuṃḍuṭavalana avi vāṭi svabhāvamuvalana āyā karmalanu cēyuṭaku viniyōgiṃcukonucunnavi. pratibhūtamulōnu tānuṃḍuṭacēta okadāni cēta iṃkoka dāniki kaṣṭasukhamulu kaligiṃcucuṃḍunu. –

“ka. bhūtamulacēta neppuḍu

bhūtamulaku janmamaraṇa pōṣaṇamulu ni

rṇītamulu cēyucuṃḍunu

bhūtamayuṃḍīśvaruṃḍu bhūta śaraṇyā “. (pōtana telugu bhāgavatamu - 1 - 378)

  1. “u. karmavaśaṃbunan jagamu kalgunu heccunaḍaṃgunannacō

garmamu buddhijūḍajaḍakāryamugāni prapaṃcakalpanā

karmamunaṃdu gartayanagā vilasillagajāla dī jaga

tkarmaka kārya kāraṇamugāvuna nīśuḍu viṣṇu ḍārayan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 22 - 581)

  1. karmaphalamu anubhaviṃci tīravalasinadē - anubhavamutōnē karmaphalamu kṣīṇiṃcunu -

    1. “avaśyamēva bhōktavyaṃ kṛtaṃkarma śubhāśubhaṃ”. (śrīdēvī bhāgavataṃ)

(cēsina karma puṇyamainadainanu, pāpakarma ayinanu anubhaviṃcaka tappadu).

  1. “nā bhuktaṃ kṣīyatē karma kalpa kōṭi śatairapi”. (dēvī bhāgavatamu)

(kōṭla kalpamulu gaḍacinanu anubhaviṃcanidē karma kṣīṇiṃcadu).

  1. “ca. dhana paśu mitra putra gṛhakāraṇa bhūtamaina yī

tanuvuna nunna jīvuḍa padaṃpaḍi yaṭṭi śarīrametti tā

nanugatamaina karmaphalamaṃdakapōvarādu miṃṭabō

yina bhuvi dūṟinan diśalakēgina neccaṭanaina ḍāginan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 - 1008)

  1. saṃcitakarma, āgāmikarma konni paristhitulalō naśiṃcinanu prārabdakarma - phalamuniccuṭaku prāraṃbhiṃcinakarma - phalamunu pūrtigā anubhaviṃpacēyaka kṣīṇiṃcadu - “tadvijñānēna āgāmi saṃcitārdāśō vinaśyati. sthūla dēhāraṃbha katvēna yāvaddēha bhāvi prāraṃbhakarmatat jñāna vijñānābhyāṃ na naśyati. tasya pravṛtta phalatvēna anubhava nāśyatvāt. yadi samyak jñānaṃ jāyatē tadā āgāmyādi karmatraya sthūlādi bhāgatrayaṃ kṣīyatē tatvajñānaṃ cēt tadartha mātrāṃśō (a) pi niśśēṣaṃ kṣīyatē. itthaṃ vyāviddha hṛdayagraṃdhi saṃśaya jālasya asya tatva jñāninaḥ āgāmi saṃcitā rabda karmāṇyapi niśśēṣaṃ kṣīyaṃtē, apahnavaṃ yāṃti.”

(sthūladēhamu modalaina tarvāta dēhamu naśiṃcuvaraku pāpaphalamu niccuṭaku prāraṃbhamaina karma - prārabda karma - jñānamucēta, vijñānamucētagāni naśiṃcadu - adi phalamuniccuṭaku araṃbhiṃcinadi kanuka dāni phalamu anubhaviṃpacēyunu - adi anubhavamuvalananē naśiṃcunu - samyak jñānamu kalugaganē āgāmi modalagu karmalu mūḍu vaṃtulu kṣīṇiṃcunu. tatvajñānamu kaliginapidapa sagamu bhāgamu naśiṃcunu. saṃśayamulu nivartiṃcinatarvāta tatvajñāniyokka āgāmi, saṃcita, prārabdakarmalu niśśēṣamugā naśiṃcunu).

  1. konni karmalu phalamanubhaviṃpacēyakayē kṣīṇiṃcunu -

    1. “ivvidhaṃbuna karmaṃbulu saṃsārahētukaṃbulayyu nīśvarārpitaṃbulai tāmu tammujaṟipi konanōpiyuṃḍu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 73)

īśvarārpaṇamu eṭlu cēyavalenanagā : -

“kāyēnavācā manasēṃdriyai rvā buddhyātmanāvā prakṛtēḥ svabhāvāt |

karōmiyadyatsakalaṃ parasmai nārāyaṇā yēti samarpayāmi ||“.

(śarīramucēta gāni, vākku cētagāni, manassucēgāni, iṃdriyamulacētagāni, buddhicētagāni, prakṛti svabhāvamucētagāni nēnu ē pani cēsinanu dānini nārāyaṇunikoṟaku samarpiṃcucunnānu).

  1. “brahmaṇyā dhāyakarmāṇi saṃgaṃ tyaktvākarōtiyaḥ |

lipyatē na sa pāpēna padma patra mivāṃ bhasā ||“. (śrīmadbhagavadgīta - 5 - 10)

yadhā padma patraṃ aṃbhasā saṃspṛṣṭa mapi na lipyatē, tathā karma kurvannapi brahmaṇi - iṃdriyāṇāṃ prakṛtipariṇāma viśēṣarūpatvēna iṃdriyā kārēṇa avasthitāyāṃ prakṛtau - karma ādhāya phalasaṃgaṃ tyaktvā, naivakiṃcitkarōmiti yaḥ karmāṇi karōti saḥ prakṛti saṃspṛṣṭatayā vartamānōpi prakṛtyātmābhimāna rūpēṇa baṃdhahētunā pāpēna nalipyatē” (śrīrāmānujaḥ)

(tāmarāku nīṭini aṃṭi yunnappaṭikī nīṭi kalmaṣamu tāmarākunaku aṃṭanaṭlu karma cēyucunnappaṭikī parabrahma nimittamē nēnī karma cēyucunnānu ani karmaphalamunu viḍicipeṭṭi, nēnu ē karmayunu cēyalēdu, prakṛtilōnē vartiṃcucunnānu, anu kartṛtvābhimānamu valana kalugu dōṣamunu poṃdaḍu - ā karma atanini baṃdhiṃcadu dāni phalamunu anubhaviṃpacēyadu).

“yaḥ atatvavit pravṛttaśca karmayōgē karma brahmaṇi īśvarē ādhāya nikṣipya, ‘tadarthaṃ karma karōmi’ iti bhṛtya iva svāmyarthaṃ sarvāṇi karmāṇi mōkṣē (a) pi phalē saṃgaṃ tyaktvā karōti, saḥ pāpēna na lipyatē - yathā padma patraṃ iva aṃbhasā udakēna kēvalaṃ satvaśuddhi mātraṃ ēva phalaṃ tasya tatkaraṇaḥ” (śrīśaṃkaraḥ)

(ātma tatvamu teliyanivāḍu karmayōgamaṃdu pravṛttuḍainavāḍu tānu cēyu karma paramātmayaṃdu samarpiṃci, yajamāni koṟaku karma cēyu sēvakunivale’bhagavaṃtuni koṟaku nēnī karma cēyucunnānu’ anu abhiprāyamutō samastamaina karmalanu vāṭi phalamaṃdāsakti lēka - mōkṣaphalamaṃdainanu āsakti lēka - cēyuvāniki pāpamu aṃṭadu - ā karmalayokka phalamu aṃṭadu, tāmarākuku nīṭitō saṃbaṃdhamuṃḍunaṭlē. aṭṭivāniki ā karmayokka phalamu satvaśuddhi koṟaku mātramē yagunu).

  1. “yadhaidhāṃsi samiddhō(a)gniḥ bhasmasāt kurutē (a)rjuna |

jñānāgniḥ sarvakarmāṇi bhasma sātkurutē tathā ||“. (śrīmadbhagavadgīta - 4 - 37)

(bāgā maṃḍucunna agni kaṭṭelanu ē prakāramugā kālcivēsi būḍida cēyunō, ā prakāramugānē prārabda karmalutappa, migilina samasta karmalu - saṃcitamulu āgāmilu - appaṭiki phalaniccuṭaku avakāśamulēka migiliyunnavanniyu, vāṭiki kāraṇamaina ajñānamu naśiṃcinaṃduna, jñānamu - brahmajñānami kaliginaṃtanē naśiṃcunu).

  1. “bhidyatē hṛdayagraṃdhiśca dyaṃtē sarvasaṃśayāḥ |

kṣīyaṃtē cāsyakarmāṇi tasmin dṛṣṭē parāvarē ||’.

(paramātmanu telusukoninacō - bhagavatsākṣātkāramu kaliginacō - hṛdayagraṃdhi - muḍi - viḍipōvunu, saṃśayamulanniyu tīripōvunu, karmalanniyu naśiṃcipōvunu).

  1. karma phalamu anēka vidhamulugā nunnadi : -

    1. “dvividhānikarmaphalāni - niyatāni aniyatāni ti ca prabala śāpādi saṃbhavāni niyatāni, itarāṇi aniyatāni aniyatatvaṃ ca tēṣāṃ dēśakālādya pēkṣayā, natu svarūpataḥ, yēna karmaṇāṃ niṣphala prasaṃgasyāt”.

(karmaphalamulu reṃḍu vidhamulu - niyatamulu, aniyatamulu. prabalamaina śāpamu modalaguvāṭivalana kalugunavi niyatamulu. migilinavi aniyatamulu - aniyatamulu vāṭi dēśakālamulanubaṭṭi aṭṭivani ceppabaḍinavi, svabhāvamugā aniyatamulukāvu) –

“ka. dharaṇīsura śāpamunaku

hariharabrahmādulaina naḍḍamu galarē

narulanaga neṃtavāralu

garamaruduga pūrvajanma karmamu dōpan” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 25 - )

dūrvāsa maharṣi śāpamuvalana śrīmahāviṣṇuvu matsya, kūrma, varāhādi avatāramulanu - rūpamulanu dhariṃcavalasi vaccenu - kāni avi prapaṃcakalyāṇamukoṟakē phaliṃcenu - iṭivaṃṭi karmaphalamu niyatamu - phalamu muṃduganē niyamiṃcabaḍinadi. aniyatamulu eppuḍu ekkaḍa ē rītigā vaccunō teliyanivi. ayinanu ā phalamulu kaluguṭa dēśamu, kālamu, rīti atisūkṣmamaina apūrvamanu dharmamu (natural law) nanusariṃciyē yuṃḍunu –

“tōḍaṃbuṭṭinavāni bhaṃgamunakuṃ duḥkhiṃci mā kṛṣṇu ne

ggāḍaṃ jūḍaku mamma; pūrvabhava karmādhīnamai prāṇulun kīḍun mēlunu jeṃdu;

lēḍokaḍu sikṣiṃpaṃga, rakṣiṃpa; nī

tōḍaṃ buṭṭinavāḍu karmaśēṣa paribhūtuṃḍayyē nēḍīyaḍan”, (śrīmadāṃdhramahābhāratamu -)

(nēḍu, ī yaḍan anuṭalō kālamu, dēśamu ceppabaḍinadi. cēyabaḍina bhaṃgamu phalarītini ceppucunnadi.)

(cūḍumu – ‘karma cakraṃ’) (cūḍumu - 5.5)

  1. pratikarmaku dṛṣṭa phalamu, adṛṣṭaphalamu ani reṃḍu vidhamula phalamu labhiṃcunu - sthūlamuga kanabaḍu phalamu dṛṣṭaphalamu, pratyakṣaphalamu. kanulaku kanabaḍanidi adṛṣṭaphalamu. annadānamu dṛṣṭaphalamu,oka jīviki saṃtōṣapeṭṭuṭa kanabaḍuphalamu. dāni valana labhiṃcu puṇyaphalamu adṛṣṭaphalamu. jīvahiṃsa dṛṣṭaphalamu - okajīviki bādha kaligiṃcuṭa kaṃṭiki kanabaḍunadi. dāni valana kalugu pāpaphalamu adṛṣṭaphalamu. sukṛta duṣkṛta karmalavalana kalugu lābhanaṣṭamulu dṛṣṭaphalamulu; vāṭi valana kalugu puṇyapāpamulu adṛṣṭaphalamulu.

  2. “aniṣṭamiṣṭaṃ miśraṃ ca trividhaḥ karmaṇaḥ phalaṃ |

bhavatyatyāgināṃ prētya natu sanyāsināṃ kvacit ||“. (śrīmadbgavadgīta - 18 - 12)

“trividhaṃ karmaṇaḥ phalaṃ - aniṣṭaṃ narakatiryagādi lakṣaṇaṃ; iṣṭaṃ dēvādi lakṣaṇaṃ; miśraṃ iṣṭāniṣṭa saṃyuktaṃ manuṣyalakṣaṇaṃ, triprakāraṃ karmaṇaḥ dharmādharma lakṣaṇasyaphalaṃ, bāhyānēka kāraka vyāpāra niṣpannaṃ sat avidyākṛtaṃ iṃdrajālamāyōpamaṃ mahā mōhakaraṃ pratyagātmō pasarpi iva ēvaṃ ca lakṣaṇaṃ phalaṃ |”. (śrīśaṃkaraḥ)

(karmaphalamu mūḍu vidhamulu : -

(1). aniṣṭamu - narakamunanubhaviṃcuṭa, jaṃtuvulugā puṭṭuṭa, modalagunavi

(2) iṣṭaphalamu - dēvatulugā puṭṭuṭa modalagunavi

(3) miśramaphalamu - iṣṭāniṣṭaphalamulu kalisinavi - mānavuḍai puṭṭuṭa.

paiki anēkavidhamulaina vyāpāramulavalana kalugucunnaṭlu kanabaḍucunnanu iṃdrajālamuvale māyacēta kalugucunnavi, goppa bhrama kalugacēyunadi, phalamu ē prakāramugā kalugucunnadō dānigati teliyabaḍakuṃḍa jarugunavi).

(ī mūḍu vidhamulagu phalamulu karmaphalamunāśiṃcuvārikē kalugunu, karmaphalamaṃdāsaktilēnivāriki kalugavu).

  1. “karma kurvataḥ tēnakarmaṇā utpattiḥ, āptiḥ vikāraḥ, saṃskāraḥ, nāśaśca iti paṃcavidhaṃ phalaṃ jāyatē. utpattiḥ padārdhasya utpattiḥ; āptiḥ padārthasya prāptiḥ vikāraḥ padārthasya pūrvarūpa parityāgēna rūpāṃtara prāptiḥ; saṃskāraḥ padārthagatamala nivṛtti rūpaḥ, padārthē guṇadānarūpaśca iti dvividhaḥ; nāśaḥ padārtha dvaṃsaḥ iti karmajanya phalasya paṃcaprakārāḥ bhavaṃti ||”

(karmacēyuvāniki tānu cēsinakarmavalana ayidu vidhamula phalamu kalugunu : - utpatti, āpti, vikāramu, saṃskāramu nāśamu. utpatti anagā okaṭi puṭṭuṭa. āpti anagā prāpyamu - prāptiṃcuṭa, okacōṭunuṃḍi maṟiyokacōṭunaku pōvuṭa. vikāramu anagā okapadārthamu maṟiyoka padārthamugā māruṭa - pālu perugugā māruṭa, padārthamu dāni pūrvarūpamunu vadali maṟiyokarūpamugā māruṭa. saṃskāramanagā padārthamulōni malamu - dōṣamu - lēnaṭlu cēyuṭa, padārdhamuyekka guṇamunu paiki vaccunaṭlu cēyuṭa ani reṃḍu vidhamulu - śuddhi cēyuṭa. nāśamu anagā padārthamu yokka dhvaṃsamu - ī ayiduvidhamula phalamulu karmalavalana kalugunu) (cūḍumu – 5.4.1).

  1. ī ayidu vidhamula karmavalana bhagavaṃtuni poṃduṭa kudaradu - utpatti - bhagavaṃtuḍu jananamu lēnivāḍu - prāpti - prāptiki, bhagavaṃtuḍu poṃduṭaku vīlukānivāḍu - “aprāpya manasā saha”

(manasu cētanainanu - ciṃtiṃcuṭakunainanu - vīlukānivāḍu). vikṛti - mārpulu lēnivāḍu - saṃskāramu - śuddhabuddha svarūpamu aguṭavalananu, “sarvadaika rasaḥ” (ellapuḍu okē rītiganuṃḍuvāḍu) ani ceppabaḍuṭacētanu saṃskāramu avasaramulēnivāḍu - nāśamu - bhagavaṃtuḍu avināśi, nāśamu lēnivāḍu - ellapuḍu uṃḍuvāḍu. aṃducēta ī ayidu vidhamulagu karmaphalamulu bhagavatprāptini -muktini - iccunavikāvu - “jñānē naivatu kaivalyaṃ” - (jñānamucētanē mōkṣamu)

  1. karmaphalamu reṃḍu vidhamulu : - mukhyaphalamu, avāṃtaraphalamu. araṭiceṭṭu vēsina dāni mukhyaphalamu araṭikāyalu, araṭipaḷḷu, ākulu, puvvu avāṃtaraphalamu. yōgābhyāsamu cēyuvāniki bhagavatsākṣātkāramu mukhyaphalamu - dāniki muṃdugā kalugu iṃdriya jayamu modalagunavi avāṃtaraphalamu.
  1. konni karmalu phalamuniccukālamu ceppabaḍīṃdi : -

    1. “na cirāt prāpyatē lōkē pāpānāṃ karmaṇāṃ phalaṃ |

saviṣāṇā mannānāṃ bhuktānāṃ kṣaṇa vā cara ||“.

(pāpakarmalaphalamu veṃṭanē acirakālamulōnē anubhaviṃcunu. viṣānnamu tinina phalamu veṃṭanē kanabaḍinaṭlu).

  1. “tribhirvarṣai stri bhirmāsai stribhirpakṣai stribhirdinaiḥ |

atyutkaṭaiḥ pāpapuṇyai rihaiva phalamāmnatē ||“.

(mahā ghōramaina pāpakarmalugāni, goppa puṇyakarmalugāni cēsina mūḍu saṃvatsaramulalōgāni, mūḍumāsamulalōgāni, mūḍu pakṣamulalōgāni, mūḍudinamulalō gāni phalamunu ikkaḍē, ī lōkamulōnē, ī janmalōnē anibhaviṃcunu).

  1. okaḍu cēsina karmaphalamunu iṃkokaḍu anubhaviṃcuṭa kūḍa kaladu : - putruḍu śrāddhamu peṭṭina taṃḍriki tṛpti kalugunu. śiṣyuḍu pāpamu cēsina guruvu vāni phalamunanubhaviṃcunu. “rājā rāṣṭra kṛtaṃ pāpaṃ, rājapāpaṃ purōhitaḥ | bhartā bhārya kṛtaṃ pāpaṃ - - - ||”. rājyamulō evaḍu pāpamu cēsina pāliṃcu rāju paripālana lēkuṃḍuṭavalana kaliginadi kanuka ā karmaphalamu rāju anubhaviṃcunu. rājunaku dharmaparipālānā vidhamu ceppi cēyiṃcakapōvuṭavalana rāju pāpakarma phalamu purōhitunidi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.