(భక్తుడు ఏ పనిచేసినను అది భగవంతుని కొరకే చేయును. ఆ కర్మయందుగాని, దాని ఫలమందుగాని అతనికి ఆసక్తి లేదు - యంత్రమువలె అతను కర్మ చేయును - భగంతుని కొఱకు ఈ కర్మను యంత్రమువలె చేయుచున్నానని అతను ఎంతకాలము తలచునో అంతకాలము అతను కర్మఫలత్యాగి యనిపించుకొనును - నేను ఈ పని చేయుచున్నాను అని తలచినంతకాలము కర్మత్యాగియని కూడా యనిపించుకొనును).
సర్వ కర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధే ద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరం ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 11, 12)
(సగుణబ్రహ్మ అయిన నాయందు నీ మనస్సును నిలుపుము - ఇతర విషయములను మఱచి నాయందు నీ ధ్యానమును నిశ్చలముగా నుంచుము. అట్లు చేసినచో నీ ధ్యానము నాయందే నిలిచియుండును. పైన చెప్పిన ప్రకారము నాయందే చిత్తమును నిశ్చలముగా నిలుపుకొనుటకు శక్తిలేని యడల, అట్లు చిత్తమును నిలుపుకొనుటకు అభ్యాసము చేయుము – అబ్యాసము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము. అట్లు అభ్యాసము కూడ చేయుటకు శక్తి లేనిచో నా గుఱించి కర్మ చేయుము - ఏ కర్మ చేసినను అది నాకొఱకే చేయుచున్నానని తలంచుము - నా గుఱించి కర్మలు చేయుట అనగా, నన్ను కీర్తించుము, నా కథలు వినుము, నా పూజలు సలుపుము - నాకు సంబంధించన కార్యములందే రతికలిగి యుండుము - ఈ ప్రకారము భగవత ధర్మములందే రతి కలిగియున్న యడల, కర్మలందు కోరిక లేకయుండిన ఆత్మజ్ఞానము కలిగి దాని ద్వారా సిద్ధిని పొందెదవు, ముక్తిని చెందెదవు - ఈ ప్రకారము భగవత్సంబంధమైన పనులనుకూడ చేయుటకు శక్తిలేనియడల సమస్త కర్మఫలమును విడిచిపెట్టుము. పైన చెప్పబడిన అభ్యాసయోగముకన్న జ్ఞానయోగము శ్రేయస్కరము, దానికన్న ధ్యానము విశిష్టమైనది. ధ్యానముకన్న కర్మఫలత్యాగము వలన శాశ్వత శాంతిని - మోక్షమును పొందగలవు).
(bhaktuḍu ē panicēsinanu adi bhagavaṃtuni korakē cēyunu. ā karmayaṃdugāni, dāni phalamaṃdugāni ataniki āsakti lēdu - yaṃtramuvale atanu karma cēyunu - bhagaṃtuni koṟaku ī karmanu yaṃtramuvale cēyucunnānani atanu eṃtakālamu talacunō aṃtakālamu atanu karmaphalatyāgi yanipiṃcukonunu - nēnu ī pani cēyucunnānu ani talacinaṃtakālamu karmatyāgiyani kūḍā yanipiṃcukonunu).
sarva karma phalatyāgaṃ tataḥ kuru yatātmavān ||
śrēyō hi jñānamabhyāsāt jñānāddhē ddhyānaṃ viśiṣyatē |
dhyānātkarma phalatyāgaḥ tyāgācchāṃti ranaṃtaraṃ ||“. (śrīmadbhagavadgīta - 12 - 11, 12)
(saguṇabrahma ayina nāyaṃdu nī manassunu nilupumu - itara viṣayamulanu maṟaci nāyaṃdu nī dhyānamunu niścalamugā nuṃcumu. aṭlu cēsinacō nī dhyānamu nāyaṃdē niliciyuṃḍunu. paina ceppina prakāramu nāyaṃdē cittamunu niścalamugā nilupukonuṭaku śaktilēni yaḍala, aṭlu cittamunu nilupukonuṭaku abhyāsamu cēyumu – abyāsamu dvārā nannu poṃduṭaku prayatniṃcumu. aṭlu abhyāsamu kūḍa cēyuṭaku śakti lēnicō nā guṟiṃci karma cēyumu - ē karma cēsinanu adi nākoṟakē cēyucunnānani talaṃcumu - nā guṟiṃci karmalu cēyuṭa anagā, nannu kīrtiṃcumu, nā kathalu vinumu, nā pūjalu salupumu - nāku saṃbaṃdhiṃcana kāryamulaṃdē ratikaligi yuṃḍumu - ī prakāramu bhagavata dharmamulaṃdē rati kaligiyunna yaḍala, karmalaṃdu kōrika lēkayuṃḍina ātmajñānamu kaligi dāni dvārā siddhini poṃdedavu, muktini ceṃdedavu - ī prakāramu bhagavatsaṃbaṃdhamaina panulanukūḍa cēyuṭaku śaktilēniyaḍala samasta karmaphalamunu viḍicipeṭṭumu. paina ceppabaḍina abhyāsayōgamukanna jñānayōgamu śrēyaskaramu, dānikanna dhyānamu viśiṣṭamainadi. dhyānamukanna karmaphalatyāgamu valana śāśvata śāṃtini - mōkṣamunu poṃdagalavu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.