← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మయోగము karmayōgamu

Original — తెలుగు
  1. కర్మైవయోగః కర్మయోగః. (కర్మయే యోగము - చేసినపనియే యోగమని భావించి చేయుట).

  2. “కర్మణాం అనుష్టానం” (శ్రీశంకరః)

కర్మాత్మికానిష్టా.

(కర్మలను అనుష్టించుటయే కర్మయోగము; కర్మలను ఒక నిష్టగా చేయుట).

  1. “ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్టీయమానం, యోగార్థత్వాత్ యోగః ఉచ్యతే గుణతః” (శ్రీశంకరః)

(పరమాత్మకు అర్పించు బుద్ధితో నిష్టగా చేయుట).

  1. కర్మైవ యుజ్యతే అంతఃకరణ శుద్ధ్యనేన ఇతి వ్యుత్పత్యా యోగః -

(దీనివలన అంతఃకరణశుద్ధి - చిత్తశుద్ధి - కలుగును - అందుచేత ఈ కర్మయే యోగము - కర్మయోగము).

  1. కర్మయోగో నామ కర్మాణి కృత్వా, తేషాం బ్రహ్మాత్వికత్వ జ్ఞానం ఇతి కేచిత్.

(కర్మలు చేసి వాటియందు అవి బ్రహ్మమే అని జ్ఞానము కలిగియుండుట కర్మయోగమని కొందరి అభిప్రాయము).

  1. ఫలకామనాది త్యాగేన ఈశ్వరార్పణ బుద్ధ్యా వర్ణాశ్రమ విహిత కర్మానుష్టానమేవ కర్మయోగః.

(కర్మలవలన కలుగు ఫలమును విడిచిపెట్టి ఈశ్వరునికి ఆ కర్మను అర్పించు బుద్ధితో వర్ణాశ్రములకు విధించబడిన కర్మలను చేయుట - అనుష్టించుట – కర్మయోగము)

  1. కర్మానుష్టానే సమాదియోగం – నిస్సంగతయా ద్వంద్వ ప్రహాణ పూర్వకం ఈశ్వరారాధనార్ధం కర్మానుష్టానం సమాధియోగం కర్మయోగం.

(కర్మను చేయునపుడు సమాధిలో నుండుటయే కర్మయోగము – ద్వంద్వములను విడిచి – లక్ష్యము చేయక – దేనియందును ఆశ లేకుండనుండి ఈశ్వరుని ఆరాధించుట కొఱకే ఈ కర్మ చేయుట సమాధియోగము, కర్మయోగము.)

  1. కర్మయోగం స్వవర్ణాశ్రమోచితం, నతు గృహస్థ కర్మైవేతి నియమః - సన్యాసాది విధానాత్ సామాన్య వచనాచ్ఛ -

(కర్మయోగమనగా గృహస్థ కర్మ అని గాని వర్ణాశ్రమమునకు తగిన కర్మయనికాని కాదు, సామాన్యముగా ఆలోచించినా, సన్యాస విధిని ఆలోచించినా అట్టి నియమము లేదు).

  1. గృహస్థకర్మైవ, వనస్థ కర్మైవ, బ్రహ్మచారి కర్మైదేతి నియమాన వివక్షితః ఇత్యర్థః.

(గృహస్థాశ్రమములోనుండి చేయుకర్మ అని కాని, వానప్రస్థ్గాశ్రమములోనుండి చేయు కర్మయనికాని, బ్రహ్మచర్యాశ్రమమునకు సంబంధించిన కర్మయనికాని కర్మయోగము అనగా నియమములేదు).

  1. కర్మయోగో నామ “దైవమే వపరే యజ్ఞం” ఇత్యాదినా వికల్ప విహితేషు కర్మయోగౌ అవాంతర భేదేషు ఏకం యథా రుచ్యంగి తయా స్వీకృత్య అన్యాని నిత్య నైమిత్తికాని తదంగ తయా ఉపసం హృత్య అసంగ కర్మానుష్టాన విశేషః“.

(‘దైవమే యజ్ఞము - యజ్ఞరూపుడు’ అను మొదలగు విహితములైన అనేక భేదములుగల కర్మయోగములందు ఏదో మనసునకు నచ్చినదానిని అవలంభించి మిగిలిన నిత్య నైమిత్తిక కర్మలను దాని అంగములుగా వదలి దేనియందును ఆసక్తి లేకుందా కర్మను అనుష్టించుట).

  1. “శ్రీ విష్ణుమందిర నిర్వాణ, తదీయ సమ్మార్జన, దీపారోపనమాల్య సమర్పణాదికంబును, పంకజోదర కైకర్య రూపతపోదాన యాగాధ్యయన వన తటాకాది నిర్వర్తనంబులను క్రియా విశేషంబులనగునది కర్మయోగమనంబడు”.

(కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122)

  1. “యం సన్యాసః ఇతి, జ్ఞానయోగః ఇతి - ఆత్మయాధాత్మ్య జ్ఞానం ఇత్ - ప్రాహుః తం కర్మయోగమివ విద్ధి” (శ్రీరామానుజః)

(సన్యాసమని, జ్ఞానయోగమని - ఆత్మస్వరూపజ్ఞానమని యేది చెప్పబడుచున్నదో అదియే కర్మయోగమని తెలుసుకొనుము).

  1. యుజ్యతే అభ్యుదయో (అ) నేనేతి యోగః, కర్మైవ యోగః కర్మయోగః -

అభ్యుదయమునకు సమకూర్చునది యోగము. అట్టికర్మలను చేయుట కర్మయోగము. ఆ కర్మలు ఏవి అనగా :-

(1) “అహరహస్సంధ్యాముపాసీత” (ప్రతిరోజు సంధ్యోపాసన చేయవలెను).

(2) “కుర్వన్నేవే హకర్మాణి జి జెవిషేచ్ఛ తం సమాః” (కర్మలు చేయుచునే నూరు సంవత్సరములు జీవింపవలెను)

(3) “సత్యంవద” (సత్యమునే పలుకుము)

(4) ధర్మంచర (ధర్మమునాచరించుము).

  1. “యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |

సిద్ధ్య సిద్ధ్యఓః నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 48)

” యోగస్థః సన్ ఫలే కామం కర్తృత్వాభిమతం తథా |

త్యక్త్వా త్వం కురుకర్మాణి కృష్ణార్పణ ధియా సదా |

త్యక్త్వా హర్షం ఫలప్రాప్తౌ ఫలాసిద్ధౌ విషాదతాం |

- - - సిద్ధ్య సిద్ధ్యో సమత్వం యత్స యోగ ఇతి కధ్యతే ||“. (గీతాభావప్రకాశము - 2 - 504 to 506)

(కర్మఫలము సిద్ధించినపుడు సంతోషము పొందక, సిద్ధించనపుడు దుఃఖమును పొందక, ఎల్లపుడు ఒకే విధముగ నుండుట యోగము - అట్టి యోగమందుండి, కర్మఫలమునాసించక, తానే కర్మ చేయుచున్నను, దానియందు అభిమానము వదలి భగవదర్పణ బుద్ధితో కర్మలు చేయవలెను. అట్లు కర్మలు చేయుట కర్మయోగము).

  1. “యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే(అ)ర్జున |

కర్మేంద్రియః కర్మయోగమస్తకః స విశిష్యతే ||’. (శ్రీమద్భగవద్గీత - 3 - 7)

“కర్మణ్యధిజృతో యస్తు స చిత్తా నీంద్రియాణిచ |

భోగాసక్తే ర్నివర్త్యా శు వాక్పాణి భిరింద్రియైః |

శుద్ధహేతు తయా ప్రోక్తం కర్మయోగ వివేకవాన్ |

ఫలాభిలాష శూన్యస్సన్ కరోతి స విశిష్యతే ||“. (గీతాభావప్రకాసము - 3 - 58, 59)

(కర్మయోగమునవలంబించువాడు మనస్సును ఇంద్రియములను భోగములందు కలుగు ఆసక్తినుండి మరల్చి, కర్మఫలమునందు కలుగు ఆసక్తినుండి మరలించి కర్మను చేయు కర్మయోగి మనశ్శుద్ధి కలిగియుండుటచేతకర్మయోగులలో విశిష్టుడగును.

  1. లోకే (అ)స్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తామయా నఘ |

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ||” (శ్రీమద్భగవద్గీత - 3 - 3)

“సాంఖ్యానాం శుద్ధ చేతసాం యుజ్యతే బ్రహ్మణానేన జ్ఞానం తద్యోగ ఈరితః |

జ్ఞానయోగేన తే నైవ నిష్టా తేషాముదాహృతా |

కర్మాధికారిణాం పుం సాయ శుద్ధ మనసాం తథా |

కర్మైవ యుజ్యతే చిత్త శుద్ధ్యా (అ) నేనేతియోగకః |

తేనైవ కర్మయోగేన నిష్ఠా తేషాముదాహృతా |

ధీ శుద్ధి ద్వారతో జ్ఞానభూమౌ సమ్యక్ ప్రవేశనం |

నాన్యధే త్యా శయొ విష్ణోః శ్రీకృష్ణస్య కృపానిధేః |

అతో భిన్నాధికారిత్వాత్ సాధ్యసాధన రూపయోః |

నవికల్పస్తయోః జ్ఞాన లర్మనో ర్వా సముచ్చయః |

తస్మాదవస్తా భేదేన చైకమే వ ప్రతిద్వయోః |

ఉపయోగా న్న వైయర్థ్యముపదేశస్య చేతి ధిక్ ||“. (గీతాభావప్రకాశము - 3 - 35 to 40)

(పరబ్రహ్మతో ఐక్యముచేయునది యోగము - సాంఖ్యులకు - జ్ఞానులకు - జ్ఞానయోగము అను నిష్ఠ చెప్పబడినది -కర్మవలన చిత్త శుద్ధి కలుగును. కనుక అది యోగము అని చెప్పబడినది. మనశ్శుద్ధి లేనివానికి - కర్మాధికారులకు ఈ కర్మయోగమను నిష్ఠ చెప్పబడినది. చిత్త శుద్ధి కలిగిననే జ్ఞానమునకు - జ్ఞానయోగమునకు అవకాశము కలుగును. అందుచేత అధికారి భేదమును బట్టి నిష్ఠకూద వేరువేరుగ చెప్పబడినది. చిత్తశుద్ధిగలవారికి జ్ఞానయోగమని, చిత్తశుద్ధిలేనివారికి కర్మయోగమని నిష్ఠ చెప్పబడినది. రెండింటిలోను తారతమ్యము లేదు - రెండూ ఒకటే.

  1. సన్యాసః కర్మయోగశ్చ నిః శ్రేయసకరావుభే |

తయోస్తు కర్మసన్యానాత్కర్మయోగో విశిష్యతే ||“. (శ్రీమద్భగవదీత - 5 - 2)

“నిః శ్రేయసకరౌ కర్మ సన్యాసౌ శ్రుతి సమ్మతౌ |

మోక్షోప యోగినౌ జ్ఞానోత్పత్తిహేతుతయాహ్యుభౌ |

తయోస్తు కర్మసన్యాసాదశుద్ధస్వాంత కర్తృ కాత్ |

శుద్ధిసంపాదకత్వేన కర్మయోగో విశిష్యతే ||“. (గీతాభావప్రకాశము - 5 - 36 to 38)

(సన్యాసము, కర్మయోగము - ఈ రెండునూ శ్రేయస్కరములే. శ్రుతిలో చెప్పబడినవే. జ్ఞానోత్పత్తి కలుగచేయునవి యగుటచేత మోక్షమునకుపయోగించునవే. ఈ రెండింటిలోను కర్మసన్యాసముకన్న - ఏ కర్మయును యుండుటకన్న - కర్మయోగము, చిత్తశుద్ధి లేనివానికి చిత్తశుద్ధి కలిగించుతచేత విశిష్టమైనది).

  1. “యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |” (శ్రీమద్భగవద్గీత - 5 - 5)

(సాంఖ్యులు జ్ఞానయోగముచే ఏ స్థానమునుపొందుదురో కర్మయోగులు కర్మయోగమువలన దానినేపొందుదురు -

  1. “నేహాభి క్రమోనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్” (శ్రీమద్భగవద్గీత - 2 - 40)

(ఈ కర్మయోగము చేయుటలో దానిని ప్రారంభించినతర్వాత ఫలము క్షీణించుటలేదు, అడ్డు ఏమియు ఉండదు. ఇది స్వల్పమయినప్పటికీ తిరిగి సంసారములో పడవేయదు).

  1. “కర్మయోగః సుఖసాధ్యత్వాత్ అవిలంబిత ఫలః”.

(సుఖముగా సాధించుటకు వీలగునది కనుక కర్మయోగము. ఆలస్యము లేకయే ఫలమునిచ్చునది).

  1. యావత్ జ్ఞానయోగాధికారః కర్మయోగః కర్తవ్యః.

(బ్రహ్మజ్ఞానమునకు అధికారియగునంతకాలము కర్మయోగము చేయవలెను).

  1. “కషాయ నివృత్యర్థః కర్మయోగః; తన్నివృత్తే కర్మయోగం పరిత్యజ్య జ్ఞానయోగః ఉపాధేయః - అతో జ్ఞానయోగ ఏవ ఆత్మదర్శనే సాక్షాత్సాథనం”.

(చిత్తశుద్ధి కొఱకే కర్మయోగము – చిత్తశుద్ధి కలిగిన తర్వాత జ్ఞానయోగము ఉపదేశించవలెను - అందుచేత జ్ఞానయోగమే బ్రహ్మసాక్షాత్కారమునకు సాక్షాత్సాధనము).

Transliteration
  1. karmaivayōgaḥ karmayōgaḥ. (karmayē yōgamu - cēsinapaniyē yōgamani bhāviṃci cēyuṭa).

  2. “karmaṇāṃ anuṣṭānaṃ” (śrīśaṃkaraḥ)

karmātmikāniṣṭā.

(karmalanu anuṣṭiṃcuṭayē karmayōgamu; karmalanu oka niṣṭagā cēyuṭa).

  1. “īśvarārpaṇa buddhyā anuṣṭīyamānaṃ, yōgārthatvāt yōgaḥ ucyatē guṇataḥ” (śrīśaṃkaraḥ)

(paramātmaku arpiṃcu buddhitō niṣṭagā cēyuṭa).

  1. karmaiva yujyatē aṃtaḥkaraṇa śuddhyanēna iti vyutpatyā yōgaḥ -

(dīnivalana aṃtaḥkaraṇaśuddhi - cittaśuddhi - kalugunu - aṃducēta ī karmayē yōgamu - karmayōgamu).

  1. karmayōgō nāma karmāṇi kṛtvā, tēṣāṃ brahmātvikatva jñānaṃ iti kēcit.

(karmalu cēsi vāṭiyaṃdu avi brahmamē ani jñānamu kaligiyuṃḍuṭa karmayōgamani koṃdari abhiprāyamu).

  1. phalakāmanādi tyāgēna īśvarārpaṇa buddhyā varṇāśrama vihita karmānuṣṭānamēva karmayōgaḥ.

(karmalavalana kalugu phalamunu viḍicipeṭṭi īśvaruniki ā karmanu arpiṃcu buddhitō varṇāśramulaku vidhiṃcabaḍina karmalanu cēyuṭa - anuṣṭiṃcuṭa – karmayōgamu)

  1. karmānuṣṭānē samādiyōgaṃ – nissaṃgatayā dvaṃdva prahāṇa pūrvakaṃ īśvarārādhanārdhaṃ karmānuṣṭānaṃ samādhiyōgaṃ karmayōgaṃ.

(karmanu cēyunapuḍu samādhilō nuṃḍuṭayē karmayōgamu – dvaṃdvamulanu viḍici – lakṣyamu cēyaka – dēniyaṃdunu āśa lēkuṃḍanuṃḍi īśvaruni ārādhiṃcuṭa koṟakē ī karma cēyuṭa samādhiyōgamu, karmayōgamu.)

  1. karmayōgaṃ svavarṇāśramōcitaṃ, natu gṛhastha karmaivēti niyamaḥ - sanyāsādi vidhānāt sāmānya vacanāccha -

(karmayōgamanagā gṛhastha karma ani gāni varṇāśramamunaku tagina karmayanikāni kādu, sāmānyamugā ālōciṃcinā, sanyāsa vidhini ālōciṃcinā aṭṭi niyamamu lēdu).

  1. gṛhasthakarmaiva, vanastha karmaiva, brahmacāri karmaidēti niyamāna vivakṣitaḥ ityarthaḥ.

(gṛhasthāśramamulōnuṃḍi cēyukarma ani kāni, vānaprasthgāśramamulōnuṃḍi cēyu karmayanikāni, brahmacaryāśramamunaku saṃbaṃdhiṃcina karmayanikāni karmayōgamu anagā niyamamulēdu).

  1. karmayōgō nāma “daivamē vaparē yajñaṃ” ityādinā vikalpa vihitēṣu karmayōgau avāṃtara bhēdēṣu ēkaṃ yathā rucyaṃgi tayā svīkṛtya anyāni nitya naimittikāni tadaṃga tayā upasaṃ hṛtya asaṃga karmānuṣṭāna viśēṣaḥ”.

(‘daivamē yajñamu - yajñarūpuḍu’ anu modalagu vihitamulaina anēka bhēdamulugala karmayōgamulaṃdu ēdō manasunaku naccinadānini avalaṃbhiṃci migilina nitya naimittika karmalanu dāni aṃgamulugā vadali dēniyaṃdunu āsakti lēkuṃdā karmanu anuṣṭiṃcuṭa).

  1. “śrī viṣṇumaṃdira nirvāṇa, tadīya sammārjana, dīpārōpanamālya samarpaṇādikaṃbunu, paṃkajōdara kaikarya rūpatapōdāna yāgādhyayana vana taṭākādi nirvartanaṃbulanu kriyā viśēṣaṃbulanagunadi karmayōgamanaṃbaḍu”.

(kulaśēkharamahīpāla caritra - 2 - 122)

  1. “yaṃ sanyāsaḥ iti, jñānayōgaḥ iti - ātmayādhātmya jñānaṃ it - prāhuḥ taṃ karmayōgamiva viddhi” (śrīrāmānujaḥ)

(sanyāsamani, jñānayōgamani - ātmasvarūpajñānamani yēdi ceppabaḍucunnadō adiyē karmayōgamani telusukonumu).

  1. yujyatē abhyudayō (a) nēnēti yōgaḥ, karmaiva yōgaḥ karmayōgaḥ -

abhyudayamunaku samakūrcunadi yōgamu. aṭṭikarmalanu cēyuṭa karmayōgamu. ā karmalu ēvi anagā :-

(1) “aharahassaṃdhyāmupāsīta” (pratirōju saṃdhyōpāsana cēyavalenu).

(2) “kurvannēvē hakarmāṇi ji jeviṣēccha taṃ samāḥ” (karmalu cēyucunē nūru saṃvatsaramulu jīviṃpavalenu)

(3) “satyaṃvada” (satyamunē palukumu)

(4) dharmaṃcara (dharmamunācariṃcumu).

  1. “yōgasthaḥ kuru karmāṇi saṃgaṃ tyaktvā dhanaṃjaya |

siddhya siddhyaōḥ namō bhūtvā samatvaṃ yōga ucyatē ||“. (śrīmadbhagavadgīta - 2 - 48)

” yōgasthaḥ san phalē kāmaṃ kartṛtvābhimataṃ tathā |

tyaktvā tvaṃ kurukarmāṇi kṛṣṇārpaṇa dhiyā sadā |

tyaktvā harṣaṃ phalaprāptau phalāsiddhau viṣādatāṃ |

- - - siddhya siddhyō samatvaṃ yatsa yōga iti kadhyatē ||“. (gītābhāvaprakāśamu - 2 - 504 to 506)

(karmaphalamu siddhiṃcinapuḍu saṃtōṣamu poṃdaka, siddhiṃcanapuḍu duḥkhamunu poṃdaka, ellapuḍu okē vidhamuga nuṃḍuṭa yōgamu - aṭṭi yōgamaṃduṃḍi, karmaphalamunāsiṃcaka, tānē karma cēyucunnanu, dāniyaṃdu abhimānamu vadali bhagavadarpaṇa buddhitō karmalu cēyavalenu. aṭlu karmalu cēyuṭa karmayōgamu).

  1. “yastviṃdriyāṇi manasā niyamyārabhatē(a)rjuna |

karmēṃdriyaḥ karmayōgamastakaḥ sa viśiṣyatē ||’. (śrīmadbhagavadgīta - 3 - 7)

“karmaṇyadhijṛtō yastu sa cittā nīṃdriyāṇica |

bhōgāsaktē rnivartyā śu vākpāṇi bhiriṃdriyaiḥ |

śuddhahētu tayā prōktaṃ karmayōga vivēkavān |

phalābhilāṣa śūnyassan karōti sa viśiṣyatē ||“. (gītābhāvaprakāsamu - 3 - 58, 59)

(karmayōgamunavalaṃbiṃcuvāḍu manassunu iṃdriyamulanu bhōgamulaṃdu kalugu āsaktinuṃḍi maralci, karmaphalamunaṃdu kalugu āsaktinuṃḍi maraliṃci karmanu cēyu karmayōgi manaśśuddhi kaligiyuṃḍuṭacētakarmayōgulalō viśiṣṭuḍagunu.

  1. lōkē (a)smin dvividhā niṣṭā purā prōktāmayā nagha |

jñānayōgēna sāṃkhyānāṃ karmayōgēna yōgināṃ ||” (śrīmadbhagavadgīta - 3 - 3)

“sāṃkhyānāṃ śuddha cētasāṃ yujyatē brahmaṇānēna jñānaṃ tadyōga īritaḥ |

jñānayōgēna tē naiva niṣṭā tēṣāmudāhṛtā |

karmādhikāriṇāṃ puṃ sāya śuddha manasāṃ tathā |

karmaiva yujyatē citta śuddhyā (a) nēnētiyōgakaḥ |

tēnaiva karmayōgēna niṣṭhā tēṣāmudāhṛtā |

dhī śuddhi dvāratō jñānabhūmau samyak pravēśanaṃ |

nānyadhē tyā śayo viṣṇōḥ śrīkṛṣṇasya kṛpānidhēḥ |

atō bhinnādhikāritvāt sādhyasādhana rūpayōḥ |

navikalpastayōḥ jñāna larmanō rvā samuccayaḥ |

tasmādavastā bhēdēna caikamē va pratidvayōḥ |

upayōgā nna vaiyarthyamupadēśasya cēti dhik ||“. (gītābhāvaprakāśamu - 3 - 35 to 40)

(parabrahmatō aikyamucēyunadi yōgamu - sāṃkhyulaku - jñānulaku - jñānayōgamu anu niṣṭha ceppabaḍinadi -karmavalana citta śuddhi kalugunu. kanuka adi yōgamu ani ceppabaḍinadi. manaśśuddhi lēnivāniki - karmādhikārulaku ī karmayōgamanu niṣṭha ceppabaḍinadi. citta śuddhi kaliginanē jñānamunaku - jñānayōgamunaku avakāśamu kalugunu. aṃducēta adhikāri bhēdamunu baṭṭi niṣṭhakūda vēruvēruga ceppabaḍinadi. cittaśuddhigalavāriki jñānayōgamani, cittaśuddhilēnivāriki karmayōgamani niṣṭha ceppabaḍinadi. reṃḍiṃṭilōnu tāratamyamu lēdu - reṃḍū okaṭē.

  1. sanyāsaḥ karmayōgaśca niḥ śrēyasakarāvubhē |

tayōstu karmasanyānātkarmayōgō viśiṣyatē ||“. (śrīmadbhagavadīta - 5 - 2)

“niḥ śrēyasakarau karma sanyāsau śruti sammatau |

mōkṣōpa yōginau jñānōtpattihētutayāhyubhau |

tayōstu karmasanyāsādaśuddhasvāṃta kartṛ kāt |

śuddhisaṃpādakatvēna karmayōgō viśiṣyatē ||“. (gītābhāvaprakāśamu - 5 - 36 to 38)

(sanyāsamu, karmayōgamu - ī reṃḍunū śrēyaskaramulē. śrutilō ceppabaḍinavē. jñānōtpatti kalugacēyunavi yaguṭacēta mōkṣamunakupayōgiṃcunavē. ī reṃḍiṃṭilōnu karmasanyāsamukanna - ē karmayunu yuṃḍuṭakanna - karmayōgamu, cittaśuddhi lēnivāniki cittaśuddhi kaligiṃcutacēta viśiṣṭamainadi).

  1. “yatsāṃkhyaiḥ prāpyatē sthānaṃ tadyōgairapi gamyatē |” (śrīmadbhagavadgīta - 5 - 5)

(sāṃkhyulu jñānayōgamucē ē sthānamunupoṃdudurō karmayōgulu karmayōgamuvalana dāninēpoṃduduru -

  1. “nēhābhi kramōnāśōsti pratyavāyō na vidyatē |

svalpa mapyasya dharmasya trāyatē mahatō bhayāt” (śrīmadbhagavadgīta - 2 - 40)

(ī karmayōgamu cēyuṭalō dānini prāraṃbhiṃcinatarvāta phalamu kṣīṇiṃcuṭalēdu, aḍḍu ēmiyu uṃḍadu. idi svalpamayinappaṭikī tirigi saṃsāramulō paḍavēyadu).

  1. “karmayōgaḥ sukhasādhyatvāt avilaṃbita phalaḥ”.

(sukhamugā sādhiṃcuṭaku vīlagunadi kanuka karmayōgamu. ālasyamu lēkayē phalamuniccunadi).

  1. yāvat jñānayōgādhikāraḥ karmayōgaḥ kartavyaḥ.

(brahmajñānamunaku adhikāriyagunaṃtakālamu karmayōgamu cēyavalenu).

  1. “kaṣāya nivṛtyarthaḥ karmayōgaḥ; tannivṛttē karmayōgaṃ parityajya jñānayōgaḥ upādhēyaḥ - atō jñānayōga ēva ātmadarśanē sākṣātsāthanaṃ”.

(cittaśuddhi koṟakē karmayōgamu – cittaśuddhi kaligina tarvāta jñānayōgamu upadēśiṃcavalenu - aṃducēta jñānayōgamē brahmasākṣātkāramunaku sākṣātsādhanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.