కార్యముల నాచరించువాడు -
కారణ భూతః. (కార్యములకు కారణమైనవాడు).
కరణానాం వ్యాపారయితా ఉపాధిలక్షణః - (ఇంద్రియములను వాటి వాటి వ్యాపారములలో నియోగించువాడు).
క్రియా శక్తిమాన్ - (పని చేయగల శక్తిగలవాడు).
జీవ వ్యాపారేషు ప్రయోజకర్తా; యద్వా, ప్రేరణక్రియా కర్తా ఇత్యర్థః -
(జీవునియొక్క వ్యాపారములందు ప్రయోజకర్త, లేక ప్రేరేపించువాడు - ప్రేరేపించుట అను పని చేయువాడు).
అనుష్ఠాతా (అనుష్టింప చేయువాడు).
‘జీవాత్మ’ (శ్రీరామానుజః)
స్వతంత్రః (శ్రీశంకరః)
(పనులు చేయుటయందు స్వతంత్రుడైనవాడు).
(కర్తయొక్క ప్రయోజకత్వముద్వారా అంతర్యామిగాను, అనుమంతగాను ఉండువాడు).
(ఉపాధి లక్షణమైన భోక్త).
(విష్ణువే సర్వకర్త - అన్నింటిని చేయువాడు అని చెప్పబడినది కనుక కర్త అనగా విష్ణువు).
(సుఖ దుఃఖములు కలిగించు బుద్ధిని ఆశ్రయించి యుండువాడు - ఆ బుద్ధి కోరిక ప్రకారము దేహాంతము చేయువాడు).
(సత్వరజస్తమోగుణముల ననుసరించియు, జీవులు చేసిన కర్మలవలన నేను నాలుగు వర్ణములను సృష్టించితిని - ఇట్లు చేసినప్పటికీ నేను కర్తను గాను - కర్మలు నన్ను అంటవు. ఎందుచేతననగా నాకు ఆ కర్మలవలన కలుగు ఫలమందు అపేక్ష లేదు).
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే |
తత్త్యవిత్తు మహా బాహో గుణకర్మ విభాగయోః |
గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 28)
(మిధ్యాజ్ఞానమే మాయ, అదే ప్రకృతి, పరమేశ్వరునకు సంబంధించినది, పరమేశ్వరుని శక్తి. ఆ ప్రకృతియొక్క పరిణామములు - మార్పులు - అయిన సత్వరజస్తమములు అను మూడు గుణములచేత సమస్తమైన శ్రౌతకర్మలు, లౌకిక కర్మలు చేయబడుచున్నవి. తనే ఆత్మ అను వివేకము లేని మనస్సుగలవాడు, దేహమే ఆత్మ యను అధ్యాస కలిగియుండడమువలన ఆ కార్యములన్నీ కర్తనైన నేనే చేయుచున్నాను అని తలంచును - త్రిగుణముల యొక్కయు, కర్మలయొక్కయు తత్వము తెలిసినవాడు మాత్రము ఇట్లు తలంచడు. దేహము, ఇంద్రియములు మొదలగునవి అహంకారాస్పదములు - అహంకారము ఉండుటవలన కలుగునవి - అవి చేయు పనులు - కర్మలు - అనేక విధములు మమకారమువలన కలుగునవి. ప్రకృతి జడము, అందులో ప్రవేశించినది భగవంతుని శక్తి - చైతన్యము. ఈ జడము యొక్కయు ప్రకృతి యొక్కయు యాధాత్మ్యమును -తత్వమును - తెలిసిన విద్వాంసుడు శాస్త్రమువలన, అనుభవమువలనను యుక్తి వలనను ఈ ప్రకారముగా తలచును - త్రిగుణములు వికారములు, కర్మరూపములు - అవి విషయములందు కర్మలద్వారా ప్రవర్తించుచున్నవి - అంతేకాని వికారములు లేని ఆత్మ ఆ కర్మలను చేయుటలేదు - అని. ఇట్లు ఆత్మయొక్క అవికారత్వమును - వికారములులేని దానినిగాను - త్రిగుణములు మార్పులు కలవిగాను ఉండుట తెలిసిన పండితుడు ఆ కర్మలందు కర్తృత్వబుద్ధి కలిగియుండడు).
(ఆత్మయే కర్త, గుణములుకావు. ఎందుచేతననగా శాస్త్రములో ఈ ప్రకారము చెప్పబడుచున్నది - “స్వర్గమును కోరువాడు యజ్ఞమును చేయవలయును” అనిన్నీ, “మోక్షము కోరువాడు బ్రహ్మనుపాసించవలెను” అనిన్నీ. ఈప్రకారముగా స్వర్గమును, మోక్షమును కోరువాడే ఆ పనిని చేయవలయును, ఆ పనులకు కర్త అని చెప్పబడినది. అచేతనమైనది కర్తగా చెప్పబడియుండలేదు. శాసించునది శాస్త్రము. శాసించుట అనగా ప్రవర్తింపచేయుట. అచేతనమైన ప్రథానము జ్ఞానమును కలుగచేయలేదు, అందుచేత చేతనుడైన భోక్తయే కర్తయని శాస్త్రార్థము - శ్రీమద్భగవద్గీతలో - “చంపువాడను నేనే” అని అనుకొనరాదు. ఆత్మ ఎవరిని చంపదు, ఎవరిచేతను చంపబడదు. దీనివలన ఆత్మ అకర్తయని చెప్పబడినది. ఆత్మ నిత్యమైనది కనుక ఆ ప్రకారము చెప్పబడినది. శ్రీమద్భగవద్గీతలో ఇంకొక చోట ప్రకృతియొక్క గుణములవలన అన్నియు చేయబడుచున్నవి అని చెప్పబడినది - ప్రకృతిగుణములైన సత్వరజస్తమములే కర్తయని చెప్పబడినవి. మఱియొక చోట పుణ్యపాపజన్మలు కలుగుటకు కారణము త్రిగుణములే - వాటి కూటమి యే యని చెప్పబడినది - అనగా ప్రకృతియొక్క త్రిగుణములే కర్త యని చెప్పబడినది. ఇట్లున్నను ఆత్మజ్ఞానము లేనివాడు తానే కర్తను అని అజ్ఞానమువలనతలచును. అధిష్ఠానము మొదలగునవి అయిదు కర్తలని చెప్పబడినవి. ఇట్లు అయిదు కర్తలగుచుండ తానే కర్తను అనుకొనుట ఆత్మే కర్త యనుకొనుట అజ్ఞానము).
న కర్మఫల సం యోగం స్వభావస్తు ప్రవర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 14)
(ఆత్మ కర్తకాదు - జీవులకు ఈ పనిని చేయుము అని చెప్పి చేయించదు - దేహాదుల కర్తౄత్వము ప్రకృతిదే, స్వభావముదే - దానినే మాయయని అవిద్యయని అందురు. అందుచేత ఎవరి పనులకు వారి స్వభావమే కర్త. పరమార్థ దృష్టిలో అసంగి అయిన జీవునకు కర్తృత్వము లేదు - భగవంతునికి కారయితృత్వము లేదు. ఆవరణవిక్షేప శక్తులు గల మాయ యను అజ్ఞానముచేత జ్ఞానము కప్పబడినది. జీవేశ్వర జగత్తులకు భేదముకలదు అను భ్రమకు అజ్ఞానము అధిష్ఠానము - “స్వయమేవ సర్వం భావయ తీతి స్వభావః, స్వం భావయతీతివా స్వభావః”. స్వభావము అనగా స్వయముగా సర్వము భావింపచేయునది, తనను భావింపచేయునది - వాసనామయమగు ప్రకృతి కర్మలను చేయించి, సుఖ దుఃఖములననుభవింపచేయును. భగవంతుడు ఏ జీవుని ఉద్దరింపతలచునో అతనిచేత పుణ్యకార్యములను చేయించును. ఎవరిని అధమ గతికి చేర్చవలెననుకొనునో వానిచే పాపకర్మలు చేయించును. అయినను జీవుడు అజ్ఞానముచే ఆవరింపబడిన జ్ఞానము కలవాడు కనుక వారి స్వభావమును బట్టి కర్మలుచేసి కర్త అగుచున్నారు -).
(భగవంతుడు తన చైతన్యశక్తితో ప్రకృతిలో ప్రవేశించి దానిచే ప్రపంచరూపములన్నింటిని పుట్టింపచేయుచున్నాడు. అట్లు పుట్టిన రూపములన్నింటిలో భగవంతుని శక్తియున్నది. భగవంతుని శక్తి లేనిదే ఏ వస్తువు ఏమియు చేయనేరదు. భగవంతుని శక్తి తనలో నుండుటవలననే జీవుడు కర్మలు చేయుచున్నాడు - కర్మలు చేయుటకు భగవంతుడు తన శక్తినిచ్చును గాని దానిని సన్మార్గములో ఉపయోగించుట జీవుని బాధ్యత - ఈ బాధ్యత నిర్వహించుటలో జీవుడు తనకర్మ ఫలము వశమున స్వతంత్రుడు కానివాడై ప్రవర్తించును - అందుచేత జీవుని స్వభావమే అతను చేయు కర్మలకు కర్త). (చూడుము - కర్మకారణములు - ).
కర్తయనువాడు మూడు విధములుగా నున్నాడు - సాత్విక కర్త, రాజసకర్త, తామసకర్త.
“మ యాధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరం |
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 10)
(నా అధ్యక్షత క్రింద ప్రకృతి చరాచరములతో కూడియున్న ఈ జగత్తును కనుచున్నది - పుట్టించుచున్నది. ఇందువలన జగత్తు అనేక విధములుగ పరివర్తించుచున్నది - మారు చున్నది) (భగవంతుని శక్తి తనలోనుంచుకొని ఆ శక్తివలన ప్రపంచమును ప్రకృతి సృష్టిచేయుచున్నది. భగవంతుని శక్తి తనలో లేనిచో ప్రకృతిజడమైనందున ఏమియు చేయ లేదు).
kāryamula nācariṃcuvāḍu -
kāraṇa bhūtaḥ. (kāryamulaku kāraṇamainavāḍu).
karaṇānāṃ vyāpārayitā upādhilakṣaṇaḥ - (iṃdriyamulanu vāṭi vāṭi vyāpāramulalō niyōgiṃcuvāḍu).
kriyā śaktimān - (pani cēyagala śaktigalavāḍu).
jīva vyāpārēṣu prayōjakartā; yadvā, prēraṇakriyā kartā ityarthaḥ -
(jīvuniyokka vyāpāramulaṃdu prayōjakarta, lēka prērēpiṃcuvāḍu - prērēpiṃcuṭa anu pani cēyuvāḍu).
anuṣṭhātā (anuṣṭiṃpa cēyuvāḍu).
‘jīvātma’ (śrīrāmānujaḥ)
svataṃtraḥ (śrīśaṃkaraḥ)
(panulu cēyuṭayaṃdu svataṃtruḍainavāḍu).
(kartayokka prayōjakatvamudvārā aṃtaryāmigānu, anumaṃtagānu uṃḍuvāḍu).
(upādhi lakṣaṇamaina bhōkta).
(viṣṇuvē sarvakarta - anniṃṭini cēyuvāḍu ani ceppabaḍinadi kanuka karta anagā viṣṇuvu).
(sukha duḥkhamulu kaligiṃcu buddhini āśrayiṃci yuṃḍuvāḍu - ā buddhi kōrika prakāramu dēhāṃtamu cēyuvāḍu).
(satvarajastamōguṇamula nanusariṃciyu, jīvulu cēsina karmalavalana nēnu nālugu varṇamulanu sṛṣṭiṃcitini - iṭlu cēsinappaṭikī nēnu kartanu gānu - karmalu nannu aṃṭavu. eṃducētananagā nāku ā karmalavalana kalugu phalamaṃdu apēkṣa lēdu).
ahaṃkāra vimūḍhātmā kartāhamiti manyatē |
tattyavittu mahā bāhō guṇakarma vibhāgayōḥ |
guṇāḥ guṇēṣu vartaṃtē iti matvā na sajjatē ||“. (śrīmadbhagavadgīta - 3 - 28)
(midhyājñānamē māya, adē prakṛti, paramēśvarunaku saṃbaṃdhiṃcinadi, paramēśvaruni śakti. ā prakṛtiyokka pariṇāmamulu - mārpulu - ayina satvarajastamamulu anu mūḍu guṇamulacēta samastamaina śrautakarmalu, laukika karmalu cēyabaḍucunnavi. tanē ātma anu vivēkamu lēni manassugalavāḍu, dēhamē ātma yanu adhyāsa kaligiyuṃḍaḍamuvalana ā kāryamulannī kartanaina nēnē cēyucunnānu ani talaṃcunu - triguṇamula yokkayu, karmalayokkayu tatvamu telisinavāḍu mātramu iṭlu talaṃcaḍu. dēhamu, iṃdriyamulu modalagunavi ahaṃkārāspadamulu - ahaṃkāramu uṃḍuṭavalana kalugunavi - avi cēyu panulu - karmalu - anēka vidhamulu mamakāramuvalana kalugunavi. prakṛti jaḍamu, aṃdulō pravēśiṃcinadi bhagavaṃtuni śakti - caitanyamu. ī jaḍamu yokkayu prakṛti yokkayu yādhātmyamunu -tatvamunu - telisina vidvāṃsuḍu śāstramuvalana, anubhavamuvalananu yukti valananu ī prakāramugā talacunu - triguṇamulu vikāramulu, karmarūpamulu - avi viṣayamulaṃdu karmaladvārā pravartiṃcucunnavi - aṃtēkāni vikāramulu lēni ātma ā karmalanu cēyuṭalēdu - ani. iṭlu ātmayokka avikāratvamunu - vikāramululēni dāninigānu - triguṇamulu mārpulu kalavigānu uṃḍuṭa telisina paṃḍituḍu ā karmalaṃdu kartṛtvabuddhi kaligiyuṃḍaḍu).
(ātmayē karta, guṇamulukāvu. eṃducētananagā śāstramulō ī prakāramu ceppabaḍucunnadi - “svargamunu kōruvāḍu yajñamunu cēyavalayunu” aninnī, “mōkṣamu kōruvāḍu brahmanupāsiṃcavalenu” aninnī. īprakāramugā svargamunu, mōkṣamunu kōruvāḍē ā panini cēyavalayunu, ā panulaku karta ani ceppabaḍinadi. acētanamainadi kartagā ceppabaḍiyuṃḍalēdu. śāsiṃcunadi śāstramu. śāsiṃcuṭa anagā pravartiṃpacēyuṭa. acētanamaina prathānamu jñānamunu kalugacēyalēdu, aṃducēta cētanuḍaina bhōktayē kartayani śāstrārthamu - śrīmadbhagavadgītalō - “caṃpuvāḍanu nēnē” ani anukonarādu. ātma evarini caṃpadu, evaricētanu caṃpabaḍadu. dīnivalana ātma akartayani ceppabaḍinadi. ātma nityamainadi kanuka ā prakāramu ceppabaḍinadi. śrīmadbhagavadgītalō iṃkoka cōṭa prakṛtiyokka guṇamulavalana anniyu cēyabaḍucunnavi ani ceppabaḍinadi - prakṛtiguṇamulaina satvarajastamamulē kartayani ceppabaḍinavi. maṟiyoka cōṭa puṇyapāpajanmalu kaluguṭaku kāraṇamu triguṇamulē - vāṭi kūṭami yē yani ceppabaḍinadi - anagā prakṛtiyokka triguṇamulē karta yani ceppabaḍinadi. iṭlunnanu ātmajñānamu lēnivāḍu tānē kartanu ani ajñānamuvalanatalacunu. adhiṣṭhānamu modalagunavi ayidu kartalani ceppabaḍinavi. iṭlu ayidu kartalagucuṃḍa tānē kartanu anukonuṭa ātmē karta yanukonuṭa ajñānamu).
na karmaphala saṃ yōgaṃ svabhāvastu pravartatē ||“. (śrīmadbhagavadgīta - 5 - 14)
(ātma kartakādu - jīvulaku ī panini cēyumu ani ceppi cēyiṃcadu - dēhādula kartṝtvamu prakṛtidē, svabhāvamudē - dāninē māyayani avidyayani aṃduru. aṃducēta evari panulaku vāri svabhāvamē karta. paramārtha dṛṣṭilō asaṃgi ayina jīvunaku kartṛtvamu lēdu - bhagavaṃtuniki kārayitṛtvamu lēdu. āvaraṇavikṣēpa śaktulu gala māya yanu ajñānamucēta jñānamu kappabaḍinadi. jīvēśvara jagattulaku bhēdamukaladu anu bhramaku ajñānamu adhiṣṭhānamu - “svayamēva sarvaṃ bhāvaya tīti svabhāvaḥ, svaṃ bhāvayatītivā svabhāvaḥ”. svabhāvamu anagā svayamugā sarvamu bhāviṃpacēyunadi, tananu bhāviṃpacēyunadi - vāsanāmayamagu prakṛti karmalanu cēyiṃci, sukha duḥkhamulananubhaviṃpacēyunu. bhagavaṃtuḍu ē jīvuni uddariṃpatalacunō atanicēta puṇyakāryamulanu cēyiṃcunu. evarini adhama gatiki cērcavalenanukonunō vānicē pāpakarmalu cēyiṃcunu. ayinanu jīvuḍu ajñānamucē āvariṃpabaḍina jñānamu kalavāḍu kanuka vāri svabhāvamunu baṭṭi karmalucēsi karta agucunnāru -).
(bhagavaṃtuḍu tana caitanyaśaktitō prakṛtilō pravēśiṃci dānicē prapaṃcarūpamulanniṃṭini puṭṭiṃpacēyucunnāḍu. aṭlu puṭṭina rūpamulanniṃṭilō bhagavaṃtuni śaktiyunnadi. bhagavaṃtuni śakti lēnidē ē vastuvu ēmiyu cēyanēradu. bhagavaṃtuni śakti tanalō nuṃḍuṭavalananē jīvuḍu karmalu cēyucunnāḍu - karmalu cēyuṭaku bhagavaṃtuḍu tana śaktiniccunu gāni dānini sanmārgamulō upayōgiṃcuṭa jīvuni bādhyata - ī bādhyata nirvahiṃcuṭalō jīvuḍu tanakarma phalamu vaśamuna svataṃtruḍu kānivāḍai pravartiṃcunu - aṃducēta jīvuni svabhāvamē atanu cēyu karmalaku karta). (cūḍumu - karmakāraṇamulu - ).
kartayanuvāḍu mūḍu vidhamulugā nunnāḍu - sātvika karta, rājasakarta, tāmasakarta.
“ma yādhyakṣēṇa prakṛtiḥ sūyatē sa carācaraṃ |
hētunānēna kauṃtēya jagadviparivartatē ||“. (śrīmadbhagavadgīta - 9 - 10)
(nā adhyakṣata kriṃda prakṛti carācaramulatō kūḍiyunna ī jagattunu kanucunnadi - puṭṭiṃcucunnadi. iṃduvalana jagattu anēka vidhamuluga parivartiṃcucunnadi - māru cunnadi) (bhagavaṃtuni śakti tanalōnuṃcukoni ā śaktivalana prapaṃcamunu prakṛti sṛṣṭicēyucunnadi. bhagavaṃtuni śakti tanalō lēnicō prakṛtijaḍamainaṃduna ēmiyu cēya lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.