(సమష్టి సూక్ష్మశరీరములను అభిమానించియుండు - అధిష్ఠించియుండు చైతన్యమే - పరబ్రహ్మ చైతన్యమే - కార్యబ్రహ్మ అని, హిరణ్యగర్భుడని చెప్పబడుచున్నది. కార్య బ్రహ్మాధిష్ఠించి యుండు లోకమే బ్రహ్మలోకమని చెప్పబడుచున్నది).
(సృష్టి వస్తువులన్నియు సూక్ష్మరూపములో సమిష్టిగా కలిసి ఒకే వస్తువుగా ఉన్న స్థితిలో వాటిని అభిమానించు చైతన్యము - వాటిలోనుండు భగవంతుని శక్తి (ENERGY) - హిరణ్యగర్భుడు అని చెప్పబడుచున్నది. హిరణ్యమనగా సృష్టి చేయుటకు అవసరమైన శక్తి - అది తనలో గలవాడు కనుక హిరణ్యగర్భుడు అని చెప్పబడుచున్నాడు). (ఇప్పుడు సృష్టిలో అనేక నామ రూపములతో ఉన్న సమస్త వస్తువులు ప్రళయకాలమందు నశించిపోయి వాటి వాటి కారణవస్తువులలో లీనమై పోయి సూక్ష్మరూప ములో అన్నియు కలిసి ఒకే వస్తువుగా నుండి, తిరిగి సృష్టి ప్రారంభమువరకు ఆ స్థితిలోనే అవ్యక్త ముగా నుండు స్థితియే హిరణ్యగర్భుడు అని చెప్పబడును - ఇదియే మద్భగవద్గీతలోని 8 వ అధ్యాయ ములో 17, 18 శ్లోకములలో చెప్పబడిన అవ్యక్తము - వ్యక్తముగాని స్థితిలోనుండి సృష్టి ప్రారంభసమయములో సృష్టి చేయబడుటకు ఉన్ముఖమై యున్న ప్రకృతి). (ఇదియే చతుర్ముఖబ్రహ్మ, హిరణ్యగర్భుడు - ఇందులోనుండి సూక్ష్మరూపములోనున్న వస్తువులు పైకి నామరూపములతో స్థూలరూపములో వెలువడుటే చతుర్ముఖ బ్రహ్మ చేయు సృష్టి. ఈ చతుర్ముఖ బ్రహ్మలో పరబ్రహ్మ తన చైతన్య శక్తితో దానిని తపింప చేయుటవలననే - క్షోభింపచేయుటవలననే - ఇట్లు జరుగుచున్నది. ఇదియే సృష్టి ప్రారంభము -
సహస్రయుగ పర్యంత మహర్య ద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహప్రాంతాం తే(అ)హోరాత్రవిదో జనాః ||
అవ్యకాద్వ్యక్తయః సర్వా ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్త్రైవా వ్యక్త సంజ్ఞికే ||
(చతుర్ముఖబ్రహ్మకు వేయి యుగములు ఒక పగలు, అట్లే వేయి యుగములు ఒక రాత్రికాలము. అట్టి పగటి కాలమందు వ్యక్తముగాని అవస్థలో ఉన్న సమస్త వస్తువులు వ్యక్తమగుచున్నవి - స్థూలరూపము ధరించుచున్నవి. ఇదియే సృష్టి - పరబ్రహ్మ అవ్యక్తమను పేరుగల ఈ కార్యబ్రహ్మలోనుండి దానిని తన చైతన్య శక్తిచే తపింప చేయుటవలననే జరుగుచున్నది. అందుచేతనే సృష్టికి కారణము భగవంతుడు అని చెప్పబడుచున్నది. చతుర్ముఖ బ్రహ్మ రాత్రికాలములో ఈ సృష్టిలో నామరూపములతో స్థ్గూలరూప ములోనున్న సమస్త వస్తువులు వాటి నామరూపములు వదలి వాటి కారణములో లీనమగుచున్నవి. ఇదియే ప్రళయము. ఇట్లు ప్రపంచమునకు సృష్టి ప్రళయములు భగంతుని వలననే కలుగుచున్నవని ఈ క్రింద శ్రీమద్భగవద్గీతా శ్లోకమువలన స్పష్టమగుచున్నది : -
“సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం |
కల్పక్షయే; పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం |
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ||“. (9 - 7, 8)
(samaṣṭi sūkṣmaśarīramulanu abhimāniṃciyuṃḍu - adhiṣṭhiṃciyuṃḍu caitanyamē - parabrahma caitanyamē - kāryabrahma ani, hiraṇyagarbhuḍani ceppabaḍucunnadi. kārya brahmādhiṣṭhiṃci yuṃḍu lōkamē brahmalōkamani ceppabaḍucunnadi).
(sṛṣṭi vastuvulanniyu sūkṣmarūpamulō samiṣṭigā kalisi okē vastuvugā unna sthitilō vāṭini abhimāniṃcu caitanyamu - vāṭilōnuṃḍu bhagavaṃtuni śakti (ENERGY) - hiraṇyagarbhuḍu ani ceppabaḍucunnadi. hiraṇyamanagā sṛṣṭi cēyuṭaku avasaramaina śakti - adi tanalō galavāḍu kanuka hiraṇyagarbhuḍu ani ceppabaḍucunnāḍu). (ippuḍu sṛṣṭilō anēka nāma rūpamulatō unna samasta vastuvulu praḷayakālamaṃdu naśiṃcipōyi vāṭi vāṭi kāraṇavastuvulalō līnamai pōyi sūkṣmarūpa mulō anniyu kalisi okē vastuvugā nuṃḍi, tirigi sṛṣṭi prāraṃbhamuvaraku ā sthitilōnē avyakta mugā nuṃḍu sthitiyē hiraṇyagarbhuḍu ani ceppabaḍunu - idiyē madbhagavadgītalōni 8 va adhyāya mulō 17, 18 ślōkamulalō ceppabaḍina avyaktamu - vyaktamugāni sthitilōnuṃḍi sṛṣṭi prāraṃbhasamayamulō sṛṣṭi cēyabaḍuṭaku unmukhamai yunna prakṛti). (idiyē caturmukhabrahma, hiraṇyagarbhuḍu - iṃdulōnuṃḍi sūkṣmarūpamulōnunna vastuvulu paiki nāmarūpamulatō sthūlarūpamulō veluvaḍuṭē caturmukha brahma cēyu sṛṣṭi. ī caturmukha brahmalō parabrahma tana caitanya śaktitō dānini tapiṃpa cēyuṭavalananē - kṣōbhiṃpacēyuṭavalananē - iṭlu jarugucunnadi. idiyē sṛṣṭi prāraṃbhamu -
sahasrayuga paryaṃta maharya dbrahmaṇō viduḥ |
rātriṃ yugasahaprāṃtāṃ tē(a)hōrātravidō janāḥ ||
avyakādvyaktayaḥ sarvā prabhavaṃtyaharāgamē |
rātryāgamē pralīyaṃtē tattraivā vyakta saṃjñikē ||
(caturmukhabrahmaku vēyi yugamulu oka pagalu, aṭlē vēyi yugamulu oka rātrikālamu. aṭṭi pagaṭi kālamaṃdu vyaktamugāni avasthalō unna samasta vastuvulu vyaktamagucunnavi - sthūlarūpamu dhariṃcucunnavi. idiyē sṛṣṭi - parabrahma avyaktamanu pērugala ī kāryabrahmalōnuṃḍi dānini tana caitanya śakticē tapiṃpa cēyuṭavalananē jarugucunnadi. aṃducētanē sṛṣṭiki kāraṇamu bhagavaṃtuḍu ani ceppabaḍucunnadi. caturmukha brahma rātrikālamulō ī sṛṣṭilō nāmarūpamulatō sthgūlarūpa mulōnunna samasta vastuvulu vāṭi nāmarūpamulu vadali vāṭi kāraṇamulō līnamagucunnavi. idiyē praḷayamu. iṭlu prapaṃcamunaku sṛṣṭi praḷayamulu bhagaṃtuni valananē kalugucunnavani ī kriṃda śrīmadbhagavadgītā ślōkamuvalana spaṣṭamagucunnadi : -
“sarvabhūtāni kauṃtēya prakṛtiṃ yāṃti māmikāṃ |
kalpakṣayē; punastāni kalpādau visṛjāmyahaṃ |
prakṛtiṃ svāmavaṣṭabhya visṛjāmi punaḥ punaḥ |
bhūtagrāmamimaṃ kṛtsnamavaśaṃ prakṛtērvaśāt ||“. (9 - 7, 8)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.