(చేయబడినది కార్యము - కారణముయొక్క ఫలము).
కరణీయం; కర్తుం యోగ్యం - (చేయవలసిన పని; చేయతగిన పని)
కర్మానుష్టాన మేవ కార్యం - (కర్మ చేయుటయే కార్యము).
“కారణా జ్జాయతే కార్యం”. (కారణవస్తువునుండి కార్యవస్తువు పుట్టుచున్నది -
“ఆకాశా ద్వాయుః” - ఆకాశమునుండి వాయువు పుట్టుచున్నది. ఆకాశము కారణవస్తువు, దానిలో నుండి పుట్టిన వాయువు కార్యము).
(శరీరము పంచభూతముల కలియికవల్ల కలుగుచున్నది. అందుచేత అది పంచభూతముల కార్యము).
(దేనికి పరిమితి కలదో అది కార్యము - అనగా, ఏది ఒకచోట నుండి మఱియొకచోట నుండదో, ఒక వస్తువులోనుండి మరియొక వస్తువులోనుండదో, ఏది ఒకప్పుడు ఉండి, మరియొకప్పుడు ఉండదో అది పరిచ్ఛిన్నము - ఇంద్రియములు అంతఃకరణము పరిచ్ఛిన్నములు కనుక కార్యములు - భగవంతుడు అపరిచ్ఛిన్నుడు - ఎక్కడ పడితే అక్కడ, దేనిలో పడితే దానిలో ఎప్పుడు పడితే అప్పుడు ఉండువాడు - అందుచేత భగవంతుడు కార్యముకాదు.
(అవిద్యవలన - అజ్ఞానమువలన కలిగినదై - మూడు కాలములందు ఉండనిదగుటచేత కార్యము అని చెప్పబడినది, శాశ్వతముగా నుండునదికాదు).
(కార్యమైన వస్తువునకు కర్తయనునది ఉండవలెను - ప్రపంచము కార్యము - అందుచేత దానిని చేసిన వాడు - కర్త ఉండవలెను - ఆ కర్తే పరబ్రహ్మ). (ప్రపంచములోని వస్తువులన్నియు కార్యములు. వీటికి కర్త (కారణము) లేనిచో ఇవి ఉండవు. ప్రపంచమునకు - ప్రపంచములోని వస్తువులన్నింటికి కర్త భగవంతుడు - భగవంతుడు లేనిచో - కారణము లేనిచో - ప్రపంచము (కార్య వస్తువు) పుట్టదు. కుమ్మరివాడు లేనిదే కుండ ఉండదు - అందుచేత కర్తలేని కార్యముండదు - కారణములేని కార్యముండదు).
(కారణవస్తువుకంటె కార్యవస్తువు వేరు విధమైనదికాదు, కారణమే కార్యముగా మారును).
(మట్టిలేనిదే ఘటము ఉండదు - మట్టి లక్షణములకంటె ఘటము ఇతరలక్షణములుకలది కాదు. అందుచేత కార్యమునకు వ్యతిరేకమైన కార్యము లేదు).
(ఉపాదానకారణము కంటె కార్యము వేరుసత్వము కలదికాదు - కనుక ఉపాదానమును తెలుసుకొనిన దాని కార్యము తెలియనగును. ఘటమునకు మట్టి ఉపాదానకారణము. అందుచేత ఘటము మట్టి కంటె వేరు సత్తాకలదికాదు- మట్టిని తెలుసుకొనినచో ఘటమును తెలుసుకొనవచ్చును).
“మొదట చక్షురాది బాహ్యేంద్రియగోచరంబై కనబడు నీ సకలజగంబెల్లను పృధు బుధ్నోదరాకారాది సావ యవంబులం గలుగుటంజేసి, ఘటాదులు బోలె, కార్యంబులు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)
“యత్కార్యం తత్ జడం”. (కార్యమైన వస్తువు జడము - భగవంతుని సత్తాస్ఫూర్తి లేనిదే పనిచేయలేదు).
(cēyabaḍinadi kāryamu - kāraṇamuyokka phalamu).
karaṇīyaṃ; kartuṃ yōgyaṃ - (cēyavalasina pani; cēyatagina pani)
karmānuṣṭāna mēva kāryaṃ - (karma cēyuṭayē kāryamu).
“kāraṇā jjāyatē kāryaṃ”. (kāraṇavastuvunuṃḍi kāryavastuvu puṭṭucunnadi -
“ākāśā dvāyuḥ” - ākāśamunuṃḍi vāyuvu puṭṭucunnadi. ākāśamu kāraṇavastuvu, dānilō nuṃḍi puṭṭina vāyuvu kāryamu).
(śarīramu paṃcabhūtamula kaliyikavalla kalugucunnadi. aṃducēta adi paṃcabhūtamula kāryamu).
(dēniki parimiti kaladō adi kāryamu - anagā, ēdi okacōṭa nuṃḍi maṟiyokacōṭa nuṃḍadō, oka vastuvulōnuṃḍi mariyoka vastuvulōnuṃḍadō, ēdi okappuḍu uṃḍi, mariyokappuḍu uṃḍadō adi paricchinnamu - iṃdriyamulu aṃtaḥkaraṇamu paricchinnamulu kanuka kāryamulu - bhagavaṃtuḍu aparicchinnuḍu - ekkaḍa paḍitē akkaḍa, dēnilō paḍitē dānilō eppuḍu paḍitē appuḍu uṃḍuvāḍu - aṃducēta bhagavaṃtuḍu kāryamukādu.
(avidyavalana - ajñānamuvalana kaliginadai - mūḍu kālamulaṃdu uṃḍanidaguṭacēta kāryamu ani ceppabaḍinadi, śāśvatamugā nuṃḍunadikādu).
(kāryamaina vastuvunaku kartayanunadi uṃḍavalenu - prapaṃcamu kāryamu - aṃducēta dānini cēsina vāḍu - karta uṃḍavalenu - ā kartē parabrahma). (prapaṃcamulōni vastuvulanniyu kāryamulu. vīṭiki karta (kāraṇamu) lēnicō ivi uṃḍavu. prapaṃcamunaku - prapaṃcamulōni vastuvulanniṃṭiki karta bhagavaṃtuḍu - bhagavaṃtuḍu lēnicō - kāraṇamu lēnicō - prapaṃcamu (kārya vastuvu) puṭṭadu. kummarivāḍu lēnidē kuṃḍa uṃḍadu - aṃducēta kartalēni kāryamuṃḍadu - kāraṇamulēni kāryamuṃḍadu).
(kāraṇavastuvukaṃṭe kāryavastuvu vēru vidhamainadikādu, kāraṇamē kāryamugā mārunu).
(maṭṭilēnidē ghaṭamu uṃḍadu - maṭṭi lakṣaṇamulakaṃṭe ghaṭamu itaralakṣaṇamulukaladi kādu. aṃducēta kāryamunaku vyatirēkamaina kāryamu lēdu).
(upādānakāraṇamu kaṃṭe kāryamu vērusatvamu kaladikādu - kanuka upādānamunu telusukonina dāni kāryamu teliyanagunu. ghaṭamunaku maṭṭi upādānakāraṇamu. aṃducēta ghaṭamu maṭṭi kaṃṭe vēru sattākaladikādu- maṭṭini telusukoninacō ghaṭamunu telusukonavaccunu).
“modaṭa cakṣurādi bāhyēṃdriyagōcaraṃbai kanabaḍu nī sakalajagaṃbellanu pṛdhu budhnōdarākārādi sāva yavaṃbulaṃ galuguṭaṃjēsi, ghaṭādulu bōle, kāryaṃbulu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
“yatkāryaṃ tat jaḍaṃ”. (kāryamaina vastuvu jaḍamu - bhagavaṃtuni sattāsphūrti lēnidē panicēyalēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.