(వర్ణించువాడు కవి - కవి చేసినది, రచించినది కావ్యము).
కవతే చాతుర్యేణ వర్ణయతి ఇతి కవిః - (చతురతతో వర్ణించు వాడు కవి).
దేవతా ప్రసాద లబ్ద కవితా సంపత్తిమాన్. (దైవానుగ్రహముచేత కవిత్వము చెప్పు శక్తిగలవాడు).
విచిత్ర ప్రబంధ వచనరచనా చాతురీ ధురీన ప్రతిభా సంపన్నాః కవయితారః.
(విచిత్రమైన ప్రబంధ వచన రచించుటలో చాతుర్యముగలవారు కవులు).
(కం అనగా బ్రహ్మ. వ = వేత్తి తెలుసుకొనిన వాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు, కవిత్వము చెప్పువాడు, వక్తా అని అర్థము).
(చిద్రూపుడు - చైతన్యము లేక జ్ఞానము రూపముగా గలవాడు - అగుటచేత - (బ్రహ్మ) సర్వజ్ఞుడు).
వేద శాస్త్ర పారంగతః. (వేదములను, శాస్త్రములను సాంతముగా, తుదిముట్ట - చదివినవాడు).
బ్రహ్మ విద్యా విశారదః - (బ్రహ్మజ్ఞానమును తెలియచేయు విద్యయందు - వేదమందు విశారదుడు).
శబ్ద బ్రహ్మ నిష్ణాతః. (వేదాధ్యయనమునందు నిష్టకలవాడు).
తత్వ విద్. (తత్వమును - ఆత్మ తత్వమును తెలిసినవాడు).
తత్వత్రయా ధ్యాత్మవిద్. (జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి అను మూడు తత్వములను తెలిసినవాడు).
బ్రహ్మ.
సర్వ దృక్ = అన్నింటికి సాక్షి అయినవాడు.
సూరిః - సూరిభిః దృశ్యంచ వైష్ణవం పదమేవ - తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః.
(సూరిజనులే పరమపదమైన వైష్ణవ పదమును సర్వదా చూచెదరు).
(ఇంద్రియములకు మించిన - ఇంద్రియములకు అందని విషయములను చూచుటయందు సమర్థుడైనవాడు).
“త్వం కవిః సర్వవేదినాత్” ఇతి బ్రాహ్మ. (అన్నింటిని తెలిసినవాడగుటచేత నీవు కవివి).
“క్రాంత దర్శీ” - క్రాంత దర్శిత్వాత్ కవిః.
(క్రాంత దర్శీ అనగా భూతభవిష్యద్వర్తమానముల నెఱింగినవాడు - క్రాంతిదర్శియగుటవలన కవి).. ‘సర్వ దృక్’ అన్నింటిని చూచువాడు. “నాన్యతో స్తి ద్రష్టా” ఇతి శ్రుతేః. అన్నింటిని చూచుటవలన ద్రష్ట అయినవాడు భగవంతుడుకాక మరొకడు లేడు - అట్లు చూచువాడు కనుక కవి).
న్యాయ విదః. (న్యాయమును న్యాయశాస్త్రమును - ధర్మమును - తెలిసినవాడు).
కావ్యనాటకాది కర్తా. (కావ్యములను, నాటకములను రచించువాడు).
యుక్తాయుక్త వివేక చతురః. (ఏది యుక్తము, ఏది అయుక్తము - ఏది మంచిది, ఏది చెడ్డ అని వివేకము గలవాడు - నేర్పరి).
“అతీతానా గతా దేశ్చ సర్వ స్యైవచవస్తునః |
సమదర్శితయం క్రాంత దర్శీ సర్వజ్ఞ ఉచ్యతే ||“. (గీతాభావప్రకాశము - 8 - 66)
(గడచినదానిని రాబోవుదానిని చూడగల్గువాడు క్రాంతదర్శి. పరమాత్మ సర్వజ్ఞుడు కనుక కవి).
“కవిం పురాణమనుశాసితారం” (శ్రీమద్భగవదీత - 8 - 9)
(వ్యాసుడు మొదలగువారివలె పరతత్వమును - పరబ్రహ్మ తత్వమును బోధించి ప్రబంధములను రచించిన వాడు).
(వ్యాసుడు మొదలగువారివలె పరమపురుషునియొక్క స్వరూపము, అతని భూతములు, అతని కల్యాణగుణములు - వీటిని బాగుగా తెలియచేయు ప్రబంధరూప గ్రంధములను నిర్మించినవాడు - రచించినవాడు లేక - క్రాంతదర్శీ - అనగా, యోగాభ్యాసము చేతకాక ఇతర మార్గము చేత తెలుసుకొనుటకు వీలుకాని, పరిశుద్ధమైన జీవాత్మ స్వరూపమందు అడ్డులేని, ఆగని ధారాప్రవాహమువలె నుండు స్మృతిరూపమైన జ్ఞానయోగమందు నిష్ఠ కలిగియున్నవాడు).
“కవీనామస్మ్యహం శుక్రః సుసుక్ష్మార్థ వివేకినాం |”. (శ్రీమద్భగవద్గీత - 10 - 160)
(భగవంతుని విభూతులు చెప్పుచూ కవులలో ఉశనుడు అను కవి నేనే అనిన్నీ, సూక్ష్మార్థములను తెలిసిన కవులలో శుక్రుడు నేను అని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు).
(ఇంకొకరి అపేక్ష లేకయే కలిగినజ్ఞానము కలిగియుండుటచేత కవివి).
(సమస్తమును తెలిసినవాడు; బుద్ధిమంతుడు; జ్ఞానము - బ్రహ్మజ్ఞానము ; కలవాడు; సమ్యక్ జ్ఞానము కలవాడు, పండితుడు, నిపుణుడు, మంచిబుద్ధి కలవాడు, విద్వాంసుడు).
(varṇiṃcuvāḍu kavi - kavi cēsinadi, raciṃcinadi kāvyamu).
kavatē cāturyēṇa varṇayati iti kaviḥ - (caturatatō varṇiṃcu vāḍu kavi).
dēvatā prasāda labda kavitā saṃpattimān. (daivānugrahamucēta kavitvamu ceppu śaktigalavāḍu).
vicitra prabaṃdha vacanaracanā cāturī dhurīna pratibhā saṃpannāḥ kavayitāraḥ.
(vicitramaina prabaṃdha vacana raciṃcuṭalō cāturyamugalavāru kavulu).
(kaṃ anagā brahma. va = vētti telusukonina vāḍu, brahmajñānamu kalavāḍu, kavitvamu ceppuvāḍu, vaktā ani arthamu).
(cidrūpuḍu - caitanyamu lēka jñānamu rūpamugā galavāḍu - aguṭacēta - (brahma) sarvajñuḍu).
vēda śāstra pāraṃgataḥ. (vēdamulanu, śāstramulanu sāṃtamugā, tudimuṭṭa - cadivinavāḍu).
brahma vidyā viśāradaḥ - (brahmajñānamunu teliyacēyu vidyayaṃdu - vēdamaṃdu viśāraduḍu).
śabda brahma niṣṇātaḥ. (vēdādhyayanamunaṃdu niṣṭakalavāḍu).
tatva vid. (tatvamunu - ātma tatvamunu telisinavāḍu).
tatvatrayā dhyātmavid. (jīvātma, paramātma, prakṛti anu mūḍu tatvamulanu telisinavāḍu).
brahma.
sarva dṛk = anniṃṭiki sākṣi ayinavāḍu.
sūriḥ - sūribhiḥ dṛśyaṃca vaiṣṇavaṃ padamēva - tadviṣṇōḥ paramaṃ padaṃ sadā paśyaṃti sūrayaḥ.
(sūrijanulē paramapadamaina vaiṣṇava padamunu sarvadā cūcedaru).
(iṃdriyamulaku miṃcina - iṃdriyamulaku aṃdani viṣayamulanu cūcuṭayaṃdu samarthuḍainavāḍu).
“tvaṃ kaviḥ sarvavēdināt” iti brāhma. (anniṃṭini telisinavāḍaguṭacēta nīvu kavivi).
“krāṃta darśī” - krāṃta darśitvāt kaviḥ.
(krāṃta darśī anagā bhūtabhaviṣyadvartamānamula neṟiṃginavāḍu - krāṃtidarśiyaguṭavalana kavi).. ‘sarva dṛk’ anniṃṭini cūcuvāḍu. “nānyatō sti draṣṭā” iti śrutēḥ. anniṃṭini cūcuṭavalana draṣṭa ayinavāḍu bhagavaṃtuḍukāka marokaḍu lēḍu - aṭlu cūcuvāḍu kanuka kavi).
nyāya vidaḥ. (nyāyamunu nyāyaśāstramunu - dharmamunu - telisinavāḍu).
kāvyanāṭakādi kartā. (kāvyamulanu, nāṭakamulanu raciṃcuvāḍu).
yuktāyukta vivēka caturaḥ. (ēdi yuktamu, ēdi ayuktamu - ēdi maṃcidi, ēdi ceḍḍa ani vivēkamu galavāḍu - nērpari).
“atītānā gatā dēśca sarva syaivacavastunaḥ |
samadarśitayaṃ krāṃta darśī sarvajña ucyatē ||“. (gītābhāvaprakāśamu - 8 - 66)
(gaḍacinadānini rābōvudānini cūḍagalguvāḍu krāṃtadarśi. paramātma sarvajñuḍu kanuka kavi).
“kaviṃ purāṇamanuśāsitāraṃ” (śrīmadbhagavadīta - 8 - 9)
(vyāsuḍu modalaguvārivale paratatvamunu - parabrahma tatvamunu bōdhiṃci prabaṃdhamulanu raciṃcina vāḍu).
(vyāsuḍu modalaguvārivale paramapuruṣuniyokka svarūpamu, atani bhūtamulu, atani kalyāṇaguṇamulu - vīṭini bāgugā teliyacēyu prabaṃdharūpa graṃdhamulanu nirmiṃcinavāḍu - raciṃcinavāḍu lēka - krāṃtadarśī - anagā, yōgābhyāsamu cētakāka itara mārgamu cēta telusukonuṭaku vīlukāni, pariśuddhamaina jīvātma svarūpamaṃdu aḍḍulēni, āgani dhārāpravāhamuvale nuṃḍu smṛtirūpamaina jñānayōgamaṃdu niṣṭha kaligiyunnavāḍu).
“kavīnāmasmyahaṃ śukraḥ susukṣmārtha vivēkināṃ |”. (śrīmadbhagavadgīta - 10 - 160)
(bhagavaṃtuni vibhūtulu ceppucū kavulalō uśanuḍu anu kavi nēnē aninnī, sūkṣmārthamulanu telisina kavulalō śukruḍu nēnu ani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu).
(iṃkokari apēkṣa lēkayē kaliginajñānamu kaligiyuṃḍuṭacēta kavivi).
(samastamunu telisinavāḍu; buddhimaṃtuḍu; jñānamu - brahmajñānamu ; kalavāḍu; samyak jñānamu kalavāḍu, paṃḍituḍu, nipuṇuḍu, maṃcibuddhi kalavāḍu, vidvāṃsuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.