← Back to క · Booklets 11–20 (digitized file 2)

కేశవః kēśavaḥ

Original — తెలుగు
  1. “కేశవద్గాత్వా కేశవః”. (శ్రీ శంకరః)

(కశ = కేశి అను రాక్షసుని, వ = వధించినవాడు - కనుక కేశవుడు).

  1. “యస్మాత్ త్వయేవ దుష్టా త్మాహతః కేశే జనార్థన |

తస్మాత్ కేశవనామ్నా లోకే ఖ్యాతిం భవిష్యసి ||“. (విష్ణుపురాణము)

(దుర్మార్గుడైన కేశియను రాక్షసుని వధించితివి కావున లోకములో నీవు కేశవుడని ప్రఖ్యాతిపొందెదవు).

  1. కో బ్రహ్నేతి సమాఖ్యాతః ఈశోహం సర్వదేహినాం | ఆవాం తనాంశ సంభూతౌ స్మాత్ కేశవ నామవాన్.

(‘క’ అనగా బ్రహ్మ, సమస్త దేహులకు నేను ( శివుడు) ఈశ్వరుడను. మేము ఇద్దరము నీ అంశలో (విష్ణువు యొక్క అంశలో) పుట్టినవారము - అందుచేత నువ్వు కేశవుడు అని చెప్పబడుచున్నావు).

  1. “కశ్చ, అశ్చ, ఈశశ్చ త్రిమూర్తయః కేశాః, తే యద్వశే వర్తం తే సకేశవః”. (శ్రీ శంకరః)

(క, అ, ఈశ అనగా త్రిమూర్తులు, ‘వ’ అనగా వశమందు ఉండువారు. త్రిమూర్తులు ఇతని వశమందుండువారు కనుక కేశవుడు).

  1. “త్రయః కేశినః” ఇతి శ్రుతేః - కేశ శబ్దః శక్తి పర్యా యత్వేన ప్రయుక్తః -

(‘కేశ’ అనుమాట ’శక్తి” అను మాటకు పర్యాయపదముగా వాడబడినది, బ్రహ్మ, విష్ణు, శివుడు అను మూడు శక్తులు గలవాడు కనుక కేశవుడు -

  1. “కం బ్రహ్మాణం ఈశం, రుద్రంచ వర్తయతి ఇతి కేశవః - తథాహి నిరుక్తః కృతా హరివం శేషు కైలాస యాత్రాయాం -హిరణ్య గర్భః కః ప్రోక్తః ఈశః శంకర ఏవచ| సృష్ట్యాదినా వర్తయతి తే యతః కేశవో భవాన్ ||”. ఇతి.

(కం అనగా బ్రహ్మను, ఈశం అనగా ఈశ్వరుని ప్రవర్తింప చేయువాడు కనుక కేశవుడు - హరివంశ మందు, కైలాస యాత్ర విషయములో ఈ విధముగా కేశవుడను పదము నిరుక్తి చేయబడినది - హిరణ్య గర్భుడు - చతుర్ముఖ బ్రహ్మ - క అని చెప్పబడుచున్నాడు, ఈశుడు అనగా శంకరుడు - ఈ ఇద్దరిని సృష్టి చేయుట మొదలగు పనులలో నియమించు వాడు కనుక కేశవుడు).

  1. కానాం ఇంద్రియాణాం ఈశః కేశః, కేశాన్ ఇంద్రియాధిష్టాతృ దేవతాదీన్ తత్తద్విషయం ప్రతి వాతి ప్రేరయతి ఇతి కేశవః.

(ఇంద్రియములకు ఈశుడు అనగా ఇంద్రియములనధిష్ఠించియుండు అధి దేవతలు కేశులు. వారిని వారి వారి విషయములయెడల వాటిలో నుండి ప్రేరేపించువాడు).

  1. “విష్ణు నామములలో నొకటి -”దామోదరో ఋషీ కేశః కేశవో మాధవ స్స్వభూః” (అమరము).

  2. “ఆకాశా త్సతితం తోయం యదాగచ్ఛతి సాగరం| సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి||”.

(ఆకాశమునుండి పడిన నీరు, ఎక్కడపడినదైనను, అన్నింటికంటె పల్లపు ప్రదేశమగు సముద్రమునే చేరును

“నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు” (water finds its level). ఆ ప్రకారముగానే ఏ దేవునికి నమస్కరించనను, దేవతులరూపములన్నియు కేశవుడే కనుక, ఆ నమస్కారములన్నియు కేశవునకే చెందును).

Transliteration
  1. “kēśavadgātvā kēśavaḥ”. (śrī śaṃkaraḥ)

(kaśa = kēśi anu rākṣasuni, va = vadhiṃcinavāḍu - kanuka kēśavuḍu).

  1. “yasmāt tvayēva duṣṭā tmāhataḥ kēśē janārthana |

tasmāt kēśavanāmnā lōkē khyātiṃ bhaviṣyasi ||“. (viṣṇupurāṇamu)

(durmārguḍaina kēśiyanu rākṣasuni vadhiṃcitivi kāvuna lōkamulō nīvu kēśavuḍani prakhyātipoṃdedavu).

  1. kō brahnēti samākhyātaḥ īśōhaṃ sarvadēhināṃ | āvāṃ tanāṃśa saṃbhūtau smāt kēśava nāmavān.

(‘ka’ anagā brahma, samasta dēhulaku nēnu ( śivuḍu) īśvaruḍanu. mēmu iddaramu nī aṃśalō (viṣṇuvu yokka aṃśalō) puṭṭinavāramu - aṃducēta nuvvu kēśavuḍu ani ceppabaḍucunnāvu).

  1. “kaśca, aśca, īśaśca trimūrtayaḥ kēśāḥ, tē yadvaśē vartaṃ tē sakēśavaḥ”. (śrī śaṃkaraḥ)

(ka, a, īśa anagā trimūrtulu, ‘va’ anagā vaśamaṃdu uṃḍuvāru. trimūrtulu itani vaśamaṃduṃḍuvāru kanuka kēśavuḍu).

  1. “trayaḥ kēśinaḥ” iti śrutēḥ - kēśa śabdaḥ śakti paryā yatvēna prayuktaḥ -

(‘kēśa’ anumāṭa ’śakti” anu māṭaku paryāyapadamugā vāḍabaḍinadi, brahma, viṣṇu, śivuḍu anu mūḍu śaktulu galavāḍu kanuka kēśavuḍu -

  1. “kaṃ brahmāṇaṃ īśaṃ, rudraṃca vartayati iti kēśavaḥ - tathāhi niruktaḥ kṛtā harivaṃ śēṣu kailāsa yātrāyāṃ -hiraṇya garbhaḥ kaḥ prōktaḥ īśaḥ śaṃkara ēvaca| sṛṣṭyādinā vartayati tē yataḥ kēśavō bhavān ||”. iti.

(kaṃ anagā brahmanu, īśaṃ anagā īśvaruni pravartiṃpa cēyuvāḍu kanuka kēśavuḍu - harivaṃśa maṃdu, kailāsa yātra viṣayamulō ī vidhamugā kēśavuḍanu padamu nirukti cēyabaḍinadi - hiraṇya garbhuḍu - caturmukha brahma - ka ani ceppabaḍucunnāḍu, īśuḍu anagā śaṃkaruḍu - ī iddarini sṛṣṭi cēyuṭa modalagu panulalō niyamiṃcu vāḍu kanuka kēśavuḍu).

  1. kānāṃ iṃdriyāṇāṃ īśaḥ kēśaḥ, kēśān iṃdriyādhiṣṭātṛ dēvatādīn tattadviṣayaṃ prati vāti prērayati iti kēśavaḥ.

(iṃdriyamulaku īśuḍu anagā iṃdriyamulanadhiṣṭhiṃciyuṃḍu adhi dēvatalu kēśulu. vārini vāri vāri viṣayamulayeḍala vāṭilō nuṃḍi prērēpiṃcuvāḍu).

  1. “viṣṇu nāmamulalō nokaṭi -”dāmōdarō ṛṣī kēśaḥ kēśavō mādhava ssvabhūḥ” (amaramu).

  2. “ākāśā tsatitaṃ tōyaṃ yadāgacchati sāgaraṃ| sarva dēva namaskāraḥ kēśavaṃ pratigacchati||”.

(ākāśamunuṃḍi paḍina nīru, ekkaḍapaḍinadainanu, anniṃṭikaṃṭe pallapu pradēśamagu samudramunē cērunu

“nīru pallamerugu, nijamu dēvuḍerugu” (water finds its level). ā prakāramugānē ē dēvuniki namaskariṃcananu, dēvatularūpamulanniyu kēśavuḍē kanuka, ā namaskāramulanniyu kēśavunakē ceṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.