← Back to ఖ · Booklets 11–20 (digitized file 2)

ఖేచరీముద్ర khēcarīmudra

Original — తెలుగు
  1. “కపాల కుహరే జిహ్వా ప్రవిష్టగా విపరీతగా |

భ్రువోరం తర్గతా దృష్టిః ముద్రా భవతి ఖేచరీ |

న పీడ్యతే సరోగేణ నచ లిప్యతే కర్మణా |

భాధ్యతే నచకాలేన యోముద్రాం వేత్తి ఖేచరీం ||

చిత్తంచరతి ఖే యస్మాత్, జిహ్వా చరతి ఖేగతా |

తేవేషా ఖేచరీనామ ముద్రా సిద్దైః నిషేవితా |

యావద్బిందుః స్థితో దేహే తావాన్ మృత్యు భయం కుతః |

యావద్బద్థాచసాముద్రా తావద్బిందుర్న గచ్ఛతి||“.

(జిహ్వ కపాలరంధ్రమందును, ధృష్టి కనుబొమల మధ్యను ఉంచినయెడల అది ఖేచరీముద్ర యగును - అట్లు చేయువాడు రోగపీడితుడు కాడు, అతనిని కర్మ బంధించదు, కాలమువలన బాధింపబడడు. జిహ్వ ఆకాశమందు, చిత్తము ఆకాశమునందు సంచరించుటవలన ఇది ఖేచరీముద్రయని చెప్పబడినది. దీనిని సిద్ధులు సేవించెదరు. బిందువు దేహమందున్నంతకాలము మృత్యుభయము లేదు. ఖేచరీముద్ర వేసిన

బిందువు దేహమును విడిచిపోదు).

  1. “తన్నామార్థ ప్రవక్ష్యామి సాదరం శృణు నారద |

చిత్తం చరతి ఖే యస్మాత్ జిహ్వా చగతి ఖేగతా|

బ్రువోరంతర్గతాదృష్టిః ముద్రాభవతి ఖేచరీ |

- - - న ఖేచరీ సమా ముద్రాసత్యం సత్యం చ నారద ||“. (దేవీభాగవతం)

(నారదా ! ఆ ముద్ర పేరు చెప్పుచున్నాను, వినుము. చిత్తము ఆకాశమందుంచి, జిహ్వకూడ అక్కడే ఉంచి, దృష్టి కనుబొమల మధ్యనుంచిన అది ఖేచరీ ముద్రయగును - ఖేచరీ ముద్రతో సమానమైనది లేదు - నిజము,ముమ్మాటికి నిజము).

Transliteration
  1. “kapāla kuharē jihvā praviṣṭagā viparītagā |

bhruvōraṃ targatā dṛṣṭiḥ mudrā bhavati khēcarī |

na pīḍyatē sarōgēṇa naca lipyatē karmaṇā |

bhādhyatē nacakālēna yōmudrāṃ vētti khēcarīṃ ||

cittaṃcarati khē yasmāt, jihvā carati khēgatā |

tēvēṣā khēcarīnāma mudrā siddaiḥ niṣēvitā |

yāvadbiṃduḥ sthitō dēhē tāvān mṛtyu bhayaṃ kutaḥ |

yāvadbadthācasāmudrā tāvadbiṃdurna gacchati||“.

(jihva kapālaraṃdhramaṃdunu, dhṛṣṭi kanubomala madhyanu uṃcinayeḍala adi khēcarīmudra yagunu - aṭlu cēyuvāḍu rōgapīḍituḍu kāḍu, atanini karma baṃdhiṃcadu, kālamuvalana bādhiṃpabaḍaḍu. jihva ākāśamaṃdu, cittamu ākāśamunaṃdu saṃcariṃcuṭavalana idi khēcarīmudrayani ceppabaḍinadi. dīnini siddhulu sēviṃcedaru. biṃduvu dēhamaṃdunnaṃtakālamu mṛtyubhayamu lēdu. khēcarīmudra vēsina

biṃduvu dēhamunu viḍicipōdu).

  1. “tannāmārtha pravakṣyāmi sādaraṃ śṛṇu nārada |

cittaṃ carati khē yasmāt jihvā cagati khēgatā|

bruvōraṃtargatādṛṣṭiḥ mudrābhavati khēcarī |

- - - na khēcarī samā mudrāsatyaṃ satyaṃ ca nārada ||“. (dēvībhāgavataṃ)

(nāradā ! ā mudra pēru ceppucunnānu, vinumu. cittamu ākāśamaṃduṃci, jihvakūḍa akkaḍē uṃci, dṛṣṭi kanubomala madhyanuṃcina adi khēcarī mudrayagunu - khēcarī mudratō samānamainadi lēdu - nijamu,mummāṭiki nijamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.