← Back to క · Booklets 11–20 (digitized file 2)

కో(అ)హం kō(a)haṃ

Original — తెలుగు

‘నేనెవడను -?’ అనుకొనుట.

(‘నేను’ అని ప్రతిమానవుడు అనుకొనుటకలది - వ్యవహారము కొరకు ఒకరికి ఇంకొకరికి పేర్లు వేరయినా అందరికి ఒకటే పేరు - ‘నేను’ అని. నేను అనగా ఎవరు ? ఈ శరీరములోపల ఉండి, దానిని చైతన్యవంతముగా చేయువాడు, అనగా జీవుడు. ఆ జీవుడే ‘అహం’ = నేను అనువాడు, అహం అనుమాటకు అర్థమైనవాడు - అప్పుడు ‘కోహం’ అనగా ఈ జీవుడెవరు ? అను ప్రశ్న వచ్చును. ఈ ప్రశ్నకు సమా ధానము కొఱకే యోగములన్నియు - అన్ని విధముల ఆలోచించిన చివరకు “ఆ పరమాత్మయే నేను” అను సమాధానము - జ్ఞానము - కలుగును - అందుచేత ‘కోహం’ అను ప్రశ్నకు ‘సోహం’ = సః అహం - అతనే నేను - ఆ పరమాత్మయే నేను - అనునదియే సమాధానము - జీవుడు పరమాత్మ అంశయే - అంతా ఒకటే తత్వము - ‘సోహం’ అనునదియే “అహం బ్రహ్మాస్మి” (నేనే ఆ పరబ్రహ్మను) అను మాహావాక్యార్థమే ‘సోహం’ అను మాటయే మాటలు తారుమారు చేసిన ‘హంసః’ అయినది.

Transliteration

‘nēnevaḍanu -?’ anukonuṭa.

(‘nēnu’ ani pratimānavuḍu anukonuṭakaladi - vyavahāramu koraku okariki iṃkokariki pērlu vērayinā aṃdariki okaṭē pēru - ‘nēnu’ ani. nēnu anagā evaru ? ī śarīramulōpala uṃḍi, dānini caitanyavaṃtamugā cēyuvāḍu, anagā jīvuḍu. ā jīvuḍē ‘ahaṃ’ = nēnu anuvāḍu, ahaṃ anumāṭaku arthamainavāḍu - appuḍu ‘kōhaṃ’ anagā ī jīvuḍevaru ? anu praśna vaccunu. ī praśnaku samā dhānamu koṟakē yōgamulanniyu - anni vidhamula ālōciṃcina civaraku “ā paramātmayē nēnu” anu samādhānamu - jñānamu - kalugunu - aṃducēta ‘kōhaṃ’ anu praśnaku ‘sōhaṃ’ = saḥ ahaṃ - atanē nēnu - ā paramātmayē nēnu - anunadiyē samādhānamu - jīvuḍu paramātma aṃśayē - aṃtā okaṭē tatvamu - ‘sōhaṃ’ anunadiyē “ahaṃ brahmāsmi” (nēnē ā parabrahmanu) anu māhāvākyārthamē ‘sōhaṃ’ anu māṭayē māṭalu tārumāru cēsina ‘haṃsaḥ’ ayinadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.