← Back to క · Booklets 11–20 (digitized file 2)

కోశము kōśamu

Original — తెలుగు
  1. మృదు చిత్ర చర్మమ యః కోశః పరిచ్చదః ఆవరణం యస్య, అసేః ఖడ్గస్య తద్వత్.

(మృదువైనది, చిత్రమైనది, చర్మమ యమైనదియగు కప్పు ఆవరణమువలె ఉంచునది - కత్తిని లోపల ఉంచుకొను ఒర.

  1. అంతర్భాగం (లోపలనున్న భాగము).

  2. అర్థరాశిః = ధనాగారము, ధన భాండాగారము.

  3. “కోశోనామ ఆచ్చాదనం, పిధానం వా ఉచ్యతే. అసి పిధానం యధా అసి స్వరూపమాచ్ఛాదయతి, తధా ఏతే పంచకోశాః ఆత్మనః స్వరూపమాచ్ఛాదయంతి ఇతి. అన్నమయాదయః కోశాః ఇతి కీర్త్యంతే. అనేకమంద మతయః గురు శాస్త్ర సంప్రదాయ హీనాః పంచకోశాంతర్గతమాత్మ భూతం యంకం అపి పదార్థం ఆత్మత్వేన మన్యమానాః కోశానాం సాక్షిభూతాత్ ముఖ్యాత్మ స్వరూపాత్ విముఖా భవంతి. అత ఏవ అన్నమయా దయః కోశాః ఆత్మ స్వరూపాచ్ఛాదనాః ఇతి వర్ణ్యంతే”.

(కోశమనగా ఆచ్ఛాదనము, కత్తి ఒర వంటిది, కప్పునది. కత్తియొక్క స్వరూపమును దాని ఒర ఏప్రకార ముగా కప్పి ఉంచునో ఆ ప్రకారము పంచకోశములు ఆత్మయొక్క స్వరూపమును కప్పి పుచ్చుచున్నవి, అందువల్ల ఈ అన్నమయకోశము మొదలగునవి కోశములని చెప్పబడుచున్నవి. గురు, శాస్త్ర సంప్రదాయ ములేని అనేక మందమతులు ఈ అయిదు కోశములలోనున్న ఆత్మకాని ఒకానొక పదార్థమును ఆత్మయని తలచుచూ, ఈ కోశములకు సాక్షియైనటువంటి నిజమైన ఆత్మస్వరూపమునుండి విముఖులగుచున్నారు, అసలు ఆత్మను కనుగొనలేక పోవుచున్నారు, అందుచేత అన్నమయకోశము మొదలగు కోశములు ఆత్మ స్వరూపమును ఆచ్ఛాదించునవి అని చెప్పబడుచున్నవి).

  1. లింగశరీరం. (తనలోపలనున్న ఆత్మను కప్పిపుచ్చు సూక్ష్మ శరీరము -).

  2. అనాది పుణ్యా పుణ్య రూపకర్మవాసనా కోశం.

(అనేక జన్మలలో చేసిన పాపపుణ్యరూపమైన కర్మ వాసనయే కోశము). (చూడుము - ‘పంచ కోశములు’).

  1. కోశోపాధ్యుపహిత ఏవ ఆత్మాకోశ ఇత్యుచ్యతే -” (సర్వసారోపనిషత్).

(కోశము అను ఉపాధిచే కప్పబడు ఆత్మయే కోశము).

Transliteration
  1. mṛdu citra carmama yaḥ kōśaḥ pariccadaḥ āvaraṇaṃ yasya, asēḥ khaḍgasya tadvat.

(mṛduvainadi, citramainadi, carmama yamainadiyagu kappu āvaraṇamuvale uṃcunadi - kattini lōpala uṃcukonu ora.

  1. aṃtarbhāgaṃ (lōpalanunna bhāgamu).

  2. artharāśiḥ = dhanāgāramu, dhana bhāṃḍāgāramu.

  3. “kōśōnāma āccādanaṃ, pidhānaṃ vā ucyatē. asi pidhānaṃ yadhā asi svarūpamācchādayati, tadhā ētē paṃcakōśāḥ ātmanaḥ svarūpamācchādayaṃti iti. annamayādayaḥ kōśāḥ iti kīrtyaṃtē. anēkamaṃda matayaḥ guru śāstra saṃpradāya hīnāḥ paṃcakōśāṃtargatamātma bhūtaṃ yaṃkaṃ api padārthaṃ ātmatvēna manyamānāḥ kōśānāṃ sākṣibhūtāt mukhyātma svarūpāt vimukhā bhavaṃti. ata ēva annamayā dayaḥ kōśāḥ ātma svarūpācchādanāḥ iti varṇyaṃtē”.

(kōśamanagā ācchādanamu, katti ora vaṃṭidi, kappunadi. kattiyokka svarūpamunu dāni ora ēprakāra mugā kappi uṃcunō ā prakāramu paṃcakōśamulu ātmayokka svarūpamunu kappi puccucunnavi, aṃduvalla ī annamayakōśamu modalagunavi kōśamulani ceppabaḍucunnavi. guru, śāstra saṃpradāya mulēni anēka maṃdamatulu ī ayidu kōśamulalōnunna ātmakāni okānoka padārthamunu ātmayani talacucū, ī kōśamulaku sākṣiyainaṭuvaṃṭi nijamaina ātmasvarūpamunuṃḍi vimukhulagucunnāru, asalu ātmanu kanugonalēka pōvucunnāru, aṃducēta annamayakōśamu modalagu kōśamulu ātma svarūpamunu ācchādiṃcunavi ani ceppabaḍucunnavi).

  1. liṃgaśarīraṃ. (tanalōpalanunna ātmanu kappipuccu sūkṣma śarīramu -).

  2. anādi puṇyā puṇya rūpakarmavāsanā kōśaṃ.

(anēka janmalalō cēsina pāpapuṇyarūpamaina karma vāsanayē kōśamu). (cūḍumu - ‘paṃca kōśamulu’).

  1. kōśōpādhyupahita ēva ātmākōśa ityucyatē -” (sarvasārōpaniṣat).

(kōśamu anu upādhicē kappabaḍu ātmayē kōśamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.