← Back to క · Booklets 11–20 (digitized file 2)

క్రియా యోగాః kriyā yōgāḥ

Original — తెలుగు

సర్వేపిక్రియా యోగాః ఫలేచ్చయా కృతాః సర్వేపి యజ్ఞా రయః సంసృతి హేతువః, సంసారస్యైవ వర్థకాః, ఫలేచ్ఛయా కృతానాం కర్మణాం ఫలానుభవార్థం శరీరారంభస్య ఆవశ్య కత్వాత్ శరీరారంభే చ సంసార విమోక్ష ప్రసంగా భావాత్. తే క్రియా యోగః ఏవపరే బ్రహ్మణి అకల్పితాశ్చేత్ - అసమర్పితాశ్చేత్ - ఆత్మవినాశాయ నరకాయ కల్పంతే - భగవత్సమర్పణం భావే భగవత్ప్రీతే రజననాత్, తదభావే పాపమోక్షా సంభవాత్, అవిముక్తే పాపే నరకస్య అవశ్యం భావత్ - వ్యాధి సంపాదక ద్రవ్యాను భావానాంతరం వ్యాధి జననే తన్నివృత్యర్థం చికిత్సాయాం కృతాయాం అనం తరం ద్రవ్య చాపల్యేన వ్యాధిసంపాదక ద్రవ్యే పునర్భుక్తే యధా వ్యాధేర్న నివృత్తిః, అవితు ప్రకోప ఏవ, ఏవం సర్వ పాపక్షయార్థం యజ్ఞాద్యనుష్ఠానేపి తత్ఫలాసకౌ ఫలానుభవార్థం శరీరారంభస్య ఆవశ్య కత్వాత్. ఆరబ్ధేచ శరీరే తస్య త్రిగుణాత్మకత్వేన తమో గుణోద్రేక దశాయాం పునః పాపారంభ సంభవాత్ అపధ్య కృన్న్యాయేన పాపనివృత్తిరూప ఫలాసిద్ధిరేవ ప్రత్యుత తాదృశ కర్మణాం భగవత్సమర్పణ విరహే భగవత్ప్రీత్య జననేన పాపనివృత్త్య సంభవాత్ నరకాది ప్రాప్తిరేవస్యాత్. అతః ఫలసంగో న కర్తవ్యం.

“సర్వే క్రియా యోగాః పరే సమర్పితాః సంతః ప్రధమం మహత్సేవా, తతస్తత్కృపా, తతస్తద్థర్మశ్రద్ధా, తతో భగవత్కథా శ్రవణం, అతో భగవతి రతిః, తయాచ దేహద్వయ వివిక్తాత్మజ్ఞానం, తతో దృఢా భక్తిః, తతో భగవత్తత్వవిజ్ఞానం, తతస్తత్కృపయా సర్వజ్ఞత్వాది భగవద్గుణావిర్భావః - ఇతిక్రమః” “భగవదర్పణేన క్రియామాణం కర్మభక్తియోగం జనయతి”.

(క్రియా యోగములన్నియు ఫలమును కోరియే చేయబడుచిన్నవి. యజ్ఞము మొదలగునవన్నియు సంసారమునకు కారణములు, సంసారమును వృద్ధిచేయునవి - ఫలమును కోరి చేసిన కర్మల ఫలము ననుభవించుటకు శరీరము కావలసియున్నందున, శరీరము కలిగిన సంసారమునుండి విడుదల లేకపోవుటచేతను. ఆ క్రియాయోగములే భగవంతునికి సమర్పించని యెడల ఆత్మవినాశము కొరకు, నరకముకొరకు, చేయ బడినవగును - భగవంతునికి సమర్పించనందున, భగవంతుని దయకలుగకపోవుటవలన, భగవంతు ని దయలేనందున పాపమునుండి విడుదల లేనందున, అట్లు పాపమునుండి విముక్తి లేనందున నరకము తప్పక కలుగును - కనుక ఇది ఎట్లు అనగా - వ్యాధిని కలిగించు ద్రవ్యమును అనుభవించిన తర్వాత, వ్యాధికలుగగా, ఆవ్యాధి శమించుటకు చికిత్స చేయించుకున్న తర్వాత, ఆ ద్రవ్యమందలి చపలత్వముచేత ఆ వ్యాధినికలిగించు ద్తవ్యమును మరల అనుభవించిన వ్యాధి అణగదు, సరేకదా, మరింతవృద్ధి పొందును. ఇట్లే సమస్తమైన పాపములు పోవుటకు యజ్ఞములు మొదలగు వాటిని అనుష్ఠించినను, దాని ఫలమందాసక్తివలన మరల శరీరము పొందవలసిన - జన్మించ వలసిన - ఆవశ్యకత ఉన్నది. శరీర మును పొందినయెడల, అది సత్వరజస్తమోగుణాత్మకమగుటవలన, తమోగుణము ఉద్రేకించిన సమయ మందు మరల పాపము చేయుట ప్రారంభమగును - పైన చెప్పన అపథ్యన్యాయము వలన పాపఫల నివృత్తి కలుగక నరకము మొదలగునవి ప్రాప్తించును. అందుచేత క్రియలయందు వాటి ఫలము కలుగవలెనని కోరిక యుండకూడదు, భగవంతునికి ఆ క్రియలు సమర్పించక ఉండరాదు).

(సమస్త క్రియా యోగములు భగవంతునికి సమర్పించినయడల అందువలన మొదట మహానుభావుల సేవయు, దానివలన వారి దయ, తర్వాత వారి ధర్మమందు శ్రద్ధ, తర్వాత భగవంతుని కథలను వినుట, అందువలన భగవంతుని యందు రతి గలిగియుండడము, దానివలన దేహద్వయ వివిక్త ఆత్మజ్ఞానము, దానివలన ధృఢమైన భక్తి, దానివలన భగవత్తత్త్వ విజ్ఞానం, తరువాత భగవంతుని దయవలన సర్వ జ్ఞత్వము మొదలగు భగవంతుని గుణములు యుండుట. సర్వ కర్మలు భగవంతునికి సమర్పించుట చేత కలుగు క్రమము ఇదియే).

“చేయు పనిని భగవంతునికి అర్పించుట వలన భక్తియోగమును కలుగచేయును” -

Transliteration

sarvēpikriyā yōgāḥ phalēccayā kṛtāḥ sarvēpi yajñā rayaḥ saṃsṛti hētuvaḥ, saṃsārasyaiva varthakāḥ, phalēcchayā kṛtānāṃ karmaṇāṃ phalānubhavārthaṃ śarīrāraṃbhasya āvaśya katvāt śarīrāraṃbhē ca saṃsāra vimōkṣa prasaṃgā bhāvāt. tē kriyā yōgaḥ ēvaparē brahmaṇi akalpitāścēt - asamarpitāścēt - ātmavināśāya narakāya kalpaṃtē - bhagavatsamarpaṇaṃ bhāvē bhagavatprītē rajananāt, tadabhāvē pāpamōkṣā saṃbhavāt, avimuktē pāpē narakasya avaśyaṃ bhāvat - vyādhi saṃpādaka dravyānu bhāvānāṃtaraṃ vyādhi jananē tannivṛtyarthaṃ cikitsāyāṃ kṛtāyāṃ anaṃ taraṃ dravya cāpalyēna vyādhisaṃpādaka dravyē punarbhuktē yadhā vyādhērna nivṛttiḥ, avitu prakōpa ēva, ēvaṃ sarva pāpakṣayārthaṃ yajñādyanuṣṭhānēpi tatphalāsakau phalānubhavārthaṃ śarīrāraṃbhasya āvaśya katvāt. ārabdhēca śarīrē tasya triguṇātmakatvēna tamō guṇōdrēka daśāyāṃ punaḥ pāpāraṃbha saṃbhavāt apadhya kṛnnyāyēna pāpanivṛttirūpa phalāsiddhirēva pratyuta tādṛśa karmaṇāṃ bhagavatsamarpaṇa virahē bhagavatprītya jananēna pāpanivṛttya saṃbhavāt narakādi prāptirēvasyāt. ataḥ phalasaṃgō na kartavyaṃ.

“sarvē kriyā yōgāḥ parē samarpitāḥ saṃtaḥ pradhamaṃ mahatsēvā, tatastatkṛpā, tatastadtharmaśraddhā, tatō bhagavatkathā śravaṇaṃ, atō bhagavati ratiḥ, tayāca dēhadvaya viviktātmajñānaṃ, tatō dṛḍhā bhaktiḥ, tatō bhagavattatvavijñānaṃ, tatastatkṛpayā sarvajñatvādi bhagavadguṇāvirbhāvaḥ - itikramaḥ” “bhagavadarpaṇēna kriyāmāṇaṃ karmabhaktiyōgaṃ janayati”.

(kriyā yōgamulanniyu phalamunu kōriyē cēyabaḍucinnavi. yajñamu modalagunavanniyu saṃsāramunaku kāraṇamulu, saṃsāramunu vṛddhicēyunavi - phalamunu kōri cēsina karmala phalamu nanubhaviṃcuṭaku śarīramu kāvalasiyunnaṃduna, śarīramu kaligina saṃsāramunuṃḍi viḍudala lēkapōvuṭacētanu. ā kriyāyōgamulē bhagavaṃtuniki samarpiṃcani yeḍala ātmavināśamu koraku, narakamukoraku, cēya baḍinavagunu - bhagavaṃtuniki samarpiṃcanaṃduna, bhagavaṃtuni dayakalugakapōvuṭavalana, bhagavaṃtu ni dayalēnaṃduna pāpamunuṃḍi viḍudala lēnaṃduna, aṭlu pāpamunuṃḍi vimukti lēnaṃduna narakamu tappaka kalugunu - kanuka idi eṭlu anagā - vyādhini kaligiṃcu dravyamunu anubhaviṃcina tarvāta, vyādhikalugagā, āvyādhi śamiṃcuṭaku cikitsa cēyiṃcukunna tarvāta, ā dravyamaṃdali capalatvamucēta ā vyādhinikaligiṃcu dtavyamunu marala anubhaviṃcina vyādhi aṇagadu, sarēkadā, mariṃtavṛddhi poṃdunu. iṭlē samastamaina pāpamulu pōvuṭaku yajñamulu modalagu vāṭini anuṣṭhiṃcinanu, dāni phalamaṃdāsaktivalana marala śarīramu poṃdavalasina - janmiṃca valasina - āvaśyakata unnadi. śarīra munu poṃdinayeḍala, adi satvarajastamōguṇātmakamaguṭavalana, tamōguṇamu udrēkiṃcina samaya maṃdu marala pāpamu cēyuṭa prāraṃbhamagunu - paina ceppana apathyanyāyamu valana pāpaphala nivṛtti kalugaka narakamu modalagunavi prāptiṃcunu. aṃducēta kriyalayaṃdu vāṭi phalamu kalugavalenani kōrika yuṃḍakūḍadu, bhagavaṃtuniki ā kriyalu samarpiṃcaka uṃḍarādu).

(samasta kriyā yōgamulu bhagavaṃtuniki samarpiṃcinayaḍala aṃduvalana modaṭa mahānubhāvula sēvayu, dānivalana vāri daya, tarvāta vāri dharmamaṃdu śraddha, tarvāta bhagavaṃtuni kathalanu vinuṭa, aṃduvalana bhagavaṃtuni yaṃdu rati galigiyuṃḍaḍamu, dānivalana dēhadvaya vivikta ātmajñānamu, dānivalana dhṛḍhamaina bhakti, dānivalana bhagavattattva vijñānaṃ, taruvāta bhagavaṃtuni dayavalana sarva jñatvamu modalagu bhagavaṃtuni guṇamulu yuṃḍuṭa. sarva karmalu bhagavaṃtuniki samarpiṃcuṭa cēta kalugu kramamu idiyē).

“cēyu panini bhagavaṃtuniki arpiṃcuṭa valana bhaktiyōgamunu kalugacēyunu” -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.