← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృష్ణపింగళం kṛṣṇapiṃgaḷaṃ

Original — తెలుగు
  1. దక్ల్షిణే మహేశ్వరభాగే కృష్ణవర్ణః, ఉమాభాగే వామే పింగళవర్ణః - శివః.

(అర్థనారీశ్వర విగ్రహమందు - రూపమందలి - కుడిప్రక్కను ఉన్న మహేశ్వరభాగము కృష్ణవర్ణము న్నూ, ఎడమప్రక్క ఉమాభాగమందు పింగళవర్ణమున్నూ కలిగియున్నవాడు - శివుడు).

  1. కంఠేనేత్రయోః కృష్ణ పింగళం -

(విషమును కంఠమందు ధరించుటవలన కంఠమందు కృష్ణవర్ణము, నేత్రములందు పింగళవర్ణము కలవాడు - శివుడు).

  1. లక్ష్మీ శోభా సం యుక్తతయా కృష్ణ పింగళం; అధవా, భగవిద్విగ్రహస్య అతసీ పుష్పశంకాశతయా ప్రతి పాదనాత్ అతసీ పష్పస్య మయూరగ్రీవా సదృశతయా కృష్ణ పింగళవర్ణత్వాత్ కృష్ణ పింగలోత్పత్తిః - విష్ణుః“.

(లక్ష్మీ శోభతో కూడియుండుటవలన కృష్ణపింగళుడు - లేక భగవంతుని విగ్రహము అతసీ పుష్పమువలె - అవిశి పువ్వువలె - ఉండునని చెప్పబడియుండుటవలన అతిసీ పుష్పము నెమలికంఠమువలె కృష్ణ పింగళవర్ణము కలిగియుండుటవలన, కృష్ణ పింగళుడు అని చెప్పుచున్నారు).

Transliteration
  1. daklṣiṇē mahēśvarabhāgē kṛṣṇavarṇaḥ, umābhāgē vāmē piṃgaḷavarṇaḥ - śivaḥ.

(arthanārīśvara vigrahamaṃdu - rūpamaṃdali - kuḍiprakkanu unna mahēśvarabhāgamu kṛṣṇavarṇamu nnū, eḍamaprakka umābhāgamaṃdu piṃgaḷavarṇamunnū kaligiyunnavāḍu - śivuḍu).

  1. kaṃṭhēnētrayōḥ kṛṣṇa piṃgaḷaṃ -

(viṣamunu kaṃṭhamaṃdu dhariṃcuṭavalana kaṃṭhamaṃdu kṛṣṇavarṇamu, nētramulaṃdu piṃgaḷavarṇamu kalavāḍu - śivuḍu).

  1. lakṣmī śōbhā saṃ yuktatayā kṛṣṇa piṃgaḷaṃ; adhavā, bhagavidvigrahasya atasī puṣpaśaṃkāśatayā prati pādanāt atasī paṣpasya mayūragrīvā sadṛśatayā kṛṣṇa piṃgaḷavarṇatvāt kṛṣṇa piṃgalōtpattiḥ - viṣṇuḥ”.

(lakṣmī śōbhatō kūḍiyuṃḍuṭavalana kṛṣṇapiṃgaḷuḍu - lēka bhagavaṃtuni vigrahamu atasī puṣpamuvale - aviśi puvvuvale - uṃḍunani ceppabaḍiyuṃḍuṭavalana atisī puṣpamu nemalikaṃṭhamuvale kṛṣṇa piṃgaḷavarṇamu kaligiyuṃḍuṭavalana, kṛṣṇa piṃgaḷuḍu ani ceppucunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.