← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృతకృత్యః kṛtakṛtyaḥ

Original — తెలుగు
  1. కర్తుం యోగ్యం కృత్యం, కృతం కృత్యం ఏన సః కృత కృత్యః.

(కృత్యం అనగా చేయవలసిన పని; చేయవలసినపని చేసినవాడు కృతకృత్యుడు ).

  1. ప్రాప్త కర్తవ్యః - (తన కర్తవ్యమును నెఱవేర్చినవాడు).

  2. కృతార్థః.

(ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములను సాధించినవాడు - తన విధి నెరవేర్చినవాడు).

  1. సార్ధక జన్మః.

(జన్మను సార్ధకము చేసినవాడు - పుట్టినందుకు పురుషార్థములను సాధించినవాడు - జన్మ ఫలించు నట్లు చేసుకొనినవాడు - “తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దాని దెనిగించి నా జననంబున్ సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్ ||”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - - )

  1. కర్తవ్యాత్ ఋణత్రయాత్ విముక్తః, కృతకర్తవ్యః ఇత్యర్థః.

ఋణత్రయము అనగా దేవ ఋణము, పితృ ఋణము, మొదలగునవి. ఈ ఋణ త్రయమునుండి విముక్తుడ గుటకు వాడు చేయవలసిన పనులను చేసినవాడు - అట్టి కర్తవ్యమును చేసినవాడు కృతకృత్యుడు ).

  1. “తదాత్మ తత్వం ప్రసమీక్ష్య దేహీ ఏకః కృతార్థో భవతి వీతశోకః” (శ్వేతాశ్వతరోపనిషత్ -).

(ఆత్మ తత్వము - ఆత్మ అనగా ఏమిటి ? - సృష్టి క్రమమంతయు దీనిలోనే ఉన్నది. ఆత్మ తత్వమును - ఉన్న తత్వమంతా ఒకటే అయిన ఆత్మ తత్వమును తెలిసిన వాడు ఒకడే కృతార్థుడును, దుఃఖము లేనివాడును).

  1. “జనుండు బాల్య కైశోరకౌమారవయో విశేషంబుల వెనుక నైననుం బెద్ద యైన వెనుక నైనను, నన్నెఱింగెనేని కృతకృత్యుండగు” –

(శ్రీమదాంధ్రమహా భాగవతము - 11 - 110)

  1. “ప్రధమం యజ్ఞాద్యనుష్టానం, తతః ప్రాణాయామాది, తతః సమాధిః, వాక్యార్థజ్ఞాన నిష్పత్తిః, తతః కృతకృత్యతా” (శ్రీశంకరః).

(మొదట యజ్ఞము చేయుట మొదలగు అనుష్టానము తర్వాత ప్రాణాయామము మొదలగునవి, తర్వాత సమాధి తర్వాత “అహం బ్రహ్మాస్మి” (నేను బ్రహ్మను అయితిని) అను మొదలగు మహావాక్యముల నర్ధము చేసు కొనుట - అవి క్రమముగా జరిగిన తర్వాత కృతకృత్యుడగును).

  1. కొందఱు కొందఱు అధికారులకు వారు చేయవలసినపని ఈ క్రింద విధముగా చేప్పబడినది : -

“అజ్ఞాన దశాయాం ఐహిక భోగాది సిద్ధ్యర్ధం కృష్యాది వ్యవసాయః, ఆముష్మిక భోగార్థం కామ్య కర్మోపాస నాదియః, చిత్త శుద్ధ్యెకాగ్ర్యార్ధం నిష్కామ కర్మోపాసనాదయః, వేదాంత శ్రవణాయ వివేక వైరాగ్యాది చతుర్విధసాధనం, అద్వితీయాత్మ సాక్షాత్కారాయ గురూపదేశః, సంశయాది నివృత్యర్థం శ్రవణాదయః, తత్పదార్థ విషయక పరోక్షత్వ భ్రమ నివృత్తయే, త్వం పదార్ధ విషయక పరిచ్ఛిన్నత్వ భ్రమ నివృత్తయేచ అన్యోన్య వ్యతిషంగః - (వ్యతిహారః - ఓతప్రోతభావః) - మోక్షార్థం దృఢ తరాద్వితీయ చిన్మాత్రాత్మా పరోక్ష సాక్షాత్కారశ్చ - ఇత్యేవమాది పుష్కల సాధనానుష్టానం తత్సంవాదనం చ ‘కర్తవ్యం’ ఇత్యుచ్యతే. ఏ తదనుష్టాన సంపాదన రూపం కర్తవ్యం యేన కృతం స ఏవ కృత కర్తవ్యః, కృత కృత్యః ఇత్యుచ్యతే”.

(అజ్ఞానదశయందు లోకవ్యవహారముకొరకు వ్యవసాయము మొదలగునవియు; పరలోకములో భోగము లననుభవించుటకు కామ్య కర్మోపాసన మొదలగునవియు; చిత్తశుద్ధి, ఏకాగ్రతకొరకు నిష్కామకర్మో పాసన మొదలగునవియు వేదాంతశ్రవణము కొఱకు, వివేకము, వైరాగ్యము మొదలగు చతుర్విధసాధన ములున్నూ; అద్వితీయాత్మసాక్షాత్కారము కొఱకు గురూపదేశమున్నూ, సంశయములు మొదలగు వాటి నివృత్తి గుఱించి శ్రవణము మొదలగునవియు; తత్పదార్థ విషయమైన పరోక్షత్వభ్రమ నివృత్తికొఱకున్నూ, త్వం పదార్థవిషయమైన పరిచ్ఛిన్నత్వభ్రమ నివృత్తి కొరకున్నూ (అన్యోన్య వ్యతిషంగము) ఓతప్రోతభావ మున్నూ; మోక్షము కొఱకు దృఢమైన అద్వితీయ చిన్మాత్రాత్మా పరోక్షసాక్షాత్కారమున్నూ - ఇట్లు ఇన్నివిధ ములైన సాధనముల ననుష్టించుట, వాటిని సంపాదించుట - ఇది కర్తవ్యము - కృత్యము. ఇటివంటి అను ష్టాన సంపాదన రూపమైనది కర్తవ్యము - చేయతగిన పని ఎవడు చేయునో కృతకర్తవ్యుడు - కృత కృత్యుడు - చేయవలసిన పని చేసినవాడు).

Transliteration
  1. kartuṃ yōgyaṃ kṛtyaṃ, kṛtaṃ kṛtyaṃ ēna saḥ kṛta kṛtyaḥ.

(kṛtyaṃ anagā cēyavalasina pani; cēyavalasinapani cēsinavāḍu kṛtakṛtyuḍu ).

  1. prāpta kartavyaḥ - (tana kartavyamunu neṟavērcinavāḍu).

  2. kṛtārthaḥ.

(dharmārthakāmamōkṣamulanu caturvidha puruṣārthamulanu sādhiṃcinavāḍu - tana vidhi neravērcinavāḍu).

  1. sārdhaka janmaḥ.

(janmanu sārdhakamu cēsinavāḍu - puṭṭinaṃduku puruṣārthamulanu sādhiṃcinavāḍu - janma phaliṃcu naṭlu cēsukoninavāḍu - “tenuguṃ jēyaru munnu bhāgavatamun dāni denigiṃci nā jananaṃbun saphalaṃbu jēseda punarjanmaṃbu lēkuṃḍagan ||”

(śrīmadāṃdhramahābhāgavatamu - - )

  1. kartavyāt ṛṇatrayāt vimuktaḥ, kṛtakartavyaḥ ityarthaḥ.

ṛṇatrayamu anagā dēva ṛṇamu, pitṛ ṛṇamu, modalagunavi. ī ṛṇa trayamunuṃḍi vimuktuḍa guṭaku vāḍu cēyavalasina panulanu cēsinavāḍu - aṭṭi kartavyamunu cēsinavāḍu kṛtakṛtyuḍu ).

  1. “tadātma tatvaṃ prasamīkṣya dēhī ēkaḥ kṛtārthō bhavati vītaśōkaḥ” (śvētāśvatarōpaniṣat -).

(ātma tatvamu - ātma anagā ēmiṭi ? - sṛṣṭi kramamaṃtayu dīnilōnē unnadi. ātma tatvamunu - unna tatvamaṃtā okaṭē ayina ātma tatvamunu telisina vāḍu okaḍē kṛtārthuḍunu, duḥkhamu lēnivāḍunu).

  1. “januṃḍu bālya kaiśōrakaumāravayō viśēṣaṃbula venuka nainanuṃ bedda yaina venuka nainanu, nanneṟiṃgenēni kṛtakṛtyuṃḍagu” –

(śrīmadāṃdhramahā bhāgavatamu - 11 - 110)

  1. “pradhamaṃ yajñādyanuṣṭānaṃ, tataḥ prāṇāyāmādi, tataḥ samādhiḥ, vākyārthajñāna niṣpattiḥ, tataḥ kṛtakṛtyatā” (śrīśaṃkaraḥ).

(modaṭa yajñamu cēyuṭa modalagu anuṣṭānamu tarvāta prāṇāyāmamu modalagunavi, tarvāta samādhi tarvāta “ahaṃ brahmāsmi” (nēnu brahmanu ayitini) anu modalagu mahāvākyamula nardhamu cēsu konuṭa - avi kramamugā jarigina tarvāta kṛtakṛtyuḍagunu).

  1. koṃdaṟu koṃdaṟu adhikārulaku vāru cēyavalasinapani ī kriṃda vidhamugā cēppabaḍinadi : -

“ajñāna daśāyāṃ aihika bhōgādi siddhyardhaṃ kṛṣyādi vyavasāyaḥ, āmuṣmika bhōgārthaṃ kāmya karmōpāsa nādiyaḥ, citta śuddhyekāgryārdhaṃ niṣkāma karmōpāsanādayaḥ, vēdāṃta śravaṇāya vivēka vairāgyādi caturvidhasādhanaṃ, advitīyātma sākṣātkārāya gurūpadēśaḥ, saṃśayādi nivṛtyarthaṃ śravaṇādayaḥ, tatpadārtha viṣayaka parōkṣatva bhrama nivṛttayē, tvaṃ padārdha viṣayaka paricchinnatva bhrama nivṛttayēca anyōnya vyatiṣaṃgaḥ - (vyatihāraḥ - ōtaprōtabhāvaḥ) - mōkṣārthaṃ dṛḍha tarādvitīya cinmātrātmā parōkṣa sākṣātkāraśca - ityēvamādi puṣkala sādhanānuṣṭānaṃ tatsaṃvādanaṃ ca ‘kartavyaṃ’ ityucyatē. ē tadanuṣṭāna saṃpādana rūpaṃ kartavyaṃ yēna kṛtaṃ sa ēva kṛta kartavyaḥ, kṛta kṛtyaḥ ityucyatē”.

(ajñānadaśayaṃdu lōkavyavahāramukoraku vyavasāyamu modalagunaviyu; paralōkamulō bhōgamu lananubhaviṃcuṭaku kāmya karmōpāsana modalagunaviyu; cittaśuddhi, ēkāgratakoraku niṣkāmakarmō pāsana modalagunaviyu vēdāṃtaśravaṇamu koṟaku, vivēkamu, vairāgyamu modalagu caturvidhasādhana mulunnū; advitīyātmasākṣātkāramu koṟaku gurūpadēśamunnū, saṃśayamulu modalagu vāṭi nivṛtti guṟiṃci śravaṇamu modalagunaviyu; tatpadārtha viṣayamaina parōkṣatvabhrama nivṛttikoṟakunnū, tvaṃ padārthaviṣayamaina paricchinnatvabhrama nivṛtti korakunnū (anyōnya vyatiṣaṃgamu) ōtaprōtabhāva munnū; mōkṣamu koṟaku dṛḍhamaina advitīya cinmātrātmā parōkṣasākṣātkāramunnū - iṭlu innividha mulaina sādhanamula nanuṣṭiṃcuṭa, vāṭini saṃpādiṃcuṭa - idi kartavyamu - kṛtyamu. iṭivaṃṭi anu ṣṭāna saṃpādana rūpamainadi kartavyamu - cēyatagina pani evaḍu cēyunō kṛtakartavyuḍu - kṛta kṛtyuḍu - cēyavalasina pani cēsinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.