← Back to క · Booklets 11–20 (digitized file 2)

కూటము kūṭamu

Original — తెలుగు
  1. కూటోనామ అయోఘన విశేషః అయస్కారాది ప్రసిద్ధిః

(నగలు మొదలగువాటిని చేయుటకు బంగారుపనివాడు ఉపయోగించు యినుప దిమ్మ. దానిమీద ఆ స్వర్ణ కారుడు ఎన్నినగలను చేసినను, ఆ చేయుటలో ఎన్నిసుత్తి దెబ్బలు కొట్టినను అది చెక్కు చెదరక, నిశ్చ లముగా, నిర్వికారముగా (మార్పు లేకుండునట్లు) నుండును. దానిమీద చేయబడిన ఆభరణములు ఎన్ని మార్పులు చెందినను అదిమట్టుకు మార్పు చెందదు).

  1. “కూటం ఖం వ్యోమం సంధిరాకాశ ఉచ్యతే”. (కూటము అనగా, ఆకాశము, సంధి, కలయిక).

  2. నిర్వికారం (మార్పు చెందనిది) (ఎల్లకాలము ఒకేరీతిగా నుండునది).

  3. మాయ; మాయకు అధిష్ఠానమైనది; అజ్ఞానము.

  4. దృశ్యమానగుణకం, అంతర్దోషం వస్తుకూటం, కూటరూపం - ‘కూట సాక్ష్యం’ ఇత్యాదౌ కూట శబ్దః ప్రసిద్ధో లోకే.

(పైకి మంచిదివలె కనబడుచు లోపల దోషముకలది - కూటసాక్ష్యము అబద్ధపు సాక్ష్యము అని చెప్పు నపుడు లోకములో ‘కూటము’ అను మాట వాడుకలోనున్నది).

  1. కూటశబ్దో అనృత వాక్యాది వాచీ.

(‘అబద్ధపుమాట’ అని చెప్పునపుడు కూటవాక్యము అనుట వాడుకలో నున్నది).

  1. “వస్తుతః అసత్ అపి సత్ ఇవ అవభాసమానం కూటం - యధా కూటకర్షాపణం, కూట తులేతి”.

(నిజముగా అసత్ అయినను - అబద్ధమైనను - సద్వస్తువువలె, నిజమైనదివలె తోచునది - త్రాసు - వలె).

  1. “యత్ మిథ్యా భూతం సత్య తయా ప్రతీయతే తత్ కూటం ఇతి లోకైః ఉచ్యతే - యథా కూటకార్షాపణః, కూటసాక్షిత్వం ఇత్యాదౌ అజ్ఞానమపి మాయాఖ్యం సహకార్య ప్రపంచేన మిథ్యా భూతమపి లౌకికైః సత్యతయా ప్రతీయమానం కూటం”.

(మిథ్యా వస్తువు సత్యమైనదివలె ప్రకాశించునది కూటము అని లోకులు చెప్పుచున్నారు - కూటసాక్ష్య ము (అబద్ధపు సాక్ష్యమువలె) మాయ యను పేరున నుండు అజ్ఞానము మిధ్య అయినప్పటికీ సత్యమైనది వలె - నిజమైనదివలె గోచరించునది కూటము).

Transliteration
  1. kūṭōnāma ayōghana viśēṣaḥ ayaskārādi prasiddhiḥ

(nagalu modalaguvāṭini cēyuṭaku baṃgārupanivāḍu upayōgiṃcu yinupa dimma. dānimīda ā svarṇa kāruḍu enninagalanu cēsinanu, ā cēyuṭalō ennisutti debbalu koṭṭinanu adi cekku cedaraka, niśca lamugā, nirvikāramugā (mārpu lēkuṃḍunaṭlu) nuṃḍunu. dānimīda cēyabaḍina ābharaṇamulu enni mārpulu ceṃdinanu adimaṭṭuku mārpu ceṃdadu).

  1. “kūṭaṃ khaṃ vyōmaṃ saṃdhirākāśa ucyatē”. (kūṭamu anagā, ākāśamu, saṃdhi, kalayika).

  2. nirvikāraṃ (mārpu ceṃdanidi) (ellakālamu okērītigā nuṃḍunadi).

  3. māya; māyaku adhiṣṭhānamainadi; ajñānamu.

  4. dṛśyamānaguṇakaṃ, aṃtardōṣaṃ vastukūṭaṃ, kūṭarūpaṃ - ‘kūṭa sākṣyaṃ’ ityādau kūṭa śabdaḥ prasiddhō lōkē.

(paiki maṃcidivale kanabaḍucu lōpala dōṣamukaladi - kūṭasākṣyamu abaddhapu sākṣyamu ani ceppu napuḍu lōkamulō ‘kūṭamu’ anu māṭa vāḍukalōnunnadi).

  1. kūṭaśabdō anṛta vākyādi vācī.

(‘abaddhapumāṭa’ ani ceppunapuḍu kūṭavākyamu anuṭa vāḍukalō nunnadi).

  1. “vastutaḥ asat api sat iva avabhāsamānaṃ kūṭaṃ - yadhā kūṭakarṣāpaṇaṃ, kūṭa tulēti”.

(nijamugā asat ayinanu - abaddhamainanu - sadvastuvuvale, nijamainadivale tōcunadi - trāsu - vale).

  1. “yat mithyā bhūtaṃ satya tayā pratīyatē tat kūṭaṃ iti lōkaiḥ ucyatē - yathā kūṭakārṣāpaṇaḥ, kūṭasākṣitvaṃ ityādau ajñānamapi māyākhyaṃ sahakārya prapaṃcēna mithyā bhūtamapi laukikaiḥ satyatayā pratīyamānaṃ kūṭaṃ”.

(mithyā vastuvu satyamainadivale prakāśiṃcunadi kūṭamu ani lōkulu ceppucunnāru - kūṭasākṣya mu (abaddhapu sākṣyamuvale) māya yanu pēruna nuṃḍu ajñānamu midhya ayinappaṭikī satyamainadi vale - nijamainadivale gōcariṃcunadi kūṭamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.