బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా |
తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః |
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 23, 24)
(ఓం, తత్, సత్ అను మూడుమాటలచేత పరబ్రహ్మ నిర్దేశింపబడినాడు. ఈ మూడు మాటలచేతనే పూర్వము బ్రాహ్మణములు, వేదములు, యజ్ఞములు, విహితమైనవి - నిర్మింపబడినవి. బ్రహ్మను నిర్దేశించునది, బ్రహ్మకు వాచకమైనది కనుకనే వేదవాదులశాస్త్రములో విధించబడినకర్మలు అగు యజ్ఞము, దానము, తపస్సు, మొదలగునవి ‘ఓం’ అని ముందు ఉచ్చరించి చేయబడుచున్నవి).
(ఓం, తత్. సత్ అని బ్రహ్మ మూడు విధముల మూడునామముల నిర్దేశింపబడుచున్నాడు అని శ్రీ కృష్ణభగవానుడు చెప్పియుండుటచేత భగవంతుని స్తోత్రము, నమస్కారము మొదలగునవి అసాత్వికమైనవైనను, విగుణములైనవైనను, శ్రద్ధతో ఈ మూడు అభిదానములను ప్రయోగించినయడల అవి గుణము గలవియు సాత్వికమైనవియు అగును).
(నిర్దిశ్యతే అనేనేతి నిర్దేశః - త్రివిధోనామ నిర్దేశః బ్రహ్మణః స్మృతః, చింతితః, వేదాంతేషు బ్రహ్మవిద్భిరితి).
(నిర్దేశింపబడినది కనుక నిర్దేశము - బ్రహ్మ యొక్క నామము మూడు విధముల - ఓం, తత్, సత్ అని - ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానము కలవారిచేత చింతింపబడినది).
(ఓం, తత్, సత్ అనునవి పరబ్రహ్మపేర్లు అని ప్రసిద్ధివహించినవి. తత్ అనగా అది - దూరముగానున్నది - పరబ్రహ్మ ఎప్పుడు దూరముగా, కనబడకుండనుండువాడు కనుక ‘తత్’ (అది) అని చెప్పబడుచున్నాడు - ఎందుచేతననగా పరబ్రహ్మ శరీరము లేనివాడు, ఆకారము లేనివాడు, ఊహించుటకు వీలులేనివాడు).
(ఓం. తత్, సత్ అని ఈ మూడు విధములుగా బ్రహ్మ అనుమాట నిర్దేశింపబడినది - ఇవి బ్రహ్మకు అన్వయించునవి. బ్రహ్మ అనగా వేదము. వేదము అనగా వైదికము - వేదములో చెప్పబడినది, వేదమునకు సంబంధించినది - యజ్ఞము మొదలగు కర్మ. ఓం అనునది వైదిక కర్మలకు అంగము - ‘తత్, సత్’ అను రెండు శబ్దములు పూజ్యత్వమును తెలియచేయును).
brāhmaṇāstēna vēdāśca yajñāśca vihitāḥ purā |
tasmādō mityudāhṛtya yajñadāna tapaḥ kriyāḥ |
pravartaṃtē vidhānōktāḥ satataṃ brahmavādināṃ ||“. (śrīmadbhagavadgīta - 17 - 23, 24)
(ōṃ, tat, sat anu mūḍumāṭalacēta parabrahma nirdēśiṃpabaḍināḍu. ī mūḍu māṭalacētanē pūrvamu brāhmaṇamulu, vēdamulu, yajñamulu, vihitamainavi - nirmiṃpabaḍinavi. brahmanu nirdēśiṃcunadi, brahmaku vācakamainadi kanukanē vēdavādulaśāstramulō vidhiṃcabaḍinakarmalu agu yajñamu, dānamu, tapassu, modalagunavi ‘ōṃ’ ani muṃdu uccariṃci cēyabaḍucunnavi).
(ōṃ, tat. sat ani brahma mūḍu vidhamula mūḍunāmamula nirdēśiṃpabaḍucunnāḍu ani śrī kṛṣṇabhagavānuḍu ceppiyuṃḍuṭacēta bhagavaṃtuni stōtramu, namaskāramu modalagunavi asātvikamainavainanu, viguṇamulainavainanu, śraddhatō ī mūḍu abhidānamulanu prayōgiṃcinayaḍala avi guṇamu galaviyu sātvikamainaviyu agunu).
(nirdiśyatē anēnēti nirdēśaḥ - trividhōnāma nirdēśaḥ brahmaṇaḥ smṛtaḥ, ciṃtitaḥ, vēdāṃtēṣu brahmavidbhiriti).
(nirdēśiṃpabaḍinadi kanuka nirdēśamu - brahma yokka nāmamu mūḍu vidhamula - ōṃ, tat, sat ani - upaniṣattulalō brahmajñānamu kalavāricēta ciṃtiṃpabaḍinadi).
(ōṃ, tat, sat anunavi parabrahmapērlu ani prasiddhivahiṃcinavi. tat anagā adi - dūramugānunnadi - parabrahma eppuḍu dūramugā, kanabaḍakuṃḍanuṃḍuvāḍu kanuka ‘tat’ (adi) ani ceppabaḍucunnāḍu - eṃducētananagā parabrahma śarīramu lēnivāḍu, ākāramu lēnivāḍu, ūhiṃcuṭaku vīlulēnivāḍu).
(ōṃ. tat, sat ani ī mūḍu vidhamulugā brahma anumāṭa nirdēśiṃpabaḍinadi - ivi brahmaku anvayiṃcunavi. brahma anagā vēdamu. vēdamu anagā vaidikamu - vēdamulō ceppabaḍinadi, vēdamunaku saṃbaṃdhiṃcinadi - yajñamu modalagu karma. ōṃ anunadi vaidika karmalaku aṃgamu - ‘tat, sat’ anu reṃḍu śabdamulu pūjyatvamunu teliyacēyunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.