← Back to ఓ · Booklets 11–20 (digitized file 2)

ఓతప్రోతము ōtaprōtamu

Original — తెలుగు
  1. ఓతం దీర్ఘ తంతుషు పటవద్గ్రిధితం - ప్రోతంచ తిర్యక్తం తుషు పటవద్గ్రిధితం; ప్రోతంచ - ఏవం సం గ్రథితం సర్వతః అనుస్యూతం వర్తతే ఇత్యర్థః.

(బట్టలో నిలువుగాను, అడ్డుగాను అల్లినదారములవలె అంతటను వ్యాపించియుండునది. పరమాత్మ ఈ ప్రపంచమంతటను, ప్రపంచములోని ప్రతి వస్తువులోను - బట్టలో అల్లిన నిలువు దారములు, అడ్డు దారములు వలె లోపల పైన పూర్తిగా వ్యాపించియున్నాడు. పొడుగు పేకవలె అల్లిన దారములే బట్టకు ఆధారములు లేకపోయినయడల బట్టయే లేదు - ఆ ప్రకారముగానే ఈ ప్రపంచమంతటిని పూర్తిగా వ్యాపించియున్న భగవంతుడు లేనియడల ప్రపంచమే లేదు).

  1. పరమాత్మా సర్వ ప్రజాసు చేతనాచేతన వర్గేషు దీర్ఘతంతువ దోతః, తిర్యక్తం తువ త్ప్రోతః చ వ్యాప్య వర్తతే.

(నిలువుగానూడ్డముగాను నేయబడిన బట్టవలె చేతనా చేతనాత్మకమైన ఈ జీవులందఱిలోను పరమాత్మ వ్యాపించియున్నాడు).

  1. “ఓతోహ్య యమాత్మా” ఇతి శ్రుతిః - వ్యాపకః - (ఈ ఆత్మ బట్టలోని దారములవలె వ్యాపించియున్నాడు).

  2. “సర్వేవా ఏతే ప్రాణాశ్చ, ప్రాణినాశ్చ, దేవాశ్చ, దివ్యానిచ లోకాశ్చ, లోకినాశ్చ, అలోకాశ్చ, అలోకినాశ్చ నిష్టావేవ ఓతశ్చ, ప్రోతశ్చ” ఇతి శ్రుతిః -

(ఈ ప్రాణములు, ప్రాణులు, దేవతలు, దేవలోకములు, లోకులు, అలోకములు (కనబడనివి), అలోకనివాసులు, ఇవన్నియు విష్ణువునందే, బట్టలోని పొడుగు పేక దారములవలె అల్లుకొని యున్నవి).

  1. సచ్చిదానంద రూపస్య కారణ సాక్షిణః సదాది రూపైః కారణవ్యాప్తి రూపమో తోనామ.

(సత్ చిత్ ఆనందములు రూపముగా గలిగినటువంటిన్నీ మూలకారణము, ఆదికారణము అయినటువంటిన్నీ పరమాత్మ సత్ మొదలగు తన శక్తులను రూపముతో అన్నివస్తువులలోను కారణరూపముగా వ్యాపించియుండుటే ఓతము అని తెలియునది).

  1. “ఓత ప్రోత సమస్త వస్తు నిచయం చోంకారబీజాక్షరం” (శ్రీరామకర్ణామృతం - 2 - 50)

  2. “సీ||. కలడు మదన్యుండు ఘనుడొక్కడతండు వెలికి గానగరాక విశ్వమెల్ల

నతిలీలమై మహాద్భుత సమగ్ర స్ఫూర్తినుండును, గోకనూలు భంగి

- - - దామెన బశువులు దగిలియుండెడి మాడ్కి - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 169)

Transliteration
  1. ōtaṃ dīrgha taṃtuṣu paṭavadgridhitaṃ - prōtaṃca tiryaktaṃ tuṣu paṭavadgridhitaṃ; prōtaṃca - ēvaṃ saṃ grathitaṃ sarvataḥ anusyūtaṃ vartatē ityarthaḥ.

(baṭṭalō niluvugānu, aḍḍugānu allinadāramulavale aṃtaṭanu vyāpiṃciyuṃḍunadi. paramātma ī prapaṃcamaṃtaṭanu, prapaṃcamulōni prati vastuvulōnu - baṭṭalō allina niluvu dāramulu, aḍḍu dāramulu vale lōpala paina pūrtigā vyāpiṃciyunnāḍu. poḍugu pēkavale allina dāramulē baṭṭaku ādhāramulu lēkapōyinayaḍala baṭṭayē lēdu - ā prakāramugānē ī prapaṃcamaṃtaṭini pūrtigā vyāpiṃciyunna bhagavaṃtuḍu lēniyaḍala prapaṃcamē lēdu).

  1. paramātmā sarva prajāsu cētanācētana vargēṣu dīrghataṃtuva dōtaḥ, tiryaktaṃ tuva tprōtaḥ ca vyāpya vartatē.

(niluvugānūḍḍamugānu nēyabaḍina baṭṭavale cētanā cētanātmakamaina ī jīvulaṃdaṟilōnu paramātma vyāpiṃciyunnāḍu).

  1. “ōtōhya yamātmā” iti śrutiḥ - vyāpakaḥ - (ī ātma baṭṭalōni dāramulavale vyāpiṃciyunnāḍu).

  2. “sarvēvā ētē prāṇāśca, prāṇināśca, dēvāśca, divyānica lōkāśca, lōkināśca, alōkāśca, alōkināśca niṣṭāvēva ōtaśca, prōtaśca” iti śrutiḥ -

(ī prāṇamulu, prāṇulu, dēvatalu, dēvalōkamulu, lōkulu, alōkamulu (kanabaḍanivi), alōkanivāsulu, ivanniyu viṣṇuvunaṃdē, baṭṭalōni poḍugu pēka dāramulavale allukoni yunnavi).

  1. saccidānaṃda rūpasya kāraṇa sākṣiṇaḥ sadādi rūpaiḥ kāraṇavyāpti rūpamō tōnāma.

(sat cit ānaṃdamulu rūpamugā galiginaṭuvaṃṭinnī mūlakāraṇamu, ādikāraṇamu ayinaṭuvaṃṭinnī paramātma sat modalagu tana śaktulanu rūpamutō annivastuvulalōnu kāraṇarūpamugā vyāpiṃciyuṃḍuṭē ōtamu ani teliyunadi).

  1. “ōta prōta samasta vastu nicayaṃ cōṃkārabījākṣaraṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)

  2. “sī||. kalaḍu madanyuṃḍu ghanuḍokkaḍataṃḍu veliki gānagarāka viśvamella

natilīlamai mahādbhuta samagra sphūrtinuṃḍunu, gōkanūlu bhaṃgi

- - - dāmena baśuvulu dagiliyuṃḍeḍi māḍki - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 169)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.