← Back to ఋ · Booklets 11–20 (digitized file 2)

ఋణత్రయము ṛṇatrayamu

Original — తెలుగు
  1. “అతః కార్యతు, విప్రేంద్ర ! ఋణ త్రయ విశోధనం |

తే దేవానాం ఋషీణాంచ పితృఊణాం ఋణినస్తథా |

ఋషిభ్యో బ్రహ్మచర్యేన పితృభ్యస్తుతి లోదకైః |

ముచ్యతే యజ్ఞేన దేవేభ్యః స్వాశ్రమ ధర్మ మాచరేత్ ||“.

(పుట్టినవాడు ముగ్గురకు ఋణపడియుండును - దేవతులకు, ఋషులకు, పితరులకు - యజ్ఞము చేసి దేవతల ఋణము తీర్చుకొనవలెను - బ్రహ్మచర్యమవలంభించి ఋషుల ఋణము తీర్చుకొనవలెను - పిల్లలను కని పితృ ఋణము తీర్చుకొనవలెను - ఇట్లు చేయుచు తన ఆశ్రమ ధర్మముల నవలంబించవలెను).

  1. “జాయమానో వై బ్రాహ్మణః తిభిర్ ఋణవాన్ జాయతే |

బ్రహ్మచర్యేణ ర్షిభ్యో, యజ్ఞేన దేవేభ్యః, ప్రజయా పితృభ్యః |

ఏషవా అనృణోయః పుత్రయ జ్వా బ్రహ్మచర్య వాసి” ఇతి శ్రుతిః -

(పుట్టిన బ్రాహ్మణుడు ముగ్గురకు ఋణపడియుండును - బ్రహ్మచర్యముచేత ఋషి ఋణమును, యజ్ఞముచేసి దేవ ఋణమును, పిల్లలనుకని పితృ ఋణమును తీర్చుకోవలెను).

  1. “క. దేవర్షి పితృ ఋణంబులు

భూవర ! మఖ వేదపాఠ పుత్రులచేతన్

వావిరి నీగని పురుషుడు

పోవు నధోలోకములకు బుణ్యచ్యుతుడై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉత్తర భాగము - 1125)

Transliteration
  1. “ataḥ kāryatu, viprēṃdra ! ṛṇa traya viśōdhanaṃ |

tē dēvānāṃ ṛṣīṇāṃca pitṛūṇāṃ ṛṇinastathā |

ṛṣibhyō brahmacaryēna pitṛbhyastuti lōdakaiḥ |

mucyatē yajñēna dēvēbhyaḥ svāśrama dharma mācarēt ||“.

(puṭṭinavāḍu mugguraku ṛṇapaḍiyuṃḍunu - dēvatulaku, ṛṣulaku, pitarulaku - yajñamu cēsi dēvatala ṛṇamu tīrcukonavalenu - brahmacaryamavalaṃbhiṃci ṛṣula ṛṇamu tīrcukonavalenu - pillalanu kani pitṛ ṛṇamu tīrcukonavalenu - iṭlu cēyucu tana āśrama dharmamula navalaṃbiṃcavalenu).

  1. “jāyamānō vai brāhmaṇaḥ tibhir ṛṇavān jāyatē |

brahmacaryēṇa rṣibhyō, yajñēna dēvēbhyaḥ, prajayā pitṛbhyaḥ |

ēṣavā anṛṇōyaḥ putraya jvā brahmacarya vāsi” iti śrutiḥ -

(puṭṭina brāhmaṇuḍu mugguraku ṛṇapaḍiyuṃḍunu - brahmacaryamucēta ṛṣi ṛṇamunu, yajñamucēsi dēva ṛṇamunu, pillalanukani pitṛ ṛṇamunu tīrcukōvalenu).

  1. “ka. dēvarṣi pitṛ ṛṇaṃbulu

bhūvara ! makha vēdapāṭha putrulacētan

vāviri nīgani puruṣuḍu

pōvu nadhōlōkamulaku buṇyacyutuḍai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - uttara bhāgamu - 1125)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.