(సూక్ష్మార్థములను, సూక్ష్మాతిసూక్ష్మమైన భగవంతుని చూచువాడు - దర్శించువాడు, తెలుసుకొనినవాడు).
(సూక్ష్మవస్తువులను, ఆత్మ మొదలగువాటిని విచక్షణగా తెలుసుకొనుటయందు సమర్థుడైనవాడు).
(ఆకాశము మొదలగు సూక్ష్మతత్వములను, అతి సూక్ష్మమైన పరబ్రహ్మను - పరతత్వమును - దర్శించినవాడు, తెలుసుకొనినవాడు).
(తత్వములను, పరతత్వమును - యధార్థముగా తెలిసినవాడు).
పరబ్రహ్మ దర్శీ. (పరబ్రహ్మను దర్శించినవాడు - సాక్షాత్కారము చేసుకొనినవాడు).
స్వాత్మ పరమాత్మ యదాత్మ్యవిత్. (జీవాత్మ పరమాత్మలయొక్క యాథాత్మ్యను - యదార్థముగాతెలిసినవాడు).
ఆత్మావలోకన పరః - (ఆత్మను అవలోకించుట యందే. కనుగొనుట యందే ఆసక్తి గలవాడు).
సమ్యక్ దర్శీ. (భగవత్సాక్షాత్కారమును పొందినవాడు).
వేదః; మంత్రః, తద్ద్రష్టారః వా. (వేదము; మంత్రము; మంత్ర ద్రష్ట - మంత్రమును కనిపెట్టినవా డు) (మంత్రాణి, తద్దర్శనః).
మంత్ర ద్రష్ట్రా; మంత్రదర్శినః. (మంత్రమును కనుగొనినవాడు - “గాయత్ర్యాః సవితా దేవతా, విశ్వామిత్ర ఋషిః” - గాయత్రీ మంత్రమును కనిపెట్టిన ఋషి విశ్వామిత్రుడు).
“యో మంత్రస్య ద్రష్టా స ఋషిః; యో యస్య వాక్యం మంత్రః సతస్య ఋషిః.
(మంత్రమును కనిపెట్టినవాడు ఆ మంత్రమునకు ఋషి - ఎవనియొక్క వాక్యము మంత్రమో, ఆ మంత్రమునకు అతను ఋషి).
(ఎవని వాక్యము శ్రుతియగునో - భగవంతునినుండి స్వయముగా విన్నదియో అతను ఋషి).
(కుహకం అనగా ఇతరుల మాటలను మనసులో ఒకరీతిగ నూహించుకొనుచు, పైకి యింకొకరీతిగా అర్థము చేసుకొనినట్లు అగపడుట. అహంకారమనగా మిధ్యాభి మానము. అనృతమనగా చూడనిది చూచినట్లు చెప్పుట. ఇదియు, మాయ, శాఠ్యము, దంభము మొదలగు దోషములు లేనివారు ఋషులు).
(వేదములలో ఏకాండలలో ఏ యే మంత్రములు ఏ యే ఋషులు చెప్పిరో, వారి వారి ఆకారము, శక్తి మొదలగునవి బాగుగా నాలోచించి, తర్వాత వచ్చు కల్పమందు ఆయాకారములతో ఆయా శక్తి మొదలగునవి కలవారినిగా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి, వారినే ఆయా మంత్రములను మరల తెలుసుకొని ద్రష్టలగునట్లు కూడా నియమించును. అట్టివారు చతుర్ముఖ బ్రహ్మచేత ఈ రీతిగా నియమింపబడినవారై, ఆయా శక్తులను పొంది, వాటికి తగిన తపస్సుచేసి నిత్యసిద్ధులై పూర్వ కల్పములలో నుండెడి వశిష్టుడు మొదలగు మంత్ర ద్రష్టలను ఆ పూర్వమంత్రములనే, అధ్యయనము చేయకనే, స్వరములో వర్ణములో మార్పులేకుండగనే, ఏ విధమైన దోషములు లేకుండగనే చూడగలుగుదురు - తెలుసుకొన గలుగుదురు - ఇందువలననే వేదములు ఎన్ని కల్పములు గడిచిపోయినను నిత్యములని చెప్పబడుచున్నవి. ఈ ఋషులు ఏ కల్పమునకు ఆ కల్పములో మంత్ర ద్రష్ట లగుచున్నారు - “ధాతా యధా పూర్వమకల్పయత్” - (చతుర్ముఖ బ్రహ్మ పూర్వమువలనే, క్రిందటి కల్పములోవలెనే సృష్టిని చేసెను - అని శ్రుతి చ్రెప్పుచున్నది).
“అప్రతిహత జ్ఞానవాన్” (అడ్డులేని జ్ఞానము కలవాడు; సిద్ధాంతీకరింపబడిన బ్రహ్మజ్ఞానము గలవాడు).
సర్వజ్ఞః - (సర్వమును తెలిసినవాడు - తెలియతగిన వాటినన్నింటిని తెలుసుకొనినవాడు - సర్వమును తెలిసినవాడు పరబ్రహ్మ - సృష్టి చేయుటలో సర్వజ్ఞత్వము రూఢి అయినది - “యస్సర్వజ్ఞః సర్వవిత్” -
“అతీంద్రియా న సంవేద్యాన్ పశ్యంత్యార్షేణ చక్షుషా | యే భవాన్ వచనం తేషాం నాను మానేన చాద్యతే”. (భర్తృహరి)
(ఇంద్రియములకు గోచరముకానివి, బాగాతెలియ బడనవి అయిన విషయములను ఋషులు వారి ఆర్ష్య చక్షువుచేత - వారికి గల సూక్ష్మదృష్టి విశేషమువలన - చూడగలుగుచున్నారు. అట్టివారు చెప్పిన విషయములు అనుమానము చేత కొట్టివేయుటకు - త్రోసివేయుటకు వీలుకానివి).
(ఇంద్రియములకు గోచరముకాని వస్తువుల గుఱించియు, భూత భవిష్యత్కాలములలో జరిగిన విషయముల గుఱించియు, జరుగబోవు విషయముల గుఱించియు అయిన జ్ఞానము ఆర్షజ్ఞానము - ఇది, ఆత్మ మనస్సుల సంయోగమువలన, యధార్థభాషణము - సత్య సంధత - ప్రభావము వలనను కలుగును - ఇది దేవ ఋషులకు అధికముగాను, ఈ లోకవాసులకు కదాచిత్కముగా - ఎప్పుడో, ఎవరికో - కలుగును).
మయా వా సుమహత్తప్తం తపః పరమదారుణం |
భూతం భవ్యం భవిష్యం చ జానీయామితి సత్తమాః |
తస్యమే తప్త తపసో నిగృహీ తేంద్రి యస్యచ |
నారాయణ ప్రసాదేన క్షీరో దస్యానుకూలతః |
త్రైకాలికమిదం జ్ఞానం ప్రాదుర్భూతం యధేప్సితం |
యథావృత్తం హి కల్పాదౌ దృష్టం మే జ్ఞాన చక్షుషా ||“. - (మహాభారతము - శాంతి పర్వము - 340)
(పరాశరుని కుమారుడైన వ్యాస,మహర్షి యిట్లు పలికెను -
“నేను పరమదారుణమైన, గొప్ప, తపస్సు చేసితిని. దాని ఫలితముగా నాకు భూత భవిష్యద్వర్తమాన కాలములలో ఎక్కడ ఏమిటి జరుగుచున్నదో చెప్పగల జ్ఞానము కలిగినది. ఈ తపస్సు వలన, ఇంద్రియనిగ్రహమువలన, శ్రీమన్నారాయణుని దయవలన, నేను కోరినట్లు ఈ త్రికాలజ్ఞానము కలిగినది. కల్ప ప్రారంభమున జరిగినది నేను నా జ్ఞానచక్షువువలన - ఈ అర్షిజ్ఞానమను దృష్టి కలుగుటవలన - యథాతథముగా, - ఎట్లు జరిగినదో అట్లే - చూచితిని” - ఇట్టి ఆర్షజ్ఞానము కలవాడు కనుకనే వ్యాసమహర్షి భూతకాల చరిత్ర అయిన పురాణములు, వర్తమానములో జరుగుచున్న విషయములు, భవిష్యత్కాలములో జరుగబోవు విషయములను - పూసగుచ్చినట్లు - వ్రాసి యున్నాడు).
(sūkṣmārthamulanu, sūkṣmātisūkṣmamaina bhagavaṃtuni cūcuvāḍu - darśiṃcuvāḍu, telusukoninavāḍu).
(sūkṣmavastuvulanu, ātma modalaguvāṭini vicakṣaṇagā telusukonuṭayaṃdu samarthuḍainavāḍu).
(ākāśamu modalagu sūkṣmatatvamulanu, ati sūkṣmamaina parabrahmanu - paratatvamunu - darśiṃcinavāḍu, telusukoninavāḍu).
(tatvamulanu, paratatvamunu - yadhārthamugā telisinavāḍu).
parabrahma darśī. (parabrahmanu darśiṃcinavāḍu - sākṣātkāramu cēsukoninavāḍu).
svātma paramātma yadātmyavit. (jīvātma paramātmalayokka yāthātmyanu - yadārthamugātelisinavāḍu).
ātmāvalōkana paraḥ - (ātmanu avalōkiṃcuṭa yaṃdē. kanugonuṭa yaṃdē āsakti galavāḍu).
samyak darśī. (bhagavatsākṣātkāramunu poṃdinavāḍu).
vēdaḥ; maṃtraḥ, taddraṣṭāraḥ vā. (vēdamu; maṃtramu; maṃtra draṣṭa - maṃtramunu kanipeṭṭinavā ḍu) (maṃtrāṇi, taddarśanaḥ).
maṃtra draṣṭrā; maṃtradarśinaḥ. (maṃtramunu kanugoninavāḍu - “gāyatryāḥ savitā dēvatā, viśvāmitra ṛṣiḥ” - gāyatrī maṃtramunu kanipeṭṭina ṛṣi viśvāmitruḍu).
“yō maṃtrasya draṣṭā sa ṛṣiḥ; yō yasya vākyaṃ maṃtraḥ satasya ṛṣiḥ.
(maṃtramunu kanipeṭṭinavāḍu ā maṃtramunaku ṛṣi - evaniyokka vākyamu maṃtramō, ā maṃtramunaku atanu ṛṣi).
(evani vākyamu śrutiyagunō - bhagavaṃtuninuṃḍi svayamugā vinnadiyō atanu ṛṣi).
(kuhakaṃ anagā itarula māṭalanu manasulō okarītiga nūhiṃcukonucu, paiki yiṃkokarītigā arthamu cēsukoninaṭlu agapaḍuṭa. ahaṃkāramanagā midhyābhi mānamu. anṛtamanagā cūḍanidi cūcinaṭlu ceppuṭa. idiyu, māya, śāṭhyamu, daṃbhamu modalagu dōṣamulu lēnivāru ṛṣulu).
(vēdamulalō ēkāṃḍalalō ē yē maṃtramulu ē yē ṛṣulu ceppirō, vāri vāri ākāramu, śakti modalagunavi bāgugā nālōciṃci, tarvāta vaccu kalpamaṃdu āyākāramulatō āyā śakti modalagunavi kalavārinigā caturmukha brahma sṛṣṭiṃci, vārinē āyā maṃtramulanu marala telusukoni draṣṭalagunaṭlu kūḍā niyamiṃcunu. aṭṭivāru caturmukha brahmacēta ī rītigā niyamiṃpabaḍinavārai, āyā śaktulanu poṃdi, vāṭiki tagina tapassucēsi nityasiddhulai pūrva kalpamulalō nuṃḍeḍi vaśiṣṭuḍu modalagu maṃtra draṣṭalanu ā pūrvamaṃtramulanē, adhyayanamu cēyakanē, svaramulō varṇamulō mārpulēkuṃḍaganē, ē vidhamaina dōṣamulu lēkuṃḍaganē cūḍagaluguduru - telusukona galuguduru - iṃduvalananē vēdamulu enni kalpamulu gaḍicipōyinanu nityamulani ceppabaḍucunnavi. ī ṛṣulu ē kalpamunaku ā kalpamulō maṃtra draṣṭa lagucunnāru - “dhātā yadhā pūrvamakalpayat” - (caturmukha brahma pūrvamuvalanē, kriṃdaṭi kalpamulōvalenē sṛṣṭini cēsenu - ani śruti creppucunnadi).
“apratihata jñānavān” (aḍḍulēni jñānamu kalavāḍu; siddhāṃtīkariṃpabaḍina brahmajñānamu galavāḍu).
sarvajñaḥ - (sarvamunu telisinavāḍu - teliyatagina vāṭinanniṃṭini telusukoninavāḍu - sarvamunu telisinavāḍu parabrahma - sṛṣṭi cēyuṭalō sarvajñatvamu rūḍhi ayinadi - “yassarvajñaḥ sarvavit” -
“atīṃdriyā na saṃvēdyān paśyaṃtyārṣēṇa cakṣuṣā | yē bhavān vacanaṃ tēṣāṃ nānu mānēna cādyatē”. (bhartṛhari)
(iṃdriyamulaku gōcaramukānivi, bāgāteliya baḍanavi ayina viṣayamulanu ṛṣulu vāri ārṣya cakṣuvucēta - vāriki gala sūkṣmadṛṣṭi viśēṣamuvalana - cūḍagalugucunnāru. aṭṭivāru ceppina viṣayamulu anumānamu cēta koṭṭivēyuṭaku - trōsivēyuṭaku vīlukānivi).
(iṃdriyamulaku gōcaramukāni vastuvula guṟiṃciyu, bhūta bhaviṣyatkālamulalō jarigina viṣayamula guṟiṃciyu, jarugabōvu viṣayamula guṟiṃciyu ayina jñānamu ārṣajñānamu - idi, ātma manassula saṃyōgamuvalana, yadhārthabhāṣaṇamu - satya saṃdhata - prabhāvamu valananu kalugunu - idi dēva ṛṣulaku adhikamugānu, ī lōkavāsulaku kadācitkamugā - eppuḍō, evarikō - kalugunu).
mayā vā sumahattaptaṃ tapaḥ paramadāruṇaṃ |
bhūtaṃ bhavyaṃ bhaviṣyaṃ ca jānīyāmiti sattamāḥ |
tasyamē tapta tapasō nigṛhī tēṃdri yasyaca |
nārāyaṇa prasādēna kṣīrō dasyānukūlataḥ |
traikālikamidaṃ jñānaṃ prādurbhūtaṃ yadhēpsitaṃ |
yathāvṛttaṃ hi kalpādau dṛṣṭaṃ mē jñāna cakṣuṣā ||“. - (mahābhāratamu - śāṃti parvamu - 340)
(parāśaruni kumāruḍaina vyāsa,maharṣi yiṭlu palikenu -
“nēnu paramadāruṇamaina, goppa, tapassu cēsitini. dāni phalitamugā nāku bhūta bhaviṣyadvartamāna kālamulalō ekkaḍa ēmiṭi jarugucunnadō ceppagala jñānamu kaliginadi. ī tapassu valana, iṃdriyanigrahamuvalana, śrīmannārāyaṇuni dayavalana, nēnu kōrinaṭlu ī trikālajñānamu kaliginadi. kalpa prāraṃbhamuna jariginadi nēnu nā jñānacakṣuvuvalana - ī arṣijñānamanu dṛṣṭi kaluguṭavalana - yathātathamugā, - eṭlu jariginadō aṭlē - cūcitini” - iṭṭi ārṣajñānamu kalavāḍu kanukanē vyāsamaharṣi bhūtakāla caritra ayina purāṇamulu, vartamānamulō jarugucunna viṣayamulu, bhaviṣyatkālamulō jarugabōvu viṣayamulanu - pūsaguccinaṭlu - vrāsi yunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.