← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉదానః udānaḥ

Original — తెలుగు
  1. ఉదానో నామ కంఠస్థానీయ ఊర్థ్వగమనవాన్ ఉత్క్రమణ వాయుః.

(సూక్ష్మశరీరము స్థూలశరీరమును విడిచిపోవుటకు సాధనమై కంఠమందుండు వాయువు).

  1. “లోకాంతర యాత్రకాలే ఊర్థ్వగమనవా నిత్యర్థః” (శివదత్తః)

  2. “అదైక యోర్థ్వ ఉదానః పుణ్యేన పుణ్యలోకం న యతి”. (ప్రశ్నోపనిషత్ - 3 - 7)

(ఉదానవాయువు, పుణ్యముచేసిన వారిని మీదికి, పుణ్యలోకములకు తీసుకొని వెళ్ళును).

  1. “ఉత్కర్షో ర్థ్వ గమనాది హేతుః, ఆపాదతలమస్తకస్థాన ఊర్థ్వ వృత్తిః” (శ్రీశంకరః)

(పాదములనుండి తలవరకు నడచు, నడిపించు వృత్తిగలది).

  1. “ఉదానోనామ యస్తూర్థ్వముపైతి పవనోత్తమః |

తేన భాషిత గీతాది విశేషో (అ) భిప్రవర్తతే ||” (సుశ్రత సమ్హిత)

(శరీరములోనుండి మీదకువచ్చు సంచరించువాయువు. కంఠముతో చేయుపనులు అయినమాటలాడుట, పాడుట మొదలైనవి చేయించునది).

  1. “స్పంద యత్యధరం వక్త్రం గాత్రనేత్ర ప్రకోపతః |

ఉద్వేజయతి కర్మాణి ఉదానో నామ మారుతః ||“.

(కంఠమునందుండి, అధరము, వక్త్రము, గాత్రము, నేత్రము వీటికి స్పందనము - చైతన్యము కలిగించి, వాటిపనులు అవి చేయుటలో వాటిని ప్రేరేపించునది).

  1. “సర్వ సంధిస్థః ఉదానః. (శాండిల్యోపనిషత్)

(శరీరములోని అన్ని సంధులందును ఉండునది ఉదానవాయువు).

  1. “ఉదానో వాయుః ఆపాద తలమస్తక వృత్తిస్సంచరన్ పుణ్యేన కర్మణా శాస్త్రవిహితేన పుణ్యం లోకం దేవాదిస్థానలక్షనం నయతి, ప్రాపయతి, పాదేన తద్విపరీతేన పాపం తిర్యగ్యోన్యాది లక్షణం, ఉభాభ్యాః, సమ పధానా భ్యాం పుణ్య పాపాభ్యామేవ మనుష్యలోకం నయతి”

(శ్రీశంకరః)

(ఉదానవాయువు శరీరములో పాదములు మొదలు శిరస్సువరకు సంచరించుచు, శాస్త్రములో చెప్పబడిన పుణ్యకర్మలనాచరించినవారిని, పుణ్యలోకములను, దేవలోకము మొదలగు వాటిని పొందించును. పాపకర్మలు చేసినవారిని దానికి విపరీతమైన నరకమునకు తీసుకొని వెళ్ళును. అనగా జంతువులుగా పుట్టునట్లు చేయును. పుణ్యములు, పాపములు - ఈ రెండింటిని చేసినవారిని మనుష్యలోకమునకు తీసుకొనివెళ్ళును).

  1. “యద్వా పీతాశిత పానీయాన్నపానాద్యద్గార క్రియోత్క్రమణం తద్ధేతుః, తదర్థ మూర్థ్వ గమన వా నిత్యర్థః”. (శివదత్తః)

(తినిన అన్నము, త్రాగిన నీరు మొదలగు జీర్ణముకాని వాటిని, శరీరమునుండి నోటిద్వారా బైటకు నెట్టివేయుటకు కారణమై - అందు నిమిత్తము మీదకు, మీదకు సంచరించు వాయువు).

  1. “వాయుతత్వము అగ్నిని గూడి ఉదానమాయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము).
Transliteration
  1. udānō nāma kaṃṭhasthānīya ūrthvagamanavān utkramaṇa vāyuḥ.

(sūkṣmaśarīramu sthūlaśarīramunu viḍicipōvuṭaku sādhanamai kaṃṭhamaṃduṃḍu vāyuvu).

  1. “lōkāṃtara yātrakālē ūrthvagamanavā nityarthaḥ” (śivadattaḥ)

  2. “adaika yōrthva udānaḥ puṇyēna puṇyalōkaṃ na yati”. (praśnōpaniṣat - 3 - 7)

(udānavāyuvu, puṇyamucēsina vārini mīdiki, puṇyalōkamulaku tīsukoni veḷḷunu).

  1. “utkarṣō rthva gamanādi hētuḥ, āpādatalamastakasthāna ūrthva vṛttiḥ” (śrīśaṃkaraḥ)

(pādamulanuṃḍi talavaraku naḍacu, naḍipiṃcu vṛttigaladi).

  1. “udānōnāma yastūrthvamupaiti pavanōttamaḥ |

tēna bhāṣita gītādi viśēṣō (a) bhipravartatē ||” (suśrata samhita)

(śarīramulōnuṃḍi mīdakuvaccu saṃcariṃcuvāyuvu. kaṃṭhamutō cēyupanulu ayinamāṭalāḍuṭa, pāḍuṭa modalainavi cēyiṃcunadi).

  1. “spaṃda yatyadharaṃ vaktraṃ gātranētra prakōpataḥ |

udvējayati karmāṇi udānō nāma mārutaḥ ||“.

(kaṃṭhamunaṃduṃḍi, adharamu, vaktramu, gātramu, nētramu vīṭiki spaṃdanamu - caitanyamu kaligiṃci, vāṭipanulu avi cēyuṭalō vāṭini prērēpiṃcunadi).

  1. “sarva saṃdhisthaḥ udānaḥ. (śāṃḍilyōpaniṣat)

(śarīramulōni anni saṃdhulaṃdunu uṃḍunadi udānavāyuvu).

  1. “udānō vāyuḥ āpāda talamastaka vṛttissaṃcaran puṇyēna karmaṇā śāstravihitēna puṇyaṃ lōkaṃ dēvādisthānalakṣanaṃ nayati, prāpayati, pādēna tadviparītēna pāpaṃ tiryagyōnyādi lakṣaṇaṃ, ubhābhyāḥ, sama padhānā bhyāṃ puṇya pāpābhyāmēva manuṣyalōkaṃ nayati”

(śrīśaṃkaraḥ)

(udānavāyuvu śarīramulō pādamulu modalu śirassuvaraku saṃcariṃcucu, śāstramulō ceppabaḍina puṇyakarmalanācariṃcinavārini, puṇyalōkamulanu, dēvalōkamu modalagu vāṭini poṃdiṃcunu. pāpakarmalu cēsinavārini dāniki viparītamaina narakamunaku tīsukoni veḷḷunu. anagā jaṃtuvulugā puṭṭunaṭlu cēyunu. puṇyamulu, pāpamulu - ī reṃḍiṃṭini cēsinavārini manuṣyalōkamunaku tīsukoniveḷḷunu).

  1. “yadvā pītāśita pānīyānnapānādyadgāra kriyōtkramaṇaṃ taddhētuḥ, tadartha mūrthva gamana vā nityarthaḥ”. (śivadattaḥ)

(tinina annamu, trāgina nīru modalagu jīrṇamukāni vāṭini, śarīramunuṃḍi nōṭidvārā baiṭaku neṭṭivēyuṭaku kāraṇamai - aṃdu nimittamu mīdaku, mīdaku saṃcariṃcu vāyuvu).

  1. “vāyutatvamu agnini gūḍi udānamāyenu”. (brahmavidyāsudhārṇavamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.