← Back to ఉ · Booklets 11–20 (digitized file 2)

ఉదాసీనః udāsīnaḥ

Original — తెలుగు
  1. ఉపేక్షకః; తటస్థః.

(ఉపేక్షకుడు, దేనియందును తగులము లేని మనస్సుకలవాడు).

  1. “పక్షపాత విహీనత్వాదుభయో రమ్యపేక్షకః”. (గీతాభావప్రకాశము - 6 - 45)

(ఏ పక్షమునందు చేరకయుండుటచేత రెండు పక్షములందు ఉపేక్షకలవాడు).

  1. “ఉపేక్షకో యధా కశ్చి ద్ధ్వయోర్వివిదమానయోః |

జయా జయాద్య సంసర్గీ తత్తాస్తే నిర్వికారధీః | (గీతాభావప్రకాశము - 9 - 67, 68)

(వాదించుకొనుచుండు ఇద్దఱిలో వారి జయముతోను అపజయముతోను సంబంధము కలుగచేసుకొనకుండ, ఆ వివాదమువలన ఏ విధమైన వికారమును మనసులో పొందక తటస్థముగా నుండువాడు).

  1. తూష్ణీం స్థితః ఇతి స్వకార్యైః ప్రవృత్తైః గుణైః కిం ఏభిః మమ ఇతి.

(ఊరకనే ఉండువాడు, అనగా, వాటి వాటి కార్యములందు పని చేయుచున్న త్రిగుణములతో నాకు పనిలేదు అని వాటిని లక్ష్యము చేయక ఊరకనుండువాడు).

  1. “ఉభయహేత్వభావాత్ (హిత హిత) ఉభయరహితాః ఉదాసీనాః” (శ్రీరామానుజః)

(ఇష్టమైనవాడు, ఇష్టముకానివాడు; ఇష్టమైనది, ఇష్టముకానిది అను విచక్షణ లేనివాడు - - ఇష్టా ఇష్టములు లేనివాడు).

  1. “కర్తవ్యే ఉపకారే, అపకారే చ యః ఉదాస్తే స ఉదాసీనః” (శ్రీ అనందతీర్థః)

(ఉపకారముకాని, అపకారముకాని చేయుటయందు ఉదాసీనుడుగానుండువాడు).

  1. “కస్య చిన్నైవ మిత్రాదేః పక్షం భజతి - (గీతాభావప్రకాశము - 12 - 117)

(స్నేహితుని పక్షముగాని, ఇతరుని పక్షముగాని చేరనివాడు).

  1. సాక్షితయా తటస్థః.

(జరుగుచున్న పరిస్థితికి వేరుగా ఉండి, కేవలము దానిని చూచుచుండుటచేత సాక్షియై తటస్థుడుగానుండువాడు).

  1. నలినపత్రే సలిలమివ.

(తామరాకుమీదనున్న నీరు తామరాకుని అంటనట్లు దేనితోను సంబంధములేనట్లుండువాడు).

  1. రాగద్వేషాది రహితః - లోకేహి రాగద్వేషాది రహితః ఉదాసీనః ఉచ్యతే |.

(రాగము, ద్వేషము మొదలగునవిలేనివాడు - లోకములో రాగద్వేషాదులు లేనివాడు ఉదాసీనుడని చెప్పబడుచున్నాడు).

  1. ప్రకృతౌ స్వార్థ ప్రవృత్తా యామపి స్వయం అప్రాకృతత్వాత్ అస్పృష్టః ఇత్యర్థః -

(భగవంతుడు తాను అప్రాకృతుడగుటవలన, ప్రకృతితో కలిసియున్నప్పటికీ ప్రకృతి గుణములనంటనివాడు).

Transliteration
  1. upēkṣakaḥ; taṭasthaḥ.

(upēkṣakuḍu, dēniyaṃdunu tagulamu lēni manassukalavāḍu).

  1. “pakṣapāta vihīnatvādubhayō ramyapēkṣakaḥ”. (gītābhāvaprakāśamu - 6 - 45)

(ē pakṣamunaṃdu cērakayuṃḍuṭacēta reṃḍu pakṣamulaṃdu upēkṣakalavāḍu).

  1. “upēkṣakō yadhā kaści ddhvayōrvividamānayōḥ |

jayā jayādya saṃsargī tattāstē nirvikāradhīḥ | (gītābhāvaprakāśamu - 9 - 67, 68)

(vādiṃcukonucuṃḍu iddaṟilō vāri jayamutōnu apajayamutōnu saṃbaṃdhamu kalugacēsukonakuṃḍa, ā vivādamuvalana ē vidhamaina vikāramunu manasulō poṃdaka taṭasthamugā nuṃḍuvāḍu).

  1. tūṣṇīṃ sthitaḥ iti svakāryaiḥ pravṛttaiḥ guṇaiḥ kiṃ ēbhiḥ mama iti.

(ūrakanē uṃḍuvāḍu, anagā, vāṭi vāṭi kāryamulaṃdu pani cēyucunna triguṇamulatō nāku panilēdu ani vāṭini lakṣyamu cēyaka ūrakanuṃḍuvāḍu).

  1. “ubhayahētvabhāvāt (hita hita) ubhayarahitāḥ udāsīnāḥ” (śrīrāmānujaḥ)

(iṣṭamainavāḍu, iṣṭamukānivāḍu; iṣṭamainadi, iṣṭamukānidi anu vicakṣaṇa lēnivāḍu - - iṣṭā iṣṭamulu lēnivāḍu).

  1. “kartavyē upakārē, apakārē ca yaḥ udāstē sa udāsīnaḥ” (śrī anaṃdatīrthaḥ)

(upakāramukāni, apakāramukāni cēyuṭayaṃdu udāsīnuḍugānuṃḍuvāḍu).

  1. “kasya cinnaiva mitrādēḥ pakṣaṃ bhajati - (gītābhāvaprakāśamu - 12 - 117)

(snēhituni pakṣamugāni, itaruni pakṣamugāni cēranivāḍu).

  1. sākṣitayā taṭasthaḥ.

(jarugucunna paristhitiki vērugā uṃḍi, kēvalamu dānini cūcucuṃḍuṭacēta sākṣiyai taṭasthuḍugānuṃḍuvāḍu).

  1. nalinapatrē salilamiva.

(tāmarākumīdanunna nīru tāmarākuni aṃṭanaṭlu dēnitōnu saṃbaṃdhamulēnaṭluṃḍuvāḍu).

  1. rāgadvēṣādi rahitaḥ - lōkēhi rāgadvēṣādi rahitaḥ udāsīnaḥ ucyatē |.

(rāgamu, dvēṣamu modalagunavilēnivāḍu - lōkamulō rāgadvēṣādulu lēnivāḍu udāsīnuḍani ceppabaḍucunnāḍu).

  1. prakṛtau svārtha pravṛttā yāmapi svayaṃ aprākṛtatvāt aspṛṣṭaḥ ityarthaḥ -

(bhagavaṃtuḍu tānu aprākṛtuḍaguṭavalana, prakṛtitō kalisiyunnappaṭikī prakṛti guṇamulanaṃṭanivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.